పర్యాటకానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు
సేవలరంగం
-GSDPకి అత్యధికంగా 62 శాతం సేవల రంగం నుంచి వస్తుందని, ఇంకా 62.03 శాతం మందికి పట్టణాల్లో జీవనోపాధి లభిస్తుందని పేర్కొంది.
-దీనిలో రియల్ ఎస్టేట్ నుంచి అత్యధిక వృద్ధి లభించిందని పేర్కొంది.
-మొత్తం రాష్ట్రంలో సేవలరంగం కోసం 10,085 కంపెనీలు ఉన్నాయని పేర్కొంది.
సమాచార రంగాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న ముఖ్యమైన చర్యలు
1. T-HUB: దీన్ని 2015, నవంబర్ 5న ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం (IIT-H, ISB, NALSAR)తో ప్రారంభించారు.
-దీన్ని స్టార్టప్‌లకు సంధానకర్తగా అన్ని సౌకర్యాలు ఒకే ప్రదేశంలో కేంద్రీకృతయ్యేవిధంగా నిర్మించనున్నారు.
2. ITIR -Information Teachnology Investment Region: ఇది రూ.2,35,000 కోట్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని, 15 లక్షల మందికి ఉపాధినిస్తుందని పేర్కొంది.
3. టైర్2, టైర్3 పట్టణాలకు ప్రోత్సాహం: ఇప్పటికే వరంగల్‌ను టైర్-2గా మారుస్తున్నారు.
4. ICT, గేమింగ్, యానిమేషన్ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్
5. టాస్క్ పథకం: కళాశాలల్లోనే పరిశ్రమల సహాయంతో వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించి, ఉద్యోగాలు కల్పించడం
6. డిజిటల్ తెలంగాణ ప్రోగ్రాం: ఇది 2015, జూలై 1న ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ పరికరాలు, ఎంపిక హక్కు ఉండాలని పేర్కొంది.
7. పల్లెసమగ్ర సేవా కేంద్రాలు: దీన్ని గాంధీ జయంతి రోజు (2015, అక్టోబర్ 2)న దేశంలోనే మొదటిసారిగా ప్రారంభించారు.
పర్యాటకం
-దశాబ్దం కంటే ఈసారి పర్యాటకులు రెండింతలయ్యారని పేర్కొంటూ 2005లో 3.26 కోట్లుగా ఉన్న పర్యాటకులు 2015 కల్లా 9.46 కోట్లుగా నమోదయ్యారని పేర్కొంది.
-జిల్లాలవారీగా కరీంనగర్ అత్యంత ఆకర్షణీయ నగరం, తర్వాత ఆదిలాబాద్ ఎక్కువగా దేశీయ పర్యాటకులను ఆకర్షించిందని పేర్కొంది.
-విదేశీ పర్యాటకులకు హైదరాబాద్, రంగారెడ్డి అత్యంత ప్రాధాన్యతలని పేర్కొంది. మొత్తం 1.26 లక్షల విదేశీ పర్యాటకుల్లో 1.22 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డిని మాత్రమే వీక్షించారని పేర్కొంది.
6. గోదావరి పుష్కరాలు: 12 ఏండ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలు ఈసారి 2015 జూలై 14, 25 మధ్య బాసర, ధర్మపురి, కాలేశ్వరం, భద్రాచలం ముఖ్యమైన ఘాట్లలో జరిపామని పేర్కొంది.
7. మెడికల్ పర్యాటకం: స్వదేశంలో వైద్యం కోసం వచ్చే పర్యాటకులు పెరిగారని, ASSOCHAM ప్రకారం ఇక్కడ విదేశాల కంటే 1/8 వంతు మాత్రమే వైద్యఖర్చులు అవుతాయి. దీనికి అత్యంత మంచి రాష్ర్టాలు తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమైనవని పేర్కొన్నారు.
8. బిజినెస్ పర్యాటకం: అంతర్జాతీయ సమావేశాలకు, మీటింగులకు హైదరాబాద్ వేదికైందని పేర్కొంది. రాష్ట్రంలో ఉండే చక్కటి వాతావరణం, వివిధ ఎంఎన్‌సీలు, విమానయాన సౌకర్యం, ప్రపంచస్థాయి హోటల్స్ వెరసి హైదరాబాద్ అంతర్జాతీయ వేదికైందని పేర్కొంది.
2015లో జరిగిన అంతర్జాతీయ మీటింగ్‌లు
1. 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్ర పండుగ
2. భారత ఆర్థిక సంఘం మీటింగ్
3. ఇండో-గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్
4. గ్లోబల్ ఫార్మా ఎక్స్పో
5. అంతర్జాతీయ బయో- ఆసియా సదస్సు
ఎకో టూరిజం సర్క్యూట్
-గిరిజన పర్యాటక సర్క్యూట్
-మహబూబ్‌నగర్‌లో ఎకో టూరిజమ్ సర్య్యూట్ అభివృద్ధి
-దీని కోసం కింది ప్రాంతాలను ఎన్నుకున్నారు.
1. సోమశిల నదీ తీరఫు అభివృద్ధి 12 ఏండ్లకోసారి పండుగ చేసుకుంటారు ఈ నది దగ్గర.
2. సింగోటం
3. అక్కమ్మదేవి గుహలు: శ్రీశైలం నుంచి 18 కి.మీ దూరంలో ఉన్నాయి.
4. కడలివనం
5. ఫరహాబాద్: దీన్నే మౌంట్ పీసంట్ (Mount Peasant) అని అంటారు.
6. మల్లెల తీర్థం
7. శ్రీశైలం
8. ఉమా మహేశ్వరం
చాప్టర్-VI
మానవాభివృద్ధి సూచీ (HDI)
-1. తలసరి ఆదాయం 2. ఆరోగ్యం 3. విద్య అనే మూడు విషయాల ఆధారంగా HDIని లెక్కిస్తారు.
-2015లో మొత్తం 188 దేశాలకుగాను భారత్ 130వ స్థానంలో ఉంది.
-దీని విలువ 0 నుంచి 1 వరకు ఉంటుంది.
0 – అతి తక్కువ అభివృద్ధి
1 – పరిపూర్ణ అభివృద్ధి
-భారత్ 2014 రిపోర్టులో 0.586, 2015లో 0.609 విలువను పొందింది.
-రాష్ర్టాలవారీగా మొట్టమొదట మధ్యప్రదేశ్ ప్రచురించింది.
-తెలంగాణ HDI విలువలను, ర్యాంకులను సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్ట్రక్చర్ ప్రచురిస్తుంది. 2004-05, 2011-12 సంవత్సరాలకు ప్రచురించిన విలువలనే 2015కి కూడా వర్తింపజేస్తున్నామని సర్వే తేల్చింది.
రాష్ర్టాలవారీగా HDI విలువ
-2004-05 నుంచి 2011-12కు దాదాపు అన్ని రాష్ర్టాల్లో HDI విలువ పెరిగింది. కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా కింది వరుసలో ఉన్నాయి.
-తెలంగాణ స్థానం 13వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకు అభివృద్ధి చెందింది.
-2004-05లో 0.343గా ఉన్న తెలంగాణ HDI విలువ 2011-12కల్లా 0.513 కి అభివృద్ధి చెంది, 13 నుంచి 10వ స్థానానికి ఎగబాకింది.
జిల్లాలవారీగా HDI విలువలు
-2004-05, 2011-12 రెండేండ్లలో మొదటి నాలుగు స్థానాలు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ ఆక్రమించగా.. నిజామబాద్, మెదక్, మహబూబ్‌నగర్ చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.
-ఖమ్మం 7వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. నల్లగొండ ర్యాంకు 5 నుంచి 7కి పడిపోయింది. ఆదిలాబాద్ రెండేండ్ల నుంచి 6వ స్థానంలోనే ఉంది.
జిల్లాలవారీగా వృద్ధి వివరాలు
-మొదటి రెండు స్థానాల్లో మెదక్, రంగారెడ్డి, మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అయినా కూడా మెదక్ HDIలో చివరలో ఉండటం విశేషం.
ఆరోగ్య వివరాలు – HDI
-శిశు మరణాల రేటు (Infant Mortality Rate – IMR)
-శిశు మరణాల రేటు అంటే ప్రతి 1000 మంది శిశు జననాలకు మరణించిన (0-1 ఏండ్లలోపు) పిల్లల సంఖ్య.
-తెలంగాణ IMR
-2011 – 43 (హైదరాబాద్-20, రంగారెడ్డి-34, కరీంనగర్-38, వరంగల్-40)
2015 – 28
-కేరళ IMR – 12
ప్రసూతి మరణాల రేటు (Maternal Mortality Rate – MMR)
-ప్రతి లక్షమంది పిల్లల జన్మకు చనిపోతున్న తల్లుల సంఖ్యే ప్రసూతి మరణాల రేటు.
-2011-13లో – 92
-ఆదిలాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలు మిలీనియమ్ సహస్రాబ్ది లక్ష్యాలను సాధించాయి.
-Total Fertility Rate (TFR)
-సగటున ఒక వ్యక్తి సంతానం.
-తెలంగాణలో ఒక మహిళ తన జీవిత కాలంలో 1.8 మందికి జన్మనిస్తుంది. (మెదక్-2.2, మహబూబ్‌నగర్-2.4)
సగటు పెళ్లి వయసు
-2007-08లో 19.2 సంవత్సరాలుగా ఉన్న మహిళల సగటు పెళ్లి వయసు 2012-13 నాటికి 19.8 సంవత్సరాలకు పెరిగింది.
-28 శాతం మంది చట్టపరమైన వయసు (18 ఏండ్లు) కంటే ముందే పెళ్లి చేసుకుంటున్నారు.
-ఇంకా అక్షరాస్యత, డ్రాపవుట్స్ మొదలైన అంశాలను వివరిస్తూ చాప్టర్‌ను ముగించింది.
గుర్తుంచుకోవాల్సినవి
1. వివిధ రాష్ర్టాల వారిగా HDI విలువ
2. జిల్లాల వారిగా HDI విలువ
3. జిల్లాల వారిగా GDDP విలువ
4. ఆరోగ్య సూచికలు
5. విద్యా సూచికలు
చాప్టర్-VII
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (దిక్సూచి)
-2000లో సహస్రాబ్ది లక్ష్యాల ఒప్పందం నుంచి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వచ్చాయి.
– మిలీనియమ్ డెవలప్మెంట్ గోల్స్ (MGD), 21 లక్ష్యాలతో 2015 తుది సంవత్సరంగా ఈ MGD లను ఏర్పర్చుకున్నారు.
-ఇవి 2015లో ముగియడంతో కొత్త ఆలోచనతో 2015 నుంచి 2030 మధ్యలో సాధించడానికి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ దేశాలు ఏర్పర్చుకున్నాయి.
సహస్రాబ్ది లక్ష్యాలు (MDG)
1. పేదరికం, ఆకలిని పారదోలడం – 1993లో 44.2 శాతంగా ఉన్న పేదరికాన్ని తెలంగాణ 2011-12 వరకు 8.8 శాతానికి తగ్గించింది.
2. ప్రపంచ ప్రాథమిక విద్యను స్థాపించడం – మరో రెండేళ్లలో 100 శాతం విద్య నమోదును అందుకుంటుంది.
3. లింగ సమానత్వం, మహిళా సాధికారత – సబల, బాల పంచాయతి, లింగ విద్యతో మహిళా సాధికారత సాధిస్తుంది. (లింగ విద్యను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ)
4. శిశు మరణాల రేటును తగ్గించడం – ప్రస్తుతం 28/1000. ఆదిలాబాద్, కరీంనగర్ తప్ప అన్ని జిల్లాలు సాధించాయి.
5. తల్లుల ఆరోగ్యం మెరుగపర్చడం – ఇప్పటికే ఆదిలాబాద్ తప్ప అన్ని జిల్లాలు సాధించాయి.
6. HIV/AIDS, మలేరియా ఇతర రోగాలను నిరోధించడం – ఎన్నో చర్యలు తీసుకున్నారు.
7. అభివృద్ధికి ప్రపంచ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం.
-MDG లలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. IMR, MMR, HIV/AIDS నిర్మూలన, మంచినీరు మొదలైన వాటిలో అద్భుతమైన పురోగతిని సాధించి MDG కి సార్థకత చేకూర్చింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (17)
-2015తో ముగిసిన MDG కి మరింత పరిపక్వతను జోడిస్తూ 17 సహస్రాబ్ది లక్ష్యాలను సాధించాలని, అది రాబోయే 15 ఏండ్లలో పూర్తవ్వాలని పేర్కొంది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చర్యలు
– ఆసరా పింఛన్లు, ఆరోగ్య లక్ష్మి, ఆహార భద్రత, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 2BHK, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొదలైనవన్నీ SDG ని సాధించడానికి మార్గదర్శకాల వంటివని చెప్పవచ్చు.
ముగింపు: ఈ విధంగా ఎన్నో విశ్లేషణలతో, విజయవంతమైన గణాంకాలతో, గతించిన అన్యాయాలతో, గట్టి లక్ష్యాలతో బంగారు తెలంగాణ సాధిస్తామని సర్వే పేర్కొంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు