మలిపోరులో గర్జించిన తెలంగాణ
దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని ఎప్పటికప్పుడు వలస పాలకులు అణచివేస్తూ వచ్చినప్పటికీ 1990 దశకంనాటికి మళ్లీ ఊపందుకొంది. తెలంగాణ మేధావులు స్వరాష్ట్ర కాంక్షా భావజాలాన్ని బలంగా ప్రచారం చేయటంతో తెలంగాణ సమాజం అట్టడుగుస్థాయి వరకు చైతన్యవంతమైంది. నాటి రాజకీయ పరిణామాలు కూడా ఉద్యమానికి ఉత్సాహాన్నిచ్చాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఉద్యమం ఒక వ్యవస్థీకృత రూపందాల్చి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ఉరకలెత్తింది.
మేధోమదన చర్చలు – టీఆర్ఎస్ ఆవిర్భావం
– ఎన్నో ఏండ్ల తెలంగాణ ప్రజల అసహనం, వెనుకబాటుతనంపై చర్చ మొదలైంది.
– పెరుగుతున్న వివక్షపై, తెలంగాణ అస్థిత్వ పరిరక్షణ కోసం మేధావులు సమరశంఖం పూరించారు.
– తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టును జయశంకర్, మరికొందరు కలిసి ఏర్పాటు చేశారు. 1986, జనవరిలో మా తెలంగాణ మాస పత్రిక వెలువడింది.
– ఓయూలో చిన్నరాష్ర్టాలపై జాతీయ సెమినార్‌ను 1993 ఆగస్టులో జార్జి ఫెర్నాండెస్ అధ్యక్షతన నిర్వహించారు.
– 28 తెలంగాణ సంఘాల ఐక్యత కోసం జయశంకర్ సార్ ఆధ్వర్యంలో ఓయూలో 12 మందితో తెలంగాణ ఐక్యవేదిక కమిటీ 1997 అక్టోబర్ 28న ఏర్పడింది.
– టీడీఎఫ్ 1999లో యూఎస్ఏలో ఏర్పడింది.
– 1991లో తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. 1992లో టీఎస్ఎఫ్ కేయూ ఏర్పడ్డాయి.
– 1996 నవంబర్ 1న వరంగల్‌లో విద్రోహదినంను జయశంకర్, భూపతి కృష్ణమూర్తి, కాళోజీ, బాపు, గద్దర్, వరవరరావు నిర్వహించారు.
– 1996 నవంబర్ 20న సిద్దిపేటలో మంజీర రచయితల సంఘం ఏర్పాటైంది.
– 1997 ఆగస్టు 17న సిద్దిపేట రచయితలు, ఉద్యోగులు తెలంగాణ సభ నిర్వహించారు. నందిని సిధారెడ్డి నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ పాటను ఈ సభలో ఆలపించారు.
– 1997లో భువనగిరిలో జయశంకర్, కాళోజీ మొదలైనవారు విరసం పర్యవేక్షణలో దగాపడ్డ తెలంగాణ పేరుతో సభ నిర్వహించారు.
– 1997 ఏప్రిల్‌లో సూర్యాపేటలో మహాసభను మారోజు వీరన్న నిర్వహించారు.
– 1997 డిసెంబర్ 28, 29ల్లో వరంగల్ డిక్లరేషన్ చేశారు. దీనిలో 60 అంశాలున్నాయి. దీన్ని తెలంగాణ రాజ్యాంగం అంటారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం – ప్రజా పోరాటం
– జీవో 610తో కలతచెందిన కేసీఆర్ 2000లో 3 చిన్న రాష్ర్టాలు ఏర్పడుతుంటే బాబు అడ్డుకోవటంతో మనస్థాపం చెంది జయశంకర్, ఇతర మేధావులతో చర్చించారు.
– 2001 మే 17న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. జల దృశ్యంలో ఆవిర్భావ సభ జరిగింది.
– 2001 జూలైలో స్థానిక సంస్థల బ్యాలెట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించి 1000 ఎంపీటీసీ, 87 జడ్పీటీసీ, 84 ఎంపీపీ, 2 జడ్పీ పీఠాలు దక్కించుకుంది.
– 2002 సెప్టెంబర్, అక్టోబర్లలో కేసీఆర్ పల్లెబాట చేపట్టారు.
– 2002 నవంబర్, 2003 జనవరిలో జలసాధన చేపట్టారు.
– 2003 జూలైలో ఆలంపూర్ నుంచి గద్వాల వరకు, ఆగస్టులో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్రలు చేపట్టారు.
– 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ 5 ఎంపీ, 26 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది.
– మౌలాంకర్ హోటల్లో చిన్న రాష్ర్టాల సమావేశం కేసీఆర్ కన్వీనర్‌గా నిర్వహించారు.
– 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్‌కు లేఖలు రాశాయి. ముగ్గురు మాజీ ప్రధానులు వీపీ సింగ్, గుజ్రాల్, దేవెగౌడ మద్దతు తెలిపారు.
– ప్రణబ్ కమిటీతో కేంద్రం తాత్సారం చేయడంతో 2006 ఆగస్టులో టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేశారు.
– 2008 మార్చిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు.
– 2009 ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ను మచ్చిక చేసుకొనేందుకు వైఎస్సార్ వేసిన రోశయ్య కమిటీ పాచిక పారలేదు.
– చంద్రబాబు తెలంగాణకు అనుకూలమని రాసిన లేఖతో టీఆర్ఎస్, వామపక్షాలు, టీడీపీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి.
– మహాకూటమి ఓటమితో టీఆర్ఎస్ పనైపోయిందన్నారు.
– 2009 అక్టోబర్ 9న హైదరాబాద్ ఫ్రీజోన్‌పై సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.
– కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపడతానని నవంబర్ 5న ప్రకటించి నవంబర్ 29న దీక్షకు పూనుకున్నారు.
– నవంబర్ 26న కరీంనగర్ వెళ్లి, 29న దీక్షాస్థలి రంగధాంపల్లికి వస్తుండగా పోలీసులు కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. జైలుకు పంపగా దీక్ష చేపట్టారు.
– దీక్షతో ఆరోగ్యం క్షీణించటంతో కేసీఆర్‌ను డిసెంబర్ 3న నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
– డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనతో కేసీఆర్ దీక్ష విరమించారు.
– డిసెంబర్ 9 ప్రకటనతో ఆంధ్రాలో అలజడి, రాజీనామా లు, విధ్వంసాలు జరిగాయి.
– ఆంధ్రా నాయకులు అలా రియాక్ట్ అవుతారని కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసు. నెహ్రూ, ఇందిరాగాంధీలను సైతం తమ లాబీయింగ్‌తో లొంగదీసుకున్న ఆంధ్రా పాలకులు మళ్లీ అదే చేస్తారని ఆ పార్టీకి తెలుసు. వాళ్ల తృప్తికోసం డిసెంబర్ 23న రాష్ట్ర ప్రకటనపై యూ టర్న్ తీసుకుంది.
– తెలంగాణ ఎలా రియాక్ట్ అవుతుందో చిదంబరానికి ముం దే తెలుసు. యూ టర్న్ స్టేట్మెంట్ ఇచ్చి మినిస్ట్రీ నుంచి తప్పుకున్నాడు. షిండే రంగంమీదికొచ్చాడు.
– డిసెంబర్ 9 స్టేట్మెంట్ కేంద్రం తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టి అసెంబ్లీలో తీర్మానం పెడుతుంది.
– డిసెంబర్ 23 ప్రకటనతో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తుంది.
– ఆంధ్రా ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ కాబట్టి తీర్మానం నెగ్గడం చాలాకష్టం.
– 2009 డిసెంబర్ 24న కోదండరాం కన్వీనర్‌గా, మల్లెపల్లి లక్ష్మయ్య కో కన్వీనర్‌గా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ)ఏర్పడి రాష్ట్రం కోసం పోరుబాట పట్టింది.
– గ్రామగ్రామాన వృత్తులవారీ జేఏసీలు ఏర్పడి ఆత్మగౌరవం కోసం పోరాటం చేశాయి.
ఆత్మబలిదానాలు
– 2009 నవంబర్ 30న శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. డిసెంబర్ 4న మరణించాడు.
– డిసెంబర్ 1న కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీతో కాల్చుకొని ఆత్మబలిదానం చేసుకున్నాడు.
– 2010 జనవరి 3న బండారు రజని బలిపీఠం ఎక్కింది.
– జనవరి 19న ఓయూలో వేణుగోపాల్‌రెడ్డి ఆత్మబలిదానం.
– ఫిబ్రవరి 20న ఎన్సీసీసీ గేట్ వద్ద సిరిపురం యాదయ్య ఆత్మాహుతి.
– పార్లమెంట్ సమీపాన యాదిరెడ్డి ఆత్మహత్య .
– జూలై 31న ఇషాన్‌రెడ్డి ఆత్మహత్య .
– 2012 మార్చి 24న బోజ్యానాయక్ ఆత్మహత్య .
– ఇలా 1100 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారు.
– 1969 ఉద్యమం విద్యుత్ ఉద్యోగులతో మొదలైంది.
– 2009 నుంచి అన్ని ఉద్యమాల్లో ఉద్యోగులు, ప్రజలు, లాయర్లు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ప్రతిష్ఠాత్మక ఉద్యమాలు
– సహాయ నిరాకరణ : 2011 ఫిబ్రవరి 17న ప్రారంభమైంది.
– అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా 3 లక్షల ఉద్యోగులు విధులు బహిష్కరించారు.
– పెన్‌డౌన్, గన్‌డౌన్ చేయగా,16 రోజులు జరిగింది.
– చలో అసెంబ్లీ : 2011 ఫిబ్రవరి 21న జేఏసీ పిలుపుమేరకు జరిగింది. ఓయూ దిగ్బంధనం, అసెంబ్లీ, రాజ్భవన్లను ముట్టడించారు.
– పల్లెపల్లె పట్టాలపైకి : 2011 మార్చి 1న చేపట్టారు. రైళ్లు నిలిపివేశారు.
– మిలియన్ మార్చ్ : 2011 మార్చి 10న నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై 11 విగ్రహాలను ధ్వంసం చేశారు.
– వంటావార్పు : 2011 జూన్ 19న చేపట్టారు.
– సకల జనుల సమ్మె : 2011 సెప్టెంబర్ 13న ప్రారంభించారు. 42 రోజులు ఈ సమ్మె కొనసాగింది.
– గమనిక : పగిలిన విగ్రహాలు 11, కేసీఆర్ దీక్ష 11 రోజులు, తొలిమంత్రివర్గం 11, కోర్ కమిటీ 11 జూలై.
– తెలంగాణ మార్చ్/సాగరహారం : 2012 సెప్టెంబర్ 30న చేపట్టారు. 144 వాటర్ క్యానన్లు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించినా సాగరహారం విజయవంతమైంది.
– సమర దీక్ష : 2013 జనవరి 27, 28న నిర్వహించారు. ఇందిరాపార్క్ వద్ద జరిగింది. 13 యూనివర్సిటీల విద్యార్థులు రాజ్‌భవన్‌ను ముట్టడించారు.
– సడక్‌బంద్ : జేఏసీ పిలుపు మేరకు 2013 మార్చి 21న చేపట్టారు. శంషాబాద్-ఆలంపూర్ రోడ్డును బంద్ చేశారు.
పార్లమెంటరీ ప్రక్రియ
– 2012 డిసెంబర్ 28న అఖిలపక్షం ఏర్పాటు.
– 2013 జూలై 11న కోర్ కమిటీని నియమించారు. జూలై 30న సీడబ్ల్యూసీ, ఆగస్టు 5న పార్లమెంటులో చిదంబరం ప్రకటన, డిసెంబర్ 5న ముసాయిదా బిల్లు -2013కు కేబినెట్ ఆమోదం.
– 2013 డిసెంబర్ 12న ప్రత్యేక విమానం ద్వారా రాత్రి 8 గంటలకు చీఫ్ సెక్రటరీ మొదట బిల్లు అందుకున్నారు.
– రూల్ 77 కింద తిరిగి వెనక్కి పంపాలని ఆంధ్రా నాయకులు తీర్మానించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నోటీస్ జిరాక్స్ కాకుండా ఒరిజినల్ కావాలని డిమాండ్ చేశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు