చీమల గురించి తెలిపే శాస్త్రం ఏది?

భూమి పుట్టినప్పటి నుంచి మానవ ఆవిర్భావం వరకు కాలాన్ని కింది విధంగా విభజించారు.
ఎజాయిక్ యుగం: ఇది మొదటి యుగం. జీవ రహిత యుగం.
ఆదిజీవ మహాయుగం: ఈ యుగంలో జీవం మొదటగా సముద్రంలో ఏర్పడింది. ఈ యుగంలో ఏకకణ జీవులు. ప్రాథమిక అకసేరుకాలు ఏర్పడ్డాయి.
ప్రాథమిక జీవ మహాయుగం:
దీనిని అకసేరుకాల యుగం అంటారు. దీనిలో ట్రైలోబైట్స్, అనిలిడా, మొలస్కా ఉద్భవించాయి.
పురాజీవ మహాయుగం (పీలియోజాయిక్ యుగం):
దీన్ని 3 యుగాలుగా విభజించారు.
-ఆర్థోవిషియస్: ఈ కాలంలో చేపలు ఉద్భవించాయి.
-డివోనియస్: ఈ కాలంలో చేపలు బాగా అభివృద్ధి చెందాయి. దీన్ని చేపల స్వర్ణయుగమని అంటారు. ఈ కాలంలో ఉభయచరాల ఆవిర్భావం కూడా జరిగింది.
-కార్బోని ఫెరస్: ఈ కాలంలో ఉభయచరాలు అత్యధికంగా అభివృద్ధి చెందాయి. దీన్ని ఉభయచరాల స్వర్ణయుగం అని అంటారు.
మాధ్యమిక జీవ మహాయుగం(మిసోజాయిక్ యుగం): దీనిలో సరీసృపాలు బాగా అభివృద్ధి చెందడంతో దీన్ని సరీసృపాల స్వర్ణయుగంగా పేర్కొంటారు.
-దీనిని a) ట్రయాసిక్ b) జురాసిక్ c) క్రటీషియా యుగాలుగా విభజించారు.
-జురాసిక్ యుగాన్ని పక్షుల స్వర్ణయుగమని అంటారు.
నవీన జీవ మహాయుగం (సినోజాయిక్ యుగం):
దీన్ని క్షీరదాలు, కీటకాల యుగంగా చెప్పవచ్చు.
-సందాన సేతువులు: ఒక జీవికిగాని జీవుల సమూహానికిగాని వాటికంటే ప్రాథమిక, వాటికంటే అభివృద్ధి చెందిన జీవుల లక్షణాలను కలిగి ఉన్నవాటిని సందాన సేతువు అంటారు. జీవులు వాటి ముందు జీవుల నుంచి ఆవిర్భవించాయని తెలిపేందుకు ఇవే నిదర్శనం. ఉదా:
-అనిలిడా- ఆర్థోపొడాకు సందాన సేతువు పెరిపేటస్ (బనైకోఫారం)
-అనిలిడా – మొలస్కాకు సందాన సేతువు నియోపిలైనా గెలాతియానా
-అకసేరుకాలు – కార్డేటాకు సందాన సేతువు హెమి కార్డేటా
-చేపలు – ఉభయచరాలకు సందాన సేతువు యూస్తినాఫ్టెరాన్ (ఆస్టియోలెపిడ్స్)
-ఉభచరాలు – సరీసృపాలకు సందాన సేతువు సీమూరియా
-సరిసృపాలు – పక్షులకు సందాన సేతువు ఆర్కియోప్టెరిక్స్
జీవశాస్త్రం – అనుబంధ శాఖలు
-బయాలజీ: జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
-బోటని/ఫైటాలజీ: మొక్కల గురించి అధ్యయనం
-జువాలజీ: జంతువుల గురించి అధ్యయనం
-మైక్రోబయాలజీ: సూక్ష్మజీవుల గురించి అధ్యయనం
-మార్ఫాలజీ: ప్రాణుల నిర్మాణం, ఆకారాల గురించి అధ్యయనం
-అనాటమీ: జీవుల అంతర్నిర్మాణాల గురించి అధ్యయనం
-హిస్టాలజీ: కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. దీనినే సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం (మైక్రో అనాటమీ) అంటారు.
-సైటాలజీ/కణశాస్త్రం: కణాల నిర్మాణం, ఆకారం గురించి అధ్యయనం చేసే శాస్త్రం
-సెల్ బయాలజీ/కణజీవ శాస్త్రం: కణాల గురించి అధ్యయనం
-కారియాలజీ: కేంద్రకం గురించి అధ్యయనం
-కాండ్రాలజీ: మృదులాస్థి గురించి అధ్యయనం
-ఆస్టియాలజీ: ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రం
-ఆర్థ్రాలజీ: కీళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
-మయాలజీ/స్కాలజీ: కండరాల గురించి తెలిపే శాస్త్రం
-కైనిసాలజీ: శరీర కండర కదలికల గురించి తెలిపే శాస్త్రం
-ఆప్తాల్మాలజీ: కళ్లను గురించి తెలిపే శాస్త్రం
-డెర్మటాలజీ: చర్మం గురించి తెలిపే శాస్త్రం
-ఒడెంటాలజీ: దంతాల గురించి చదివే శాస్త్రం
-హెమటాలజీ: రక్తం గురించి తెలిపే శాస్త్రం
-ఆంజియాలజీ: రక్తనాళాల గురించి తెలిపే శాస్త్రం
-గాస్ట్రోఎంటరాలజీ: జీర్ణాశయం, అంతరంగ అవయవాల గురించి తెలిపే శాస్త్రం
-హెపటాలజీ: కాలేయం గురించి తెలిపే శాస్త్రం
-పాంక్రియాలజీ: క్లోమం గురించి తెలిపే శాస్త్రం
-రైనాలజీ: ముక్కును గురించి తెలిపే శాస్త్రం
-ఓటాలజీ: చెవిని గురించి తెలిపే శాస్త్రం
-లారింగాలజీ: గొంతు గురించి తెలిపే శాస్త్రం
-క్రీనిమాలజీ: కపాలం గురించి తెలిపే శాస్త్రం
-కాలాలజీ: ముఖం/అందం గురించి తెలిపే శాస్త్రం
-ఫ్లూరాలజీ: ఊపిరితిత్తుల గురించి తెలిపే శాస్త్రం
-కార్డియాలజీ: హృదయం గురించి తెలిపే శాస్త్రం
-నెఫ్రాలజీ: మూత్రపిండాల గురించి తెలిపే శాస్త్రం
-యూరాలజీ: విసర్జక వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం
-ఎండోక్రైనాలజీ: అంతస్రావక గ్రంథుల గురించి తెలిపే శాస్త్రం
-న్యూరాలజీ: నాడీవ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం
-ఫ్రినాలజీ: మెదడు గురించి తెలిపే శాస్త్రం
-ఫినాలజీ: జంతు వలసల గురించి తెలిపే శాస్త్రం
-ఆండ్రాలజీ: పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం
-గైనకాలజీ: స్త్రీ ప్రత్యుత్పత్తి గురించి తెలిపే శాస్త్రం
-ఎంబ్రియాలజీ: పిండోత్పత్తి వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం
-నియోనేటాలజీ: నవజాత శిశువు గురించి తెలిపే శాస్త్రం
-ట్రామాలజీ: గాయాల గురించి తెలిపే శాస్త్రం
-టాక్సానమీ: జంతువులు, మొక్కల వర్గీకరణ గురించి అధ్యయనం
-వైరాలజీ: వైరస్ల గురించి తెలిపే శాస్త్రం
-బ్యాక్టీరియాలజీ: బ్యాక్టీరియాల గురించి తెలిపే శాస్త్రం
-మైకాలజీ: శిలీంధ్రాలు/బూజుల గురించి తెలిపే శాస్త్రం
-ఫైకాలజీ/ఆల్గాలజీ: శైవలాలు, నాచు గురించి తెలిపే శాస్త్రం
-బ్రయాలజీ: బ్రయోఫైటా మొక్కల గురించి తెలిపే శాస్త్రం
-టెరిడాలజీ: టెరిడోఫైటా మొక్కల గురించి తెలిపే శాస్త్రం
-ప్రొటోజువాలజీ: ప్రొటోజువా జీవుల గురించి తెలిపే శాస్త్రం
-పారాజువాలజీ: పొరిఫెరా (స్పంజికల) గురించి తెలిపే శాస్త్రం
-హెల్మింథాలజీ: హెల్మింథీస్ జీవుల గురించి తెలిపే శాస్త్రం
-పారాసైటాలజీ: పరాన్నజీవుల గురించి తెలిపే శాస్త్రం
-ఎంటమాలజీ: కీటకాల గురించి తెలిపే శాస్త్రం
-లెపిడాప్టిరాలజీ: సీతాకోక చిలుకల గురించి తెలిపే శాస్త్రం
-కార్సినాలజీ: రొయ్యలు, పీతల గురించి తెలిపే శాస్త్రం
-ఏరినాలజీ: సాలెపురుగుల గురించి తెలిపే శాస్త్రం
-ఏకరాలజీ: టిక్స్, మైట్స్ గురించి తెలిపే శాస్త్రం
-మిర్మికాలజీ: చీమల గురించి తెలిపే శాస్త్రం
-మెలకాలజీ: మొలస్కా జీవుల గురించి తెలిపే శాస్త్రం
-కంకాలజీ: మొలస్కా జీవుల కర్పరాల గురించి తెలిపే శాస్త్రం
-ఇక్తియాలజీ: చేపల గురించి తెలిపే శాస్త్రం
-ఆంఫిబయాలజీ: ఉభయచరాల గురించి తెలిపే శాస్త్రం
-బాట్రకాలజీ: కప్పల గురించి తెలిపే శాస్త్రం
-హెర్పెంటాలజీ: సరీసృపాల గురించి తెలిపే శాస్త్రం
-సర్పెంటాలజీ/ఒఫియాలజీ: పాముల గురించి తెలిపే శాస్త్రం
-సారాలజీ: బల్లుల గురించి తెలిపే శాస్త్రం
-ఆర్నిథాలజీ: పక్షుల గురించి తెలిపే శాస్త్రం
-టీరాలజీ: పక్షుల ఈకల గురించి తెలిపే శాస్త్రం
-నిడాలజీ: పక్షుల గూళ్ల గురించి తెలిపే శాస్త్రం
-ఊలాలజీ: పక్షుల గుడ్ల గురించి తెలిపే శాస్త్రం
-మమ్మాలజీ: క్షీరదాల గురించి తెలిపే శాస్త్రం
-ఆంథ్రోపాలజీ: మానవ పరిణామం గురించి తెలిపే శాస్త్రం
-సైకాలజీ: మానవ ప్రవర్తన గురించి తెలిపే శాస్త్రం
-ఇథాలజీ: జంతు ప్రవర్తన గురించి తెలిపే శాస్త్రం
-జెరంటాలజీ: ముసలితనం/వృద్ధాప్యం గురించి తెలిపే శాస్త్రం
-కైరాప్టరాలజీ: గబ్బిలాల గురించి తెలిపే శాస్త్రం
-ఆంథాలజీ: పుష్పాల గురించి తెలిపే శాస్త్రం
-పోమాలజీ: ఫలాల గురించి తెలిపే శాస్త్రం
-స్పెర్మాలజీ: విత్తనాల గురించి తెలిపే శాస్త్రం
-ఆగ్రానమీ: పైరు పంటల గురించి తెలిపే శాస్త్రం
-ఆగ్రోస్టాలజీ: గడ్డిజాతుల గురించి తెలిపే శాస్త్రం
-డెండ్రోక్రొనాలజీ: వార్షిక లేదా వృద్ధి వలయాల గురించి తెలిపే శాస్త్రం
-డెండ్రాలజీ: కలపనిచ్చే మొక్కల గురించి తెలిపే శాస్త్రం
-పేలినాలజీ: పరాగ/పుప్పొడి రేణువుల గురించి తెలిపే శాస్త్రం
-హైడ్రాలజీ: నీటి స్వభావాన్ని గురించి తెలిపే శాస్త్రం
-హైడ్రోఫోనిక్స్: మృత్తిక లేకుండా నీటిలో మొక్కల పెరుగుదల గురించి తెలిపే శాస్త్రం
-జన్యుశాస్త్రం: అనువంశికత (పోలిక), వైవిధ్యాల (తేడాలు)కు కారణమైన జన్యువుల గురించి తెలిపే శాస్త్రం
-ఇకాలజీ/ఆవరణ శాస్త్రం: జీవులు, వాటిచుట్టూ ఉండే పరిసరాల గురించి తెలిపే శాస్త్రం
-పీలియంటాలజీ: పురాజీవ శాస్త్రం- శిలాజాల గురించి తెలిపే శాస్త్రం
-పీలియోబోటనీ: శిలాజవృక్షాల గురించి తెలిపే శాస్త్రం
-పీలియోజువాలజీ: శిలాజ జంతువుల గురించి తెలిపే శాస్త్రం
-ట్రైకాలజీ: వెంట్రుకల గురించి వివరించే శాస్త్రం
-ఫైటోజని: మొక్కల పుట్టుక/అభివృద్ధి గురించి వివరించే శాస్త్రం
-ఫైలోజని: ఒక జీవి వర్గ వికాస చరిత్ర
-పెడాలజీ/ఎడపాలజీ: నేల/మృత్తిక గురించి వివరించే శాస్త్రం
-ఆంకాలజీ: క్యాన్సర్ గురించి వివరించే శాస్త్రం
-మాస్టాలజీ: రొమ్ములు లేదా క్షీరగ్రంథుల గురించి వివరించే శాస్త్రం
-లిమ్నాలజీ: మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి వివరించే శాస్త్రం
-మెలకాలజీ: నత్తల గురించి వివరించే శాస్త్రం
-ఎపిడిమియాలజీ: అంటువ్యాధుల వ్యాప్తి, కారణాలు, నియంత్రణ గురించి వివరించే శాస్త్రం
-కోఫ్రాలజీ: వ్యర్థపదార్థాల గురించి వివరించే శాస్త్రం
-ఎక్సోబయాలజీ: అంతరిక్షంలోని జీవుల గురించి వివరించే శాస్త్రం
-క్రయోబయాలజీ: తక్కువ ఉష్ణోగ్రత వద్ద చనిపోయిన ప్రాణులను నిల్వ ఉంచడం గురించి తెలిపే శాస్త్రం
-ఇటియాలజీ: వ్యాధుల గురించి తెలిపే శాస్త్రం
-ఇమ్యునాలజీ: రోగ నిరోధకతను నేర్చుకొనే శాస్త్రం
-టెరిటాలజీ: పిండాభివృద్ధి కాలంలో పిండంలో ఏర్పడే అపసవ్యాల గురించి నేర్చుకొనే శాస్త్రం
-వెనెరియాలజీ: లైంగిక వ్యాధుల గురించి తెలిపే శాస్త్రం
-ఎపికల్చర్: తేనెటీగల పెంపకం
-ఆక్వాకల్చర్: జలచర జీవుల పెంపకం
-సెరీకల్చర్: పట్టు పురుగుల పెంపకం
RELATED ARTICLES
-
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
-
Telangana History & Culture | 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
-
General Science Physics | సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
-
Indian Polity | ఉభయ సభల ప్రతిష్టంభన.. ఉమ్మడి సమావేశం
-
Telangana History & Culture | పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
-
Chemistry | ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు