వార్తల్లో వ్యక్తులు 25/05/2022
అన్నా ఖబాలే దుబా
కెన్యాకు చెందిన నర్స్ అన్నా ఖబాలే దుబా ఏస్టర్ గార్డియన్ గ్లోబల్ నర్సింగ్ అవార్డును దుబాయ్‌లో జరిగిన వేడుకలో మే 12 అందుకున్నారు. ఈ అవార్డు కింద 2,50,000 డాలర్ల నగదు అందజేశారు.
ఫ్రాంక్ విల్జెక్
2022కు గాను టెంపుల్టన్ అవార్డు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంక్ విల్జెక్కు మే 13న లభించింది. ప్రకృతి ప్రాథమిక చట్టాలపై పరిశోధనలు చేశారు. ఈ అవార్డును 1972లో స్థాపించారు. ఇతను 2004లో నోబెల్ బమతి అందుకున్నారు. ఇతను రచించిన నవలలు ఫండమెంటల్స్: టెన్ కీస్ టు రియాలిటీ ఫండమెంటల్స్, ది లైట్నెస్ ఆఫ్ బీయింగ్.
షేక్ మహ్మద్
యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మే 14న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మరణించిన రోజే అబుధాబిలో ఏడు ఎమిరేట్స్ పాలకులు సమావేశమై దేశ అధ్యక్షుడిగా షేక్ మహ్మద్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. షేక్ మహ్మద్ దివంగత అధ్యక్షుడు షేక్ ఖలీఫా సోదరుడు.
మాణిక్ సాహా
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా మే 15న బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు సీఎంగా ఉన్న బిప్లవ్ దేవ్ రాజీనామా చేయడంతో మాణిక్ సాహాతో గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ప్రమాణం చేయించారు.
దేవ సహాయం పిళ్లె
18వ శతాబ్దంలో తమిళనాడులో పుట్టి, కైస్తవం స్వీకరించిన దేవసహాయం పిళ్లెకు సెయింట్ హుడ్ (దేవదూత) ను పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో మే 15న ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి క్యాథలిక్ మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసారి.
యూనిసెఫ్ సుహృద్భావ రాయబారిగా సచిన్ టెండూల్కర్‌ను కొనసాగిస్తున్నట్లు ఆ సంస్థ మే 16న ప్రకటించింది. దీంతో సచిన్ యూనిసెఫ్ సుహృద్భావ రాయబారిగా రికార్డు స్థాయి లో 20వ సంవత్సరం కొనసాగనున్నారు.
సితికాంత పట్నాయక్, రాజీవ్ రంజన్
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా సితికాంత పట్నాయక్, రాజీవ్ రంజన్ మే 16న నియమితులయ్యారు. వీరు గతంలో ద్రవ్య విధాన కమిటీలో కార్యదర్శులుగా పనిచేశారు.
ఎలిసబెత్ బోర్న్
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిసబెత్ బోర్న్ మే 16న బాధ్యతలు చేపట్టారు. ఈమె ఫ్రాన్స్‌కు ప్రధానిగా ఎన్నికయిన రెండో మహిళ. ఈమె 2018లో రవాణా మంత్రిగా, 2020లో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 1991-92లో ఎడిత్ క్రెస్సన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పనిచేశారు.
హసన్ షేక్ మొహముద్
సోమాలియా అధ్యక్షుడిగా హసన్ షేక్ మొహముద్ మే 16న ఎన్నికయ్యారు. 328 మంది ఎంపీల్లో మొహముద్కు 214 ఓట్లు రాగా మొహమద్ అబ్దుల్లాహి మొహమద్ (ఫార్మాజో అని కూడా పిలుస్తారు)కు 110 ఓట్లు వచ్చాయి. హసన్ షేక్ 2012-17 మధ్య సోమాలియా అధ్యక్షుడిగా పనిచేశారు.
నవీన్ శ్రీవాస్తవ
నేపాల్‌లో భారత రాయబారిగా నవీన్ శ్రీవాస్తవను నియమిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మే 17న ప్రకటించింది. ఈయన 1993 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?