జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
వైరస్‌లతో మానవుల్లో వచ్చే వ్యాధులు
-ఆటలమ్మ, పోలియో, తట్టు/మీజిల్స్/రుబెల్లా, గవద బిళ్లలు/మమ్స్, జలుబు, మశూచి/ స్మాల్ పాక్స్, మెదడు వాపు వ్యాధి/ జపనీస్ ఎన్సెఫలైటిస్, హెపటైటిస్, ఎయిడ్స్, డెంగ్యూ, చికున్‌గున్యా, రేబీస్, సార్స్, ఎబోలా, క్యాన్సర్, స్వైన్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, కంటికలక మొక్కల్లో వైరస్‌లతో వచ్చే వ్యాధులు
-వైరస్లు అవికల్ప పరాన్నజీవులుగా ఉండి మొక్కల్లో పెరుగుతూ అనేక వ్యాధులను కలుగచేస్తాయి.
AidsDay-సాధారణంగా వైరస్ల వల్ల కలిగే మొక్కల వ్యాధులు చాల వరకు మొక్క మొత్తాన్ని ప్రభావితం(సర్వాంగీణం) చేస్తాయి. ఎక్కువగా తెగులు లక్షణాలు పత్రాల్లో కన్పిస్తాయి.
వ్యాధులు ఔషధం/వ్యాక్సిన్
1) మెదడువాపు వ్యాధి బెల్లడోనా
2) హెపటైటిస్ శాన్వాక్స్ వ్యాక్సిన్
3) తట్టు, గవద బిళ్లలు MMR టీకా
4) చికెన్ పాక్స్ కాలమైన్
5) రేబీస్ యాంటీ రేబీస్ మందు/ రేయిపోల్
6) స్వైన్‌ఫ్లూ టామిఫ్లూ
7) పోలియో సాబిన్(చుక్కల మందు)
సాల్వాక్ (ఇంజెక్షన్)
AIDS
-ప్రపంచంలో అత్యధికంగా వ్యాపిస్తున్న వ్యాధి. STD (Sexually Transmitted Diseas)
-AIDS (Aquired Immuno Deficiency Syndrom)
-ఈ వ్యాధి కలగజేసే వైరస్ HIV(Human Immuno Virus)
-మొదటగా ఈ వ్యాధిని మానవులలో 1981లో అమెరికాలో కనుగొన్నారు.
-భారతదేవంలో మొదటి ఎయిడ్స్ రోగిని చెన్నైలో (1986) గుర్తించారు. మన రాష్ట్రంలో మొదటగా హైదరాబాద్‌లో ఎయిడ్స్ రోగిని గుర్తించారు.
-హెచ్వీ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేతలు (ల్యూక్ మాంటెగ్నియర్(ఫ్రాన్స్), రాబర్ట్ గాలో(అమెరికా)
-హెచ్ఐవీ ఒక సూక్ష్మజీవి. ఇది ఇకసోహైడ్రల్ ఆకారంలో కనిపించే ఆర్ఎన్ఏ వైరస్. ఇది లిసిడ్ పొరచే ఆవృతమై ఉంటుంది. లోపల ప్రొటీనుల సమూహం, వైరస్ పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి అవసరమైన రెండు జతల ఆర్ఎన్ఏ, రివర్స్ట్రాన్స్క్రిప్టేజ్, ఇంటిగ్రేసి, ప్రోటియేజ్లను కలిగి ఉంటుంది.
-రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కారణంగా ఈ వైరస్ తన ఆకారాలను మారుస్తూ ఉంటుంది. అందువలన ఇది మందులకు తగ్గడం లేదని భావన.
-హెచ్ఐవీ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే దశలు నాలుగు అవి 1. హెచ్ఐవీ సోకిన దశ 2. వ్యాధి చిహ్నాలు కనిపించని హెచ్వీ దశ+(పొదుగు కాలం) 3. వ్యాధి చిహ్నాలు కనిపించే హెచ్ఐవీ+ దశ 4. ఎయిడ్స్ దశ
1. మొదటి దశలో వైరస్లు ఉన్నప్పటికీ ప్రతి రక్షకాలు కనిపించవు. దీనినే విండో పీరియడ్ అంటారు.
2. రెండో దశలో రక్త పరీక్షలలో హెచ్ఐవీ ప్రతి రక్షకాల ఉనికి తెలుస్తుంది. కాని వ్యాధి చిహ్నాలు కనింపించవు.
3. మూడో దశలో వ్యాధి నిరోధక శక్తి (క్రమంగా క్షీణించడం వల్ల వ్యక్తికి దీర్ఘ కాలిక జ్వరం, నీళ్ల విరేచనాలు, చర్మవ్యాధులు సోకుతాయి.
4. ఎయిడ్స్ దశ హెచ్ఐవీ సోకిన వ్యక్తి 5-10 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ దశకు చేరుకుంటాడు. ఈ దశలో రోగ నిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. టీబీ, విడువని దగ్గు, జ్వరం, నెలల తరబడి నీళ్ల విరేచనాలు, చర్మంపై పొక్కులు, నోటిపుండ్లు, లింఫ్‌గ్రంథుల వాపు, చర్మ వ్యాధులు రావడం, శరీర బరువులో 10 శాతం తగ్గడం, రాత్రి సమయాల్లో చెమట పట్టడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, న్యుమోనియా, మెదడులో గడ్డలు మొదలగు లక్షణాలు.
హెచ్ఐవీ సంక్రామ్యతను గుర్తించే పరీక్షలు
1) ఎలీసా పరీక్ష (ELISA Enzyme Linked Immuno Sorbent Assay
2) వెస్ట్రన్ బ్లాక్ పరీక్ష
3) PCR పరీక్ష (Polymerase Chain Reaction)
4) Tridot పరీక్ష
-హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న చికిత్స: యాంటీ రిట్రో వైరల్ థెరపీ(ART)
-ఈ థెరపీలో ఇచ్చే మందులు AZT: అడిడోథైమిన్
ZDV: జిడోవుడెన్
DDC: డై డీ ఆక్సీ సైటిడిన్
-హెచ్ఐవీ మానవ శరీరంలోని రక్తం, వీర్యం, యోని ద్రవాలు, తల్లి పాలలో మాత్రమే జీవిస్తుంది. కానీ లాలాజలం, కన్నీరు, స్వేదం, మలమూత్రాల ద్వారా వ్యాప్తి చెందదు.
ఎయిడ్స్ నియంత్రణా సంస్థలు
1) NACO- National Aids Control Society
2) APSACS- AndhraPradesh Aids Control Society
3) VCCTC- Voluntary Confidential Counselling and Testing Centre
4) NARI- National Aids Research Institute (పుణె)
5) TSACS- Telangana State Aids Control Society (త్వరలో ఏర్పాటు పూర్తవుతుంది)
-హెచ్ఐవీ వ్యాప్తి: హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచి మరొక వ్యక్తి లైంగిక సంబంధాలు, రక్తమార్పిడి ద్వారా, హెచ్ఐవీ వ్యక్తులకు ఉపయోగించిన సింరజిలు, సూదులు, శస్త్ర చికిత్స సాధనాలు, దంత చికిత్స సాధనాలను స్టెరిలైజ్ చేయకుండా ఇతరులకు ఉపయోగించడం ద్వారా, హెచ్ఐవీ సోకిన తల్లి నుంచి పిల్లలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది.
-ఎయిడ్స్ నివారణ, నియంత్రణ పథకాలు
1) రెడ్ రిబ్బన్ పథకం
2) ఆశ పథకం
-అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం- డిసెంబర్ 1
-ఇటీవల హెచ్ఐవీ పరీక్షను వేగంగా, సులభ పద్ధతిలో చేయడానికి ఆవిష్కరించన పరికరం- ఎం.బిప్ శామ్యూల్ కెంసియా)
గతంలో అడిగిన ప్రశ్నలు
1) కింది వాటిని సరిపోల్చండి?
వ్యాధులు కారకాలు
A. పోలియోమైలిటిస్ 1. ఫంగస్
B. క్షయ 2. బ్యాక్టీరియా
C. రింగ్వార్మ్ 3. వైరస్
D. మలేరియా 4. ప్రోటోజోవా
A B C D
1) 1 2 3 4
2) 3 2 1 4
3) 4 2 3 1
4) 3 2 4 1
2) హెపటైటిస్ దేనితో సంబంధం కలిగిన జబ్బు?
1. గుండెమంట 2. కాలేయపు మంట
3. మూత్రపిండాలు చెడిపోవటం
4. రక్తకణాలు చనిపోవడం
3) వైరస్ ఒక? (గ్రూప్-1 2003)
1. ప్రోటీన్ 2. న్యూక్లియస్
3. కార్బోహైడ్రేట్స్ 4. న్యూక్లిమో ప్రోటీన్
4) క్యాన్సర్‌కు కారణం? (గ్రూప్-2 2003)
1. ఆల్గే 2. ఫంగీ 3.వైరస్ 4.బ్యాక్టీరియా
5) డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఏ మందులో అయినా, ఏ ప్రాణి రూపంలో ఒకే న్యూక్లిక్ ఆమ్లం ఉంటుంది? (జేఎల్-2001)
1. అమీబా 2. బ్యాక్టీరియా
3. వైరస్ 4. మొక్క కణం
6) వైరస్ వల్ల కింద పేర్కొన్న వ్యాధులలో ఏది సంభవించును? (ఎస్ఐ-2008)
1. మశూచి 2. క్షయ 3. కంటికలక 4.మలేరియా
7) అస్వస్థ మానవ శరీరం కింది అవస్థలను భరించును?(ఎస్ఐ-2007)
1. వాచిన శోషరస కణపు
2. రాత్రులలో చెమట పట్టుట
3. జ్ఞాపకం కోల్పోవుట
4. బరువు తగ్గుట
– పై వాటిలో ఎయిడ్స్ లక్షణాలు
1. a,b 2. b,d 3. a,c,d 4. a,b,c,d
8) జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? (ఎస్ఐ-2007)
1. మద్రాసు 2. ముంబై 3. పుణె 4. న్యూఢిల్లీ
సమాధానాలు
1-2, 2-2, 3-4, 4-3, 5-3, 6-1, 7-4, 8-3.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు