మూలధనం అంటే ఏమిటి ?

వ్యాపార నిర్వచనం
-వ్యాపారం అనేది వస్తుత్పత్తి, వస్తువులను, సేవలను పంపిణీ చేసి లాభాలను ఆర్జించడం. అంటే వ్యాపారుడి ముఖ్య ఉద్దేశం లాభాలను ఆర్జించడం.
-Business is a Production, Distribution of goods or services with a view to Intention making profit. The main object of any Business is to drive profit. వ్యాపారం అనేది రెండింటిపై ఆధారపడి ఉంటుంది. అవి..
1. పరిశ్రమలు
i. వెలికితీసే పరిశ్రమలు/ఉద్గాటక పరిశ్రమలు
ii. జనెటిక్ పరిశ్రమలు
iii. ఉత్పత్తి పరిశ్రమలు
iv. నిర్మాణ పరిశ్రమలు
v. సేవా పరిశ్రమలు
2. వాణిజ్యం (Commerce)
i. వర్తకం (Trade)
a. కొనుగోళ్లు b. అమ్మకాలు
ii. వర్తక సహాయ సంస్థలు (Aids to Trade)
a. Banking b. Insurance
c. Godown d. Transportation
e. Advt
పరిశ్రమలు : ముడి పదార్థాలను అంతిమ వస్తువుగా మార్చే ప్రదేశాలు. It is the place or location where raw materials can be converted into finished goods.
వాణిజ్యం : It is a distribution of goods or services. అంతిమ వస్తువులను, సేవలను పంపిణీ చేసే విభాగం.
వర్తకం : వస్తువులు, సేవల కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియ. It is a Process of Purchasing and Selling of goods or Serivces.
వ్యవహారాలు : ఏదైనా ఇద్దరి వ్యక్తుల సంబంధం ఏర్పడి వస్తువులనుగాని సేవలను నగదుగాగాని అరువుగా మార్పిడి జరగడం. వ్యవహారాలు రెండు రకాలు
1) నగదు వ్యవహారాలు
2) అరువు వ్యవహారాలు
పుస్తక నిర్వహణ (Book Keeping) : ద్రవ్య లేదా ద్రవ్య సమానమైన వ్యాపార వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో వ్యాపార సంస్థ పుస్తకాల్లో రాసే ప్రక్రియ లేదా కళ నే పుస్తక నిర్వహణ అంటారు (Day and Data wise).
అకౌంటింగ్ (Accounting) : నమోదు చేసిన వ్యవహారాలను సంక్షిప్తపర్చి వర్గీకరించి ఫలితాను నివేదించడమే అకౌంటింగ్ అంటారు. వ్యాపార నిర్ణయాలు తీసుకొనే వ్యక్తులకు ఈ ఆర్థిక సమాచారం నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి.
-AICPA – American Institute of Certified Public Accountant సంస్థవారు అకౌంటింగ్ అనే పదాన్ని కిందివిధంగా నిర్వచించారు.
-పూర్తిగా గాని కొంతమేరకైనా గాని ఆర్థిక సంబంధం ఉన్న వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసి వర్గీకరించి సంక్షిప్తపర్చి వ్యాపార నిర్వాహకులు, యజమానులకు వాటి ఫలితాలను వివరించే కళే అకౌంటింగ్ (గణక శాస్త్రం).
అకౌంటింగ్ ఉద్దేశాలు
-వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడం (Recording Business Transanctions)
-ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం (To understand Financial Position)
-ఆర్థిక నివేదికలను తయారు చేయడం (To Prepare Financial Statement)
-రుణగ్రస్తుల, రుణదాతల నివేదికలు తయారు చేయడం (To Prepare Debits and Credits Statements)
-పన్ను వివరాలను లెక్కించడం
Ex : 100,000 – 30.33 శాతం పన్ను
-అకౌంటింగ్ ప్రక్రియ (Accounting Process)
1. ఇన్పుట్ వ్యాపార వ్యవహారాలు
i. నగదు వ్యవహారాలు
ii. అరువు వ్యవహారాలు
-ఇవి ద్రవ్య రూపంలో కొలమానం అవ్వాలి.
2. ప్రక్రియ
i. గుర్తించడం ii. నమోదు చేయడం
iii. వర్గీకరించడం iv. సంక్షిప్తర్చడం
v. విశ్లేషణ vi. వివరణ
vii. పోల్చుట
3. ఔట్పుట్ (ఫలితం)
-ఆర్థిక నివేదికను యజమానులు, రుణదాతలు, ప్రభుత్వం, పెట్టుబడిదారులకు అందిస్తారు.
1) గుర్తించడం – సంబంధిత ఫలితాల ఆధారంగా వ్యాపార వ్యవహారాలను గుర్తించాలి.
2) నమోదు చేయడం – వ్యాపార వ్యవహారాలు జరిగిన వెంటనే శాస్త్రీయంగా క్రమపద్ధతిలో అకౌంటింగ్ పుస్తకాల్లో నమోదు చేయాలి.
3) వర్గీకరించడం – నమోదు చేసిన వ్యాపార వ్యవహారాలను వర్గీకరించి ఒకే స్వభావం కలిగిన వ్యవహారాలను ప్రత్యేక ఆవర్జాలో ఒకే శీర్షిక కింద చూపాలి. ఖాతాల మొత్తాలను నిల్వలను కనుక్కోవాలి.
4) సంక్షిప్తపర్చడం – ఖాతాల నిల్వలను కనుకొని వాటి ఆధారంగా అంకణా తయారు చేసే ప్రక్రియ.
5) విశ్లేషణ : లాభనష్టాల ఖాతా ఆస్తి, అప్పుల పట్టికల అంశాల మధ్య సంబంధాన్ని నెలకొల్పే ఆర్థిక స్థితిగతులను విశ్లేషణ చేయాలి.
6) వివరణ : యాజమాన్యం, నిర్వాహకులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అకౌంటింగ్ సమాచార విశ్లేషణ ద్వారా నెలకొల్పిన సంబంధాల అర్థాన్ని, ప్రాముఖ్యతను వివరిస్తుంది.
7) పోల్చడం : ఆర్థిక నివేదికల సమాచారాన్ని భవిష్యత్తులో ఒక అంశాన్ని మరొక అంశంతో పోల్చడానికి సహాయపడుతుంది. వ్యాపార సంస్థకు చెందిన వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.
అకౌంటింగ్ పదజాలం
1) ఖాతా – ac : ద్రవ్య సంబంధమైన ఒకే తరహా వ్యాపార వ్యవహారాలను అకౌంటింగ్ పుస్తకాల్లో సంక్షిప్త పరుస్తారు. వ్యాపార వ్యవహారాల్లో నికర ఫలితాన్ని తెలుసుకునేవిధంగా తయారుచేసే నివేదికను ఖాతా అంటారు. ఖాతా స్వరూపం ఆంగ్ల T ఆకారంలో ఉంటుంది. ఖాతాను రెండు భాగాలుగా విభజించి ఎడమవైపు భాగాన్ని Dr అని కుడివైపు భాగాన్ని Cr అని వ్యవహరిస్తారు.
2) యజమాని : వ్యాపార సంస్థను ప్రారంభించి ఆ సంస్థపై హక్కు ఉన్న వ్యక్తే యజమాని.
3) మూలధనం : వ్యాపార నిర్వహణకు యజమాని ప్రవేశపెట్టిన మొత్తాన్ని మూలధనం అంటారు. ఆర్జించిన లాభాల వల్ల మూలధనం నిల్వ పెరుగుతుంది. నష్టాలు, సొంత వాడకాల వల్ల తగ్గుతుంది.
4) సొంతవాడకాలు : యజమాని తన వ్యక్తిగత అవసరాల కోసం లేదా ఇంటి ఖర్చుల నిమిత్తం సంస్థ నుంచి తీసుకున్న నగదు లేదా సరుకు.
5) రుణగ్రస్తులు : వస్తువులు లేదా సేవల ప్రయోజనం సంస్థ నుంచి పొంది భవిష్యత్‌లో సొమ్ము చెల్లించాల్సిన వ్యక్తి.
6) రుణదాతలు : సంస్థకు ప్రయోజనాన్ని ఇచ్చి ప్రతిఫలం పొందే వ్యక్తి లేదా సంస్థ చెల్లించాల్సిన వ్యక్తులు.
ఆస్తులు (Assets) : వ్యాపార సంస్థల్లో ఆర్జనలు సమకూర్చి కనిపించీకనపించని అంశాలకు సంబంధించినవి. ఇవి భవిష్యత్తులో సంస్థకు ఆదాయాలను సమకూర్చుతాయి. ఆస్తులు రెండు రకాలు I స్థిరాస్తులు II ప్రస్తుత ఆస్తులు
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం