క్రీడలు 25/05/2022
నిఖత్ జరీన్
12వ ఎడిషన్ ఐబీఏ (ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్) ఉమెన్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మే 19న నిర్వహించిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్ కేటగిరీ ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ 5-0తో థాయిలాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌పై విజయం సాధించింది. దీంతో ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన తెలుగు రాష్ట్రాల నుంచి తొలి క్రీడాకారిణిగా, భారత్ తరఫున మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కెసి తరువాత ఐదో మహిళా బాక్సర్‌గా రికార్డులకెక్కింది.
నిఖత్ గెలుచుకున్న ఈవెంట్లు
2011లో టర్కీలో జరిగిన ప్రపంచ జూనియర్, యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
2014 నేషన్స్ కప్‌లో స్వర్ణం
2015లో జాతీయ సీనియర్ చాంపియన్ షిప్లో స్వర్ణం
2016లో దక్షిణాసియా ఫెడరేషన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం
2018లో సెర్బియా బెల్గ్రేడ్ టోర్నీలో స్వర్ణం
2019 థాయిలాండ్ ఓపెన్‌లో రజతం
2019, 2022 స్ట్రాంజా మెమోరియల్‌లో స్వర్ణం
ఐబీఏని 1946లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం లాసానే (స్విట్జర్లాండ్). ఐబీఏ ప్రస్తుత అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లియోవ్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?