ఉన్నత విద్యలో ఏడు స్థాయిలు
# డిగ్రీ, పీజీలకు బదులుగా ఇకపై లెవల్స్
# సరికొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించిన కేంద్రం
# నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
# ప్రేమ్‌వర్క్‌ను విడుదల చేసిన యూజీసీ
# ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యలో లెవల్సే
మీరు ఏం చదివారు? అంటే ఇప్పటివరకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా అంటూ సమాధానాలు వచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో లెవల్ 4, లెవల్ 5.. లెవల్ 6 అంటూ చెప్పాల్సి వస్తుంది. వివిధ విద్యార్హతలకు స్థాయిలు (లెవల్స్‌ను) నిర్ణయించే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన విధానాన్ని ప్రతిపాదించిం ది. ఈ మేరకు నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రేమ్‌వర్క్ ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. జనరల్ కోర్సులు, సాంకేతిక విద్య, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు విడివిడిగా లెవల్స్ నిర్ధారించ నున్న ట్టు తెలిపింది. దీంతో ఏ విద్యార్థి అయినా విదేశాలకు వెళ్లినప్పుడు ఏ లెవల్ పూర్తిచేసిందీ చెప్తే సరిపోతుంది. ఈ ముసాయిదాపై యూజీసీ రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.
క్రెడిట్స్ సాధించాల్సిందే..
క్రెడిట్స్‌ను సైతం యూజీసీ ఖరారు చేసింది. 40 క్రెడిట్స్ సాధిస్తే సర్టిఫికెట్, 80 క్రెడిట్స్ సాధిస్తే డిప్లొమా, 120 క్రెడిట్స్ సాధిస్తే డిగ్రీని జారీచేయవచ్చని పేర్కొన్నది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు, సాంకేతిక నైపుణ్యాలను సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు యూజీసీ ఈ ప్రేమ్‌వర్క్ రూపొందించి, ఉన్నత విద్యను ఏడు స్థాయిలుగా యూజీసీ వర్గీకరించింది. గతంలో ఆరు స్థాయిలు ఉండగా, తాజాగా ఏడు స్థాయిలకు పెంచారు. గతంలో ఇప్పుడు సాధించాల్సిన క్రెడిట్స్ సంఖ్యలో మార్పులు చేయలేదు.
ఉన్నత విద్యలో స్థాయిలు ఇలా.
స్థాయి చదువు సాధించాల్సిన క్రెడిట్స్
లెవల్ – 4.5 అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్
(మొదటి సంవత్సరం 1, 2 సెమిస్టర్) 40
లెవల్ – 5 అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
(మొదటి రెండు సంవత్సరాలు, 1-4 సెమిస్టర్స్) 80
లెవల్ – 5.5 బ్యాచిలర్ డిగ్రీ (మూడేండ్లల్లో 6 సెమిస్టర్)
బ్యాచిలర్ ఆఫ్ నొకేషన్ (బీ నొకేషనల్) 120
మూడేండ్లు లేదా 6 సెమిస్టర్లు ఉంటుంది. 120
లెవల్ -6 బ్యాచిలర్ డిగ్రీ నాలుగేండ్లు 8 సెమిసర్లు / 160
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా
లెవల్ -6.5 మాస్టర్స్ డిగ్రీ. రెండేండ్లు నాలుగు సెమిస్టరు
మాస్టర్స్ డిగ్రీ (వన్ ఇయర్) 80
ఒక ఏడాదిలో 2 సెమిస్టర్స్‌ను పూర్తిచేయాలి. 40
లెవల్ -7 ఎంటెక్ 80
లెవల్ -8 డాక్టోరల్ డిగ్రీ విద్యార్థి సమర్పించిన థీసిస్‌ను బట్టి క్రెడిట్స్‌ను సాధించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం