సైనో టిబెటన్ భాషా సమూహం ఎక్కడ ఉంది?
ఎంఎన్ శ్రీనివాస్
-16 నవంబర్, 1916లో మైసూర్లో అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు.
-ఉన్నత విద్యను బొంబాయి యూనివర్సిటీలో జీఎస్ ఘర్యే వద్ద ఎం. ఏ విద్యనభ్యసించారు.
-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లి గురువు రాడ్క్లిఫ్బ్రౌన్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సందర్భంలో రాడ్క్లిఫ్బ్రౌన్ నిర్మితివాదానికి ఇతను ఎంతో ప్రభావితమయ్యారు.
-ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ సమాజశాస్త్రవేత్తగా ఎంతో పేరుపొందారు.
-తన పరిశోధనల్లో కులం, కులవ్యవస్థలు, సామాజిక స్తరీకరణం, దక్షిణ భారతంలో సంస్కృతిక కావ్యం వంటి అంశాలపై అధ్యయనం చేసి ఖ్యాతి గడించారు.
-రెండు డాక్టరేట్లను పొందడమే కాకుండా, బెంగళూర్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియల్ అండ్ ఎకనామికల్ చేంజ్‌ను ఏర్పాటు చేశారు.
-సంస్కృతీకరణం, పాశ్చాత్యీకరణం, లౌకికీకరణంల ద్వారా మానవ సమాజాన్ని అర్థం చేసుకోవటంలో రెండు ప్రధాన దృక్పథాలను పేర్కొన్నారు. అవి.. 1. పఠనా దృక్పథం 2. క్షేత్ర దృక్పథం
-భారతీయ సమాజం, సంస్కృతి అనే అంశాలపై పలు రచనలు చేయడంతో పాటు మతం, ప్రాంతం, కులం, గ్రామీణ సముదాయం, సామాజిక పరివర్తన మొదలైన అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు.
-భారతదేశంలో సమాజశాస్త్రం, సామాజిక మానవశాస్త్రం, ప్రజా జీవనానికి ఇతను చేసిన సేవలు ప్రఖ్యాతినొందాయి.
-ఇతను ప్రధానంగా బ్రాహ్మణీకరణం, సంస్కృతీకరణం, పాశ్చాత్యీకరణం, లౌకికీకరణం, మతం, సమాజం, కుల వ్యవస్థ, ప్రాబల్య కులం, గ్రామాలపై తదితర అంశాలపై అధ్యయనం చేశారు.
-తన అధ్యయనాలకు గ్రామాలనే ఎంచుకొని అక్కడ సామాజిక, ఆర్థిక అంశాల్లోని పరివర్తనలను చర్చించారు.
-రచనలు : ఇండియాస్ విలేజస్, ది రిమెంబర్డ్ విలేజ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ మైసూర్, ఇండియా సోషియల్ స్ట్రక్చర్, రిలీజియన్ అండ్ ది సొసైటీ అమాంగ్ ది కూర్గ్ ఆఫ్ సౌత్ ఇండియా, ది డామినెంట్ కాస్ట్ అండ్ అదర్ ఎస్సేస్, ది ఇన్సైడర్ అండ్ అవుట్ సైడర్ ఇన్ ది స్టడీ ఆఫ్ కల్చర్, ది కొసెసివ్ రోల్ ఆఫ్ శాన్సిక్రిటైజేషన్.
ఏఆర్ దేశాయ్
-1915, 16 ఏప్రిల్‌న గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించారు.
-బొంబాయి విశ్వవిద్యాలయంలో జీఎస్ ఘర్యే వద్ద విద్యార్థిగా చేరి పీహెచ్‌డీని కూడా అతని వద్దే పూర్తి చేశారు.
-అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, సమాజశాస్త్ర అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఇతనికే దక్కింది.
-కారల్‌మార్క్స్, ఏంగిల్స్ రచనలు బాగా చదివారు.
-తన సామాజిక అధ్యయనాల్లో మార్క్స్ పద్ధతిని అనుసరించారు.
-ఇతను ఆధునిక మార్క్స్‌వాదాన్ని అనుసరించినవారిలో వైతాళికునిగా ప్రసిద్ధిపొందారు.
-ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడే కాక జీవితకాల సభ్యుడిగా కూడా కొనసాగారు.
-గ్రామ, నగర సమాజశాస్త్రవేత్తగా, రాజకీయ సమాజశాస్త్రవేత్తగాను పేరుపొందారు.
-1980లో ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ వార్షికసభలో రిలవెన్స్ ఆఫ్ మార్క్సిస్ట్ అప్రోచ్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంశంపై ఉపన్యసించి తన తాత్విక సిద్ధాంతాన్ని వెల్లడించారు.
-రచనలు : రూరల్ ఇండియా ఇన్ ట్రాన్సిజేషన్, ది సోషియల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం, ఎమినెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం, స్టేట్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా, ప్రజంట్ స్ట్రగుల్స్ ఇన్ ఇండియా, ది ఇంప్తిక్లేగేషన్ ఆఫ్ ది మోడ్రనైజేషన్స్ ఆఫ్ ఇండియన్స్ సొసైటీ ఇది వరల్డ్ కాంపెస్టీ, స్లమ్స్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా, ది ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రూరల్ ఇండియా, హిస్టారికల్ అండ్ డయలిక్టికల్ పర్స్పెక్టివ్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ నేషనలిజం.
మాదిరి ప్రశ్నలు
1. భారతీయ సమాజ శాస్త్ర పితామహుడిగా పేరొందినవారు?(2)
1) ఎంఎన్ శ్రీనివాస్ 2) జీఎస్ ఘర్యే
3) కేపీ దేశాయ్ 4) ఎంఏ శర్మ
2.సోషియస్ అంటే ? (2)
1) రైటర్ 2) కామ్రేడ్ 3) డైరెక్టర్ 4) యాక్టర్
3. కింది రచయితలు గ్రంథాలను జతపర్చండి. (4)
1) ది సోషియల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం ఎ) డీపీ ముఖర్జీ
2) ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ యూత్
బి) ఏఆర్ దేశాయ్
3) ది ఇన్సైడర్ అండ్ అవుట్ సైడర్ ఇన్ ది స్టడీ ఆఫ్ కల్చర్ సి) జీఎస్ ఘర్యే
4) క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా
డి) ఎంఎన్ శ్రీనివాస్
1) 1- ఎ, 2-బి, 3- సి, 4- డి
2) 1- డి, 2-ఎ, 3- బి, 4- సి
3) 1- సి, 2-డి, 3- ఎ, 4- బి
4) 1- బి, 2-ఎ, 3- డి, 4- సి
4. కులం సనాతన సమాజానికి చెందినదని, ఇది దానంతట అదే అదృశ్యమవుతుంది అనే భావనను వ్యక్తం చేసింది? (3)
1) ఏఆర్ దేశాయ్ 2) డీపీ ముఖర్జీ
3) జీఎస్ ఘర్యే 4) ఐరావతి కార్వే
5. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గురువు రాడ్క్లిఫ్బ్రౌన్ వద్ద శిష్యరికం చేసి నిర్మితివాదానికి ఎంతో ప్రభావితమైన సామాజిక శాస్త్రవేత్త ? (4)
1) ఎంసీ కులకర్ణి 2) ఐరావతి కార్వే
3) ఎంఏ శర్మ 4) ఎంఎన్ శ్రీనివాస్
6. పరిశోధక జర్నల్సోషియాలజికల్ బులెటిన్‌ను ప్రచురించినది? (1)
1) జీఎస్ ఘర్యే 2) ఏఆర్ దేశాయ్
3) ఎంసీ కులకర్ణి 4) ఎంఎన్ శ్రీనివాస్
7. కారల్‌మార్క్స్, ఏంగిల్స్ రచనలకు ప్రభావితమైన సామాజిక శాస్త్రవేత్త? (2)
1) ఎంసీ కులకర్ణి 2) ఏఆర్ దేశాయ్
3) జీఎస్ ఘర్యే 4) ఎంఎన్ శ్రీనివాస్
8. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియల్ అండ్ ఎకనామికల్ చేంజ్‌ను ఏర్పాటు చేసినది? (4)
1) డీపీ ముఖర్జీ 2) ఐరావతి కార్వే
3) ఏఆర్ దేశాయ్ 4) ఎంఎన్ శ్రీనివాస్
9. సైనో టిబెటన్ భాషా సమూహం ఎక్కడ ఉంది? (3)
1) వాయువ్య భారత్ 2) దక్షిణ భారత్
3) ఈశాన్య భారత్ 4) పశ్చిమ భారత్
10. భారతీయ సమాజశాస్త్రవేత్త విధి ఏమిటంటే భారతీయ సంప్రదాయాలను అధ్యయనం చేయడం. ఆర్థిక అంశాల కారణంగా భారతీయ సంప్రదాయాల్లో వచ్చిన పరివర్తనను కూడా తెలుసుకోవడం అని పేర్కొన్నది? (1)
1) డీపీ ముఖర్జీ 2) జీఎస్ ఘర్యే
3) ఎంఎన్ శ్రీనివాస్ 4) ఐరావతి కార్వే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు