పర్యావరణహిత అభివృద్ధి – భారత ప్రభుత్వ చర్యలు..
అభివృద్ధికి అనాధిగా వైరుధ్యం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి ఎంత వేగంగా జరిగితే పర్యావరణం అంతే స్థాయిలో ప్రభావితమవుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఆధునిక ప్రపంచ దేశాల మధ్య అభివృద్ధిలో పోటీ తీవ్రమవటంతో పర్యావరణ విధ్వంసం తీవ్రస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిందే పర్యావరణ అనుకూల అభివృద్ధి. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ముప్పు లేని మార్గాల ద్వారా అభివృద్ధిని కొనసాగించాలన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు, రూపొందించిన కార్యక్రమాలపై ప్రత్యేక వ్యాసం నిపుణ పాఠకుల కోసం..
Triple Benefit Line లో పరిగణనలోకి తీసుకునే అంశాలు..
1. సాంఘిక లబ్ధి 2. పర్యావరణ లబ్ధి 3. విత్త లబ్ధి
ఉత్పత్తి ప్రక్రియలో సాంఘిక లబ్ధి అంటే ప్రజలు, పర్యావరణ లబ్ధి అంటే భూగోళం, విత్త లబ్ధి అంటే లాభాన్ని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది.
తీసుకోవాల్సిన చర్యలు
-పర్యావరణ రక్షణ కోసం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే ఉష్ణోగ్రత పెరిగి మానవ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.
-సాంకేతికతను ఉపయోగించేటప్పుడు పర్యావరణ పరిరక్షణ తప్పకుండా పాటించాలి. దీన్నే నిపుణులు Design With Nature అంటారు. అంటే ప్రకృతికి అనుగుణంగా సాంకేతిక వ్యవస్థను తయారు చేసుకోవాలి.
-ప్రవేశపెట్టబడే సాంకేతికతలో తక్కువ వృధాను ఉత్పత్తి చేసే విధంగా తక్కువ వనరులను ఉపయోగించుకునే విధంగా ఉండాలి.
భారత్ చర్యలు
-CRZ (Costal Regulation Zone)
-భారతదేశానికి గల దాదాపు 7156 కి.మి తీరప్రాంత పరిరక్షణ కోసం 1991, ఫిబ్రవరిలో CRZ (Costal Regulation Zone)ను ఏర్పాటు చేశారు.
-పర్యావరణంపై రుణాత్మక ప్రభావం పడకుండా జాగ్రత్త పడటం, రసాయనాలను సముద్రంలోకి విడుదల కాకుండా చూడటం, చేపలను పరిరక్షించడం మొదలైన చర్యలను తీసుకుంటారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు
-కాలుష్య నియంత్రణ కోసం, ప్రత్యేకంగా 1974, సెప్టెంబర్ 22న CPCB (Central Pollution Control Board)ను ఏర్పాటు చేశారు.
-National Air Authority Monitaring Programmeలో భాగంగా గాలిలో ఉన్న SO2 Oxide Of Nitrogen, SPM (Suspended Particulate Matter), RSPM (Respirable Suspended Patriculate Matterలను కొలుస్తుంది.
గ్రీన్ ట్యాక్స్ (Green Tax)
-పర్యావరణానికి నష్టం చేసే వస్తువులపై పన్ను ఉండాలని (Polluter Pays Principle) Coal Cess లాంటివి వేస్తున్నారు.
-ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని National Clear Energy Fund (NCEF)కు కలుపుతారు. ఈ ఎన్సీఈఎఫ్ను 2010-11లో ప్రారంభించారు.
-ఈ విధానాన్ని 2002లో కొన్ని పెట్రోలియం వస్తువులపై ఎత్తివేశారు.
-దీంతోపాటు Compensatory Afforestration Fund ఏర్పాటు, మరొకటి పంటల కోసం National Gene Fund ఏర్పాటు కూడా 12వ ప్రణాళికలో పేర్కొన్నారు.
జాతీయ పర్యావరణ విధానం
-2006లో ప్రభుత్వ జాతీయ పర్యావరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ National Environment Policyలో భూసారాన్ని కాపాడాలని సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ది చేయాలని, పునరుత్పత్తి శక్తిని పెంచడానికి 2010లో IEP ( Integrated Energy Policy)ని ప్రవేశ పెట్టారు.
-అదే విధంగా 2008లో Urban Sanitation Policyని ప్రవేశపెట్టారు.
-2031 నాటికి భారత్ తలసరి ఉద్గారాల విడుదల 4 టన్నులకు మించి ఉండదని, కానీ ప్రపంచ సగటు 4.22 టన్నులు (Co2eq)గా ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది.
పోషకాధార సబ్సిడీ
-వ్యవసాయరంగంలో భూసారాన్ని కాపాడటానికి ప్రభుత్వం 2010-11 నుంచి పోషక ఆధారిత సబ్సిడీని (Nutrient Based Subsidy)ని ప్రారంభించారు.
-అంటే ఎరువులకు ఇచ్చే సబ్సిడీ డిమాండ్, సప్లయ్‌ని బట్టికాకుండా వాటి పోషక ఆధారంగా ఇస్తారు.
-ఎక్కువ పోషకాలు ఇచ్చే ఎరువులకు ఎక్కువ సబ్సిడీ ఇస్తుందని దీని వల్ల భూసారాన్ని కాపాడవచ్చని, దీన్ని 12వ ప్రణాళికలో కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది.
-పారిశ్రామిక పార్క్‌ల నిర్మాణం, SEZల నిర్మాణం, DMIC (Delhi Mumbai Industrial Corridor) మొదలైనవి. వాటి విషయంలో వ్యక్తి లబ్ధి కంటే సమాజ లబ్ధి అధికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ధారించారు.
-Common Future అనే పదానికి ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు గ్రీన్ టెక్నాలజీ వాడే ప్రయత్నం జరగుతున్నది.
హిమాలయాలు
-హిమాలయప్రాంత అభివృద్ధి కోసం HADP (Hill Area Development Programme) ను WGDP (Western Ghats Development Programme) కొనసాగిస్తామని పేర్కొన్నారు.
-దేశంలో నమోదయ్యే వేతనాలను మించి ఈ ప్రాంతం వారికి వేతనాలు ఇవ్వడం, వైద్యరంగానికి NHM (National Health Mission) అమలు చేయడం, విద్యకోసం SSA (Sarva Shiksha Abiyan) అమలు చేస్తున్నారు.
-అదే విధంగా Darjeeling Gorkha Hill Councilను కూడా అమలు చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. అదే విధంగా GBPIHED (GB Panth Institute For Himalayas Environment & Development) కూడా సుస్థిరవృద్ధిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది.
తీరప్రాంతం
-తీరప్రాంత పరిరక్షణ కోసం స్వామినాథన్ కమిటీ సూచనలను అమలు చేస్తారు.
-తీరప్రాంతాలను పరిరక్షణ కోసం Coastal Zone Managementను అమలు చేస్తారు.
-తీరప్రాంతాలను CZ 1 to 4 గా విభజించారు.
-ఇందులో CZ-1లను అత్యంత సున్నిత తీర ప్రాంతాలుగా పరిగణిస్తారు. అదే విధంగా CZ-4 అనేది ద్వీపాలకు సంబంధించింది. చివరిగా CZ-2 & 3లలో మాత్రమే నిర్మాణాలను అనుమతిస్తారు.
ప్రజల భాగస్వామ్యం
-సుస్థిర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని 12వ ప్రణాళికలో పేర్కొన్నారు.
-అదే విధంగా GRIHA (Green Rating For Integrated Habitul Gssessment ) JFM (Joint Forest Management), స్త్రీల సాధికారతలో IID (Integrated Infrastructure Development) NKN(National Knoweldge Network), WMC (Waste Management Circles), ECO -Labelling (Eco Marks-1991)లను ప్రోత్సహిస్తామని 12వ ప్రణాళికలో పేర్కొన్నది.
నిపుణుల కమిటీ
-సుస్థిరవృద్ధి కోసం వేసిన నిపుణుల కమిటీ 12వ ప్రణాళికలోని అంశాలను అమలు చేయాలని సూచించింది.
-ముఖ్యంగా అవి Advanced Coal Teachnology, National Wind Energy Mission, National Solar Mission, Teachnology Improvement On Cement Industry, Energy Efficiency Programmes, Efficiency In Freight Transport, NOn Motorised Transport, Green Building Code, Tree Cover, Lightting Labelling
విద్యుత్
-భారతదేశంలో దాదాపు 38 శాతం అధిక ఉద్గారాలను (GHGS) విద్యుత్ రంగమే విడుదల చేస్తుంది.
-ముఖ్యంగా బొగ్గు వినియోగం Sub Critical Plants (Co2 0.93kg/kwh), Super Critical Plants (co2 -0.83kg/kwh), Ultra- Super Critical Plants (co..2 0.74kg/kwh)అని గమనించాలి. అంటే Ultra-Super Critical Plantsతో తక్కువ కాలుష్యం వస్తుందని 12వ ప్రణాళికలో USC Plantsలను NTPC, BHEL, IGCARలు ప్రారంభిస్తాయి.
-అదే విధంగా (Coal Bed Methane)ను కూడా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కలిగి ఉన్నాం.
పవన విద్యుత్
-దేశంలో గాలి ద్వారా విద్యుత్‌ను 1,03,000MW వరకు ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు.
-గాలి టర్బైన్ ఎత్తు సుమారుగా 80-120 మీటర్లుగా నిర్మిస్తున్నారు.
-అదే విధంగా భారత్‌లో 5,00,000 MW వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. కానీ వాటిని నిర్ధారణ చేయాలని 12వ ప్రణాళిక పేర్కొంది.
-2020 నాటికి 30,000 MW పవన విద్యుత్‌ను సాధించాలని 12వ ప్రణాళిక పేర్కొంది.
-కానీ గాలివేగం రోజులో మారుతూ ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఆగిపోవచ్చు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు అవసరం. National Wind Energy Missionను ఏర్పాటు చేయాలని 12వ ప్రణాళికలో పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో పవన విద్యుత్‌కు కూడా అవకాశం ఎక్కువగా ఉందని, అదే విధంగా Off Shore Wind అంటే సముద్రంలో Wind Turbine ఎక్కువగా అవకాశం ఉందని 12వ ప్రణాళిక పేర్కొంది.
అణు, జలవిద్యుత్
-ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే శక్తి Nuclear, Hydro. అందువల్ల ఈ రెండింటిని 12వ ప్రణాళికలో ప్రస్తావించారు.
-2011లోJapanలో FUKUSHIMA ప్రమాదంతో న్యూక్లియర్ విద్యుత్ స్థాపన కొంత వరకు తగ్గిపోయింది.
-కానీ మనం ఈ విద్యుత్‌ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం అమెరికాతో Nuclear Deal కూడా చేసుకున్నాం.
-అదే విధంగా జల విద్యుత్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం.
ఇనుము, ఉక్కు
-దేశం మొత్తం శక్తి వినియోగంలో 38 శాతం పారిశ్రామిక రంగమే ఉపయోగిస్తుంది.
-అంటే చైనా, అమెరికా, రష్యా తర్వాత భారత పారిశ్రామిక రంగం శక్తి వినియోగంలో 21వ స్థానంలో ఉంది.
-పారిశ్రామిక రంగంలో అధికంగా ఇనుము, ఉక్కు, సిమెంట్ రంగాలు 60 శాతం ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. 2020 నాటికి Iron And Steel ఉత్పత్తి 200 మిలియన్ టన్నులు కావాలని 12వ ప్రణాళికలో పేర్కొన్నారు.
-ఇందులో Emergency Efficiency కోసం DRI-EAF (Direct Reduced Iron and Electric ore Furnace) విధానాన్ని పాటించాలి.
సౌర విద్యుత్
-2022 నాటికి 20,000mw లక్ష్యాన్ని JNNSMలో పేర్కొన్నారు.
-అదే విధంగా 2022కి 2000 mw Solar విద్యుత్ Off-Grid Solar Power సాధించాలి. అంటే సూర్యరశ్మి లేకపోయినా Batteries ద్వారా నిల్వ చేసుకునే అవకాశం ఉండే విద్యుత్‌ను 2000mw సాధించాలని కూడా పేర్కొంది.
-దాదాపు సోలార్ మైక్రో గ్రిడ్‌కు 30 శాతం సబ్సిడీని కూడా ఇస్తున్నారు.
సిమెంట్ ఉత్పత్తి
-దేశంలో సిమెంట్ ఉత్పత్తి 303 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2020కి సిమెంట్ ఉత్పత్తి 500 మిలియన్ టన్నుల లక్ష్యం కలిగి ఉంటుంది.
-దేశంలో 365 మినీ సిమెంట్ ప్లాంట్లు, 148 లార్జ్ సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి.
-దేశంలో PPP (Port Land Pozzoglana Cement) 67 శాతం. OPC- Cordinary Port Land Cement) 25 శాతం. PSC (Port Land Slagcement) 8 శాతం ఉత్పత్తిని కలిగి ఉంది.
-ఈ పరిశ్రమలో ఉద్గారాల విడుదల 16 నుంచి 13 శాతానికి తగ్గించాలని (2020)కి ఆశించడం జరిగింది.
-అదే విధంగా శక్తి వినియోగంలో ఉద్గారాలను తగ్గించే NMEEE (National Mission For Emhanced Energy Effiency)ను అమలు చెయ్యాలని ప్రణాళిక పేర్కొంది.
నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా
-సంవత్సరానికి 2 మిలియన్ హెక్టార్ల అటవి విస్తీర్ణం పెరగాలని పేర్కొన్నది.
-దీంతో పాటు కార్బన్ ట్యాక్స్‌ను అమలు చేయాలి. దీనికి ముఖ్య కారణం Emitter Pays Principle పాటించాలని పేర్కొన్నారు.
-ప్రతి ఏడాది భారతదేశం 1.5 శాతం ఉద్గారాలను చెట్ల పెంపకం ద్వారా నియంత్రించవచ్చు. Natioanl Afforestation Programme-NAP ఆశించగా, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా ప్రకారం లక్ష్యాన్ని 1ఎంహెచ్ నుంచి 2 ఎంహెచ్లకు పెంచాలని ఆశించింది.
గ్రీన్ బిల్డింగ్ కోడ్స్
-దేశంలో శక్తి వినియోగంలో 46 శాతంతో పరిశ్రమలు ప్రథమ స్థానంలో, తరువాత స్థానాల్లో 21 శాతంతో నివాస గృహాలు, 19 శాతంతో వ్యవసాయ అవసరాలు, 8 శాతంతో వాణిజ్య భవనాలు ఉన్నాయి.
-అంటే మొత్తం భవనాలు 29 శాతం శక్తిని వినియోగిస్తున్నాయి.
-గ్రీన్ బిల్డింగ్ నిబంధనలు ఉపయోగిస్తే దాదాపు 40 నుంచి 50 శాతం శక్తిని పొదుపు చేయవచ్చని పేర్కొన్నది.
-2001లో ఎనర్జీ Conservation Actను ఆమోదించారు.
మిలీనియం డెవలప్మెంట్ లక్ష్యాలు (MDG)- ఐక్యరాజ్య సమితి
-ప్రజల సంక్షేమం, సుస్థిరవృద్ధి (Sustainable Growth) ఐక్యరాజ్య సమితి 2000లో 8 లక్ష్యాలను నిర్ధారించింది. దీనికి 8 లక్ష్యాలను కలిగి ఉన్నారు. ముఖ్యంగా అవి.
1. బీదరికాన్ని, ఆకలిని నిర్మూలించాలి.
2. సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించాలి.
3. లింగ సమానత్వాన్ని, స్త్రీ సాధికారతను సాధించాలి.
4. శిశు మరణాలను తగ్గించాలి
5. బాలింత మరణాలు తగ్గించాలి
6.హెచ్ఐవీ/ఎయిడ్స్, మలేరియా ఇతర జబ్బుల నిర్మూలన
7. పర్యావరణ రక్షణ సాధించాలి
8. అభివృద్ధిలో ప్రపంచ భాగస్వామ్యాన్ని పెంపొందించాలి
-అదే విధంగా 2015-30కి గాను సుస్థిరవృద్ధి కోసం 17 లక్ష్యాలను నిర్ధారించాలి.
-3R దృక్పథం: ఉత్పత్తి ప్రక్రియలో వనరుల వినియోగాన్ని తగ్గించడం (Reduce), వనరులను మళ్లీ మళ్లీ ఉపయోగించే అవకాశం కలిగి ఉండటం (Reuse), ఉత్పత్తి అయిన వృథాను మళ్లీ వస్తువుగా మార్చే (Recycle) విధంగా చర్యలు తీసుకోవాలి.
-పర్యావరణ అవగాహన: మొదటి నుంచి పిల్లల్లో భూమి మనది అనే భావన కల్పించాలి. దీన్నే Earth thinking అంటారు.
-పర్యావరణ విద్యపై పాఠశాల నుంచే అవగాహన కల్పించాలి.
-ఉద్గారాల ద్వారా ఓజోన్ పొర దెబ్బతినడం, యూవీ కిరణాల వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు రావడం, సముద్రాల ఉష్ణోగ్రత పెరిగిపోవడం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, అవి సూర్యరశ్మిని పరావర్తనం చేయడం, వర్షాలు రాకుండా ఎలా చేస్తున్నాయో వివరించాలి. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్ర మట్టం పెరగడం, అకాల వర్షాల వల్ల వ్యవసాయ ఉత్పత్తి పడిపోవడం, శ్వాస సంబంధ సమస్యలపై పూర్తి అవగాహన కల్పించాలి.
-పర్యావరణ పునరుత్పత్తి ఆధారంగానే వస్తుత్పత్తిని పెంచాలి. దీన్నే Carrying Capacity అంటారు. అంటే వస్తుత్పత్తి ఎంత ముఖ్యమో అంతే స్థాయిలో పర్యావరణ పునరుత్పత్తికి అవకాశం ఇవ్వాలి.
పర్యావరణం- భారత్ చర్యలు
-పర్యావరణ రక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Ministry of Environment Forest Climate Change వారు పర్యావరణ అంశాలను అమలుచేస్తున్నారు.
-1982లో సమాచారం కోసం ENVIS (Environmentol Infromation System)ను, 1996లో National River Conservation Planను ప్రారంభించారు.
-పర్యావరణ పరిశోధన కోసం 1958లో నాగపూర్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ను, 1974లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చారు.
-1986 నుంచి పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలుచేస్తున్నది.
ఎన్ఏపీసీసీ
-వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి 2008, జూన్ 30న కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్‌ప్లాన్ ఆన్ ైక్లెమేట్ చేంజ్ (ఎన్ఏపీసీసీ)ను ప్రారంభించింది. ఇందులోభాగంగా కొన్ని మిషన్స్‌ను చేపట్టింది.
నేషనల్ సోలార్ మిషన్
-2022 జేఎన్ఎన్ఎస్ఎమ్ కింద 20,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా కలిగి ఉండగా, ఎన్డీఏ ప్రభుత్వం దానిని 1,00,000 మెగావాట్లకు పెంచింది.
-ఈ విధంగా 2030 సంవత్సరానికి 40 శాతం విద్యుత్ సూర్యరశ్మి నుంచి రావాలని, గ్రీన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని, Fossil Fuelను మండించకూడదనే లక్ష్యాన్ని కలిగి ఉంది.
నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హాబిటేట్స్
-నివాసాలు కొనసాగించగల వృద్ధికి దోహదపడే ప్రయత్నం చేయాలి. ఘన వ్యర్థ పదార్థాల సమర్థవంతమైన నిర్వహణ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్, శక్తిని ఉపయోగించడం పర్యావరణ పరిరక్షణ మొదలైన అంశాలన్నీ అర్బన్ ప్లానింగ్, అర్బన్ రెన్యువల్లో పొందుపర్చారు.
-దీనికోసం వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 1974, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 1981ను అమలుచేయాలి.
నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ
-2001 ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం దేశంలో శక్తి వల్ల వచ్చే నష్టాలను తగ్గించడానికి (ఎనర్జీ ఎఫిషియన్సీ) చట్టబద్ధత కల్పించారు.
-శక్తిని పొదుపుగా వాడుకోవడం (Consercation) పర్యావరణ పరిరక్షణ శక్తిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
నేషనల్ వాటర్ మిషన్
-2050 సంవత్సరానికి నీటి కొరతను భారత్ ఎదుర్కోబోతున్నది. అందువల్ల వర్షపు నీటిని సమర్థవంతంగా ఉపయోగించడం, సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించడం, నీటి నిర్వహణలో 20 శాతం సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినింగ్ ద హిమాలయన్ ఎకో సిస్టమ్
-అతి సున్నితమైన జీవవైవిధ్యంగల హిమాలయ పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. 2006 నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీలో దీనికి సంబంధించిన అన్ని విషయాలను వివరించారు.
నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా
-అటవీ విస్తీర్ణాన్ని 23 నుంచి 33 శాతానికి పెంచాలంటే PM Green India Campaignను, నేషనల్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్ 2001ను అమలుచేసి రక్షిత ప్రాంత విధానాన్ని అమలు చేయాలి.
-ఒక చెట్టు విలువను 10,000 డాలర్లుగా నిర్ణయించారు.
నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్
-కాలుష్యాన్ని సృష్టించడంలో వ్యవసాయం రెండోస్థానంలో ఉంది. అందువల్ల సేంద్రియ వ్యవసాయాన్ని (నేషనల్ పాలసీ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్) అమలుచేయాలి.
-సేంద్రియ వ్యవసాయంపై రైతులకు పూర్తి అవగాహన (ఇంటిగ్రేటెడ్ కార్ప్ మేనేజ్మెంట్) కల్పించాలి.
National Mission On Strategic Knowledge On Climate Change
-కొనసాగించగల వృద్ధిని సాధించడానికి కావాల్సిన యంత్ర విధాన అభివృద్ధి కోసం పరిశోధనను ముందుకు తీసుకవెళ్లడం దీని లక్ష్యం.
-Climate Research Fundను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
National Bio-Energy Mission
-12వ ప్రణాళికలో Bio Mass Fired Power Stationలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతారని ప్రభుత్వం తెలిపింది.
-ఉత్పత్తి ప్రక్రియలో మూడు రకాల మదింపులను పరిగణనలోకి తీసుకునేదే Triple Benefit Line. ఈ పదాన్ని 1994లో Jhon Elkiington పేర్కొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు