అంబేద్కర్ వర్సిటీలో కొత్త కోర్సులు
# 2023-24 విద్యాసంవత్సరం నుంచి జాగ్రఫీ, ఇంటర్నేషనల్ స్టడీస్
ప్రతిష్ఠాత్మక బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏవోయూ)లో కొత్తగా రెండు కోర్సులు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. 2023-24 విద్యాసంవత్సరంలో జాగ్రఫీ, ఇంటర్నేషనల్ స్టడీస్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. బీఏ కోర్సులో భాగంగా వీటిని అందుబాటులోకి తెస్తారు. సివిల్స్ సహా గ్రూప్-1 ఉద్యోగాలకు జాగ్రఫీ సబ్జెక్టు నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారిని దృష్టిలో పెట్టుకొని జాగ్రఫీ సబ్జెక్టును అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్తమాన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నేషనల్ స్టడీస్‌ను సైతం ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఆన్లైన్ కోర్సులు
చాలా కాలం నుంచి సంప్రదాయ కోర్సులను నిర్వహిస్తున్న బీఆర్‌ఏవోయూ.. తాజాగా ఆన్లైన్ కోర్సులను సైతం అమలు చేస్తున్నది. ఇప్పటికే స్ట్రెస్ మేనేజ్మెంట్, జనరల్ స్టడీస్ కోర్సులను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చి టెలీ పాఠాలను ప్రసారం చేస్తున్నది. వీటిని యూట్యూబ్ చానల్, మొబైల్ యాప్‌లలోనూ అందుబాటులోకి తేవాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. స్వయం పోర్టల్ ద్వారా ఆన్లైన్ కోర్సులను అభ్యసించే అవకాశం ఉన్నది. బీఆర్ఏవోయూలో ప్రవేశపెట్టే కొత్త కోర్సులను సైతం స్వయం పోర్టల్‌తో అనుసంధానిస్తారు. ఆయా కోర్సులకు క్రెడిట్స్‌ను జారీచేసి, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)తో అనుసంధానించనున్నట్టు వీసీ ప్రొఫెసర్ సీతారామరావు తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు