ఇతిహాసం-మహాభారత రచన
ఇతిహాసం
-ఇతిహాసం అంటే ఇతి+హ+ఆసం. ఎలాంటి సంశయం లేకుండా నిజంగా జరిగిందని మధ్యలో ఉన్న హ అనే అక్షరం తెలుపుతుంది.
ఇతిహాసం నిర్వచనాలు
-ఇతిహాసం పురావృత్తం (ఇతిహాసమంటే పూర్వవృత్తాంతం గలది) అని చెప్పినవాడు- అమరసింహుడు.
-కర్మఫల సంబంధ స్వభావాలైన ఆగామికార్థాలు ఎందు లో కనిపిస్తాయో అదే ఇతిహాసం- అభినవగుప్తుడు.
-పురాణమితి, వృత్తమాఖ్యాయి కోదాహరణం, ధర్మశాస్త్రం మర్ధశాస్త్రం, చేతిహాసం అంటే కొన్ని పురాణ లక్షణాలు, కార్యకారణ సంబంధమైన ఇతివృత్తం, ఆఖ్యానాలు, ధర్మార్థశాస్త్ర విషయాలు కలిగినటువంటిదే ఇతిహాసం- కౌటిల్యుడు.
-శాస్త్రరూప కావ్యాచ్ఛాయాన్వయి అంటే కొంత శాస్త్ర రూపాన్ని కొంత కావ్యఛాయను కలిగినటువంటిదే ఇతిహాసం- ఆనందవర్దనుడు.
-పరంపరగా కథ చెప్పేవారికి గల పేరు- ఆఖ్యాత
-ఆఖ్యాత చెప్పే కథనం- ఆఖ్యానం
-ఆఖ్యాత కంటే చిన్నది- ఆఖ్యానకం
-ఇతరుల ద్వారా విన్నదాన్ని చెప్పడం- ఉపాఖ్యానం
-ప్రధాన కథలో ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడానికి సహకరించేది- ఉపాఖ్యానం.
-భారతీయ ఇతిహాసాలు 1) రామాయణం 2) మహాభారతం.
-ప్రాచీన ఇతిహాసం- రామాయణం
-రామాయణం అంటే రాముని జీవనయానాన్ని తెలిపేది.
-రామాయణాన్ని సంస్కృతంలో రచించింది- వాల్మీకి
-రామాయణంలోని భాగాలకు గల పేరు- కాండలు
-రామాయణంలోని కాండలు 7. అవి 1) బాలకాండ 2) అయోధ్యకాండ 3) అరణ్యకాండ 4) కిష్కింధకాండ 5) సుందరకాండ 6) యుద్ధకాండ 7) ఉత్తరకాండ
-తెలుగులో రాసిన తొలి రామాయణం- రంగనాథ రామాయణం
-రంగనాథ రామాయణం రచయిత- గోన బుద్దారెడ్డి
-రంగనాథరామాయణంలోని ఛందస్సు- ద్విపద
-గోనబుద్దారెడ్డి కాలం- 13వ శతాబ్దం
-గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణంలో ఎన్ని కాండలు రాశాడు- 6 (బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు).
-రంగనాథ రామాయణంలో ఉత్తరకాండను రచించినవారు- గోనబుద్దారెడ్డి కుమారులు కాచభూపతి, విఠలనాథుడు.
-అహల్య వృత్తాంతంలో ఇంద్రుడు కోడి రూపు ధరించడం, జంబుమాలి వృత్తాంతం, కాలనేమి కథలు ఉన్న రామాయణం- రంగనాథ రామాయణం.
-తెలుగులో రాసిన తొలి చంపూ రామాయణం- భాస్కర రామాయణం.
భాస్కర రామాయణ కర్తలు
-హుళక్కిభాస్కరుడు- అరణ్యకాండ, యుద్ధకాండ పూర్వభాగం
-మల్లికార్జునభట్టు- బాల, కిష్కింధ, సుందరకాండలు
-కుమార రుద్రదేవుడు- అయోధ్యకాండ
-అయ్యలార్యుడు- యుద్ధకాండ శేషభాగం.
-భాస్కర రామాయణంలో ఎక్కువ భాగం రచించిన కవి- మల్లికార్జునభట్టు
-హుళక్కి భాస్కరుని కుమారుడు- మల్లికార్జునభట్టు
-భాస్కరుని శిష్యుడు- కుమారరుద్రదేవుడు
– భాస్కరుని మిత్రుడు- అయ్యలార్యుడు
– భాస్కర రామాయణ రచనాకాలం- 14వ శతాబ్దం
– 15వ శతాబ్దానికి చెందిన మొల్ల రచించిన రామాయణం- మొల్లరామాయణం.
– శ్రీకంఠమల్లేశ్వరుని దయతో కవిత్వం చెప్పానని చెప్పిన కవయిత్రి- మొల్ల.
– గుహుడు రాముని పాదాలను కడిగిన వృత్తాంతం గలది- మొల్లరామాయణం
– నిరోష్ట్యరామాయణ రచయిత- మరింగంటి సింగరాచార్యులు
– నిరోష్ట్యరామాయణం- దశరథరాజనందన చరిత్ర.
– నిర్వచనోత్తర రామాయణ కర్త- తిక్కన
– జ్ఞానపీఠ్ అవార్డు పొందిన రామాయణం- శ్రీమద్రామాయణ కల్పవృక్షం
– శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచయిత – విశ్వనాథ సత్యనారాయణ
– శ్రీమద్రామాయణ కల్పవృక్షం జ్ఞానపీఠ అవార్డు పొందిన ఏడాది – 1970
– తెలుగులో రాసిన తొలి ఇతిహాసం – మహాభారతం.
– మహాభారతానికి గల పేర్లు- 1) జయసంహిత 2) పంచమవేదం
– సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన కవి- వ్యాసుడు
– సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని ఏమంటారు- శాస్త్రేతిహాసం
– తెలుగులో రాసిన మహాభారతాన్ని ఏమంటారు- కావ్యేతిహాసం
– మహాభారతంలోని భాగాలకు గల మరో పేరు- పర్వాలు
– ఆంధ్రమహాభారతంలోని పర్వాల సంఖ్య- 18. అవి 1) ఆది 2) సభా 3) అరణ్య 4) విరాట 5) ఉద్యోగ
6) భీష్మ 7) ద్రోణ 8) కర్ణ 9) శల్య 10) సౌప్తిక
11) స్త్రీ 12) శాంతి 13) అనుశాసనిక 14) అశ్వమేధ 15) ఆశ్రమవాస 16) మౌసల 17) మహాప్రస్థావిక 18) స్వర్గారోహణ. సంస్కృత
మహాభారతంలోని పర్వాల సంఖ్య- 100
– మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు- నన్నయ, తిక్కన, ఎర్రన
– ఆంధ్రమహాభారత రచయితల్లో ప్రథముడు- నన్నయ
– నన్నయ కాలం 11వ శతాబ్దం. రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. బిరుదులు: ఆదికవి, శబ్దశాసనుడు, వాగమశాసనుడు. కవిత్వ లక్షణాలు: అక్షరరమ్యత, ప్రసన్నకథాకలితార్థయుక్తి, నానారుచిరార్దసూక్తినిధిత్వం.
– నన్నయ మహాభారత రచనలో అనుసరించిన విధానం- స్వేచ్ఛానువాదం
– నన్నయ రచనలు: 1) ఆంధ్రమహాభారతం ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వం నాలుగో అశ్వాసం 142వ పద్యం వరకు. 2) ఆంధ్రశబ్దచింతామణి
– నన్నయ రచించిన తొలి పద్యం (శ్లోకం)- శ్రీవాణీగిరిజాశ్చిరాయ
– శ్రీవాణీగిరిజాశ్చిరాయ అనే శ్లోకం ఛందస్సు- శార్దూలం.
– నన్నయ రచించిన చివరి పద్యం- శారదారాత్రులుజ్వల
– నన్నయ రచించిన అవతారిక ఏ పురుషలో రాశారు- ప్రథమ
– గ్రంథం గురించి, రచనకులగల కారణాన్ని గురించి, రచనావిధానాన్ని గురించి వివరించేది- అవతారిక
– మహాభారత బద్దనిరూపితార్ధమేర్పడ తెనుగున రచియింపుమధిక ధీయుక్తిమొయిన్ అని నన్నయను కోరినవాడు- రాజరాజనరేంద్రుడు
– వివిధ వేదతత్వవేదికగా వ్యాసుని వర్ణించిన కవి- నన్నయ
– సంస్కృతంలో రాసిన తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం- ఆంధ్రశబ్దచింతామణి
నన్నయను గురించి ఇతర కవుల అభిప్రాయాలు
1) మహిమున్ వాగమశాసనుండు సృజియింపన్- రామరాజు భూషణుడు (వసుచరిత్ర)
2) ఆంధ్రకవితాగురుడు- మారన (మార్కండేయ పురాణం)
3) ఆంధ్రకావ్యపథం తీర్చినవాడు- కొలని గణపతిదేవుడు (శివయోగసారం)
– నా నేర్చు విధంబుననిక్కావ్యంబు రచియించెదనని పలికిన కవి- నన్నయ
– మహాభారతాన్ని జనమేజయునికి చెప్పినవాడు- వైశంపాయ నముని
– శ్రీనాథుడు నన్నయను ప్రశంసించిన విధం- ఉభయవాక్ప్రౌఢీ (కాశీఖండంలో)
– నందంపూడి శాసన రచయిత- నన్నయ
– గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనే సూక్తిని చెప్పిన కవి- నన్నయ
– నందంపూడి శాసనం ఎవరిని గురించి తెలుపుతుంది- నారాయణభట్టు
– మహాభారత రచనలో నన్నయకు తోడ్పడిన సహాధ్యాయి- నారాయణభట్టు
– సంస్కృత, కర్ణాటక, ప్రాకృత, పైశాచికాంధ్రభాషా సుకవి శేఖరుడు అని నన్నయ ఎవరిని కీర్తించాడు- నారాయణభట్టు
– మహాభారత రచనలో రెండోవాడు- తిక్కన. ఇతని కాలం 13వ శతాబ్దం. నెల్లూరును పాలించిన మనుమసిద్ది ఆస్థాన కవి. తండ్రి కొమ్మన దండనాథుడు, తాత మంత్రిభాస్కరుడు, పెదనాన్న కుమారుడు ఖడ్గ తిక్కన.
– రచనలు: 1) నిర్వచనోత్తర రామాయణం 2) మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు.
– బిరుదు : కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రుడు.
– నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చాడు- మనుమసిద్దికి
– నా నేర్చినభంగి జెప్పి వరణీయుడనయ్యెద భక్తకోటికిన్ అని అన్న కవి- తిక్కన
– శిల్పమునం బారగుడగళాకోవిదుడనని చెప్పుకున్న కవి- తిక్కన.
– మహాభారతంలోని ఒక్కో పర్వాన్ని ఒక్కో ప్రబంధంగా పేర్కొన్న కవి- తిక్కన.
– మహాభారతాన్ని ప్రబంధమండలి, పుణ్యప్రబంధాలు, మహాకావ్యం అని పేర్కొన్న కవి- తిక్కన.
– తిక్కనకు కలలో కనిపించిన దైవం- హరిహరనాథుడు.
– తిక్కన తాను రచించిన మహాభారతాన్ని ఎవరికి అంకితమిచ్చాడు- హరిహరనాథునికి
– విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశునిగా వ్యాసమహర్షిని కీర్తించినవాడు- తిక్కన
– ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగ రచియించెదనని చెప్పిన కవి- తిక్కన
– తిక్కన రచనలోని ప్రత్యేకతలు- నాటకీయత, రసపోషణ.
– శ్రీనాథుడు వర్ణించిన తిక్కన కవితా లక్షణం- రసాభ్యుచితబంధం
– విష్ణురూపాయ నమశ్శివాయ అని మతసామరస్యాన్ని ప్రబోధించిన కవి- తిక్కన.
– అలభ్యాలైన తిక్కన కృతులు- 1) విజయసేనం
2) కవిసార్వభౌమ ఛందస్సు 3) కృష్ణ శతకం.
– కవిత్రయంలో చివరివాడు- ఎర్రన. ఇతని జీవితకాలం 14వ శతాబ్దం. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి.
– రచనలు: రామాయణం, హరివంశం, భారత అరణ్యపర్వశేషం, నృసింహపురాణం.
– బిరుదులు: శంభుదాసుడు, ప్రబంధపరమేశ్వరుడు, రామాయణ, హరివంశాలను ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు.
krishna- భారతానికి పరిశిష్టభాగంగా చెప్పుకోదగ్గది- హరివంశం.
– అరణ్యపర్వశేషాన్ని ఎర్రన ఎవరిపేరుపై రాశాడు- నన్నయ.
– అరణ్యపర్వశేషంలో ఎర్రన తొలిపద్యం- స్ఫురదరుణాంశురాగరుచి
– ఎర్రన అరణ్యపర్వశేష భాగాన్ని రచించిన విధం- తద్రచనయకాన్
– ఎర్రన కవిత్వం వర్ణనాత్మకమైంది.
– అహోబల క్షేత్రాన్ని వర్ణించే గ్రంథం- నృసింహపురాణం
– తెలుగులో తొలి క్షేత్రమహాత్మ్యకావ్యం – నృసింహపురాణం
మాదిరి ప్రశ్నలు
1. మహాభారతాన్ని వైశంపాయనుడు ఎవరికి చెప్పాడు?
1) పరీక్షిన్మహారాజు 2) జనమేజయుడు
3) ధర్మరాజు 4) ఎవరూకాదు
2. ఎవరిని శ్రోతగా చేసుకొని నన్నయ మహాభారతాన్ని రాశాడు?
1) రాజరాజనరేంద్రుడు 2) విష్ణువు
3) నారాయణభట్టు 4) శివుడు
3. నందంపూడి శాసన రచయిత ఎవరు?
1) నారాయణభట్టు 2) నన్నయ
3) తిక్కన 4) ఎర్రన
4. ద్రుపదమహారాజు కూతురు ఎవరు?
1) సుభద్ర 2) ద్రౌపది
3) రుక్మిణి 4) సత్యభామ
5. పాండవుల వల్ల ద్రౌపదికి జన్మించినవారు?
1) మహా పాండవులు 2) బాల పాండవులు
3) ఉప పాండవువులు 4) కుమార పాండవులు
6. మహాభారతంలోని ఆరో పర్వమేది?
1) విరాట పర్వం 2) ద్రోణ పర్వం
3) భీష్మ పర్వం 4) ఉద్యోగ పర్వం
7. పరశురాముని శాపానికి గురైనవాడు?
1) ఏకలవ్యుడు 2) అర్జునుడు
3) కర్ణుడు 4) ఘటోత్కచుడు
8. యజ్ఞం చేసి సోమయాజియైన కవి?
1) నన్నయ 2) తిక్కన 3) ఎర్రన 4) పోతన
9. కర్ణుని కవచకుండలాలను దానంగా స్వీకరించినవాడు?
1) వరుణుడు 2) ఇంద్రుడు
3) బ్రహ్మ 4) విష్ణువు
10. అభిమన్యుని కుమారుడు?
1) జనమేజయుడు 2) శ్రుతకీర్తి
3) పరీక్షిత్తు 4) ప్రతివింద్యుడు
సమాధానాలు:
1-2, 2-1, 3-2, 4-2, 5-3, 6-3, 7-3, 8-2, 9-2, 10-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు