తెలంగాణ చరిత్ర నుంచి 85 మార్కులు
తెలంగాణ చరిత్ర నుంచి గ్రూప్-IIలో దాదాపు 85 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. (ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. జనరల్ స్టడీస్ పేపర్-I నుంచి 10 ప్రశ్నలు. పేపర్-2లో 75 ప్రశ్నలు కలిపి మొత్తం 85 మార్కులు తెలంగాణ చరిత్ర నుంచి వచ్చే అవకాశం ఉంది). కాబట్టి తెలంగాణ చరిత్రపై అభ్యర్థులు లోతైన అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. శాతవాహనుల నుంచి దాదాపు 8 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. హేమచంద్రుని వ్యాకరణంలో ‘శాతవాహన’ అనే పదానికి ‘‘సాతవాహన’’అనే పదం అపభ్రంశ రూపంగా పేర్కొనబడినది. మెగస్తనీస్ తన ‘ఇండికా’ గంథ్రంలో ఆంధ్రులకు 30 ప్రాకారవృతమైన దుర్గాలున్నాయని పేర్కొన్నారు. కార్లే శాసనంలో శాతవాహన కుల అనే పదప్రయోగం జరిగింది. ఇంకనూ ‘‘రాయనిముఖ శాతవాహన సిరిమతో’’ బిరుదు గల రాజు ఎవరు?. ఎవరి నాణేలపై ఓడ, వృషభం గుర్తులు కలవు?. వసిష్టిపుత్ర ఆనందుడు ఎవరి ఆస్థాన కళాకారుడు? లాంటి ప్రశ్నలు కీలకమైనవిగా పరిగణించాలి. కుమారామాత్యులు, విషయపతులు, గహపతులు, గుల్మికలాంటి పరిపాలన పదాలపై అవగాహన కలిగి ఉండాలి. హిరణ్యకుడు, భాండాగారికుడు, నిబంధనకారులు లాంటి ఆర్థికపరమైన అధికారుల గురించి తెలుసుకోవాలి. ‘‘ద్విజవర కుటుంబ వివర్ధనుడు’’గా ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? (గౌతమిపుత్ర శాతకర్ణి). ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మ రక్షిత’’ ఏ శాసనంలో కలవు (నాసిక్ శాసనం). స్కందవారం, అక్షపటకులు ఎవరు? (సైనిక స్థావరాలు, పత్రాలు భద్రపరిచే అధికారులు), శాతవాహనుల సంగీతం, పెయింటింగ్, నాట్యం తదితర అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఇక్ష్వాకుల కాలంలో తొలి సంస్కృత శాసనం ముద్రించినది? (ఏబల శాంతమూలుడు). వీరి రాజధాని విజయపురి. వీరి శిల్పకళపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఉదా. చెయ్యెత్తిన మందాత శిల్పం ఎక్కడ ఉంది?. నాగార్జున కొండను ఏఆర్ సరస్వతి 1926లో కనుగొనెను. ఇక్షాకుల మతం, కళ, నిఖాయశాఖ, ఉజ్జయిని మహాసేనుడి భక్తుడిగా ప్రసిద్ధి. విశపట్టి శాసనంలో పన్నుల గురించి, తమలపాకులు, వ్యవసాయ ప్రాధాన్యత. మొదలైన ఆర్థికపరమైన అంశాలు.
‘‘రాజు సాధారణ వస్త్రంతో 8 మంది అనుచరులతో సన్యాస ఆశ్రమానికి వెళ్తున్న శిల్పం ఎక్కడుంది?. బుద్ధుడు స్వర్గం నుంచి కిందికి దిగుతున్న శిల్పం ఎక్కడుంది? లాంటి ప్రశ్నలు ముఖ్యమైనవి. కీసర రాజధానిగా పరిపాలన చేసిన రాజులెవ్వరు?. వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని, తర్వాత రాజధాని?. మొదటి హరికేసరి వేములవాడ శాసనాన్ని చెక్కించెను. ‘సపాదలక్షదేశం’ అని ఏ ప్రాంతానికి పేరు. (రూ. 25000 ఆదాయం రావడంతో ఆప్రాంతానికి ఆ పేరు వచ్చింది). సొలదగండడు అనే బిరుదు ఎవరికి గలదు. పంపడు ఎవరి ఆస్థానంలో కలడు?. సోమదేవసూరి ఏ రాజు ఆస్థానంలో కలడు లాంటి ప్రశ్నలు కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది.
ముదిగొండ చాళుక్యుల్లో రాజ్యస్థాపకుడు, గొప్పవాడు?. వనితజనాశ్రయుడిగా ప్రసిద్ధి చెందినది ఎవరు?. ఇక కాకతీయుల కాలంలో పరిపాలనాంశాలు చాలా ప్రధానం. కాకతీయుల సాహిత్య సేవ, మత విధానం, శిల్పకళ, ఆర్థిక విధానం, ముస్లింల దాడులు, మొదలైన అంశాలు ప్రాధాన్యత గలవి. ప్రతాపరుద్ర చరిత్ర రచన, మాగల్లు తామ్రశాసనం, జగతకేసరి తటాకం, త్రిభువనమల్ల, పరమేశ్వర బిరుదులు ఎవరివి?. హనుమకొండలో మొట్టమొదటి ఉద్యానవనం నిర్మించినది ఎవరు? ఆరాధ్యత్రయం ఎవరు? కాకతీయరాజ్య స్థాపనాచార్య, కాకతీయరాజ్య భారతదేశీయుడు లాంటి బిరుదులు ఎవరికి కలవు? విశ్వేశ్వర శివాచార్య ఎవరి గురువు?. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏకైక రాణి రాణీరుద్రమదేవి పురుషనామంతో (రుద్రమహారాజు) పరిపాలించెను. పద్మనాయక వంశంలో గొప్పరాజు 2వ సింగభూపాలుడు, అతని ఆస్థానంలో పండితుల వంటి అంశాలను చదవాల్సి ఉంటుంది. గోల్కొండ కుతుబ్‌షాహీల పరిపాలనాంశాలు, మల్కిభరాముడు ఎవరు?. బడేమాలిక్ ఎవరు? అబుల్ హసన్ ఎవరు? వారి సాంస్కృతిక సేవలు ప్రధానం. మొఘల్ పాలనలో గోల్కొండ… గోల్కొండపై ఔరంగజేబు దండయాత్రలు, అక్కన్న, మాదన్న సేవలు, భక్తరామదాసు భద్రాచలంలోని రాముని దేవాలయ నిర్మాణం ముఖ్యం.
అసఫ్‌జాహీల పరిపాలన (1724-1748) అంశాలు, వీరి కాలంలో వచ్చిన సాంస్కృతిక సేవ, 1857 సిపాయిల తిరగుబాటు, వహాబి ఉద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయ కాంగ్రెస్ స్థాపన, రజాకార్ల ఉద్యమం, తెలంగాణ సాయుధపోరాటం, హైదరాబాద్‌పై పోలీస్‌చర్య, హైదరాబాద్‌లో ఆదిహిందూ సమాజం పాత్ర, భాగ్యారెడ్డివర్మ సేవలు, తెలంగాణ భాషా సాహిత్య సేవ వికాసం గురించి అభ్యర్థులు ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. చివరగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం మంత్రి మండలి, వారి శాఖలు కీలకం.
‘‘హేమచంద్రుని వ్యాకరణంలో ‘‘శాతవాహన’’ అనే పదానికి ‘‘సాతవాహన’’అనే పదం అపభ్రంశ రూపంగా పేర్కొనబడింది. మెగస్తనీస్ తన ‘ఇండికా’ గంథ్రంలో ఆంధ్రులకు 30 ప్రాకారవృతమైన దుర్గాలున్నాయని పేర్కొన్నారు. కార్లే శాసనంలో ‘శాతవాహన కుల’ అనే పద ప్రయోగం జరిగింది. ఇంకనూ ‘‘రాయనిముఖ శాతవాహన సిరిమతో’’ బిరుదు గల రాజు ఎవరు?. ఎవరి నాణేలపై ఓడ, వృషభం గుర్తులు కలవు?. వసిష్టిపుత్ర ఆనందుడు ఎవరి ఆస్థాన కళాకారుడు? లాంటి ప్రశ్నలు కీలకమైనవిగా పరిగణించాలి. కుమారామాత్యులు, విషయపతులు, గ్రహపతులు, గుల్మికలాంటి పరిపాలనా పదాలపై అవగాహన కలిగి ఉండాలి. హిరణ్యకుడు, భాండాగారికుడు, నిబంధనకారులవంటి ఆర్థికపరమైన అధికారుల గురించి తెలుసుకోవాలి’’
సిలబస్
తెలంగాణ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్ర
I- ప్రాచీన తెలంగాణ చరిత్ర
1. తెలంగాణ పూర్వచారిత్రక యుగం
2. తెలంగాణ శబ్ద ఆవిర్భావం
3. తెలంగాణ చరిత్రకు ఆధారాలు
4. శాతవాహనుల ముందుగల తెలంగాణ చరిత్ర (అస్మకరాజ్యాలు)
5. శాతవాహనులు 6. ఇక్షాకులు
7. తెలంగాణలో జైన, బౌద్ధమతాలు
(కొలనుపాక, ఫణిగిరి, జైన, బౌద్ధమతాలు)
8. విష్ణుకుండినులు (కీసరగుట్ట రాజధాని)
II- మధ్యయుగ తెలంగాణ చరిత్ర
9. వేములవాడ చాళుక్యులు
10. ముదిగొండ చాళుక్యులు
11. కాకతీయుల పాలనా విశేషాలు
12. రేచర్ల వెల్మ/పద్మనాయక వంశం
13. కుతుబ్‌షాహీల పరిపాలన (క్రీ.శ.512-1687)
14. మొఘల్ పాలనలో గోల్కొండ (క్రీ.శ.1687-1724)
III- ఆధునిక తెలంగాణ చరిత్ర
15. తెలంగాణలో ఈస్టిండియా కంపెనీ పాలన
16. తెలంగాణలో అసఫ్‌జాహీల పాలన (1724-1948)
17. తెలంగాణలో జాతీయ కాంగ్రెస్
(హైదరాబాద్ కాంగ్రెస్)
18. హైదరాబాద్ ఆదిహిందూ ఉద్యమాలు
19. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం
20. తెలంగాణలో భాషా, సాహిత్య వికాసం
21. తెలంగాణలో గ్రంథాలయోద్యమాలు
22. తెలంగాణలో వందేమాతర ఉద్యమం
23. తెలంగాణలో హోంరూల్ ఉద్యమం
24. తెలంగాణలో సహాయ నిరాకరణ ఉద్యమం
25. తెలంగాణలో శాసనోల్లంఘన ఉద్యమం
26. తెలంగాణలో స్వాతంత్య్రోద్యమం/జాతీయోద్యమం
27. 1) రజాకార్ల ఉద్యమం (1940-48)
2) తెలంగాణ సాయుధపోరాటం (1946-1951)
3) హైదరాబాద్ విలీనోద్యమం (1947 ఆగస్టు7)
4) హైదరాబాద్‌పై పోలీస్ చర్య
28. హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు
29. విశాలాంధ్ర ఉద్యమం – ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
30. తెలంగాణలో వామపక్ష ఉద్యమాలు
31. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
1) 1956 పెద్దమనుషుల ఒడంబడిక విఫలం
2) 1969 తెలంగాణ ఉద్యమం
3) 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం
4) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
మాదిరి ప్రశ్నలు
1. సీపీ బ్రౌన్ కంటే ముందే తెలుగుభాషకు నిఘంటువును, వ్యాకరణాన్ని రచించినది? (ఏ)
ఏ) ఏడీ కాంబెల్ బీ)కల్నల్ మెకంజీ
సీ) బ్రేకన్ డీ) డినెబౌలి
2. కింది వానిలో సరికానిది? (సీ)
ఏ) కంకటి పాపరాజు – ఉత్తర రామాయణం
బీ) కూచిమంచి తిమ్మకవి- నీలాసుందరి పరిణయం
సీ) మంగళగిరి ఆనందకవి- రావణ దమ్మయం
డీ) పింగళి ఎరనార్యుడు – తోభ్ర చరిత్ర
3. మొగల్రాజపురం గుహలో లేనిది? (బీ)
ఏ) అష్టభుజ ‘నటరాజ మూర్తి’ బీ) పూర్ణకుంభం
సీ) గజపృష్టాకారంలో గల శిల్పాలు
డీ) ‘సింహం’ ప్రసిద్ధ శిల్పం
4. మంత్రకూట గుండరాజును ఓడించి అతని తలను బోడి చేసి అతని వక్షంపై ‘వరాహం’ లాంఛనాన్ని ముద్రించినది? (సీ)
ఏ) గణపతి దేవుడు బీ) రుద్రదేవుడు
సీ) రెండో ప్రోలరాజు డీ) రెండోచేతరాజు
5. సిద్ధత్రయంలో లేనిది ఎవరు? (డీ)
ఏ) రేవణ బీ) మరుళ
సీ) ఏకోరామ డీ) ఉద్దటా
6. తెలంగాణ పితామడు ఎవరు? (ఏ)
ఏ) మాడపాటి హనుమంతరావు
బీ) సురవరం ప్రతాపరెడ్డి
సీ) బీ వెంకట్రావు
డీ) జమలాపురం కేశవరావు
7. కింది వానిలో సరికానిది? (డీ)
ఏ) తెలుంగరాయ స్థాపనాచార్య – మహాదేవుడు
బీ) కాకతీయ రాజ్యబార దేశీయుడు – గణపతిదేవుడు
సీ) ద్వీపిలుంటాకా, దేవిచూరకార – ండసేనాని
డీ) కాకతీయ రాజ్యస్థాపనాచార్య – రెండో ప్రతాపరుద్రుడు
8. తెలంగాణలో ఏర్పడిన తొలి గ్రంథాలయం? (ఏ)
ఏ) శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం బీ) వివేకవర్థిని
సీ) రాజరాజ నరేంద్రభాషా నిలయం
డీ) విజ్ఞాన చంద్రిక మండలి
9. గ్రంథాలయ ఉద్యమ పితామడు? (బీ)
ఏ) మాడపాటి హనుమంతరావు బీ) కొమరాజు లక్ష్మణరావు
సీ) భాగ్యారెడ్డివర్మ డీ) జమలాపురం కేశవశరావు
10. హైదరాబాద్ రాష్ట్రంలో విలీనోద్యమం లేదా జాయిన్ ఇండియా ఉద్యమం నిర్వహించిన నాయకులు ఎవరు?
ఏ) పీవీ నరసింహారావు బీ) రావి నారాయణరెడ్డి
సీ) స్వామి రామానందతీర్థ డీ) పై వారందరూ (సీ)
డా౹౹ మురళి,
లెక్చరర్ నిజాం కళాశాల,
హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు