దోపిడీ పర్యవసానమే సాంఘిక అసమానతలు
అణచివేతకు, ఆర్థిక దోపిడీకి మరో రూపమే సామాజిక అసమానతలు. అనాదిగా ఆర్థిక దోపిడీ మూలంగా అభివృద్ధికి నోచుకోని ప్రజలను ఒకగాటనకట్టి ప్రధాన సమాజానికి దూరంగా ఉంచటంతోనే సామాజిక అసమాతలు ప్రారంభయ్యాయని చెప్పొచ్చు. ఈ అసమాతనల్లో కులం, మతం, ప్రాంతీయ తత్వాలు చేరికతో అవి మరింత విజృంభించి మొత్తం సామాజిక వ్యవస్థనే ప్రమాదంలో పడేసే దశకు చేరాయి. భారత్లో ఆర్థిక అభివృద్ధితోపాటే చోటుచేసుకొన్న సామాజిక అసమానతలపై నిపుణ పాఠకులకు ప్రత్యేకం.
మతం
– అభివృద్ధికి మతానికి సంబంధం ఉంది. మత ప్రవచనాలు, దాని అనుకరణ రెండూ అభివృద్ధికి దోహదపడుతాయి. ఏ మతమైనా మంచిని బోధిస్తుంది. కానీ పాటించేవారిపై విజయం ఆధారపడుతుంది.
– వ్యక్తులను కులాల నుంచి, మతాల నుంచి విడదీయడం అసాధ్యం. కానీ కుల, మతాలు రెండూ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి.
– వ్యక్తిని వ్యక్తి దోపిడీ చేసే విధానం, పర్యావరణాన్ని భంగపరిచే విధానం, అక్రమ వ్యాపారం, నల్లద్రవ్యం గుప్తపర్చడం, కార్టెల్గా ఏర్పడి కృత్రిమంగా ధరలు పెంచడం వంటివి చేయాలని ఏ మతం చెప్పదు. కాబట్టి మతాలను లోతుగా అధ్యయనం చేసి, అవి అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలి.
– 2010 లెక్కల ప్రకారం ప్రపంచంలో క్రిస్టియన్లు 2.2 బిలియన్లు, ఇస్లాం 1.6 బిలియన్లు, హిందూ 1 బిలియన్, బుద్ధిజం 0.5 బిలియన్ జనాభాను కలిగి ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
– సాంఘిక అభివృద్ధికి, రాజకీయ అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి మత భావనలు ఉపయోగపడితే మార్పులు సత్వరంగా వచ్చి దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది. మత గ్రంథాలు, మత బోధనలు ప్రపంచశాంతిని పెంచేవిధంగా ఉంటే స్వేచ్ఛా వాణిజ్యం పెరుగుతుంది. మతం మత్తు మందుగా కాకుండా, ప్రజాసంక్షేమాన్ని పెంచేదిగా ఉండాలి. అవసరమనుకుంటే సంస్కరణలు చేపట్టాలి.
– అభివృద్ధిలో మతాల మధ్య సమ్మిళితిని సాధించాలి. మతాలపరంగా ప్రజల్లో మైనారిటీ అనే దృక్పథం లేకుండా ప్రభుత్వం లౌకిక రాజ్యాన్ని పాటించాలి. మతం ఒక ఆధ్యాత్మిక అంశంలా కాకుండా మంచి రాజకీయ, ఆర్థిక, సాంఘిక దృక్పథాన్ని ప్రజలకు నేర్పించాలి.
– భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో మతాలను కలిగి ఉన్నందున లౌకికత్వాన్ని పాటించడంవల్ల అభివృద్ధిలో అందరి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్ లాంటి మైనారిటీ వర్గాలకు చెందినవారి సేవలను ప్రజలు పొందగలిగారు. మతం ప్రజలకు సంకుచిత దృక్పథాలను కాకుండా ఒక మంచి ఆర్థిక జీవనాన్ని బోధించాలి.
– ప్రజల నమ్మకాలకు రాజ్యాంగం మతం లాంటిది. అలాంటి మతం ప్రజల నమ్మకాలను పెంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారుచేయాలి. అప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
– భారతదేశం జాతీయాదాయంలో ప్రపంచంలో ఏడో స్థానం ఉన్నప్పటికీ HDIలో మాత్రం 130వ స్థానంలో వెనుకబడి ఉందంటే.. పెరిగిన జాతీయాదాయం కొద్దిమందికే పరిమితమైందని స్పష్టమవుతుంది. దీనికి కారణం కేంద్రీకరణం, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం. మతాలపై EB టేలర్, JG ఫ్రేజర్, సిగ్మండ్ ఫ్రాయిడ్, Emaile Durkheim, కార్ల్ మార్క్స్ మొదలైనవారు ఒక శాస్త్రీయ అధ్యయనం చేశారు.
– 1976లో రాజ్యాంగం 42వ సవరణ ద్వారా లౌకిక (Secularism) పదాన్ని చేర్చింది. అందుకే మతాల మధ్య దాదాపు సామరస్య పూరిత వాతావరణం ఉంది. ఉపనిషత్లో పేర్కొన్న సర్వధర్మ సమభావ అనే పదం కూడా దేశంలో మతాల మధ్య సామరస్యం పెరిగేవిధంగా చేస్తుంది.
– భారత ప్రజల్లో ఉన్న పొదుపు దృక్పథంవల్ల పొదుపులు, పెట్టుబడులు దాదాపు జీడీపీలో 30 శాతం దాటాయి. బ్యాంకులు ఇచ్చే తక్కువ వడ్డీకి కూడా ప్రజలు తమ జీడీపీని బ్యాంకుల్లో దాచుకుంటున్నారని SS తారాపూర్ పేర్కొనడం వెనుక భారత మతాల్లోని గొప్పతనాన్ని గమనించవచ్చు.
– దేశంలో ఉన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, లౌకిక విధానం రెండూ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఉత్పత్తి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఒకవైపు, అన్ని మతాల ప్రజలు ఒకవైపు పాల్గొనడంవల్ల.. మనదేశం 2008-09 నాటి మాంద్య పరిస్థితులను ఎదుర్కొని ఒక ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీగా ఎదుగుతున్నది.
– భారతదేశం కొన్ని సందర్భాల్లో కుటుంబ చట్టం (Family Law) అజమాయిషీ కలిగి ఉంది. దీంతో స్త్రీలు కొంత ఇబ్బందుల పాలవుతున్నారు.
– దేశంలో స్త్రీలు 100కు 25 మంది మాత్రమే కార్మికులుగా ఉన్నారు. ఇది వారు పాటించే మత ప్రభావంగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీనివల్ల జీడీపీ తగ్గుతుంది.
– దేశంలో మతాల మధ్య కొన్ని అసమానతలున్నాయి. అక్షరాస్యత గరిష్టంగా జైనుల్లో 94.1 శాతం నమోదైతే, కనిష్టంగా ముస్లింలలో 59 శాతం నమోదైంది. అదేవిధంగా క్రిస్టియన్లలో లింగనిష్పత్తి 1023గా ఉంటే, కనిష్టంగా హిందువుల్లో 939 మాత్రమే నమోదైంది. ఇలాంటి అసమానతలను తొలగించాలి. లింగ నిష్పత్తిలో దేశ సగటు 943గా ఉందని గమనించాలి. అదేవిధంగా అత్యధికంగా జైనులు 80 శాతం పట్టణాల్లో నివసిస్తున్నారు. కనిష్టంగా హిందువులు 29 శాతం గ్రామాల్లో నివసిస్తున్నారు.
జాతి తత్వం
– ఒక రకమైన శారీరక ఆకృతి, సంప్రదాయాలు, వస్త్రధారణ, చారిత్రక నేపథ్యం, భాష, జాతీయ, ప్రాంత, భాష లక్షణాలు గలవారిని ఒక జాతివారుగా గుర్తిస్తారు. అభివృద్ధికి, జాతి సమానత్వానికి సంబంధం ఉంది. దేశంలో ఉన్న అన్ని జాతుల ప్రజలు సమానంగా ఉన్నప్పుడే సాంఘిక సమానత్వం సాధ్యమైనట్లు గమనించాలి.
– ఆఫ్రికాలో Hutsi, Tutsi తెగల మధ్య దీర్ఘకాల గొడవలవల్ల పూర్తిగా పరిపాలన స్తంభించి అభివృద్ధి నిరోధకంగా మారింది.
– ఆర్థిక అభివృద్ధి ఉన్నప్పుడు అది జాతుల మధ్య గొడవలను తగ్గిస్తుందని, ఆర్థిక అభివృద్ధి లేనప్పుడు జాతుల మధ్య కొట్లాటలు పెరుగుతాయని విశ్లేషకుల అభిప్రాయం.
– కొన్ని సందర్భాల్లో రాజకీయ ఆధిపత్యాల కోసం జాతులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరికొన్ని సందర్భాల్లో ఒకే జాతివారు ఒకే మతాన్ని కలిగి సత్వర వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఉదా: ఆసియాలో కొన్ని దేశాలవారు ముఖ్యంగా మంగోలాయిడ్ జాతివారు బుద్ధిజంతో సత్వర వృద్ధిని సాధించారు.
– జాతి తత్వం చాలా సందర్భాల్లో మతాలకు ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. దేశంలో హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తినా అది లౌకికతత్వం అనే భావనకు కట్టుబడి చివరికి సమైక్యంగా జీవిస్తున్నారు. ప్రజల్లో ఉన్నత విద్యను విస్తరింపచేసినప్పుడు దాదాపు అన్ని రకాల సాంఘిక అసమానతలు తగ్గించే అవకాశం ఉంటుంది.
– జాతి అనేది ఒక గొడుగు లాంటి పదం. ఇందులో కులం, భాష, తెగ మొదలైనవి ఉంటాయి.
– తెగల మధ్య అసమానత్వం, పేదరికం, నిరుద్యోగం ఉన్నప్పటికీ అది త్వరగా అశాంతికి దారితీసే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య, ఆర్థికాభివృద్ధికి రెండు జాతుల మధ్య భేదాన్ని తగ్గించి సత్వర వృద్ధి సాధించే ప్రయత్నం జరగవచ్చు.
– చాలా సందర్భాల్లో ఇసాన్పూర్ (గుజరాత్), ధారవి (ముంబై) మురికివాడల్లో హిందూ, ముస్లిం గొడవలు జరిగాయి. పేదరికం జాతిపర గొడవలకు దారితీస్తున్నట్లు గమనించాలి.
– శ్రీకృష్ణ కమిషన్ ప్రకారం గొడవలకు చాలా సందర్భాల్లో రిలేటివ్ డిప్రివేషన్ అంటే వారి మధ్య కొంత ఆదాయ, అసమానతలు గొడవలకు దారితీసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
– మురికివాడలు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం రెండు కలిసినప్పుడు జాతుల మధ్య ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో రామ్హ్రీం నగర్, భీవండిలో పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో మురికివాడల ప్రజల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి.
– సమ్మిళితితో కూడిన విద్య, ఆర్థిక అభివృద్ధి జాతుల మధ్య ఘర్షణలను తగ్గించగలదు.
కొడుకుల అధిక ప్రాధాన్యతకు కారణం
– ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ
– మతపర అంశాలు
– వాణిజ్యంలో అందుబాటు
– వంశం కొనసాగింపు
– దేశంలో వరకట్న నిషేధ చట్టం 1961లో ప్రవేశపెట్టబడి ఇంకా కొనసాగుతుంది. తల్లిదండ్రుల ఆస్తిలో పురుషులకు, స్త్రీలకు సమాన అవకాశం కల్పించాల్సి ఉంటుంది. Mohammedan personal law ప్రకారం బాల్య వివాహాలకు అవకాశం ఉంది. అదేవిధంగా పురుషులు ఏకపక్షంగా విడాకులు తీసుకునే అవకాశం ఉంది.
– స్త్రీల రక్షణ కోసం ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ వంటి చట్టాలు ఉన్నప్పటికీ వారికి న్యాయం జరుగలేదు. ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్, నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఉమెన్ మొదలైన సంస్థలు స్త్రీల రక్షణ కోసం పోరాటం చేస్తున్నాయి.
– సెక్సు రేషియోలో బాలికల సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం విచారకరం. దేశీయ స్త్రీ, పురుష నిష్పత్తి 943 అయితే, పిల్లల స్త్రీ, పురుష నిష్పత్తి 916గా నమోదైంది. దీన్ని RGCCI ఖండించింది. 1994లో అక్రమ గర్భస్రావాలపై నిషేధం విధించినప్పటికీ దేశంలో యేటా లక్ష ఇల్లీగల్ అబార్షన్లు జరగుతుండటం విచారకరం.
– జనాభాలో 50 శాతం స్త్రీలు ఉన్నప్పటికీ వారికి సరైన ప్రాతినిధ్యం, విలువ ఇవ్వకపోవడం బాధాకరం. పురాతన భారతదేశంలో స్త్రీ, పురుషులు సమాన అవకాశాలు కలిగి ఉండేవారు. స్త్రీలలో సాధువులు కూడా ఉండేవారు. ఉదాహరణకు మైత్రేయి అనే సాధువు కూడా ఉండేది. ఎప్పుడైతే మనుధర్మ శాస్త్రం ప్రారంభమైందో అప్పటినుంచి స్త్రీలకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బ్రిటిష్వారి కాలంలో రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, ఆచార్య వినోభా భావే మొదలైనవారు స్త్రీల హక్కుల కోసం కృషిచేశారు. 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశారు. 1929లో CMRAను తీసుకొచ్చారు.
– స్త్రీల హక్కుల కోసం ఆర్టికల్ 14, ఆర్టికల్ 15(1), ఆర్టికల్ 15(3), ఆర్టికల్ 16 అమలు చేయాలి. అదేవిధంగా ఆర్టికల్ 39(ఎ), ఆర్టికల్ 39(డి), ఆర్టికల్ 42ను సమర్థవంతంగా అమలు చేయాలి. అదేవిధంగా మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ చట్టాలను కూడా అమలు చేయాలి.
– ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ – 1976
– ఇమ్మోరల్ ట్రాఫిక్ – 1956
– మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ – 1961
– మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ – 1971
– సతీ యాక్ట్ – 1987
– చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ – 2006
– ప్రీ కన్సెప్షన్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ – 1994
– సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ – 2013
– భారతదేశం ప్రపంచ సంస్థల్లో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. ముఖ్యంగా కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్, అదేవిధంగా మెక్సికో ప్లాన్ ఆఫ్ యాక్షన్ (1975), నైరోబి ఫార్వర్డ్ లుకింగ్ స్ట్రేటజీస్ (1985), బీజింగ్ డిక్లరేషన్ యాజ్ వెల్ యాజ్ ది ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ (1995), జాతీయస్థాయిలో 2001లో నేషనల్ పాలసీ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ తదితర సంస్థల్లో భారత్కు భాగస్వామ్యం ఉంది.
– భారతదేశం స్త్రీల హక్కులను కాపాడుతూ ఉత్పాద ప్రక్రియలో వారిని ప్రోత్సహించాలి. 100 మంది పురుష జనాభాలో 50 శాతం మంది పనుల్లో పాల్గొంటే, 100 మంది స్త్రీలలో మాత్రం కేవలం 25 శాతం మంది మాత్రమే పనులు చేస్తున్నారు. దీన్ని మార్చాల్సి ఉంది.
– దేశం జాతీయ ఆదాయంలో ప్రపంచంలో 7వ స్థానం కలిగి ఉన్నప్పటికీ, HDIలో వెనుకబడి ఉంది. మానవాభివృద్ధి సూచీలో కూడా అలాంటి స్థానాన్ని పొందాలంటే సాంఘిక అసమానతలను నిర్మూలించాలి.
లింగ అసమానత్వం – కారణాలు
– పితృస్వామ్యం కారణంగా కుటుంబంలో తండ్రికి అధికారాలు ఎక్కువగా ఉంటాయి. వంశపారంపర్యంగా మగవారికి హక్కులు ఉండటంవల్ల వారికే అధికారాలు ఎక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసే బాధ్యత మగవారిపై ఉండటంవల్ల పురుషులకు అధికారాలు పెరిగినట్లు భావించాలి. కూతరుకు కొంత ద్రవ్యాన్ని వరకట్న రూపంలో ఇవ్వడం, కొడుకులకు కోట్ల రూపాయల ఆస్తులను ఇవ్వడం అనే సంప్రదాయంవల్ల కూడా పురుషుల ఆధిక్యం పెరుగుతున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు