శాతవాహనులు -రాజకీయ చరిత్ర
‘శాతవాహనులు’ వారి జన్మప్రాంతంపై భిన్న కథనాలు అనేకం ఉన్నాయి. చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. అయినప్పటికీ వాదోపవాదనలపై ఏదోఒక ప్రశ్న పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది. అలాంటి వాదనల్లో ముఖ్యమైనవి కింది ఉదాహరణల్లో ఇచ్చారు.
సిద్ధాంతాలు-చెప్పిన చరిత్రకారులు
# హన్మంతరావు : వీరు ‘ఆర్యులు’ అని తన రచనల్లో పేర్కొన్నాడు.
# అగస్త్యులు : ‘దక్షిణ భారతదేశపు వాస్కోడిగామా’ అని ఇతడికి పేరు కలదు. ఇతడు శాతవాహనులు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చి దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని చెప్పాడు.
# ఆర్ఎస్ బ్రహ్మ : శాతవాహనులు ‘ఆర్యవ్రతం’ చేసి ఆర్యులుగా స్థిరపడిన ‘ద్రవిడులు’గా వివరించాడు.
# ప్రొఫెసర్ మిరాషి : శాతవాహనులు (వంద ఏనుగులు వాహనములుగా గలవారు) మహారాష్ట్రలోని ‘విదర్భ’ ప్రాంతానికి చెందినవారు అని చెప్పాడు. విదర్భ అంటే ప్రస్తుతం నాగ్పూర్. వీరు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పోరాడుతున్నారు. గతంలో విదర్భ బీరార్ రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ వంశాన్ని ‘ఇమ్మద్ షాహీ’ స్థాపించాడు (1492 సంవత్సరంలో)
# ఐరోపా వారు : బార్నేట్, వీఏ స్మిత్ మొదలగు చరిత్రకారులు ‘శాతవాహనులను ‘తెలంగాణ వారు’గా పేర్కొన్నారు.
వీరు పేర్కొన్న కారణాలు
నాణేలు : తెలంగాణలో కోటిలింగాల వద్ద లభించాయి.
# శాతవాహనుల నాణేల ముద్రణాలయం (టంకశాల) పెద్ద బంకూర్ వద్ద బయటపడింది. దీన్నిబట్టి శాతవాహనులు తెలంగాణ వారే అనే వాదనను బలపర్చారు. శాతవాహనుల తొలి రాజధానికోటిలింగాల’(నేటి కరీంనగర్జిల్లా)ను చేసుకొని ‘శ్రీముఖుడు’ పరిపాలించాడు.
# శాతవాహనులపై మరికొన్ని ముఖ్యమైన ఆధారాలు
అశోకుని 13వ శిలాశాసనం
అశోకుడు తన శిలాశాసనంలో ‘ఆంధ్ర’ అనే పదం గురించి వివరించాడు. క్రి.పూ. 260లో అశోకుడు కళింగ రాజ్యంపై దండయాత్ర సమయంలో ఆంధ్ర ప్రాంతం వా రు కళింగులకు సహాయంగా, మౌర్యులకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు.
పాణిని : తన అష్టాధ్యాయ గ్రంథంలో ‘దక్షిణాపథం’ గురించి వివరాలు ఇచ్చాడు.
సుత్తనివారం : బౌద్ధ గ్రంథంలో ‘ఆంధ్రులు’ అస్మక రాజ్యంలోని వారుగా పేర్కొంది.
కౌటిల్యుడు : తన అర్థశాస్త్రంలో ఆంధ్రులు ఆహార, విహార ప్రియులు, ఆరంభ శూరులు అని వివరించాడు.
టాలమి : తన ‘ఏ గైడ్ టు జాగ్రఫి’ గ్రంథంలో ఆంధ్ర ప్రాంతలోని అనేక తీర ప్రాంతాల గురించి ప్రస్తావించాడు.
మెగస్తనీస్ : తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 ప్రాకారమైన దుర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
శాతవాహనుల రాజకీయ చరిత్ర
#‘దక్కన్’ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం ‘శాతవాహనులు’. వీరి పాలన గురించి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వాయు పురాణంలో 30 మంది రాజులని, మత్స్య పురాణంలో 19 మంది రాజులని వివరాలు ఉన్నాయి. (ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏ పురాణంలో ఎంత మంతి రాజులను పేర్కొన్నారు)
# శ్రీముఖుడు ఈ రాజ్య స్థాపకుడు ఇతడు ‘మౌర్యులకు’ సామంతుడిగా పనిచేశాడు. ఇతని కాలంలో దక్షిణ భారతదేశంలో పౌరతిరుగుబాట్లు జరిగాయి. ఈ తిరుగుబాట్లు చివరకు దక్కన్ ప్రాంతానికి వ్యాపించి శ్రీముఖుని మరణానికి కారణమయ్యాయి. ప్రజలు తిరుగుబాటు చేసి, ఇతని పాలనను వ్యతిరేకించి చంపేశారని జైనమత గ్రంథంలో ‘సోమదేవసూరి’ తన ‘కథాసరిత్సాగరం’లో, హేమచంద్ర సూరి ‘పరిశిష్టపర్వన్’ గ్రంథంలో వివరించారు. ఇతని తర్వాత కన్హుడు లేదా కృష్ణుడు రాజ్యానికి వచ్చాడు.
#ఉత్తర భారతదేశంలోని ‘వాసుదేవుడు’ భాగవతమతం స్థాపించాడు. ఈ మతాన్ని దక్షిణ భారతదేశంలో కన్హుడు ప్రచారం చేశాడు. ఇతడు బౌద్ధులకు లేదా శ్రావణుల కొరకు నాసిక్ (గోదావరి నది జన్మప్రాంతం)లో ఒక గుహ దేవాలయం నిర్మించాడు. ఈ దేవాలయాన్ని కొంచెం మార్పులు చేసినట్లు తర్వాతి కాలంలో ‘గౌతమీ బాలశ్రీ’ తన నాసిక్ శాసనంలో చెప్పుకొంది.
మొదటి శాతకర్ణి
# కన్హుడి తర్వాత మొదటి శాతకర్ణి లేదా మల్లకర్ణి రాజ్యానికి వచ్చాడు. ఇతని గురించి మత్స్య పురాణం (మొత్తం 18 పురాణాలు కలవు. వీటిని అష్టాదశ పురాణాలు) అంటారు. (తొలి పురాణం మత్య, దశావతారాల్లో కూడా మొదటిది). మౌర్యు ల చివరి రాజు బృహద్రదుడు తన సేనాని పుష్యమిత్రుడి చేతిలో ఓడి చంపబడ్డాడు. దీంతో ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత శుంగవంశాన్ని పుష్యమిత్ర శుంగుడు స్థాపించాడు. దీంతో అప్పటి వరకు మౌర్యులకు సామంతులుగా ఉన్న శాతవాహనులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.
మొదటిశాతకర్ణి నిజమైన శాతవాహన రాజుగా చెప్పుకోవచ్చు. అశ్వమేథ, రాజసూయ యాగాలు నిర్వహించాడు. తన రాజ్యాన్ని విస్తరించడానికి మరాఠా రాజు త్రణకైయిలో కుమార్తె ‘దేవి నాగానిక’ను వివాహం చేసుకున్నాడు. నాగానిక ‘నానాఘాట్ శాసనం వేయించింది. ఈ శాసనంలో త్రైరాజ్య యుద్ధాల గురించి, శాతవాహనులు ‘స్వతంత్రం’ స్థాపించుకొనుటకు గల కారణాలు వివరించింది. త్రైరాజ్య యుద్ధాలంటే శాతవాహనుకు, కళింగులకు మధ్య విభేదాలు, కళింగులకు,శుంగులకు మధ్య రాజకీయ విభేదాల గురించి పేర్కొంటుంది.
# మొదట శాతకర్ణి రాజ్యవిస్తరణలను ‘కళింగ ఖారవేలుడు’ అడ్డుకట్ట వేశాడు. ఇతని రాజ్యంపైకి దాడి చేసి ‘పితుండ నగరం’ను గాడిదలతో దున్నించాడు. (పితుండ నగరం ప్రతిపాల నగరం(ప్రతిపాలపురం)గా పేర్కొన్నారు). ఇతనికి ‘దక్షిణాపథపతి’ అనే బిరుదు కలదు. తర్వాత పూర్ణాత్సంగ, స్కందస్కంబి పాలనలోకి వచ్చారు. తర్వాత రెండోశాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. ఇతడు దీర్ఘకాలం పరిపాలించిన శాతవాహన రాజు.
దాదాపు 56 ఏండ్లు పరిపాలించాడు. ఇతడు ఒడిశా (కళింగ), పాటలీపుత్ర ప్రాంతాలను జయించినట్లు ఆనందుడు అనే కవి పేర్కొన్నాడు. ఇతని తర్వాత లంబోదరుడు, అప్పీలకుడు, మేఘస్వాతి, స్వాతికర్ణి, స్కందస్వాతి, మృగేంద్రుడు వరుసగా రాజ్యానికి వచ్చారు.
కుంతల శాతకర్ణి
# ఇతని కాలంలో ప్రాకృత భాషను రద్దుచేసి సంస్కృతాన్ని ప్రవేశపెట్టాడు.(ఇతని కాలంలోనే సంస్కృతం రాజభాష, మిగతా రాజులందరిలో ప్రాకృతం రాజభాష) ఇతని ఆస్థానంలో వాత్సాయనుడు ‘కామశాస్త్రం’ అనే గ్రంథంలో సంగీతం, సాహిత్యంతో పాటు (64 కళల గురించి పేర్కొన్నాడు) పేయింటింగ్స్, వాటి రకాల గురించి పేర్కొన్నాడు. ఈ గ్రంథానికి శంకారాచార్యుడు ‘జయమంగళం’ పేరుతో వ్యాఖ్యా నం రచించాడు. తర్వాత పులోమావి-I రాజ్యానికి వచ్చాడు. ఇతడు పాటలీపుత్రంపై దాడి చేశాడు. ఇతని చేతిలో ఓటమి చెంది ఉరిశిక్షకు గురైన కణ్వ వంశ పాలకుడు సుశర్మ.(సుశర్మ అనంతరం మగధను కణ్వులు పరిపాలించారు. కణ్వవంశ స్థాపకుడు వాసుదేవుడు) పులోమావి ఘన విజయాల గురించి ‘కుమ్రాహార్’(ప్రాచీన పాటలీపుత్రం), బీత (అలహాబాద్ సమీపంలో ఉంది), తవ్వకాల్లో లభించిన శాతవాహనులు నాణేలు రుజువు చేస్తున్నాయి.
# హాలుడు పాలించినది ఒక సంవత్సరమే. అయినా ఇతని కీర్తి అజరామరమైనది. స్వయంగా గొప్పకవి. అనేక మంది కవులను పోషించి ‘కవి వత్సలుడు’గా ప్రసిద్ధి చెందాడు. శ్రీలంక మీద దండయాత్ర చేసి ‘దుట్టగామణి’ అనే రాజును ఓడించి ‘లీలావతి’ అనే రాజకుమార్తెను తీసుకొచ్చి తెలంగాణలోని గోదావరి తీరంలో వివాహం చేసుకున్నాడు. ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాడ్యుడు (తెలంగాణ తొలికవి) బృహత్కథ గ్రంథకర్త నివసించారు.
గౌతమిపుత్ర శాతకర్ణి
# శాతవాహనుల్లో గొప్పరాజు. యవనులను, శకులను, ప్రహ్లావులను నాశనం చేశాడు. ‘వర్ణాశ్రమ ధర్మోద్ధారకుడు’గా ప్రసిద్ధి. ‘త్రిసముద్రతోయ పీతవాహనుడు’(ఇతని రాజ్యం మూడు సముద్రాల వరకు విస్తరించినది’ అని అర్థం). ఇతనికి ‘రాజరాణో’ లేదా ‘రాజరాజు’ అనే బిరుదు ఉన్నట్లు తన తల్లి గౌతమి బాలాశ్రీ వేయించిన శాసనం ‘నాసిక్’లో వివరాలు కలవు. (నాసిక్ శాసనం 24వ రాజు ‘వాసిష్టపుత్ర పులోమావి’ కాలంలో చెక్కించబడెను). గౌతమీపుత్ర శాతకర్ణికి ఏకధనుర్ధరీ, శాతవాహన కులయశ, ప్రతిష్టాపనాకరుడుగా పేర్కొన్నారు. ఇతడు కింది రాజ్యాలను జయించాడు.
1. సిరితన – శ్రీశైలం
2. మలియ – నీలగిరి
3. అచివట – మాళ్వా(మధ్యప్రదేశ్)
4. ముళక – ప్రతిష్ఠానపురం
5. కుకుర – రాజస్థాన్
6. అరూప – నర్మదానది ప్రాంతం
# తర్వాత వాసిష్టిపుత్ర పులోమావి రాజ్యానికి వచ్చాడు. నాసిక్, కార్లే, అమరావతి, ధరణికోటలు లభించిన ఆధారాలు ఇతని వివరాలు కలిగివుండెను. ఉజ్జయిని పాలకుడైన కర్దమక వంశస్థుడైన ‘చష్టనుడు’ సమకాలీనుడుగా టాలమీ పేర్కొనెను. ఇతనికి ‘దక్షిణాపదేశ్వరుడు’గా ఛతరపవన, క్షత్రప అనే బిరుదులు కలవు.
# దక్షిణాపథంతో కూడిని కొన్ని బిరుదులు కలిగి ఉన్న శాతవాహన రాజులు ఎవరంటే…
1. దక్షిణాపథపతి : మొదటి శాతకర్ణి
2. దక్షిణాపథ రాజ్యస్థాపకుడు : శ్రీముఖుడు
3. దక్షిణాపథపదేశ్వరుడు : పులోమావి -2
4. త్రిసముద్రాధిపతి : యజ్ఞశ్రీ
# చివరకు కుషాణుల దాడులు తన రాజ్యంపై జరుగుటచే తన రాజధానిని తీరాంధ్రలోని ‘ధాన్యకటకాని’కి మార్చుకొనెను. యజ్ఞశ్రీ శాతకర్ణి తన పూర్వీకులు కో ల్పోయిన రాజ్యాలను తిరిగి జయించెను.తన సేనాని ‘భావగోపుడు’ చాలా ప్రసిద్ధి. యజ్ఞశ్రీ శాతకర్ణిని ‘అరక, మహాతారక’గా శాసనాలు వర్ణించెను.
# ఓడ గుర్తుగల నాణేలు ముద్రించి, విదేశీ వ్యాపారం ప్రోత్సహించెను. ఆచార్య నాగార్జునుడు ఇతని ఆస్థానంలో నివసించెను, ఇతని తర్వాత శాతవాహన సామంతులు అభీరులు, ఇక్షాకులు, పల్లవులు తిరుగుబాటు చేయడం, రాజరిక వారసత్వ యుద్ధాల వలన రాజ్యం అంతమయ్యెను. ఈ వంశంలో చివరి రాజు పులోమావి-3.
మాదిరి ప్రశ్నలు
1. దక్షిణ భారత ప్రజలు ఆహార,విహార ప్రియులు, ‘ఆరంభశూరులు’ అన్న మాటలు ఎవరివి? ఏ గ్రంథంలో ఉన్నవి? (2)
1) మెగస్తనీస్ – ఇండికా
2) కౌటిల్యుడు – అర్థశాస్త్రం
3) ప్లినీ – నేచురల్ హిస్టరీ
4) ఐతరేయ బ్రాహ్మణం – రుగ్వేదం
2. ‘త్రప్పగ’ శాతవాహనుల కాలంలో తరుచుగా కన్పించే పదం ఇది. దీని అర్థం? (3)
1) నాణేల ముద్రణాలయం 2) విదేశీ వ్యాపారుల కూటమి
3) విదేశీ నౌకలకు దారిచూపే నౌకలు
4) విదేశీ వాణిజ్య కేంద్రాలు
3. శాతవాహనుల కాలంలో ‘చిత్రలేఖనం’ గురించి వివరాలు ఈ కింది ఏ గ్రంథంలో ఉన్నాయి? (1)
1) వాత్సాయుని కామశాస్త్రం
2) హాలుడు – గాధాసప్తశతి
3) గుణాడ్యుడు- బృహత్కథ
4) ఆర్యదేవుడు – చిత్తశుద్ధి
4. జియోపొలిటికల్ యుద్ధాలను (త్రైరాజ్య యుద్ధాల) గురించి వివరాలందించిన శాసనం ఏది? లేదా భూభౌతో యుద్ధాలు గురించి? (2)
1) నాసిక్ శాసనం 2) నానాఘాట్ శాసనం
3) హాతిగుంఫా శాసనం
4) తిష్యరష్మతి శాసనం
డా౹౹ మురళి,
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు