అంతర్జాతీయం 08-06-2022
రష్యా క్షిపణి
రష్యా నేవీ బారెంట్స్ సముద్రంలో అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌక నుంచి జిర్కాన్ క్రూయిజ్ క్షిపణిని మే 28న ప్రయోగించింది. వెయ్యి కిలోమీటర్ల (540 నాటికల్ మైళ్లు) దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. జిర్కాన్ ధ్వని కంటే 9 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది.
యూఎస్ ఫ్రాంటియర్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్‌గా యూఎస్‌కు చెందిన ఫ్రాంటియర్ నిలిచింది. 59వ ఎడిషన్ ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సూపర్కంప్యూటర్ల టాప్-500 జాబితాను జర్మనీ మే 30న విడుదల చేసింది. ఫ్రాంటియర్‌ను హెవ్లెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజెస్ (హెచ్‌పీఈ) ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి తయారుచేశారు. దీనికి తరువాత ఫుగాకు (జపాన్) ఉంది.
గబాన్ పర్యటనలో ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆఫ్రికా దేశం గబాన్లో మే 31న పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు అలీబొంగో ఒండింబా, ప్రధాని రోజ్ క్రిస్టెన్ ఒసౌకా రపోండాలతో సమవేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు.
గ్లోబల్ పేరెంట్స్ డే
గ్లోబల్ పేరెంట్స్ డేని జూన్ 1న నిర్వహించారు. పిల్లల జీవితంలో పేరెంట్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం దీని థీమ్ ‘అప్రిసియేట్ ఆల్ పేరెంట్స్ త్రో ఔట్ ది వరల్డ్ (ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులందరినీ మెచ్చుకోండి)’.
అదేవిధంగా జూన్ 1న వరల్డ్ మిల్క్ డే (ప్రపంచ పాల దినోత్సవం)ని కూడా జరుపుకొంటారు. పాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం దీని థీమ్ ‘రాబోయే 30 ఏండ్లలో గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించి, పాడి పరిశ్రమను సుస్థిరంగా మార్చేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చడం ద్వారా ‘డెయిరీ నెట్ జీరో’ సాధించడమే లక్ష్యం.
భారత్-సెనెగల్
ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో సెనెగల్ అధ్యక్షుడు మకీ సాల్ జూన్ 1న సెనెగల్‌లోని డాకర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2022-26 కాలానికి సంబంధించి కల్చరల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం (సీఈపీ) పునరుద్ధరణకు సంబంధించి, వీసా రహిత పాలన అధికారానికి సంబంధించి, యువత విషయాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందింకునే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవం
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3న నిర్వహించారు. సైకిల్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి 2018 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో నిర్వహించిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 72వ సెషన్లో సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.
70 ఏండ్ల పాలన
క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జూన్ 2న ప్రారంభమై 5న ముగిశాయి. 96 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్‌లో ఎక్కువ కాలం సింహాసనాన్ని అధిష్టించిన రాణిగా చరిత్రలో నిలిచారు.
టర్కీ పేరు మార్పు
టర్కీ దేశం పేరు మార్చుకోవాలని నిర్ణయించు కున్నట్లు, నూతన నామాన్ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కవుసోగ్లు జూన్ 3న లేఖ రాశారు. టర్కీగా ఉన్న దేశం పేరును టుర్కీయేగా మార్చుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కూడా తమ దేశం పేరును టుర్కీయేగా ఉచ్ఛరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. 1923లో స్వాతంత్య్రం పొందిన అనంతరం మొదట ఈ దేశాన్ని టుర్కీయేగా పిలిచేవారు.
– నరహరి చాపల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?