జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది?
1.కిందివాటిలో ప్రొటీన్లు కానిది (1)
1) బియ్యం 2) మాంసం 3) పప్పులు 4) గుడ్లు
2. కిందివాటిలో క్రీడాకారులు తక్షణ శక్తి కోసం దేన్ని తీసుకుంటారు? (1)
1) గ్లూకోజ్ 2) విటమిన్ సి 3) సోడియం క్లోరైడ్ 4) పాలు
3.క్రీడాకారులు తక్షణ శక్తి కోసం కిందివాటిలో దేన్ని తీసుకుంటారు? (2)
1) విటమిన్లు 2) కార్బోహైడ్రేట్లు 3) ప్రొటీన్లు 4) కొవ్వులు
4.డాక్టర్లు మన ఆహారాన్ని వనస్పతి, నెయ్యిలో కన్నా నూనెల్లో వండాలని
ఎందుకు సిఫార్సు చేస్తారు? (1)
1) నూనె సంతృప్త కొవ్వులను కలిగి ఉండటం
2) నూనె అసంతృప్త కొవ్వులను కలిగి ఉండటం
3) నూనె ఆహార రుచిని పెంచుతుంది
4) వనస్పతి, నెయ్యి త్వరగా జీర్ణం కావు
5.ఆహారంలో ఇనుము లోపం దేనికి దారితీస్తుంది? (3)
1) గొంతు కణితి (గాయిటర్) 2) స్కర్వీ 3) ఎనిమియా 4) రికెట్స్
6.పప్పుదినుసులు వేటి ఆధారాలు (3)
1) కార్బోహైడ్రేట్లు 2) కొవ్వులు 3) ప్రొటీన్లు 4) విటమిన్లు
7. తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండేది ఏది? (2)
1) గ్లూకోజ్ 2) పిండిపదార్థం 3) మాల్టోజ్ 4) మాంసకృత్తులు
8. నత్రజని సంబంధ ఆహారం (1)
1) ప్రొటీన్లు 2) లిపిడ్స్ 3) సాల్ట్స్ 4) కార్బోహైడ్రేట్స్
9. కోడిగుడ్లల్లో మాంసకృత్తులతో పాటు ఇంకా ఏమి ఉంటాయి? (4)
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి 3) ఇనుము 4) పైవన్నీ
10. నీటిలో కరిగే విటమినులేవి? (1)
1) B, C 2) A, D 3) B, D 4) C, A
11. గుడ్డులో లభించేది? (4)
1) రాగి 2) సిలికాన్ 3) Co2 4) సల్ఫర్
12.పాస్ఫరస్ ఎక్కువగా లభించే ఆహార పదార్థం? (2)
1) ఉల్లిపాయలు 2) గుడ్డు పచ్చసొన 3) మామిడి 4) కొబ్బరికాయ
13.పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది? (2)
1) ఎ 2) బి 3) డి 4) కె
14. విటమిన్-డి రసాయనిక నామం? (3)
1) బయోటిన్ 2) రెటినాల్ 3) కాల్సిఫెరాల్ 4) ఆస్కార్బిక్ ఆమ్లం
15.పాలు, మాంసం, కోడిగుడ్లు దేనికి మంచి వనరులు? (1)
1) మాంసకృత్తులు 2) కొవ్వు 3) పిండిపదార్థం 4) విటమిన్లు
16.ఆహారంలో అయోడిన్ లోపంతో వచ్చే వ్యాధి? (1)
1) గాయిటర్ 2) ఎనిమియా 3) క్షయ 4) రికెట్స్
17. కిందివాటిలో ఇనుము దేనిలో అధికంగా ఉంటుంది? (1)
1) ఆకుకూరలు 2) పాలు 3) పెరుగు 4) క్యాలిఫ్లవర్
18). సూర్యకాంతి దేనికి అత్యుత్తమ వనరు? (2)
1) విటమిన్ ఎ 2) విటమిన్ డి 3) విటమిన్ బి 4) విటమిన్ సి
19. రేచీకటి ప్రధానంగా ఏ విటమిన్ లోపంతో వస్తుంది? (1)
1) ఎ 2) డి 3) కె 4) సి
20.గాయాలు, ఎముకల విరుగుదలను త్వరగా మాన్పడానికి తోడ్పడే విటమిన్? (4)
1) ఎ 2) డి 3) కె 4) సి
21. మామిడి, బొప్పాయి, టొమాటోలో ఉండే విటమిన్? (1)
1) ఎ 2) డి 3) కె 4) సి
22.తాజా పండ్లలో ఉండే విటమిన్? (4)
1) ఎ 2) డి 3) కె 4) సి
23.సాధారణంగా గర్భవతుల్లో లోపించేది? (4)
1) సోడియం, కాల్షియం 2) సోడియం, ఇనుము
3) ఇనుము, మెగ్నీషియం 4) కాల్షియం, ఇనుము
24.విటమిన్ ఇ రసాయన నామం? (1)
1) టోకోఫెరాల్ 2) కెరోటిన్ 3) బయోటిన్ 4) కాల్సిఫెరాల్
25.విటమిన్ కెను కనుగొన్నది? (1)
1) డాయిసీ డాం 2) మెక్కల్లం 3) జిన్నర్ 4) కాల్సిఫెరాల్
26.తల్లిపాలల్లో అధికంగా ఉండేవి? (2)
1) విటమిన్లు 2) ప్రొటీన్లు 3) ఎంజైమ్స్ 4) సాల్ట్స్
27.విటమిన్ల చరిత్ర ప్రారంభకాలం? (1)
1) 18వ శతాబ్దం 2) 17వ శతాబ్దం
3) 15వ శతాబ్దం 4) 16వ శతాబ్దం
28.ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఏ భాగానికి హాని కలిగిస్తుంది? (4)
1) గుండె 2) మూత్రపిండాలు 3) ఊపిరితిత్తులు 4) ఎముకలు
29.శరీరంలో కొవ్వును నిల్వ చేసే కణాలు (1)
1) అడిపోసైట్స్ 2) ప్లేట్లెట్స్ 3) ఫైబ్రోబ్లాస్టిస్ 4) గ్లియల్ కణాలు
30.తల్లిపాలల్లో అధికంగా ఉండే మూలకం? (1)
1) ఇనుము 2) మెగ్నీషియం 3) పొటాషియం 4) కాల్షియం
31. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్? (2)
1) ఎ 2) డి 3) కె 4) ఇ
32. రక్తంలో ఏ రకం చక్కెర గణనీయ పరిమాణంలో ఉంటుంది? (1)
1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోజ్ 3) గాలాక్టోజ్ 4) సుక్రోజ్
33.ఆహారంలో విటమిన్ డి లోపంతో వచ్చే జబ్బు? (2)
1) స్కర్వీ 2) రికెట్స్ 3) బెరి బెరి 4) రేచీకటి
34.మానవ శరీరంలో ఎక్కువగా ఉండేవి? (2)
1) మాంసకృత్తులు 2) నీరు 3) కొవ్వుపదార్థం 4) ప్లాస్మా
35.ఎముకలు, దంతాలు ఏర్పడుటకు ముఖ్యమైన విటమిన్? (2)
1) ఎ 2) డి 3) కె 4) ఇ
36.కళ్లు ఆరోగ్యవంతంగా పనిచేయడానికి దోహదపడే విటమిన్? (1)
1) ఎ 2) డి 3) కె 4) ఇ
37.శరీరానికి అవసరమైన ఇనుము దీనిలో అధికంగా ఉంటుంది? (1)
1) ఆకుకూరలు 2) పాలు 3) గుడ్లు 4) క్యాలిఫ్లవర్
38. క్యారెట్లో అధికంగా లభించే విటమిన్? (1)
1) ఎ 2) బి 3) సి 4) డి
39.బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపంతో కలుగుతుంది? (2)
1) ఎ 2) బి 3) సి 4) డి
40. సి విటమిన్ ఏ ఆహారపదార్థాల్లో ఎక్కువగా లభిస్తుంది? (2)
1) ఆపిల్ 2) సిట్రస్ జాతి పండ్లు 3) అరటిపండు 4) సీతాఫలం
41.ఆస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్‌ని పిలుస్తారు? (3)
1) ఎ 2) బి 3) సి 4) డి
42.ఆహారంలో విటమిన్ ఎ లోపిస్తే దెబ్బతినే అవయవం? (1)
1) కళ్లు 2) చర్మం 3) గొంతు 4) కాలేయం
43. కాలేయంలో నిల్వ ఉండే విటమిన్? (2)
1) ఎ 2) డి 3) ఇ 4) సి
44.జంతు ఆహార ఉత్పుత్తుల్లో మాత్రమే కనిపిస్తూ సంబంధిత
ఆహార ఉత్పత్తుల్లో కనిపించని విటమిన్? (4)
1) ఎ 2) కె 3) సి 4) బి..12
45.గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రొటీన్ ఏది? (2)
1) కెరోటిన్ 2) ఆల్బుమిన్ 3) కొల్లాజెన్ 4) హిమోగ్లోబిన్
46.హైడ్రాలజీ అంటే కిందివాటిని గురించి తెలిపే శాస్త్రం? (2)
1) మృత్తిక 2) నీరు 3) సముద్రనీరు 4) మంచినీరు
47.జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది? (3)
1) గొల్లభామ 2) బొద్దింక 3) లెపిష్మా 4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు