వార్తల్లో వ్యక్తులు 08-06-2022
నటరాజన్
బ్యాడ్ బ్యాంక్‌గా పరిగణించే నేషనల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)కి ఎండీ, సీఈవోగా నటరాజన్ సుందర్ మే 30న నియమితులయ్యారు. ఈయన ఎస్బీఐలో 37 సంవత్సరాలు పనిచేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. ఇది మొండి బకాయిల వసూలుకు పరిష్కార మార్గాలను సూచిస్తుంది.
సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ)కు కొత్త డైరెక్టర్‌గా సుజోయ్ లాల్ థాయోసేన్ మే 31న నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ ఐపీఎస్ మధ్యప్రదేశ్ క్యాడర్ అధికారి. ఎస్ఎస్బీ నేపాల్ (1,751 కి.మీ.), భూటాన్ (699 కి.మీ.) దేశ సరిహద్దులను కాపాడుతుంది. ఎస్ఎస్బీని 1963లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)కి కొత్త డైరెక్టర్ జనరల్‌గా జుల్ఫికర్ హసన్ మే 31న నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ ఐపీఎస్ పశ్చిమ బెంగాల్ క్యాడర్ అధికారి. బీసీఏఎస్ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిని 1978లో స్థాపించారు.
జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీంసింగ్ మే 31న మరణించాడు. 1982లో పాంథర్స్ పార్టీని స్థాపించాడు. 2012 వరకు 30 సంవత్సరాల పాటు ఆ పార్టీ చైర్మన్‌గా కొనసాగారు. 2022లో అతడిని పార్టీ నుంచి బహిష్కంచారు.
రుచి ఫుడ్లైన్ డైరెక్టర్ రష్మీ సాహూ ‘టైమ్స్ బిజినెస్ అవార్డ్-2022’ జూన్ 1న అందుకున్నారు. ఆమెకు ఈస్టర్న్ ఇండియా లీడింగ్ రెడీ టు ఈట్ బ్రాండ్ విభాగంలో ఈ అవార్డు లభించింది.
హరిణి లోగన్
అమెరికాలో జూన్ 3న నిర్వహించిన 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏండ్ల హరిణి లోగన్ విజేతగా నిలిచింది. 21 పదాలకు స్పెల్లింగ్‌లను తప్పులేకుండా చెప్పిన ఆమె స్క్రిప్స్ కప్ ట్రోఫీని అందుకుంది. 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. టెక్సాస్‌కు చెందిన ఆమె 8వ గ్రేడ్ చదువుతుంది. విక్రమ్ రాజు రెండో స్థానంలో నిలిచాడు. 1925 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?