తెలంగాణలో కాకతీయ వెలుగులు
భారత దేశంలో తొలి మహాసామ్రాజ్యం ‘మౌర్యవంశం’ ఎలాగో తెలంగాణలో ‘కాకతీయులు’ కూడా అలాగే. తెలంగాణ చరిత్రలో వీరి పాలన ‘నిజమైన స్వర్ణయుగం’ అని చెప్పక తప్పదు. భారతదేశ చరిత్రలో కన్పించే గుప్తుల యుగం, విజయనగర వంశం, మొఘల్ వంశ చరిత్రలు స్వర్ణయుగాలయితే కాకతీయుల పాలన కచ్చితంగా తెలంగాణలో తొలి స్వర్ణయుగమే.
తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, కన్నడ, మహారాష్ట్రల్లో కాకతీయుల యుగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దక్కన్ ప్రాంతాన్ని శాతవాహనుల తర్వాత సమైక్యం చేసి తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ ఒకే పరిపాలన కిందకు తెచ్చి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఇతోధికంగా కృషిచేసినవారు కాకతీయులు. వీరు అనేక ప్రజాహిత, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ఆర్థిక రంగంలో ఆంధ్రదేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించారు. భిన్నమతాల మధ్య సఖ్యత నెరిపి కళలను, కవులను పోషించి రెడ్డిరాజులకు, విజయనగరా ధీశులకు మార్గదర్శకులయ్యారు.
వంశ చరిత్ర
# మొట్టమొదటిసారిగా కాకతీయుల ప్రస్తావన గణపతిదేవుని చెల్లెలు (సోదరి) మైలమదేవి (మైలాంబ) ‘బయ్యారం’ చెరువు శాసనం (ఖమ్మం జిల్లా)లో సవివరంగా పేర్కొంది. (ఆమెకు ముందు తూర్పు చాళుక్య యువరాజైన దానార్ణవుని ‘మాగల్లు’ శాసనంలో ఉందికానీ అది కాకతీయులు వేసినది కాదు. కాబట్టి ఇక్కడ దాని గురించి ప్రస్తావించడం లేదు).
పై శాసనం (మైలాంబ, బయ్యారం) ప్రకారం కాకతీయులు ‘రాష్ట్రకూటులకు సేనానులుగా తెలంగాణ ప్రాంతానికి వచ్చి తరువాత సామంతులుగా స్థిరపడి, తమ సార్వభౌములు బలహీనులైన తర్వాత విజృంభించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. రాష్ట్రకూటులపై ఇతోధిక గౌరవం ఉండటం వల్ల వారి లాంఛనం గూడా స్వీకరించారు (గరుడ కేతనం వారి లాంఛనం). అటుతర్వాత ‘తూర్పు చాళుక్యులకు’ సామంతులుగా ఉండి వారి రాజముద్ర ‘వరాహం’ (వరాహ లాంఛ నం) కూడా కాకతీయులు స్వీకరించారు. ఇప్పుడు అభ్యర్థులకు రెండు ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
1. కాకతీయులు ఎవరి సామంతులు ? అని ప్రశ్నవస్తే సమాధానం ఏమిటి. దీనికి…
1. రాష్ట్రకూటులు
2. తూర్పు చాళుక్యులు. వీరిద్దరిలో ఎవరికి కాకతీయులు సామంతులు అనేది రెండో ప్రశ్న .
# దీనికి సరైన సమాధానం ఈ పేరాగ్రాఫ్‌ను క్షుణ్ణంగా చదివిన వారికి అర్థమవుతుంది. కాకతీయులు రాష్ట్రకూటులకు ‘సేనానులు’గా, తూర్పుచాళుక్యులకు సామంతులు’ అని శాసనంలో పేర్కొంది. అంత సులభంగా సమాధానం ఉంటే వీరు ‘రాష్ట్రకూటులకు సామంతులు’ అనే ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఒకసారి ఆలోచించండి ? చాలామంది చరిత్రను చదవని వారు చరిత్రపై గ్రంథాలు రచించి వాటిని అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి మాత్రమే నా వ్యాసాలు ఉపయోగపడతాయి. అకడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రాయడం జరిగింది. దానికోసం మార్కెట్లో వందలాది పుస్తకాలు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. ప్రతిచిన్నదానికీ సార్ ఫలానా పుస్తకంలో ఒక రకంగా ఉంది. ఫనాలా సార్ ఒక రకంగా చెప్పారు ! అనే ప్రశ్నలు, అనుమానాలు రాకుండా ఉండాలి. దానికి కొన్ని
1. గతంలో వచ్చిన ప్రశ్నపత్రం, దానికి సమాధానం.
2. విజయం సాధించిన అభ్యర్థుల సమాధానాలు
3. సివిల్స్ తరహాలో ఉన్న ప్రామాణిక గ్రంథాలు
4. చివరగా మీ ప్రయత్నం.
# ఈ నాలుగు అంశాలు ఎవరైతే సీరియస్‌గా పాటిస్తారో వారే విజయానికి చేరువవుతారనే సత్యం తెలుసుకోండి. కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఖర్చుపెట్టి గుంపులో గోవిందయ్యల్లాగా గంటల తరబడి నోట్స్ రాసుకున్నా, గ్రంథాలయాల్లో గంటల తరబడి ఏ బుక్ కనిపిస్తే దాన్ని కూలంకషంగా చదువుతున్నామని అనుకున్నా వృథా ప్రయాసే అని గుర్తించండి. అసలు సివిల్స్ తరహాలో పోటీ ఉంటుందంటే అది ఎలా ? గత పబ్లిక్ కమిషన్ వారు (గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో) నిర్వహించిన పోటీ పరీక్షల విధానం ఎలా ఉంది ? అంటే…
ఉదా :
1. గుహలను ఎవరు అభివృద్ధి చేశారు ? (1)
1) విష్ణుకుండినులు 2) రాష్ట్రకూటులు
3) శాతవాహనులు 3) కాకతీయులు
# ఇది కూడా ఒక ప్రశ్నా ! దీనికి సమాధానం 5వ తరగతి చదివే ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు. ఇది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీపరీక్షల్లో వచ్చే ప్రశ్న.
# ఇక సివిల్ తరహాలో నిర్వహించే పరీక్ష విధానంలో వచ్చే ప్రశ్నను ఒకసారి పరిశీలిద్దాం.
ఉదా :
2. ఉండవల్లి గుహలకు సంబంధించి ఏది అవాస్తవమైనదో గుర్తించండి ? (4)
1) ఉండవల్లిలో మొత్తం నాలుగు అంతస్తులు కలవు
2) మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు కలవు
3) రెండో అంతస్తులో అనంతశయన విష్ణువు విగ్రహం చాలా ప్రసిద్ధి
4. మూడో అంతస్తులో బౌద్ధ సన్యాసుల నివాసాలు ఉన్నాయి
# (మూడో అంతస్తులో ‘త్రికూట’ ఆలయం ఉంది. నాలుగో అంతస్తులో బౌద్ధ భిక్షువుల-సన్యాసుల విశ్రాంతి మందిరాలు కలవు) దీన్నిబట్టి రాష్ట్ర తరహా ప్రశ్నలు ఎలా ఉంటాయి, సివిల్స్ తరహా ప్రశ్నలు ఎలా ఉంటాయో ఉదాహరణ చెప్పాను. అంతేకానీ అభ్యర్థులను భయపెట్టాలని కాదు. ప్రశ్నల తీరు ఎలా ఉం టుందో చెప్పాను. అందుకే ఎస్ఎస్సీ, ఇంటర్, ఇంజినీరింగ్ పరీక్షల్లో ఒక్కో విద్యా ర్థికి 90 శాతానికి మించి మార్కులు వస్తాయి. కానీ ఐఐటీ, గేట్, సివిల్స్ పరీక్షల్లో వీరు కనీసం 50 శాతం మార్కులు కూడా సాధించలేరు. అది సివిల్స్ తరహా పోటీ. మనది బట్టీపట్టే తరహా ప్రిపరేషన్ ఉంటుంది. అక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ ఉంటాయి. పూర్తిగా ఆ ప్రశ్నపై అవగాహన ఉన్నవారే దానికి సమాధానం గుర్తిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తయారు చేయలేని పరీక్షా విధానాన్ని సివిల్స్ తరహాలో తొలిసారిగా తయారుచేసి దేశంలో నంబర్‌వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదంటే తెలంగాణ సర్వీస్ కమిషన్ అని అందరు అనుకునే విధంగా రూపొందించాలనే ప్రయత్నంలో ఉంది. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు దీన్ని గమనించి చదువుకోవాలి.
# కాకతీయుల వంశనామం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులనే జైన తీర్ధంకరుల్లోని నేమినాథుడు శాసనాధికారిణి ‘కుష్మాండిన’ కాకతమ్మ దేవతగా పూజించారని వల్లభాచార్యుడు తన క్రీడాభిరామంలో పేర్కొన్నాడు.
# కాకతీయులు మొదట ‘కందాపురం’ నుంచి వచ్చారని, సిద్ధేశ్వర చరిత్ర తెలుపుతుంది (ఈ స్థలం ప్రస్తుతం నాందెడ్ జిల్లాలోని ‘కందహార్’గా పేర్కొనబడింది). ఈ స్థలమే కాకతీయుల జన్మస్థలమని కొందరి వాదన. వీరు ప్రతిష్ఠించిన గ్రామదేవత ‘కాకతి’, ‘పద్మావతి’. ఎందుకంటే తొలి కాకతీయులు జైనులు. బేతరాజు-I సుప్రసిద్ధమైన మతాచార్యుడు ‘రామేశ్వర’ పండితుడి నుంచి శైవమతం స్వీకరించిన తర్వాత ‘స్వయంభూ’ దేవుడు కాకతీయులు కులదేవత అయ్యాడు. ‘కాకతమ్మ’ విగ్రహం ప్రతిష్టించిన ఓరుగల్లే ‘కాకతిపురం’గా అభివృద్ధి చెందివుండవచ్చు. కాకతీపుర వల్లబులే కాకతీయులు అనడం ఎంతైనా సమంజసం.
#కాకతీయులు ఏ కులానికి చెందివారనే విషయం కూడా వివాదస్పదమైంది. కొందరు వీరిని క్షత్రియులనీ, మరికొందరు ‘చతుర్దకులజులనీ’ (శూద్రులనీ) అభిప్రాయపడ్డారు.
# గణపతిదేవుడు : మోటుపల్లి (ప్రకాశం జిల్లా), పాకాల (వరంగల్), కాంచీపురం (తమిళనాడు) శాసనాలు ఈ రాజులను క్షత్రియులుగానూ, సూర్యవంశీయులుగానూ వర్ణించారు.
సాహిత్య ఆధారాలు
#మల్లికార్జున పండితుడు : శివతత్వసారం, తెలుగులో తొలి శతకం.
#మారన : మార్కండేయ పురాణం. తెలుగులో తొలి పురాణం.
కేతన : విజ్ఞానేశ్వరీయం, తెలుగులో తొలి న్యాయస్మృతి, ఇది యాజ్ఞవల్కుని న్యాయశాసా్త్రనికి, విజ్ఞానేశ్వరుడు, మితాక్షరీయం పేరుతో వ్యాఖ్యానం రచించాడు. దీన్ని తెలుగులోకి అనువదించినవాడు కేతన.
బద్దెన : నీతిశాస్త్ర ముక్తావళి, ఇది కాకతీయుల రాజనీతి దర్పణం.
తిక్కన : నిర్వచనోత్తర రామాయణం, మహాభారతంలోని విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తెలుగులోకి అనువదించాడు.
భాస్కర రామాయణం : దీన్ని ఐదుగురు కవులు కలిసి రచించారు. వారు
1. భాస్కరుడు, 2. ళక్కి భాస్కరుడు 3. మల్లికార్జునుడు 4. కుమార రుద్రకవి 5. అయ్యలార్యుడు.
కాకతీయుల చరిత్రకు ఆధారాలు
కాపర్ప్లేట్ శాసనాలు
1. బేతరాజు : ఖాజీపేట శాసనం (1075)
2. కాకతిరుద్రుడు : ‘హన్మకొండ’ వేయిస్తంభాల గుడి శాసనం (1163)
3. గణపతిదేవుడు : ధర్మసాగరం (ఇందులో రజుకండుక, సింగినాదం మొదలగు సంగీత పరికరాల గురించిన వివరాలు ఉన్నాయి.)
4. శిలాశాసనాలు : కరీంనగర్ రాగిప్లేట్ శాసనం (1254)
5. రుద్రమదేవి : చందుపట్ల (నల్లగొండ జిల్లా) (2189) (రుద్రమదేవి 1289లో మరణం పొందిన సంవత్సరం వివరించబడింది)
వివరణ :
(రుద్రమదేవి పురుషనామంతో సింహాసనం ధరించింది. ఈమె ఆస్థానాన్ని మార్కోపోలో 1292 సంవత్సరంలో సందర్శించాడు. రుద్రాంబ 1289 సంవత్సరంలో మరణిస్తే మార్కోపోలో ఈమె ఆస్థానాన్ని ఎలా సందర్శించాడు. అభ్యర్థులకు అనేక అనుమానాలు వస్తాయి.
1. మార్కోపోలో వచ్చిన సంవత్సరం 1292 తప్పు అయినా అయి ఉండాలి.
2. రుద్రాంబ 1289 మరణించిన సంవత్సరం అయినా తప్పై ఉండాలి.
ఖాజీపేట శాసనంలోని కొన్ని ముఖ్యాంశాలు
# బేతరాజుకు ‘కాకతిపురాధినాథ’ అనే బిరుదు, పోలరాజుకు కాకతివల్లభ అనే బిరుదులు ఉండటం చేత వీరిని ‘కాకతిపురాధీశ్వరులే’ అని చెప్పవచ్చు.
పాలంపేట శాసనం-రేచర్ల రుద్రుడు
# ‘ఖండవల్లి’ ప్లేట్ శాసనం-రెండో ప్రతాపరుద్రుడు మొదలగునవి చాలా ఉన్నాయి. (ఏయే శాసనాల్లో పెయింటింగ్స్, సంగీతం, శిల్పకళలు, చెరువుల నిర్మాణాల గురించి ప్రస్తావనలు కలిగి ఉన్నాయో! అలాంటి శాసనాలు చాలాముఖ్యం, పైన పేర్కొన్న శాసనాల్లో ఏమి ఉన్నాయో? ప్రస్తుతం పేర్కొనడం లేదు.
(తల్లికలువ శాసనం : గణపతిదేవుడు గిరికపాడు, పాకాల, పిల్లలమరి, పాలంపేట శాసనాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.)
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు