మొలంగూర్ కోట ఎక్కడ ఉంది?
ఓరుగల్లు కోట
# ఓరుగల్లు అంటే ‘ఏకశిలానగరం’ అని అర్థం. పూర్వం వరంగల్ ప్రాంతాన్ని ‘ఓరుగల్లు’ అని పిలిచేవారు.
# తొలి కాకతీయ రాజు అయిన రెండో ప్రోలరాజు ‘ఒంటి కొండ’ ప్రాంతాన్ని ఎంచుకొని ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు.
# రుద్రదేవుడి (మొదటి ప్రతాపరుద్రుడు) ఆధ్వర్యంలో ఓరుగల్లు కోట నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో కొనసాగి, కోటలో అధిక భాగాన్ని నిర్మించాడు. రుద్రమదేవి కాలంలో ఈ కోట నిర్మాణం పూర్తయింది.
#శత్రువుల బారి నుంచి ప్రజలను, రాజ్యాన్ని కాపాడుకోవడానికి శత్రుదుర్బేధ్యంగా మొత్తం 7 కోటలు నిర్మించినట్టు చెబుతారు.
# ప్రస్తుతం మనకు కనిపించే మూడు కోటలు మాత్రమే అవి.. పుట్ట కోట, మట్టి కోట, రాతి కోట.
# వరంగల్ ప్రాంతం చుట్టూ ఉన్న 8 కి.మీ. మట్టి కోట, 5 కి.మీ. రాతి కోట నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
# రాతి కోటను గణపతి దేవుడి కాలంలో, కోట లోపలి నుంచి కోటపైకి ఎక్కే మెట్లను రుద్రమదేవి కాలంలో నిర్మించారని చెబుతారు. స్థానికులు ఈ మెట్లను రుద్రమ మెట్లు అంటారు.
#రాతి కోటలో ప్రతాపరుద్రుడు-2 77 మంది నాయంకరులకు వీలుగా 77 బురుజులను నిర్మించారు.
# నాయంకరులు అంటే యుద్ధంలో రాజుకు సైనిక సహాయం అందించేవారు.
#ఈ కోటలో స్వయంభూ లింగేశ్వర ఆలయం, ఏకశిల గుట్ట, గుండు చెరువు, ఖుష్ మహల్ నేటికీ చూడవచ్చు.
# ఈ కోటకు గల ప్రాకారాల్లో మొదటి ప్రాకారం మట్టితో చేసింది. దీన్నే ధరణి కోట అంటారు.
#ఇక్కడి స్వయంభూ లింగేశ్వరాలయం లేదా స్వయంభూ శివాలయాన్ని క్రీ.శ. 1162లో గణపతి దేవ చక్రవర్తి నిర్మించాడు.
# భూ భాగం నుంచి చూస్తే పుష్పాకారంలోని పై కప్పు నక్షత్రాకారంతో పోలినట్లు నల్లటి రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు.
# ఈ ఆలయ రక్షణ ద్వారం వద్ద గల వీరభద్ర స్వామి విగ్రహం ఆకర్షణగా కనిపిస్తుంది.
#కోట ప్రాంగణంలోని ఖుష్ మహల్‌ను కట్టించినది- షితాబ్ ఖాన్ (సీతాపతి)
#ఈ ఖుష్‌మహల్ కట్టడం పొడవు 90 అడుగులు, వెడల్పు 45 అడుగులు, ఎత్తు 30 అడుగులు.
# ఈ మహల్ నిర్మాణం రెండు అంతస్తుల్లో ఉంది. ఈ మహల్ గోడలు చాలా వెడల్పుగా ఉండి సుమారు 77 డిగ్రీల వాలుతో కిందికి వేలాడుతున్నట్లుగా కనిపిస్తాయి.
# కోట ప్రాంగణంలో ఏకశిలా పార్కు పక్కన ఒక చెరువు ఉంది. దీన్ని గుండు చెరువు అంటారు.
#ఈ కోట ప్రాంగణంలో ఏకశిలతో గల ఒక పెద్ద బండరాయి ఉంది. దీన్ని ఒంటి కొండ అని, అలాగే ఏకశిలతో ఉండటం వల్ల ఓరుగల్లును ఏకశిలా నగరం అని పిలుస్తారు.
# వరంగల్ కోట ప్రాంతానికి కూతవేటు దూరంలో 17 స్నానాల బావులు ఉన్నాయి. ప్రస్తుతం దీనిలో నాలుగు బావుల ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అవి అక్కాచెల్లెళ్ల బావి, కోడిపుంజు బావి, భోగం బావి, గుర్రాల బావి.
# నాలుగు అంతస్తులతో అనేక స్నానపు గదులతో గల బావి ఉంది. దీన్ని రాణి రుద్రమ బావి అంటారు.
#కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది.
#ఎంతో ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు కోటలోని కీర్తితోరణం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా గుర్తింపు పొందింది.
ఎలగందుల కోట
# ప్రస్తుత కరీంనగర్ పూర్వ నామం- ఎలగందుల
#మానేరు నది ఒడ్డున కరీంనగర్‌కు 13 కి.మీ. దూరంలో ఎలగందుల గ్రామంలో ఈ కోట ఉంది.
# మొఘల్ కాలంలో ఔరంగజేబు ఇక్కడ నిర్మించిన కట్టడాలు-ఆలంగీర్ మసీద్, బింద్రాబస్
# 1754లో జాఫరుద్దౌలా ఈ కోటలో మీనార్లను నిర్మించాడు.
# ఈ కోటపై నుంచి ఆధిపత్యం చూపించిన రాజవంశాలు- కాకతీయులు, యాదవులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, మొఘలులు, అసఫ్జాహీలు.
# సుమారు 200 అడుగుల ఎత్తు, 3 కి.మీ. విస్తీర్ణంలో ఈ దుర్గం వెలసింది.
# గతంలో ఎలగందుల గ్రామాన్ని, బహుధాన్యపురం, వెలిగందుల అనే పేరుతో పిలిచేవారని చరిత్ర పరిశోధకులు పేర్కొంటారు.
# 19వ శతాబ్దంలో అసఫ్‌జాహీల ద్వారా నియమితులైన ఖిలేదారు కరీముద్దీన్ ఎలగందుల ఖిల్లాకు 6 కి.మీ. దూరంలో మానేరు నది ఉత్తర తీరంలో తన పేరున కరీంనగర్ పట్టణాన్ని నిర్మించాడు.
మెదక్ కోట
#ఇది మెదక్ జిల్లా కేంద్రంలో ఉంది.
#దీన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడు నిర్మింపజేశాడు.
#పూర్వకాలంలో మెదక్‌ను ‘సిద్దాపురం’ అని పిలిచేవారు. ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ దుర్గాన్ని ‘మెతుకు దుర్గం’ అని పిలిచేవారు. కాలక్రమేణా ఈ పట్టణానికి మెదక్ అని పేరు వచ్చింది.
#కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కుతుబ్‌షాహీ ఆధీనంలోకి వచ్చిన తరువాత ఈ కోటను మళ్లీ పునర్నిర్మించారు.
#కుతుబ్‌షాహీల కాలంలోనే ఈ కోటలో మసీదును ఏర్పాటు చేశారు.
# ఈ కోటలో 3 ద్వారాలు ఉన్నాయి. 1) ప్రధాన ద్వారం 2) సింహ ద్వారం 3) గజద్వారం
#ప్రధాన ద్వారంపై కాకతీయ రాజ్య చిహ్నమైన ‘గండ భేరుండ/రెండుతలల పక్షి’ గుర్తులు ఉన్నాయి.
# సింహ ద్వారంపై రెండు గర్జిస్తున్న సింహాల శిల్పాలు ఉన్నాయి.
# గజ ద్వారంపై పరస్పరం తలపడుతున్న రెండు ఏనుగులు ఉన్నాయి.
# ఈ కోటలో ప్రస్తుతం 17వ శతాబ్దానికి చెందిన శూలం ఆకారంలో చెక్కిన 3.2 మీటర్ల పొడవైన ఫిరంగి ఉంది.
గద్వాల కోట
# ఈ కోట జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది.
#గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన పెద సోమభూపాలుడు (సోమనాథుడు) 17వ శతాబ్దంలో ఈ కోటను నిర్మింపజేశాడు.
# ఈ కోటను చాళుక్య-పర్షియన్ శైలిలో నిర్మించారు.
#ఈ కోటలోని చెన్నకేశవ ఆలయాన్ని సోమనాద్రి అని పిలిచే పెద సోమభూపాలుడు అత్యంత సుందరంగా నిర్మించారు.
# ఈ కోటకు ఇరువైపులా శివాలయం, ఎల్లమ్మ దేవాలయం ఉన్నాయి.
# ఈ చెన్నకేశవ ఆలయ గోడలపై ఉన్న శిల్పకళ, 90 అడుగుల ఎత్తయిన గాలిగోపురం సందర్శకులను ఆకట్టుకుంటుంది.
# ఈ కోటలో ఏకశిలపై చెక్కిన సూర్యనారాయణ విగ్రహం ఉంది.
#కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య 1200 మైళ్ల విస్తీర్ణంలో ఈ కోట ఉండేది.
# దేశంలోనే 32 అడుగుల అతిపెద్ద ఫిరంగి ఈ కోటలో ఉంది.
#ఇక్కడ కవులకు, పండితులకు, బ్రాహ్మణులకు గౌరవమర్యాదలు లభించేవి. అందుకే చారిత్రకంగా ఈ ప్రాంతాన్ని ‘విద్వద్ గద్వాల (కవి పండిత పోషణకు నిలయం)’గా పిలుస్తారు.
# ఈ కోట రాతిగోడలపై చెక్కిన డిజైన్లను గద్వాల చీరలపై వాడుతున్నారు.
దేవరకొండ కోట
#ఈ కోట నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉంది.
#భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న దేవరకొండ కోట ఒకాకప్పుడు శత్రుదుర్బేధ్యమైన కోటగా వర్థిల్లింది.
# ఈ కోట నిర్మాణంలో అడుగడుగునా రక్షణ వ్యూహం కనిపిస్తుంది.
#13వ శతాబ్దంలో ఉప్పు వాగు, స్వర్ణముఖి నదుల మధ్య ఈ కోటను నిర్మించారు.
# ఈ కోటలోని ఆలయాలు నరసింహాలయం, రామాలయం, శివాలయం, ఓంకారేశ్వర ఆలయం.
#ఈ కోటలో 360 బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేర్లు, చిన్న కొలనులు ఉండేవి.
# అత్యధిక నీటి వసతి గల ఈ కోటలో సుమారు 100 ఎకరాల వ్యవసాయ భూమి 13 ధాన్యాగారాలు ఉన్నాయి.
#పాలమూరు కవి ముకురాల రాంరెడ్డి ‘దేవరకొండ దుర్గం’ ఖండకావ్యం ఈ కోట గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
కౌలాస్ కోట
#కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో కౌలాస్ కోట ఉంది.
# దీన్ని రాష్ట్రకూటుల రాజు మూడో ఇంద్రుడు నిర్మించాడు.
#కౌలిస ముని బాలాఘాట్ పర్వత శ్రేణుల్లో తపస్సు చేయడం వల్ల దీనికి కైలాస్ కోట అనే పేరు వచ్చిందని, రాను రాను కౌలాస్ కోటగా మారిందని చెబుతారు.
#ఈ కోటను కాకతీయులు యుద్ధ కేంద్రంగా, ఆయుధ భాండాగారంగా తీర్చిదిద్దారు.
# 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోటను నైరుతి బాలాఘాట్ కొండల్లో 1000 అడుగుల ఎత్తులో, సెమీ ద్రవిడియన్ శైలిలో నిర్మించారు.
# ఈ కోటలో 12 స్వాగత తోరణాలు, 52 బురుజులు ఉన్నాయి.
#ఈ కోటలో 30 దేవాలయాలు, సరస్వతి ఆలయం, హనుమాన్ ఆలయం, వేంకటేశ్వర ఆలయం, కల్యాణ రామదాసు ఆలయం, శంకరాచార్యుల గుడి ఉన్నాయి.
#ఏనుగుల బావి, కాశీగుండం కూడా ఉన్నాయి.
#కోట వెనుక భాగంలో అష్టభుజి మాత (జగదాంబ) ఆలయం కూడా ఉంది.
# 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో రాజా దీప్‌సింగ్ ఈ కోట నుంచి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు.
# ఈ కోటలోని కాశీకుండ్ దేవాలయాన్ని కాశీ దేవాలయం తరహాలో నిర్మించారు.
#చుట్టూ దట్టమైన అడవి, కింద నది ఉండటం వల్ల ఈ కోట నుంచి చూస్తే ప్రకృతి దృశ్యం అమెజాన్ అడవిని తలపిస్తుంది.
# అండాకారంలో ఉన్న ఈ కోటకు మూడు ప్రాకారాల్లో మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంది.
#ఈ కోటలోని దర్గాలను, దేవాలయాన్ని రక్షిత స్మారక చిహ్నాలుగా పురావస్తు శాఖ ప్రకటించింది.
#ఈ కోటకు దగ్గరలో గల కౌలాస్ డ్యామ్‌కు శీతాకాలంలో పెద్ద సంఖ్యలో పక్షులు వలస వస్తాయి.
# ఈ కోటలోని ఫిరంగులను జగదాంబ భవాని ఫిరంగి అని, నవగార్జి తోప్ ఫిరంగి అని పిలుస్తారు.
భువనగిరి కోట
#యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్ల ఆరో విక్రమాదిత్య నిర్మించాడు. ఈ పట్టణానికి ఇతని పేరుమీదుగా భువనగిరి అని పేరు వచ్చిందని చరిత్రకారులు పేర్కొంటారు. ఈ కోటను 500 అడుగుల ఎత్తున, 50 ఎకరాల విస్తీర్ణంలో ఏకశిలపై నిర్మించారు. ఈ కోట అండాకారంలో, నిద్రిస్తున్న ఏనుగు ఆకారంలో ఉంటుంది. కోట చుట్టూ కందకం ఉంది. భూగర్భంలో విశాలమైన గది, రహస్య తలుపులు, ఆయుధగారాలు, అశ్వశాల, జలాశయం, బావులు ఉన్నాయి.
వివిధ కోటలు ప్రదేశం/జిల్లా
దోమకొండ కోట దోమకొండ (మం)
నగునూర్ కోట నగునూర్ (గ్రా.), కరీంనగర్
రాచకొండ కోట రాచకొండ, నల్లగొండ జిల్లా
నిర్మల్ కోట నిర్మల్
గాంధారి ఖిల్లా బొక్కలగుట్ట (గ్రా.)మంచిర్యాల జిల్లా
జగిత్యాల కోట జగిత్యాల
చంద్రగఢ్ కోట అమరచింత, వనపర్తి జిల్లా
రామగిరి ఖిల్లా బేగంపేట (గ్రా.), పెద్దపల్లి
వేల్పుగొండ కోట/ జఫర్ గఢ్ కోట జఫర్‌గఢ్ (గ్రా.), జనగామ
అంకాలమ్మ కోట నాగర్‌కర్నూల్ జిల్లా,నల్లమల అటవీ ప్రాంతం
కోయలకొండ కోట కోయలకొండ, మహబూబ్‌నగర్ జిల్లా
మొలంగూర్ కోట మొలంగూర్ (గ్రా.),కరీంనగర్ జిల్లా
పానగల్ కోట పానగల్, వనపర్తి జిల్లా
ఘనపురం కోట ఘనపురం, వనపర్తి జిల్లా
ముజాహిద్పూర్కోట కుల్కచర్ల (మం), వికారాబాద్ జిల్లా
రాచర్ల కోట రాజన్న సిరిసిల్ల జిల్లా
తివుడంపల్లి కోట వనపర్తి జిల్లా
సిర్పూర్ కోట కుమ్రంభీం , ఆసిఫాబాద్ జిల్లా
కన్నెకల్ కోట నల్లగొండ జిల్లా
రాజాపేట కోట యాదాద్రి భువనగిరి జిల్లా
ఉట్నూరు కోట (గోండు రాజుల కోట ఆదిలాబాద్ జిల్లా
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?