‘వెయ్యి ఉరిల మర్రి’తో సంబంధం ఉన్నవారు?
1. 1917లో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన ప్రథమ ఆంధ్ర ఆదిహిందూ సదస్సు ఎక్కడ జరిగింది ?
1) గుంటూరు 2) విజయవాడ
3) ఖమ్మం 4) నల్లగొండ
2. దళితుల్లో అంతర్గత సమస్యలను పరిష్కరించటానికి కులపెద్దల పంచాయితీ వ్యవస్థను స్థాపించింది ఎవరు?
1) ఆళ్వారు స్వామి 2) భాగ్యరెడ్డి వర్మ
3) బీఎస్ కళా వెంకట్రావ్ 4) జ్యోతిబాఫూలే
3. మొదటి ఆదిహిందూ లీగ్ మహాసభ ఎవరి అధ్యక్షతన జరిగింది?
1) పాపన్న 2) వామన్ నాయక్
3) రాజా ధన్‌రాజ్‌గిర్ 4) కేశవరావు
4. 1927లో ఎక్కడ జరిగిన అఖిల భారత నిమ్నవర్గాల సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ దక్షిణ భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు?
1) కర్ణాటక 2) అలహాబాద్ 3) ఢిల్లీ 4) లక్నో
5. జంతుబలికి వ్యతిరేకంగా భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సభ ఏది?
1) ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్
2) జగన్ మిత్రమండలి
3) జీవదయ ప్రచార సభ
4) ఆదిహిందూ సభ
6. భాగ్యరెడ్డి చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా వర్మ అనే బిరుదును ఇచ్చి , ఆర్య సమాజ్ కార్యకర్తగా పేరొందిన వ్యక్తి ఎవరు?
1) బాజి కిషన్ రావు 2) ధర్మవీర్
3) స్వామి శ్రద్ధానంద్ 4) వామన్ నాయక్
7. అంబేద్కర్‌కే మార్గదర్శిగా నిలిచి, 51వ ఏట 1939 ఫిబ్రవరి 18న క్షయవ్యాధితో మరణించినది ఎవరు?
1) బీఎస్ కళావెంకట్రావ్ 2) భాగ్యరెడ్డి వర్మ
3) జ్యోతిబాఫూలే 4) ఆళ్వార్‌స్వామి
8. హరిజనులను అగ్రవర్ణాలతో సమానంగా చూడాలని 1932లో అఖిల భారత హరిజన సంఘాన్ని స్థాపించింది ఎవరు?
1) బీఆర్ అంబేద్కర్ 2) గాంధీజీ
3) నెహ్రూ 4) ధక్కర్ బాబా
9. హరిజనోద్యమాన్ని మరింత ఉధృతం చేయటానికి 1934లో హరిజన యాత్ర పేరిట హైదరాబాద్ పర్యటన చేసిందెవరు?
1) గాంధీజీ 2) బీఆర్ అంబేద్కర్
3) నెహ్రూ 4) జ్యోతిబాఫూలే
10. ఏ చట్టం ద్వారా గిరిజనుల సంపదను దోచుకుంటున్న మైదాన ప్రాంత ప్రజల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు?
1) 1878 అటవీ చట్టం 2) 1927 భారత అటవీ చట్టం 3) 1865 మొదటి అటవీ చట్టం
4) 1894 మొదటి అటవీ విధానం
11. ఏ చట్టం ద్వారా అడవుల్లోకి చొరబడటం, పశువులను మేపటం వంటి చర్యలను ప్రభుత్వం నిషేధించింది?
1) 1865 మొదటి అటవీ చట్టం 2) 1878 అటవీ చట్టం 3) 1927 భారత అటవీ చట్టం
4) 1894 మొదటి అటవీ విధాన చట్టం
12. 1857లో ఎవరి కాలంలో హైదరాబాద్ రాజ్యంలో మొదటి
సారిగా అటవీ శాఖ ప్రారంభమైంది?
1) మహబూబ్ అలీఖాన్ 2) సాలార్జంగ్
3) ఉస్మాన్ అలీఖాన్ 4) ఎవరూ కాదు
13. గోండుల పరిధి గురించి ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1994లో ఏ పేరుతో పుస్తకం ప్రచురించింది?
1) షెడ్యూల్డ్ తెగలు 2) షెడ్యూల్డ్ కులాలు
3) మరియా గోండులు 4) కొండమరియాలు
14. వెయ్యి ఉరిల మర్రితో సంబంధం ఉన్న వ్యక్తి ?
1) కొమరం భీమ్ 2) రాంజీగోండు
3) షేక్ బందగీ 4) కొమరయ్య
15. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్ జోడేఘాట్ అటవీ ప్రాంతంలో సంకేపల్లిలో జన్మించింది ఎవరు?
1) రాంజీగోండు 2) దొడ్డి కొమరయ్య
3) కొమరం భీమ్ 4) బందగి
16. 1917 అటవీ చట్టం ప్రకారం గిరిజనులు అడవుల్లో పశువును మేపుకొనేందుకుగాను ప్రభుత్వానికి ఏ రకమైన శిస్తు చెల్లించేవారు?
1) బంచెరాయి పన్ను 2) దుంపపట్టి
3) ఘర్‌పట్టి 4) చౌబీన
17. 1918లో మొదటి తహసీల్ ఆఫీస్ ఏర్పడి అటవీ, రెవెన్యూ పన్నులను వసూలు చేసింది ఎక్కడ?
1) ఉట్నూరు 2) నిర్మల్ 3) కాగజ్‌నగర్ 4) సిర్పూర్
18. విఠోబా (ప్రింటింగ్ ప్రెస్ యజమాని) అనే వ్యక్తిని ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని ప్రచురిస్తున్నాడన్న కారణంతో బ్రిటిష్ అధికారులు అరెస్ట్ చేయగా ఆ ప్రెస్ నుంచి కొమరం భీమ్ తప్పించుకొని ఏ రాష్ర్టానికి వెళ్లాడు?
1) పశ్చిమ బెంగాల్ 2) అస్సాం
3) మణిపూర్ 4) నాగాలాండ్
19. కింది వారిలో జల్, జంగల్, జమీన్ నినాదం ఎవరిది?
1) రాంజీగోండు 2) బందగి
3) కొమరం భీమ్ 4) దొడ్డి కొమరయ్య
20. కొమరం భీమ్ దగ్గర పనిచేసిన ఎవరిని ప్రభుత్వ అధికారులు లొంగదీసుకొని అతని సహాయంతో జోడేఘాట్ గుట్టలను ఎక్కి పోరాటం చేశారు?
1) కుర్దు పటేల్ 2) కొండల్ రఘు
3) సుద్దులు 4) అబ్దుల్ సత్తార్
21. కొమరం భీమ్ దళ సభ్యులు, నిజాం ప్రభుత్వ బలగాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ?
సూపరింటెండెంట్ ఎవరు?
1) కెప్టెన్ అలీరజా బ్రాండెన్ 2) అబ్దుల్ సత్తార్
3) అమీన్‌సాబ్ 4) ఎవరూకాదు
22. గిరిజనగూడెంలపై కాల్పుల అనంతరం చనిపోయిన గిరిజనుల శవాలను నిజాం ప్రభుత్వాధికారులు కుప్పగా పోసి దహనం చేయగా ఆ వాసన కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించిందని ఏ పత్రికలో ప్రచురితమైంది?
1) మీజాన్ 2) రయ్యత్
3) ముషీరే దక్కన్ 4) పయాం
23. మీర్ ఉస్మాన్ అలీఖాన్ గోండుల పరిస్థితుల అధ్యయనానికి మానవశాస్త్రవేత్త అయిన ఎవరిని నియమించాడు?
1) ప్యూరర్ హైమన్ డార్ఫ్ 2) సర్ విల్ఫ్రెడ్ గ్రిగ్సన్
3) సిరాజుల్లా తిర్మాజీ 4) ఎవరూకాదు
24. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు బ్రిటిష్ ప్రభుత్వం నిజాం ప్రభువరేణ్యులు అనే వారసత్వ ప్రాధాన్యతగల బిరుదు ఎప్పుడు ఇచ్చింది?
1) 1915 2) 1918 3) 1920 4) 1930
25. 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం గీతం పాడిన విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించగా ఏ విశ్వవిద్యాలయం వీరికి ప్రవేశం కల్పించింది?
1) బొంబాయి యూనివర్సిటీ 2) మద్రాస్ యూనివర్సిటీ 3) నాగపూర్ యూనివర్సిటీ
4) అన్నామలై విశ్వవిద్యాలయం
26. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించడి.
ఎ) 1938 జనవరి 29న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించారు
బి) 1938 సెప్టెంబర్ 7న నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధించింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు