హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటి బ్రిడ్జి?
పోటీ పరీక్షల ప్రత్యేకం
రామప్ప దేవాలయం
-ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేటలో ఉంది.
– ఈ ఆలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయరాజు గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు.
-ఈ దేవాలయ నిర్మాణ రూపశిల్పి- రామప్ప
-భారతదేశంలో శిల్పి పేరుతో ఉన్న ఏకైక దేవాలయంగా చెప్పవచ్చు.
-ఇది శివాలయం. దీనిలో పూజించే దేవుడు రామలింగేశ్వర స్వామి (రుద్రేశ్వరుడు).
-ఈ దేవాలయాన్ని నక్షత్రం ఆకారంలో నిర్మించారు.
– గణపతి దేవుడి బావమరిది, గజసైన్యాధ్యక్షుడు అయిన జాయపసేనాని రాసిన గ్రంథం ‘నృత్యరత్నావళి’ లోని పేరిణి నృత్య భంగిమలు, భరతనాట్యం, శృంగుడు, భృంగుడు, రతి వంటి భంగిమలు ఆలయం గోడలపై చెక్కారు.
– ఈ దేవాలయం చుట్టూ ఎర్రని రాతితో వాత్సాయనుడి కామసూత్రాలను అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు.
-రామప్ప గుడి గోడలపై వాద్యగాళ్లు, గాయకులు భక్తిగీతాలు పాడే రంగ మండపంలోని స్తంభాలపై శిల్పులు చెక్కిన ‘గోపికా వస్త్రా పహరణ ఘట్టం’, రాసక్రీడ భాగవత దృశ్యాలు నాటి శిల్పుల పనితనానికి మచ్చుతునకలు.
-ఈ ఆలయంలో ‘నాగిని, మదనిక’ అనే శిల్పాలు చెక్కారు.
– రామాయణ, మహాభారత శిల్పాలు చెక్కి ఉన్నాయి.
– ఆలయాన్ని ఆరున్నర అడుగుల ఎత్తుగల ఉపపీఠంపై నిర్మించారు.
– ప్రదక్షిణ పథం పది అడుగుల వెడల్పు ఉంది. దీనికి నాలుగు అంతస్తుల విమానం (గాలి గోపురం) ఉంది.
-పాలిపోయిన ఎరుపు రంగు గట్టిరాళ్లతో రామప్ప గుడిని నిర్మించారు.
-ఈ దేవాలయంలో కాకతీయుల వాస్తుశిల్పకళకు ప్రత్యక్ష నిదర్శనం అయిన కాటేశ్వర, కామేశ్వర, రుద్రేశ్వర ఆలయాలను రేచర్ల రుద్రుడు ఏకకాలంలో నిర్మింపజేశాడు. కానీ ప్రస్తుతం రుద్రేశ్వరాలయం మాత్రమే ఉంది.
-ఈ ఆలయాన్ని ఏకశిల పద్ధతిలో నిర్మించారు.
– దేవాలయ గాలి గోపురానికి వాడిన ఇటుకలు నీటిలో బంతిలాగా తేలుతాయి.
-ఆలయంలోని నంది ఎటుచూసినా ప్రేక్షకులవైపు చూస్తున్నట్లు ఉంటుంది.
– ఈ ఆలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంత వెలుతురు ఉంటుందో గర్భగుడిలో అంతే వెలుతురు ఉంటుంది.
-రామప్ప దేవాలయం బేలూరులోని హొయసాల చెన్నకేశవ ఆలయాన్ని పోలి ఉంటుంది.
– 2021, జూలై 25న ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది.
– చైనాలోని ఫుజౌలో నిర్వహించిన 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆఫ్ యునెస్కో సమావేశంలో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించారు.
-ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకోగా 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు.
-ఎనిమిది శతాబ్దాల నాటి (800 సంవత్సరాల క్రితం) ప్రాచీన కట్టడమైన రామప్పను ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి యునెస్కోకు నామినేట్ చేసింది.
1) ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం (శాండ్ బాక్స్ టెక్నిక్)
2) నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం
3) ఆలయ నిర్మాణానికి వాడిన రాయి నేటికీ రంగును కోల్పోకుండా ఉండటం
-యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ జాబితాలో 39వ స్థానాన్ని పొందింది. తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తింపు పొందిన తొలి దేవాలయం.
– ఈ ఆలయానికి సమీపంలో రామప్ప చెరువును నిర్మించారు.
-రామప్ప గుడిపై రిటైర్డ్ హెడ్ మాస్టర్ మందల మల్లారెడ్డి పుస్తకాన్ని రచించారు.
-2013కు ఈ ఆలయాన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తయ్యింది.
గోల్కొండ కోట
– గోల్ (గుండ్రని) కొండ (పర్వతం)పై నిర్మించిన దుర్గం.
-దీని పూర్వనామం- మంకాల్, గొల్లకొండ
– దీన్ని కుతుబ్ షాహీ సుల్తానులు మహ్మద్ నగరంగా పిలిచేవారు.
– దీన్ని మొదట కాకతీయులు నిర్మించగా, కుతుబ్ షాహీలు అభివృద్ధిపర్చారు.
– కాకతీయుల ఆధీనంలో ఉన్న ఈ కోటను 1365లో కాకతీయ సామంత రాజు రాజాకృష్ణదేవ్ ఒక ఒప్పందం ప్రకారం సుల్తాన్ మహ్మద్ బహమనీకి కేటాయించారు.
– సుల్తాన్ మహ్మద్ షా మరణానంతరం గోల్కొండ సుబేదార్ సుల్తాన్ కులీ కుతుబ్ షా 1518లో గోల్కొండ కోటను కేంద్రంగా చేసుకొని కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
-సుల్తాన్ కులీ కుతుబ్ షా పాత మట్టికోట స్థానంలో రాతి కోటను కట్టించాడు.
– ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండ కోట బలోపేతానికి పెద్ద ప్రణాళిక రూపొందించాడు. పాత కోట చుట్టూ 7 కి.మీ. బలిష్టమైన రాతికట్టను నిర్మింపజేశాడు.
– కోటలో మొత్తం 87 బురుజులు, 8 ద్వారాలు కట్టించాడు.
-పేట్ల బురుజు, మూసా బురుజు, కాగజీ బురుజు కోటలో ప్రసిద్ధిచెందిన బురుజులు.
-ఈ బురుజుల్లో పేట్ల బురుజు పెద్దది.
– ఫతే దర్వాజ, మక్కా దర్వాజ, బంజారా దర్వాజ, పటాన్చెరు దర్వాజ, మోతీ దర్వాజ, జమాలీ దర్వాజ కొన్ని ముఖ్య దర్వాజలు.
-గోల్కొండ కోట ప్రధాన ద్వారాన్ని ఫతే దర్వాజ (విజయ గుమ్మటం) అని అంటారు.
– శత్రు రాజ్యాల రాకను ముందుగానే పసిగట్టే విధంగా కోట ప్రవేశ ద్వారం వద్ద నిలిచి చప్పట్లు కొడితే 61 మీ. ఎత్తులోగల బాలాహిస్సార్ వద్ద ఉన్నవారికి చప్పట్ల ప్రతిధ్వని వినిపిస్తుంది.
– గోల్కొండ కోటలోపలి కట్టడాల్లో దివాన్ మహల్, జామియా మసీద్, బాలాహిస్సార్, నగీనా బాగ్, సిల్హాఖానా, బారాదరీ, కటోరాహౌస్ మొదలైనవి పేర్కొనదగినవి.
బారాదరీ: మూడు అంతస్తులతో నిర్మించిన రాజు సభా మండపం.
కటోరా హౌస్: కుతుబ్‌షాహీలు స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు
బడిడి: బాలహిస్సార్ మెట్లకు కుడి పక్కన ఒక పెద్ద బావి ఉంది. దీన్ని బడిడి అంటారు.
-తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమవుతుంది.
-ఈ కోటలోని మీనార్ల మసీదు ఆధారంగా చార్మినార్‌ను నిర్మించారు.
హైకోర్టు
-మూసీ నది తీరంలో నయాపూల్ బ్రిడ్జి పక్కన దీని నిర్మాణాన్ని 1915, సెప్టెంబర్ 15న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించాడు.
-జైపూర్‌కు చెందిన ‘శంకర్‌లాల్’ హైకోర్టు భవన ప్రణాళికను రూపొందించాడు.
– ఇంజినీర్ మెహర్ అలీ ఫజల్ ఆధ్వర్యంలో భవనం పూర్తయ్యింది.
-పూర్తయిన సంవత్సరం 1919, మార్చి 31.
-మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920, ఏప్రిల్ 20న లాంఛనంగా ప్రారంభించాడు.
– దీనిని ఎరుపు, తెలుపు రంగు రాయితో నిర్మించారు.
– మత సామరస్యానికి ప్రతీకగా హైకోర్టు భవనంపై రామ్ రహీమ్ అని రాసి ఉంది.
– 1956, నవంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంగా, 2019, జనవరి నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంగా మారింది.
మక్కా మసీదు
-దీని నిర్మాణం కుతుబ్ షాహీల రాజు అయిన సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా కాలంలో 1617లో మొదలయ్యింది.
-వివిధ కారణాల వల్ల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత 1693లో పూర్తి చేశారని ఒక అభిప్రాయం ఉంది.
– దీని నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినవారు సుల్తాన్ అధికారి (డరోగా) మీర్ ఫజీ ఉల్లా బేగ్, దరి రాజయ్య.
-మక్కా మసీదు దక్కన్‌లోనే అతిపెద్ద మసీదు. భారీ వాస్తు కట్టడం.
– సుమారు 77 సంవత్సరాల పాటు కొనసాగిన నిర్మాణంలో ఎక్కడా మట్టిని వాడలేదు. రాళ్లు, రాళ్లపొడిని మాత్రమే వాడారు.
– పవిత్ర మక్కా నుంచి తెచ్చిన కొన్ని ఇటుకలను ఈ మసీదు నిర్మాణంలో వాడటం వల్ల, మక్కాలోని మసీదు లాగా నిర్మాణం చేపట్టడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
– మక్కా మసీదు నిర్మాణంలో పర్షియా, అరేబియాల నుంచి వచ్చిన మేస్త్రీలు రాతి పనివారు పాల్గొన్నారు.
– మక్కా మసీదులోని ఏకశిలా నిర్మాణం- మెహరబ్
-దీన్ని మూలస్థానం నుంచి తెచ్చి మసీదులో నిలపడానికి 6000 మంది కూలీలు, 1400 ఎద్దులను కట్టిన ప్రత్యేక చక్రాలున్న బండిని వినియోగించారని ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పేర్కొన్నాడు.
– 1676లో ట్రావెర్నియర్ మక్కామసీదును దర్శించిన సమయంలో అది ఇంకా పూర్తికాలేదు. కానీ అప్పటికే పూర్తయిన స్తంభాలు, ఆర్చ్ ల అందాలను చూసి ముగ్ధుడయ్యాడు.
– ఈ మసీదులో ఒకేసారి పదివేల మంది ప్రార్థనలు చేయవచ్చు.
– ఈ మసీదు ‘దక్కన్ కాబా’గా ప్రసిద్ధి చెందింది.
– దీనికి సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా పెట్టిన పేరు- బైతుల్ అతిఖ్
-దీనిలో ఔరంగజేబ్ సౌరగడియారం నిర్మించాడు.
– దీనిలో ప్రధాన ప్రార్థనా మందిరాన్ని 225X180X73 కొలతలతో నిర్మించారు.
కట్టడం అర్థం
1) ఫలక్‌నుమా ప్యాలెస్ ఆకాశ దర్పణం
2) ఎరమంజిల్ స్వర్గంలో నిర్మించుకున్న అందాల భవనం
3) బెల్లావిస్టా అందమైన వీక్షణం
4) దారుల్షిఫా ఆరోగ్యానికి ద్వారం
కట్టడం శిల్పి/నిర్మాత
చార్మినార్ మీర్ మోమిన్ అస్త్రబాది
మక్కా మసీదు మీర్ ఫజీ ఉల్లా బేగ్, దరి రాజయ్య
హైకోర్టు శంకర్‌లాల్, మెహర్ అలీ ఫజల్
ఫలక్‌నుమా ప్యాలెస్ సర్ వికార్ ఉల్ ఉమ్రా
హుస్సేన్ సాగర్ హజ్రత్ స్సేన్ షా వలీ
ఎర్రమంజిల్ ఫకుల్ ముల్క్ బహదూర్
పురానా పూల్
– పురానా పూల్ అంటే పాతబ్రిడ్జి అని అర్థం. మూసీనదిపై మొట్టమొదటి వంతెన ఇది.
-ఇబ్రహీం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరం ఏర్పడక ముందే 1578లో గోల్కొండ కోట కార్వాన్ ప్రాంతీయులు మూసీనదిని దాటి వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు దీని నిర్మాణాన్ని చేపట్టాడు.
– దీని పొడవు 608 గజాలు, 35 అడుగుల వెడల్పు.
– హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటి బ్రిడ్జిగా పేర్కొంటారు.
-ప్రసిద్ధ ఫ్రెంచి నగల వ్యాపారి ట్రావెర్నియర్ 1676లో హైదరాబాద్ దర్శించినప్పుడు ఈ బ్రిడ్జిని చూసి ప్రేమ వంతెన (బ్రిడ్జి ఆఫ్ లవ్)గా వర్ణించాడు.
-ఇతడు పురానా పూల్‌ను పారిస్‌లోని పాంట్న్యూఫ్ (Pont neuf)తో పోల్చాడు.
హుస్సేన్ సాగర్
-గోల్కొండ రాజ్యాన్ని పాలిస్తున్న ఇబ్రహీం కులీ కుతుబ్ షా అల్లుడు అయిన హుస్సేన్ షా వలీ హైదరాబాద్ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చడం కోసం 1562లో దీనిని నిర్మించినట్లు చెబుతారు.
-హు స్సేన్ షా వలీ నేతృత్వంలో నిర్మితమైన ఈ చెరువుకు ఇతడి పేరుమీదుగా హుస్సేన్ సాగర్ అని పేరు వచ్చిందని చెబుతారు.
-హు స్సేన్ సాగర్‌లోని గౌతమ బుద్ధుని ప్రతిమను ఎన్టీఆర్ కాలంలో గణపతి స్తపతి అనే శిల్పి రూపొందించాడు. దీని పొడవు 58 అడుగులు. బరువు 350 టన్నులు.
– హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ ప్రాంతంలో ఇంతకు ముందు హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండేది.
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?