ఘియాజుద్దీన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ?
జియాఉద్దీన్ బరౌనీ:
1285లో జన్మించాడు. ప్రముఖ గ్రంథం ‘తారీఖీ-ఇ-ఫిరోజ్-షాహీ’. ఈ గ్రంథాన్ని ఫిరోజ్‌షా తుగ్లక్ కాలంలో (1352లో) రాశాడు. దోఆబ్ ప్రాంతంలోని బరౌనీ ఇతని జన్మస్థలం. మహ్మద్‌బిన్ తుగ్లక్‌ను ‘సృష్టి వైపరీత్యం’ అన్నది ఇతడే.
సుల్తానా రజియా (1236-1240):
ఇల్టుట్మిష్ కుమార్తె రుక్నుద్దీన్ ఫిరోజ్‌షా అనంతరం ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ. ధైర్యసాహసాలుగల మహిళ. పురుషవేషం ధరించి యుద్ధాల్లో పాల్గొన్న రజియా 1240లో హత్యకు గురయ్యారు.
తైమూరు:
ఇతను 1334లో సమర్ఖండ్కు 50 మైళ్ల దూరంలో దక్షిణానగల ‘దేశ’లో జన్మించాడు. తైమూర్ ఇ-లంగ్ (అమిర్ తైమూర్) తండ్రి అమిర్ తుర్గాయ్. 1369లో ఇతడు సమర్ఖండ్ రాజయ్యాడు. 1398 డిసెంబర్లో ఢిల్లీ నగరాన్ని ముట్టడించాడు. 1398 డిసెంబర్ 18న తైమూర్ సైనికులు నెల రోజులు లూటీ చేశారు.
మాలిక్ కాఫర్
-జన్మతఃహిందువైన మాలిక్ గుజరాత్ దాడిలో అల్లావుద్దీన్ ఖిల్జీచేత 1000 దీనారాలకు 1297లో తన సైన్యాధికారి నస్రత్ ఖాన్ చేత కొనిపించాడు. అందుకే మాలిక్ కాఫర్‌ను ‘వేయిదీనారాలు’ అనే పేరుతో కూడా పిలిచేవారు. బుద్ధికుశలతగల నపుంసకుడు, అందగాడు. ఇతనికి ‘మాలిక్ తాజ్-ఉల్-మాలిక్ కాఫర్’ అనే బిరుదు కూడా ఉంది. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఇతనికి దక్షిణ భారత్‌పై దాడులు చేసే బాధ్యత అప్పగించాడు. చివరికి అల్లావుద్దీన్ ఇతని చేతిలో విషవూపయోగంతో మరణించాడు. ఇతను చివరి రోజుల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.
రాణి పద్మిని
-మేవాడ్ రాజధాని చిత్తోడ్ రాజు రాజా రతన్ సింగ్. ఇతని భార్య రాణి పద్మిని అపూరూపమైన అందగత్తె. అల్లావుద్దీన్ ఖల్జీ చిత్తోడ్‌పై దాడికి ముందు రతన్సింగ్తో రాయబారం నడిపాడు. ‘నీ భార్య పద్మినిని ఒక అద్దంలో చూపించినా చాలు నీ రాజ్యంపై దాడి చేయను’ అని వర్తమానం పంపాడు. రతన్‌సింగ్ అలాగే చేశాడు. ఐతే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమె అందానికి విస్మయం చెంది 1303లో చిత్తోడ్‌పై దాడి చేశాడు. 6 నెలల యుద్ధం అనంతరం రతన్‌సింగ్‌ను ఖైదీగా బంధించాడు. ‘తారీఖీ’ ఫెరిస్టా, పద్మావత్ గ్రంథాల ఆధారంగా ‘పద్మిని’ జౌహర్ (చితి పేర్చుకుని మరణించడం) చేసినట్లుగా తెలుస్తున్నది.
ఇబన్ బటూటా
-1304లో టాంజియర్‌లో జన్మించాడు. ‘మూర్’ జాతికి చెందినవాడు. మూర్ అంటే స్పెయిన్ దేశంలో శాశ్వతంగా ఉన్న అరబ్బులను క్రిస్టియన్లు మూర్లని పిలిచేవారు. ఇతడు ప్రపంచయావూతకు 1325లో బయలుదేరాడు. మక్కా, మదీనాలను రెండుసార్లు దర్శించి 1333లో ఢిల్లీ చేరాడు. మహ్మద్ బిన్ తుగ్లక్ ఇతన్ని ఢిల్లీ న్యాయాధికారిని చేశాడు. 8 ఏండ్లు ఇతడు న్యాయాధికారిగా పనిచేశాడు. తన 73వ ఏట 1377లో మరణించాడు. ఇతని వంశనామంతో (ఇబ్నబటూట్) చెలామణి అయిన ఇతని అసలు పేరు అబూ అబ్దుల్లా మహ్మద్.
చెంఘిజ్‌ఖాన్
-ఇతని అసలు పేరు తెముజిన్. 1154లో మంగోలియాలో జన్మించాడు. ప్రపంచ విజేతగా ప్రసిద్ధగాంచిన ఇతడు ప్రపంచంలో అత్యధిక భాగాన్ని జయించాడు. ఇతని రాజ్య విస్తీర్ణం 8వేల కి.మీ. పొడవు, 4800 కి.మీ. వెడల్పు ఉంది. క్వారజోం రాజ్యవారసుడైన జలాలుద్దీన్ మంగబార్నీని తరుముతూ ఇండియాపై దాడి చేశాడు. 1221లో మంగబార్నీ భొఖార రాజకుమ్తాను వివాహమాడి మామ రాజ్యానికి వారసుడిగా పంజాబ్‌ను పాలించాడు.
పన్నులు
1) భూమిశిస్తు : ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ భాగం భూమిశిస్తు ద్వారానే వచ్చేది. హిందువుల నుంచి వసూలుచేసే భూమి పన్నును ‘ఖరాజ్’ అనేవారు. పంటలో 1/2 నుంచి 1/5 వంతు వరకు ఉండేది. ముస్లింల నుంచి వసూలుచేసే పన్నును ‘ఉష్’్ర అనేవారు. ఇది 1/10వ వంతు ఉండేది.
2) జకాత్ : ఇది ముస్లింలు మాత్రమే చెల్లించే పన్ను. ఆదాయంలో 1/4వ వంతు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ ‘జకాత్’ను మసీదుల నిర్మాణం కోసం ఉలేమాల జీతం కోసం ఉపయోగించేవారు.
3) జిజియా : హిందువులు మాత్రమే చెల్లించేది. హిందువులను మూడు భాగాలుగా విభజించి వసూలు చేసేవారు. 10, 20, 40 టంకాలు ఆదాయాన్ని బట్టి చెల్లించేవారు.
4) ఖామ్స్ : యుద్ధాలు చేసినప్పుడు విజయం సాధించినందుకు దోపిడీ చేస్తే వచ్చిన సొమ్ములో 4/5వ వంతు, 1/5వ వంతు రాజ కోశాధిగారంలో జమచేసేది.
5) నీటి పన్నులు : కాలువ నీటిని వాడుకున్నందుకుగాను రైతుల నుంచి పండిన పంటలో 1/10వ వంతు పన్నుగా వసూలుచేసేవారు. ఉదా: ఫిరోజ్‌షా తుగ్లక్ కాలం.
6) ఇతర పన్నులు : దిగుమతులపై 21/2 నుంచి 10 శాతం వరకు పన్ను ఉండేది. నూనె, నెయ్యి వంటివాటిపై అమ్మకం పన్ను, ఇండ్లు, బానిసలు, బండ్లు, ఒంటెలు అమ్మేటప్పుడు పన్ను వసూలుచేసేవారు. వీటిని అబ్ వార్తాహరుల నియామక సమయంలో అనుమతి కోసం ఇచ్చే బహుమతులు కూడా.
-భూమి భాగాల పేర్లు : ప్రభుత్వ భూములను ‘ఖల్సా’ అనేవారు. ఆ ఖల్సా గ్రామాన్ని ‘రాయితీ’ గ్రామమని, సైనికులకు ఇచ్చిన భూములను ‘ఇక్తా’ అని, దానంగా ఇచ్చిన భూములను ‘ఇనాం’ అని, ఒక ప్రత్యేక లక్షం కోసం ఇచ్చినదాన్ని ‘వక్ఫ్’ అని పిలిచేవారు. పింఛన్‌గా ఇచ్చిన భూమిని ‘ఇవూదరత్’ అని, మతపరంగా పురుషులకు ఇచ్చేదాన్ని ‘మిల్’ అని పిలిచేవారు.
ఢిల్లీ సుల్తానుల ఆర్థిక విధానం
-అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆ నాటి ఆర్థిక పరిస్థితిని ఒక క్రమపద్ధతిలో ఉంచాడు. భూమిని కొలిపించి విస్తీర్ణం తెలుసుకొన్నాడు. అధిక భూభాగాన్ని ప్రభుత్వాధీనంలోకి తెచ్చారు. ‘మహస్సిల్’ అనే కప్పం వసూలుచేసే అధికారులు, ‘అమీల్’ అనే ఆదాయ వసూలు అధికారులు ఉండేవారు. గ్రామాల్లో ‘పట్వారీ’ వద్ద ‘బిహ’ అనే రిజిస్టర్ ఉండేది. పండిన పంటలో భూమి పన్ను 50 శాతం ఉండేది. సంప్రదాయికమైన భూమి పన్ను 1/5వ వంతు ఉండేది. అల్లాఉద్దీన్ ఖిల్జీ హిందూ భూస్వాములైన ఖాత్, ముఖద్దమ్, చౌదరిల ప్రత్యేక హక్కులను తీసివేశాడు.
-ఘియాజుద్దీన్ తుగ్లక్ ఆదాయ శాఖలో మార్పులు : 1320-1325లో పరిపాలించిన ఘియాజుద్దీన్ తుగ్లక్ వ్యవసాయంలో పంట విభజనను ప్రవేశపెట్టాడు. ఇతడు భూమి పన్ను 1/5వ వంతు వసూలుచేశాడు. ‘దివాన్-ఇ-కోహి’ అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు.
ఆర్థిక పరిస్థితులు
-భారతదేశం రత్నగర్భ. సిరిసంపదలకు నిలయం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఒక నిర్దిష్టమైన ఆర్థిక విధానం లేదు. సంప్రదాయికంగా వ్యవసాయమే ముఖ్యవృత్తి వరి, గోధుమ, జొన్న, చెరకు, పత్తి పంటలు పండించేవారు. వీరికాలంలో పండ్లతోటలు ఎక్కువగా పండించేవారు. పేదవారు జొన్న, ధనికులు వరి అన్నం తినేవారని తెలుస్తున్నది. మార్కోపోలో రాసిన ‘ది ట్రావెల్స్’ ప్రకారం ప్రభువులకు అవసరమైన వస్తువులను ఉత్పత్తిచేసే కార్ఖానాలు ఉండేవి. వ్యవసాయంలో, పరిక్షిశమల్లో కష్టపడి పనిచేసేవారు హిందువులే. ముస్లింలు ఎక్కువగా పట్టణాల్లో నివసిస్తూ, ఉద్యోగులుగా ఉండేవారు. విదేశీ వాణిజ్యం మాత్రం తురుష్కులు, అరబ్బుల చేతుల్లో ఉండేవి. అద్దకం వస్త్రాలు, బెంగాల్, గుజరాత్ రేవులగుండా విదేశాలకు ఎగుమతి అవుతుండేవి. నల్లమందు, నీలిమందు, బంగారు నగలు, పగడాలు, ఏనుగు దంతాలు, పట్టు, నూలు వస్త్రాలు, కర్పూరం, గంధపు చెక్క, జనుము, కొబ్బరి మొదలైనవి అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, చైనా, టిబెట్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధ అశ్వాలు, విలాసవస్తువులు దిగుమతి అయ్యేవి. కాంబే, దేబాల్, బ్రోచ్, మంగళూరు, తానా, చౌల్, క్విలన్, కాలికట్, కన్యాకుమారి మొదలైన ఓడరేవులుండేవి.
-సామాన్యులు : వీరి కాలంలో సామాన్యుల జీవన విధానం ఎలా ఉండేదో చెప్పసాధ్యం కాదు. అమీర్ ఖుస్రూ మాటల్లో ‘రాజు కిరీటంలోని ప్రతి రత్నమూ పేదరైతుల కంటి నుంచి రాలిన రక్త బిందువు. ఇల్నికిటిన్ రాసిన ప్రకారం నిత్యావసర వస్తువులు కూడా పేదలకు అందుబాటులో ఉండేవి కావు. అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలంలో ధరలు అందుబాటులో లేవు. తూకాలు, కొలతల్లో మోసాలు జరిగేవని తెలుస్తుంది.
సుల్తానుల కాలంలోని స్వతంత్ర రాజ్యాలు
1) బెంగాల్ రాజ్యం : ఢిల్లీకి దూరంగా ఉండటం, తురుష్కులకు నౌకాయుద్ధం సరిగా తెలియకపోవటంతో బెంగాల్ స్వతంత్ర రాజ్యంగా మనగలిగింది. తుగ్రిల్ఖాన్ తిరుగుబాటును బాల్బన్ అణిచివేసిన తరువాత అతని కుమారుడు బుగ్రాఖాన్ స్వతంత్ర బెంగాల్ రాజ్యాన్ని స్థాపించాడు. రాజధాని లక్నౌతి. ఇతని బిరుదు సుల్తాన్ నాజీరుద్దీన్.
2) జాన్పూర్ : ఇది కాశీకి 55 కి.మీ. దూరంలో గుమ్తీ నదీతీరంలో ఉంది. దీన్ని ఫిరోజ్‌షా నిర్మించాడు. దీని రాజధాని జాన్పూర్ పేరుతో జాన్పూర్ రాజ్యంగా పిలిచారు. జమదగ్ని మహర్షి పేరుతో జమనాపూర్ అని పేరు వచ్చిందని స్థానికుల కథనం. ఫిరోజ్‌షా తుగ్లక్ కుమారుడు సుల్తాన్ మహ్మద్ ఈ రాజ్య స్థాపకుడు.
3) మేవాడ్ : ఈ రాజ్యాన్ని హమ్మీరుడు 1314లో స్థాపించాడు. ఇతని తండ్రి అరిసింహుడు. తల్లి సోంగీర చౌహాన్ రాజ వంశంలో జన్మించింది. అంతకుముందు అల్లాఉద్దీన్ ఖిల్జీ 1303లో మేవాడ్ రాజధాని చిత్తోడ్ని ఆక్రమించాడు. 1492లో జన్మించిన రాణా సంగ్రామసింహుడు మేవాడ్ రాజు.
4) ఖాందేశ్ రాజ్యం : మాలిక్ రాజా ఖాన్దేశ రాజ్యాన్ని నెలకొల్పాడు. ఖాలిప్ ఉమర్ ఫరూక్ వంశస్థుడవటంతో ఖాన్దేశ్ రాజ్యాన్ని ఫరూక్ వంశ రాజ్యమని కూడా పిలిచేవారు.
5) కామరూప రాజ్యం : (అస్సాం) కూచ్ బీహార్ పట్టణానికి దగ్గరలో నైరుతి దిక్కులో ఉన్న కామతాపురం రాజధాని. 1185లో రాజైన వల్లభదేవుని తరువాత కామరూప రాజ్య చరిత్రపై స్పష్టతలేదు. ముస్లిం కైఫియతులు కామతారాజ్యాన్ని కామరూప రాజ్యంగా రాసినవి.
6) కాశ్మీర రాజ్యం : 1301లో నూహదేవుడు కాశ్మీర రాజ్యాన్ని సుస్థిరపరిచాడు.
7) మాళ్వా : ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో 1350 నాటికి దిలావర్ ఖాన్ ఘోరి మాళ్వా రాజ్య పాలకుడయ్యాడు.
8) మార్వార్ : రాథోడ్ వంశం పాలించింది. ఈ రాజ్య స్థాపకుడు ‘సీహ’ 1273లో వేయించిన శాసనం ఆధారం.
9) గుజరాత్ : ఫిరోజ్‌షా తుగ్లక్ కాలంలో మాలిక్ ముఫర్రా అనే వ్యక్తి 1377లో పరిపాలకుడయ్యాడు. ఇతనికి ఫరాహతుల్ ముల్క్ లేదా రాస్తీఖాన్ అని పేర్లు ఉన్నాయి.
10) ఇతర రాజ్యాలు : నేపాల్, సింధు, ముల్తాన్, మధుర (పాండ్యరాజ్యం), మలబార్ తీర రాజ్యాలు ఉన్నాయి. ఇంకా మిథిల లేదా తిర్వత్ రాజ్యం, కళింగ (గాంగ వంశం) రాజ్యాలు కూడా ఉన్నాయి.
పరిపాలనా విధానం
-ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం మత ప్రాధాన్యత కలది. ఎక్కువమంది ప్రజలు హిందువులు. పరిపాలనా యంత్రాంగంలో పనిచేసేవారందరూ ఎక్కువగా ముస్లింలు. మతం, మత సంస్థలు, మతాధిపతులు, ముస్లిం పండితులు, కవులు, ఇస్లాం న్యాయశాస్త్ర నిపుణులు మొదలైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వనరులన్నీ ఇస్లాం మత రక్షణ కోసం కేటాయించేవారు.
-ఢిల్లీ సామ్రాజ్య పాలనాధికారం అంతా ఖురాన్ ప్రకారం నడిచేది. ఇస్లాం మత సూత్రాలపైన, సిద్ధాంతాలపైన ఆధారపడి ఉండేది.
-భారతదేశంలో ఇస్లాం రాజ్య ఆశయం దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చటం. భారతీయులను ఇస్లాం అనుయాయులుగా ఉండేటట్లు చూడటం, హిందూమతాన్ని, విగ్రహారాధననూ సమూలంగా నిర్మూలించడం, హిందువుల దేవాలయాలను నిర్మూలించి ముస్లిం క్షేత్రాలుగా చేయటం, ప్రజలను ఇస్లాంను స్వీకరించమని బలవంతం చేయటం మొదలైనవి చేసేవారు.
ఖలీఫా :
మహ్మద్ ప్రవక్త వారసుడు లేదా పీఠాధిపతి. ఇస్లాం రాజ్యం ఎక్కడ ఉన్నా అతడే సార్వభౌముడు. చక్రవర్తులు, రాజులు, అతని ఆశీర్వాదంతో పరిపాలించేవారు. ప్రపంచమంతా నెలకొని ఉన్న ఇస్లాం రాజ్యానికి అతడు అధిపతి. అయినా రాజు స్వతంవూతంగా, వేరొక రాజ్యంపై దండయాత్ర చేయటం, పరిపాలనా విషయాల్లో సర్వస్వతంవూతంగా ఉండవచ్చు. అయిననూ ముస్లిం రాజులు తప్పనిసరిగా ఖలీఫా పేరును స్మరించి, అతని సామంతుడని భావించి అతని ఆశీర్వాదం పొందే ఆచారం ఉంది. అంటే ఢిల్లీ సుల్తానులు ఖలీఫాను నామమావూతపు అధిపతిగా పరిగణించేవారు. కొందరు తాము ముద్రించే నాణేలపై ఖలీఫా పేరును, ఖుద్బా చదివేటప్పుడు ఉన్నట్లుగా చూసుకొనేవారు. కానీ అల్లాఉద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ అనే చక్రవర్తులు ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. అల్లాఉద్దీన్ ఖిల్జీ తానే ఖలీఫా అని ప్రకటించుకొన్నాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు