మల్కిభరాముడిగా పిలవబడిన గోల్కొండ సుల్తాన్
ఇబ్రహీం కుతుబ్ షా
#తన అన్న జంషీద్ భయానికి విజయనగరానికి పారిపో యి ఏడేండ్లపాటు ‘అళియరామరాయలు’ ఆధ్వర్యంలో ప్రవాస జీవితం గడిపాడు. చివరకు 1565లో గోల్కొండకు రాజై ‘రాక్షస-తంగడి’ యుద్ధంలో సైన్యాధ్యక్షుడిగా బహ్మనీ సైన్యాలకు నాయకత్వం వహించి విజయనగర రాజ్యపతనానికి కారకుడయ్యాడు. ఇతని జీవితంలో ఇది మాయని మచ్చ. దీంతో ‘ఇబ్రహీం’ తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
#1571లో రాజమండ్రి, నిడదవోలు ప్రాంతాలు జయించాడు.
# 1579లో కొండవీడు, కొండపల్లి ప్రాంతాలు గోల్కొండలో విలీనం చేశాడు.
# 1576-78లో వినుకొండ, ఖమ్మం దుర్గం, ఖాసీం కోటలను ఆక్రమించాడు.
# గోల్కొండ రాజ్యంలో ప్రజలతో మమేకమై ‘మల్కిభరాముడు’గా పేరుగాంచాడు. ఇతడు అనేక మంది తెలుగు కవులను పోషించాడు. వారిలో..
1. సారంగ తమ్మయ్య: ‘యయాతి చరిత్ర’ అచ్చ తెలుగులో రచించిన తొలి తెలుగు గ్రంథం
2. కందూరి రుద్రకవి: వైజయంతి విలాసం.
3. గంగాధరుడు: తపతి, సుందరోపాఖ్యానం గ్రంథాలు రచించాడు.
# భగీరథీ దేవిని వివాహం చేసుకొని, హిందూ, ముస్లిం ఐక్యమత్యానికి కృషి చేశాడు. ఇబ్రహీం తొలిసారిగా ‘కుతుబ్ షా’ బిరుదు పొందాడు.
నిర్మాణాలు
1. హుస్సేన్ సాగర్
2. ఇబ్రహీంపట్నం చెరువు
3. ఇబ్రహీం బాగ్
4. పూల్ బాగ్
5. లంగర్ హౌస్ (భిక్షాగృహాలు)
6. మూసీనదిపై నిర్మించిన పురానాపూల్ వంతెన వంటి కట్టడాలు అతన్ని చిరస్మరణీయుడిగా చేశాయి.
మహ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612)
#ఇబ్రహీం కుతుబ్ షా మరణానంతరం మహ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612) అతి పిన్న వయస్సులో (14వ ఏటా) రాజయ్యాడు. ఇబ్రహీం కుతుబ్ షా ఆరుగురు మగ సంతానంలో ఇతను మూడోవాడు. మహ్మద్ కులీ కుతుబ్ షా రాజ్యానికి రావడానికి బీజాపూర్, బీదర్ సుల్తాన్లు సహాయం చేశారు. ముఖ్యంగా ‘అశ్వారావు’ విశేషంగా కృషి చేశాడు.
# సైనిక విజయాలు: స్వయంగా గొప్ప కవి అయినా.. రాజ్య విస్తరణలో ఎలాంటి చిన్న చూపు లేదు.
1. దక్షిణాన పెనుగొండ, గండికోటలను జయించాడు.
2. తూర్పున శ్రీకాకుళం వరకు రాజ్యాన్ని విస్తరించాడు.
3. గోల్కొండ రాజ్యంలో వచ్చిన తిరుగుబాట్లను అణచివేశాడు.
4. 1592లో ‘అహ్మద్ నగర్’ (నిజాంషా రాజ్యం) ఆక్రమించాడు.
8 1592లో రాజధానిని ‘గోల్కొండ’ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు.
సాహిత్య సేవ
1. ‘కుతీయత్ కులీ’ పేరుతో అనేక కవితలు రచించాడు. ఇతని కలం పేరు ‘మానిని’.
2. ‘దివాన్’ పేరుతో ‘ఉర్దూ’ కవిత్వాలు రచించాడు. తన కవిత్వాల్లో ‘హోళీ’ ‘బతుకమ్మ’ పండుగలను, తెలంగాణ ఆచార వ్యవహారాలను వివరించాడు. ఆయన కవిత్వంలో లౌకికవాదం, శృంగారం ఎక్కువగా ఉండేవి.
3. సారంగ తమ్మయ్య ‘హరిభక్తి సుధోదయం’ గ్రంథం రచించాడు.
4. నేబతి కృష్ణమంత్రి ‘రాజనీతి రత్నాకరం’ గ్రంథం రచించాడు. ఇతడు మంత్రిగా, ఆస్థానకవిగా, మిత్రుడిగా మహ్మద్ కులీ కుతుబ్ షాకు పేరు తెచ్చాడు. ఎల్లారెడ్డి బాలభారతం, కిరతార్జునీయం ప్రసిద్ధ రచనలు.
కుతుబ్‌షాహీల పరిపాలనా యుగం
#కుతుబ్‌షాహీ రాజులు తమను తాము ‘దైవాంశ సంభూతులు’గా వర్ణించుకున్నారు. రాజుకు సలహా ఇవ్వడానికి ‘మంత్రి పరిషత్తు’ ఉండేది. ప్రధానమంత్రిని ‘పీష్వా’ అనే వారు. ఇంకా ముఖ్యమైన వారు..
1. మీర్‌జుమ్లా: ఆర్థికమంత్రి
2. ఐనుల్ ముల్క్: సర్వ సైన్యాధ్యక్షుడు
3. మజుందార్: ఆడిటర్ జనరల్
4. కొత్వాల్: పోలీస్ కమిషనర్
రాజ్య విభజన
# చివరి కుతుబ్ షాహీ రాజైన అబుల్ హసన్ లేదా తానీషా గోల్కొండ రాజ్యాన్ని ‘6’ సుభాలు (తరప్ లేదా రాష్ట్రం)గా, ‘36’ సర్కార్లు (జిల్లాలు)గా, 517 పరగణాలు (తాలూకాలు)గా విభజించాడు.
1. మెదక్ సుభా: మహ్మద్ నగర్, కేలాస్, ముల్కనూర్.
2. వరంగల్ సుభా: ఎల్గందల, ఖమ్మం, దేవరకొండ.
3. ముర్తజా నగర్ సుభా లేదా గుంటూరు: కోయిల్ కొండ, ఘణపూర్, మచిలీపట్నం.
4. ముస్తఫా నగర్ లేదా కృష్ణాజిల్లా: పానగల్, కొండపల్లి, భువనగిరి, అకర్కర్……
5. గంజాం సుభా: నిజాంపట్నం, ఏలూరు, రాజమండ్రి, సికాకోల్ (శ్రీకాకుళం)
6. బీదర్ (కర్ణాటక): ఇందులో 16 సర్కార్లు ఉన్నాయి.
కులీ కుతుబ్ షా సాంస్కృతిక సేవ
#భాగ్యనగరం-హైదరాబాద్ (1593-1597): భాగమతిదేవి. తన భార్య పేరు మీదుగా నిర్మించిన పట్ట ణం. ఇది మూసీనదికి దక్షిణం వైపున ఉంది. ఆమెకు మహ్మద్ కులీ కుతుబ్ షా ‘హైదర్ మహెబ్’ అని పేరు పెట్టాడు. అదే కాలక్రమేణ హైదరాబాద్‌గా వ్యవహరించబడింది.
# చార్మినార్ (1591): ‘ప్లేగు వ్యాధి’ నిర్మూలనకై నిర్మించబడిన అద్బుతమైన కట్టడం. ఇండో-పర్షియా-రోమ్- చైనా సంస్కృతులతో మేళవించారు.
#చార్‌కమాన్ (1592)
#జామామసీదు (1597)
# దారుల్ షిఫా
#దాద్ మహల్
# ఖుదాదాద్ మహల్
# నద్ది మహల్
# బన్నత్ ఘాట్: వంటి నిర్మాణాలు కళాభిరుచికి నిదర్శనం.
# ఆర్థిక పరిస్థితి: సారవంతమైన తీరు భూములతో కూడిన గోల్కొండ రాజ్యం విస్తరించింది.
# 1611లో బ్రిటీష్ వారికి ‘మచిలీపట్నం’లో వ్యాపార అనుమతి ఇచ్చాడు. దీంతో వారు 1612లో స్థావరం నెలకొల్పారు. ‘హిప్పన్’ అనే ఆంగ్లేయుడు గ్లోబ్ నౌక ద్వారా వచ్చాడు. ఇదే బ్రిటీష్ వారికి భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం. 1613లో సూరత్‌లో వ్యాపార స్థావరం నిర్మించారు.
# 1605లో డచ్చివారు పులికాట్ ప్రాంతంలో వ్యాపా ర అనుమతులు తీసుకున్నారు.
# గోల్కొండ రాజ్యంలో ‘పాశ్చాత్యీకరణ’ పద్ధతులు ప్రవేశపెట్టారు.
గోల్కొండ సుల్తానుల ముఖ్య అధికారులు
# ‘నిరంకుశ రాజరికం’ అనుసరించారు (రాజు సర్వాధికారి)
# పీష్వా: ప్రధానమ్రంతి
# దబీర్: రాజు ఆజ్ఞలు జారీ చేసే అధికారి
# హవల్దార్: ప్రభుత్వ గిడ్డంగులు, ‘ఓడరేవులపై’ అధికారం కలదు.
#నాజీర్: ప్రభుత్వానికి నివేదికలు పంపే వ్యక్తి.
# దివాన్: రెవెన్యూ
# ఖాజీ: న్యాయం, మతం
# పండిట్: విద్యా విషయాలు
# నాయక్: సైనిక దళాధిపతి
# ఖానాబైల్: చక్రవర్తి అంగరక్షక దళం
మహ్మద్ కుతుబ్ షా (1612-1626)
సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా మరణానంతరం, తన తమ్ముని కుమారుడు, తన అల్లుడైన సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా అనేక అవాంతరాల మధ్య షియా, సున్నీల తగాదాల మధ్య సింహాసనాన్ని అధిష్టించాడు.
సాంస్కృతిక సేవ
1. ఖైరతాబాద్ మసీదు నిర్మించాడు.
2. మక్కామసీదు: మక్కా నుంచి తెచ్చిన రాళ్ళతో నిర్మించిన మసీద్ నిర్మాణం 1617లో ప్రారంభించాడు. చివరకు 1687లో ఔరంగజేబు ఈ నిర్మాణం పూర్తి చేశాడు.
3. అమ్మాన్ భవనం
4. నబీభాగ్లను నిర్మించాడు.
అబ్దుల్లా కుతుబ్‌షా(1626-72)
#సల్తాన్ మహ్మద్ తర్వాత అతని పెద్ద కొడుకు ‘అబ్దుల్లా’ రాజ్యానికి వచ్చాడు. భోగలాలసత్వం వల్ల 24 ఏండ్ల అబ్దుల్లా మొగల్ నుంచి తండ్రి, తాత ల్లా స్వతంత్రతను నిలబెట్టుకోలేకపోయాడు.
1. అహ్మద్‌నగర్‌లో మాలిక్ అంబర్ (‘గెరిల్లా’ నిపుణుడు)1626లో మరణం.
2. 1627లో బీజాపూర్ ఇబ్రహీం ఆదిల్‌షాలు మరణించాడు. దీంతో మొగల్ చక్రవర్తి షాజహాన్ దక్కన్‌పై దండయాత్రలు చేశాడు. ఆ దాడులను ప్రతిఘటించలేక అతనితో సంధి చేసుకొని సామంతుడయ్యాడు. ‘షాజహాన్ పేరు మీదుగా’ నాణేలు ముద్రించాడు. 1646లో కర్ణాటకపై, విశాఖపట్నంలపై దాడి చేసి గోల్కొండ రాజ్యంలో విలీనం చేశాడు. ఫ్రెంచి, పోర్చుగీసు వారి వ్యాపార స్థావరాలకోసం మచిలీపట్నంను ఇచ్చాడు. చివరకు 1656లో ఔరంగజేబుతో సంధి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో గోల్కొండ పై మొగల్స్ ఆధిపత్యం ప్రారంభమైంది.
అబుల్ హసన్ తానీషా (1672-87)
అబ్దుల్లా కుతుబ్ షా 1672లో మరణించడంతో వారసత్వ వివాదం జరిగింది. అనుకోకుండా అబ్దు ల్లా కుతుబ్ షా అల్లుడు అబుల్ హసన్ (మంచి రాజు) బిరుదుతో ‘తానీషా’ రాజ్యానికి వచ్చాడు. ఔరంగజేబుకు సామంతుడుగా ఉండటానికి అంగీకరిస్తూ అనేక కానుకలు పంపించినాడు. ఆ కాలంలో ఇరువురి మధ్య ఉన్న షరతులు.
1. శివాజీకి తానీషా సహాయపడకూడదు.
2. ‘షీష్కుష్’ (‘సుంకం, శిస్తు) సమయానికి గోల్కొండ రాజ్యం మొగల్ సామ్రాజ్యానికి చెల్లించాలి.
3. ‘మీర్ జుమ్లా’ను గోల్కొండ సైన్యాధ్యక్షునిగానే కొనసాగించాలి. పై నిబంధనలను అంగీకరిస్తున్నట్లు తానీషా ప్రకటించాడు. కానీ గోల్కొండ రాజ్యాన్ని శక్తివంతంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మీర్జుమ్లాను తొలగించి, ‘మాదన్నను ప్రధానమ్రంతిగా, ‘అక్కన్న’ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు.
తానీషా విజయాలు
1. కర్ణాటక ప్రాంతంలో పాశ్చాత్య వర్తకులు సృష్టించిన అలజడులను అణచివేసి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాడు.
2. ఉన్నత పదవుల్లో స్థానికేతరులను తొలగించి, స్థానికులకే అవకాశాలు కల్పించాడు.
3. నీటి వనరుల నిర్మాణాలు చేసి వ్యవసాయాభివృద్ధికి ప్రణాళికలు రచించాడు.
4. రైతుల శ్రేయస్సుకై, దళారులను తొలగించి, సకాలంలో పన్నులు చెల్లించేట్లు చేశాడు.
5. ‘గనుల’ పరిశ్రమలను పునరుద్ధరించాడు.
6. భద్రాచలంలో ‘రామాలయ’ నిర్మాణానికి కృషి చేసిన భక్తరామదాసు (కంచెర్ల గోపన్న)ను, మొద ట శిక్షించినా.. తర్వాత అతని భక్తికి, సేవలకు మెచ్చి విడుదల చేశాడు.
7. మొగలుల అధ్యక్షతను తగ్గించడానికి ‘శివాజీ’తో 1677లో తానీషా మరోమారు స్నేహ ఒడంబడిక జరిపాడు. 1680లో శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు 1685లో గోల్కొండపై దండయాత్ర చేసి ‘తానీషా’ను ఓడించి, యుద్ధ పరిహారం కింద కోటి ‘హొన్నులు’ వసూలు చేశాడు. దీంతోపాటు కింది షరతులపై ఒత్తిడి తెచ్చాడు. అవి..
#సంవత్సరానికి రెండు లక్షల ‘హొన్నులు’ కప్పం చెల్లించాలి.
# మాల్కేడు, సేడం ప్రాంతాన్ని మొగలులకు అప్పగించాలి.
# అక్కన్న, మాదన్నలను పదవి నుంచి తొలగించాలి.
పై రెండు షరతులను ఒప్పుకున్న తానీషా మూడో షరతుకు కాలయాపన చేశాడు. దీంతో ముస్లిం సర్దారులు అక్కన్న, మాదన్నలను ‘1686, మార్చి 24’న రాత్రి హత్య చేశారు. వారి తలలను ఔరంగజేబుకు కానుకగా పంపించారు. చివరకు ఔరంగజేబు 1687 ఫిబ్రవరి 7న గోల్కొండ మీద దాడి చేసి ‘8 నెలలు’ పోరాడి తానీషాను ఓడించి, బందించి దౌల్తాబాద్ కోటకు బందీగా పంపాడు. చివరకు అక్కడ ‘1700’లో మరణించాడు.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు