తెలంగాణలో బౌద్ధమతం- ఆదరణ

బౌద్ధానికి భారత్ పుట్టినిల్లు. బౌద్ధమతానికి తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుని తొలి ఐదుగురు శిష్యుల్లో మొదటివాడు తెలంగాణ వాడు కావడం గర్వించాల్సిన విషయం. ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బౌద్ధం ప్రౌఢవిల్లిందనడానికి పలు సాక్ష్యాలు లభిస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, నల్లగొండల్లో పలు చైత్యాలు, స్తూపాలు బయల్పడగా, ఇంకా పలుచోట్ల తవ్వకాలు జరగాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల్లో తెలంగాణ చరిత్ర కీలకం. ఈ నేపథ్యంలో తెలంగాణలో బౌద్ధం ఎలావర్థిల్లిందో చూద్దాం..
బౌద్ధమతం గొప్ప తత్త్వవేత్తలు
బుద్ధుని వ్యక్తిత్వం, సమాజం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణలోని ‘ఆదిమ జాతులను’ ఆకర్షించింది. తెలంగాణలోని ‘కోటిలింగాల, ఏలేశ్వరం, ఉండ్రుగొండ, నేలకొండపల్లి, నాగార్జునకొండ’ ప్రాంతాల్లో నివసించిన నాగులు’ బౌద్ధం పట్ల ఆకర్షితులైనారు. (లలితవిస్తారం ఆధారంగా పై వివరాలు తెలు స్తున్నాయి. ఈ గ్రంథాన్ని ఆర్నాల్డ్ ‘లెటర్ ఆఫ్ ఏషియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు).
బుద్ధునికి గల తొలి ‘ఐదుగురు శిష్యుల్లో’ ఒకరు తెలంగాణ వాడు కావడం గమనించాల్సిన విషయం. వారు..
1. కొడనాగు (కొండన, కౌండిన్య) – తొలి శిష్యుడు తెలంగాణ ప్రాంతం, 2. అశ్వజిత్ 3. మహానామ 4. బద్రుక 5. కశ్యప. వీరికి బుద్ధుడు ‘సారంగధర’ అనే గ్రామంలో తొలి బోధన జరిపాడు. ఈ ప్రాంతమే బౌద్ధమతం పుట్టిన ప్రదేశం అని ‘ఇసిల’ శాసనంలో ఉంది. (ఇసిల శాసనం అంటే సారనాథ్) సారనాథ్ పట్టణాన్ని అశోకుని కాలంలో ‘ఇసిల’ నగరంగా పేర్కొనేవారు. కాలక్రమేణ ఇసిల పట్టణం సారంగధర, సార్నాథ్గా మారింది.
ఇక్కడి ప్రజలు (నాగులు) పశుపతి, శివున్ని బుద్ధుని రూపంలో పూజించారు. తెలంగాణ ప్రజలు జ్ఞానమూర్తిలో ఉన్న శివుడిని ‘దక్షిణామూర్తి’గా పూజించేవారు. ఇతనే బౌద్ధంలో అవలోకేతిశ్వరుడు.
బౌద్ధ సిద్ధాంతాలు ఇక్కడి ప్రజలను అమితంగా ఆకర్షించాయి. ఉదాహరణకు..
1. నాగార్జునుడి – మాధ్యమిక వాదం
2. మైత్రేయుడి – విజ్ఞానవాదం
3. బుద్ధఘోషుడి – థెరవాదం
4. వసుబంధుడి – యోగాచార వాదం
5. కుమారిల భట్టు – పూర్వ మీమాంసగా
ప్రసిద్ధిచెందినవి. పై సిద్ధాంతాలు అంటే ఏమిటి? అవి ఎక్కడెక్కడ అభివృద్ధి చెందాయి.. మొదలైన వివరాలను ‘స్ట్రాబో’అనే చరిత్రకారుడు అందించాడు. ఈ బౌద్ధ తత్త్వవేత్తలు రాసిన గ్రంథాల ప్రభావం కూడా తెలంగాణలో బౌద్ధమతం వ్యాప్తి చెందడానికి కారణమైంది. అలాంటి గ్రంథా ల్లో ముఖ్యమైన వాటిని గమనిస్తే….
1. నాగార్జునుడి – ఆయోకసారం
2. ఆర్యదేవుడి – అక్షరస్క
3. బుద్ధఘోషుడి – విశుద్ధిమార్గ
4. బుద్ధపాలితుడి – మాధ్యమిక ప్రవృత్తి
5. వసుబంధుడి – ఆర్యదేవుని ‘శతు శతకం’ శాసా్త్రనికి వాఖ్యానం రచించాడు.
6. దిగ్ఞ్నాగుడు – ‘ప్రాజ్ఞపారమిత సంగ్రహం’ (ప్రాజ్ఞపారమిత లేదా విజ్ఞానికి సరిహద్దులు నాగార్జునుడు రచించినది. కానీ దీన్ని ప్రామాణికంగా దిగ్ఞ్నాగుడు ‘భారతీయ తర్కశాస్త్ర పితామడు’ ఈ గ్రంథాన్ని రచించాడు)
7. అసంగుడు -‘అబిసామయ సముశ్చయ’ గ్రంథంలో విజ్ఞానవాదం + యోగాచారవాదాన్ని బలపరిచినట్లు వివరాలు అందిస్తుంది.
ధర్మకీర్తి -‘ప్రమాణవర్తిక’ గ్రంథంలో తర్కశాస్త్రంపై వ్యాసాలు రచించాడు. ఇతడిని దక్షిణ భారతదేశంలో చివరి బౌద్ధతత్తవేత్తగా చెప్పుకోవచ్చు. ఇతడు ‘ఈశ్వరసేనుని’ శిష్యుడు. ఈశ్వరసేనుడు దిగ్ఞ్నాగుని శిష్యుడు.
రాణులు – యువరాజులు సామన్యప్రజల పట్ల చూపిన ఆదరణ, అభిమానాలు కూడా తెలంగాణలో బౌద్ధమతం వ్యాపించడానికి కారణంగా చెప్పవచ్చు. (అంటే రాజవంశానికి చెందిన స్త్రీలమనీ, రాణులమనే గర్వం వారిలో అణువంతయూ కన్పించలేదు. అదే విధానం సామాన్యులను విపరీతంగా ఆకర్షించింది.
(ఉదా౹౹ ఇటీవల ఢిల్లీలో 2015 ఫిబ్రవరి 10న జరిగిన ఎలక్షన్స్‌లో ఆమ్ ఆద్మీపార్టీ 53 శాతం ఓట్లను సాధించి 70 స్థానాలకు 67 సీట్లను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. దీనికి గల ముఖ్యకారణం కేజ్రీవాల్ అతిసామన్య పద్ధతులు, సామాన్యునికి ఉండాల్సిన అనుకువ, డాంబికం, గర్వం లేకుండా అందరితో కల్సిపోవడమేనని అనేక సర్వేలు ముక్తకంఠంతో తెలిపాయి. అలనాడు గాంధీ విధానం, నేటి కేజ్రీవాల్ పద్ధతులు ఒకలాంటివేనని ఢిల్లీ ప్రజలు గమనించి, గుర్తించి గెలిపించారు). అలాగే శాతవాహన, ఇక్షాకుల వంశానికి చెందిన రాణులు సమాజంలోకి ప్రవేశించి సామాన్యుల్లో ఒకరిగా కలిసిపోయి వారిలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు.

శాతవాహన, ఇక్షాకుల వంశాలకు చెందిన రాజులు
1. ఖమ్మం – నేలకొండపల్లి, 2. నల్లగొండ – ఫణిగిరి, ఉండ్రుగొండ, గాజులబండ, తిరుమలగిరి, 3. కరీంనగర్ – పెదటంకూర్, కోటిలింగాల, ధూళికట్ట, 4. మెదక్ – కొండాపూర్, పటాన్చెరు మొదలైన ప్రాంతాల్లో బౌద్ధస్తూపాలు నిర్మించి, విద్యాకేంద్రాలు స్థాపించి, వర్తకులకు, వృత్తి పనివారికి, సాధారణ ప్రజలను ఆదరించి అంతులేని సంపదలను దానం చేసి ప్రజాదరణ పొందారు.
బౌద్ధంలోని తాత్విక చింతనను, తెలంగాణలో బౌద్ధ తాత్విక సిద్ధాంతాలు అభివృద్ధి చెంది తెలంగాణకు ప్రపంచంలోనే ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. శాతవాహన, ఇక్షాకుల యుగంలో తెలంగాణ అంతట కొన్ని వందల స్తూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించబడ్డాయి. ఎక్కడ తవ్వినా బౌద్ధ శిథిలాలే. మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే బౌద్ధమతం ఉండేదని, రాష్ట్రంలో బౌద్ధం లేదని అనుకునేవారు. ఇటీవల జరిగిన పరిశోధనలో, తవ్వకాల్లో తెలంగాణలోని పెదబంకూడ, ధూళికట్ట, గాజులబండ, ఫణిగిరి, తిరుమలగిరి మొదలైన ప్రాంతాల్లో బౌద్ధశిథిలాలు బయల్పడ్డాయి.
చైత్యక శైలులు
తెలంగాణలో చైత్యక శైలులుని ప్రత్యేక శాఖలు ఉద్భవించాయి. ఈ విధానంలో చైత్యాన్ని అలకరించడం (బౌద్ధ దేవాలయాలను చైత్యాలు అంటారు) పూజించడం, దానాలు చేయడం ద్వారా బుద్ధదేవుడి అనుగ్రహం లభించి నిర్యాణం (మోక్షం) కలుగుతుందని భావించేవారు. మోక్షం అంటే జనన, మరణ చక్రం నుంచి మానవుడికి కలిగే విముక్తి. దక్షిణాది నాలుగు జాతుల్లో అనాది నుంచి పితృదేవతల ఆరాధన కన్పిస్తుంది. కనుక తల్లిదండ్రుల సమాధుల వద్ద స్తంభాలు నాటి పూజలు చేసేవారు. బృహత్ శిలాయుగ ప్రజలకు మరణం తర్వాత ఆత్మ జీవిస్తుందని నమ్మకం ఉండేది. అందువల్లనే వారు బృహత్శిలా సమాధులు నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడి తెగలకు చెట్లను, పుట్టలను, పాములను పూజించే ఆచారం ఉంది. భూత, ప్రేత పిశాచాలయందు కూడా నమ్మకం ఉంది. కాబట్టి వారిలో మంత్ర, తంత్ర విద్యలు ఉండేవి (వజ్రాయుధశాఖ దీనికొక ఉదాహరణ). మంత్రాలతో భూత, ప్రేత, పిశాచుల నుంచి రక్షించుకోవచ్చని నమ్మకం. ఈ ఆచారాలే ‘చైత్యక వాదాని’కి దారితీశా యి. ఈ చైత్యకవాదమే మహాసాంఘికవాదంగా, మహాయాన మతస్థాపనకు తర్వాత వజ్రయాన వాదానికి దారితీశాయి. మొదట ఆంధ్రలో ప్రత్యేక చైత్యక వాదాలు అభివృద్ధి చెందాయి.
చైత్యక శైలులు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలోనూ ఆవిర్భవించి ఉంటాయని శోభనా గోఖలే రచించిన ‘టూలెడ్ కాయిన్స్ ఆఫ్ గౌతమీపుత్ర శాతకర్ణి’ అనే గ్రంథంలో వివరించాడు. ఇది బ్రిటీష్ మ్యూజియంలోఉంది. అంతేకాకుండా ‘ది హిస్టరీ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ది -శాతవాహన’ గ్రంథకర్త వీవీ మెరాషి రచించిన వాటిలో కూడా ఈ వివరాలు ఉన్నాయి. కాబట్టి దొరికిన ఆధారాలే కాకుండా దొరకాల్సినవి కూడా ఏమైనా ఉండొచ్చనే కోణంలో పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంపై ఆధారపడి ఉంది.
అంతేకాకుండా అనేకమంది మహావిజ్ఞానులు, బౌద్ధ ఆచార్యులు తెలంగాణలో బౌద్ధతత్వాన్ని గొప్పగా అభివృద్ధి చేశారు. నాగార్జునుడు మహాజ్ఞాని. శుంగులు, కణ్వుల కాలంలో ఉత్తరభారతదేశంలో వైదిక పునరుద్ధరణ వలన క్షీణించిపోయే బౌద్ధమతానికి నాగార్జునుడు తన మాధ్యమికవాదం ద్వారా జీవంపోసి, మహాయాన మతానికి రూపకల్పన చేశాడు. తర్వాత థెరవాదం క్షీణించిపోగా, బుద్ధఘోషుడు శ్రీలంకకు పోయి హీనయాన గ్రంథాలు రాసుకొని ‘హీనయాన వాదం’ను నిలబెట్టాడు. సిద్ధ నాగార్జునుడు వజ్రయానానికి రూపకల్పన చేశాడు.
శాలంకాయనులు, విష్ణుకుండినుల కాలంలో బౌద్ధమతం క్షీణించింది. శాలంకాయనులు, విష్ణుకుండినులు వైదిక మతాభిమానులు. త్రిలోచనా పల్లవుడు బౌద్ధులను నాశనం చేసి హైందవ సంస్కృతిని కాపాడినాడు. విష్ణుకుండినుల కాలంలో గోవిందవర్మ రాణియైన పరమభట్టారక మహాదేవ ‘ఇంద్రపాల’ నగరంలో(రామన్నపేటలోని తుమ్మలగూడెం గ్రామం, ఇది నల్లగొండ జిల్లాలో ఉంది) విహారాన్ని నిర్మించింది.
మిగతా వారెవ్వరూ బౌద్ధానికి సేవచేయలేదు. పోషించలేదు. కాకతీయుల కాలంలో వారి సామంతులు కొంతవరకు బౌద్ధమతానికి సేవచేశారు. చివరకు వైష్ణవులు బుద్ధుని ‘విష్ణు’ దశావతారాల్లో ఒకటిగా చేర్చారు. బౌద్ధమతాన్ని తన జ్ఞానంతో, విజ్ఞానవాదంతో శంకరాచార్యులు, కుమారభట్టు పతనం చేసి హీనమతంగా ప్రచారం చేశారు. బౌద్ధంలోని అంతర్గత కారణాలు కూడా బౌద్ధం అంతంకావడానికి కారణాలయ్యాయి. ఈనాడు దేశంలోని బౌద్ధం మైనార్టీగా మిగిలిపోయి, చైనా, శ్రీలంక, జపాన్, కొరియా, థాయ్‌లాండ్ దేశాల్లో ప్రముఖంగా జీవిస్తున్నది.
ఆంధ్రలో ఉన్న 5 చైత్యక శైలిలే తెలంగాణలో కూడా ఉండి ఉండవచ్చు.
ఆంధ్రలోని చైత్యక శైలులు తెలంగాణలోని చైత్యక శైలులు
1. పూర్వాశైలి – అమరావతి 1. ఫణిగిరి (నల్లగొండ)
2. అపరశైలి – నాగార్జునకొండ 2. ధూళికట్ట (కరీంనగర్)
3. ఉత్తరశైలి – జగ్గయ్యపేట 3. పెదబంకూర్ (కరీంనగర్)
4. రాజగిరిక – గుంటుపల్లి 4. కొండాపూర్ (మెదక్)
5. సిద్ధార్థకశైలి – గుడివాడ 5. నేలకొండపల్లి (ఖమ్మం)
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
-
Geography | అత్యధిక వేలా పరిమితి ఎక్కడ నమోదవుతుంది?
-
Telangana History | తూముల యుద్ధం ఏయే రాజుల మధ్య జరిగింది?
-
INDIAN POLITY | ప్రకరణల ప్రకారం.. పరిపాలన విధానం
-
General Science | ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం?
-
Disaster Management | మనకు మాత్రమే కాదు.. భావి తరాలకు సొంతమే
-
Mathematics Group IV Special | 9,81,729; 8,64,512 అయితే 7,49,..?
Latest Updates
ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
WCDSC Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
South Central Railway Recruitment | సౌత్ సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
TSPSC Group-1 Prelims Practice Test | ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకొంటారు?
TSPSC Group-1 Prelims Practice Test | ఏడుపు పుట్టించే వాయువు ఏది?
Respiratory System – Gurukula JL special | పదార్థాల విచ్ఛిన్నం.. శక్తి ఉత్పన్నం.. ఉష్ణమోచకం
BEL Recruitment | బెంగళూరు బెల్లో 205 ఇంజినీర్ పోస్టులు