వాకాటకుల రెండో రాజధాని ఏది?
1. వాకాట సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా, తూర్పున ఛత్తీస్గఢ్, ఉత్తరాన మాళ్వా, గుజరాత్, బుందేల్ఖండ్, బాఘేల్ఖండ్, దక్షిణాన తుంగభద్రా నదీ తీరం వరకు వ్యాపించి ఉంది. అయితే వాకాటకుల్లోని వత్సగుల్మ శాఖ రాజులు తెలంగాణలో ఏ జిల్లాల్లో పరిపాలించారు ?
1) ఆదిలాబాద్ 2) కరీంనగర్
3) నిజామాబాద్ 4) పైవన్నీ
2. క్రీ.శ. 250 నుంచి 550 వరకు దాదాపు మూడు శతాబ్దాల పాటు వాకాటకుల పాలన సాగింది. తొలి వాకాటకుల శాసనాల ప్రకారం పురికా పట్టణం చనక వీరి మొదటి రాజధాని. అయితే వీరి రెండో రాజధాని ఏది ?
1) మాళ్వా 2) ప్రవరపురం (పౌనార్)
3) బాఘేల్ఖండ్ 4) రెండో రాజధాని లేదు
3. వాకాటకుల శాసనాల్లో ఎక్కువగా దాన శాసనాలే ఉన్నాయి. ఇవి సన్యాసులకు దేవాలయాలు, బ్రాహ్మణులకు, అధికారులకు దానం చేసిన భూముల వివరాలను తెలుపుతున్నాయి. అయితే ఈ శాసనాలు ఏ భాషలో ఉన్నాయి?
1) సంస్కృత భాష 2) ప్రాకృతం
3) పై రెండూ 4) ఏదీకాదు
4. రెండో ప్రవర సేనుడు ఇండోర్, యవత్మల్, మసోద్, మంథాల్ శాసనాలు వేయించాడు. 19 మంది బ్రాహ్మణులకు భూదానం చేస్తూ మసోద్ శాసనం వేయించాడు. అయితే యవత్మల్ శాసనాలు ఎందుకు వేయించాడు?
1) మతం గురించి ప్రస్తావన
2) సైనిక శక్తి గురించిన ప్రస్తావన
3) ఇదివరకే దానం చేయబడ్డ భూమిని వారికి తిరిగి దాఖలు పరుస్తూ వేయించినవి
4) ఏదీకాదు
5. మొదటి ప్రవరసేనుడి మరణానంతరం వాకాటకుల్లో నాలుగు శాఖలు ఏర్పడ్డాయి. గౌతమీపుత్రుడు నందివర్ధన-ప్రవరపుర శాఖను, సర్వసేనుడు వత్సగుల్మ శాఖను స్థాపించాడు. మిగతా రెండు శాఖల గురించి సమాచారం లేదు. వాకాటక రాజు రెండో వింధ్యాశక్తి తన 37వ రాజ్య సంవత్సరంలో వేయించిన ఏ శాసనంలో వత్సగుల్మ శాఖ ప్రస్తావన ఉంది ?
1) మసోద్ 2) యవత్మల్
3) ఇండోర్ 4) బాసిం శాసనాలు
6. వాకాటకుల కాలం నాటి భౌతిక అవశేషాలు ఎక్కడ బయటపడ్డాయి ?
1) పౌనార్, మన్సార్ 2) నందపూర్
3) రాంటెక్ 4) పైవన్నీ
7. దండి దశకుమార చరిత్రలోని విస్రుతచరితలో వాకాటక రాజ్య పతనం ఏ విధంగా జరిగిందో వివరంగా పేర్కొన్నారు. వాకాటక రాజ్యం పతనమైన ఒక శతాబ్దం తర్వాత దశకుమార చరిత్ర రాయబడినప్పటికీ వాకాటక రాజు హరిసేనుని తర్వాత సామంత రాజులు చేసిన కుట్రలు, వాకాటకుల బలహీనతలను గురించి పేర్కొంది. అయితే వాకాటక రాజు రెండో ప్రవరసేనుడు రాసిన కావ్యం కూడా ఆనాటి విషయాలను తెలియజేస్తుంది. ఆ కావ్యం పేరు ?
1) సేతుబంధం 2) హరివిజయం
3) మేఘసందేశం 4) ఏదీకాదు
8. వింధ్యాశక్తి వాకాటక వంశ స్థాపకుడు అని పురాణాలు పేర్కొంటున్నాయి. అజంతా శాసనాల్లో కూడా ఇతడు పేర్కొనబడ్డాడు. పురాణాలు ఇతన్ని విదిశ (భిల్సా, భోపాల్ సమీప ప్రాంతం) పురిక (విదర్భ ప్రాంతం) పాలకుడిగా పేర్కొంటున్నాయి. అజంతా శాసనాల్లోని ఏ గుహ శాసనం వింధ్యాశక్తిని వాకాటక వంశధ్వజుడని, ద్విజుడని పేర్కొంది ?
1) 16వ గుహ శాసనం 2) 15వ గుహ శాసనం
3) 14వ గుహ శానం 4) 13వ గుహ శాసనం
9. వింధ్యాశక్తి కుమారుడు ప్రవరసేనుడు నిజమైన వాకాటక సామ్రాజ్య నిర్మాత. ఇతడు 60 సంవత్సరాలు పరిపాలన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇతని సామ్రాజ్యంలో ఉత్తర మహారాష్ట్ర, బీరార్, మధ్యప్రదేశ్, దక్షిణ కోసల, తెలంగాణ ప్రాంతాలు అంతర్భాగమయ్యాయి. అయితే ఇతడు ఏ మతాన్ని ఆచరించాడు ? (2)
1) వైష్ణవ మతం 2) వైదిక మతం
3) బౌద్ధ మతం 4) ఏదీకాదు
10. బాసి తామ్ర శాసనాలు, అజంతా శాసనాలు వత్సగుల్మ శాఖ గురించి తెలియజేస్తున్నాయి. ఈ శాఖను సర్వసేనుడు స్థాపించాడు. ఇతడు గొప్ప సాహితీ పోషకుడు స్వయంగా కవి. ధర్మమహారాజు బిరుదును ధరించాడు. ఇతడు రచించిన ప్రాకృత కావ్యం ఏది?
1) సేతుబంధం 2) మేఘసందేశం
3) హరివిజయం 4) ఏదీకాదు
11. వాకటక రాజులకు ప్రధాన ఆదాయం భూమి శిస్తు. సాధారణంగా పంటలో 1/4వ వంతు నుంచి 1/6వ వంతును వసూలు చేసేవారు. ఉద్యోగులకు కూడా జీతాలు బదులు భూముల ఇచ్చేవారు. అయితే వారు ఏయే పన్నులను వసూలు చేసేవారు ?
1) ఎగుమతి, దిగుమంతి సుంకాలు 2) ఉప్పు తయారీ
3) మద్యం తయారీ 4) పైవన్నీ
12. వాకాటక రాజు దేవసేనుని హిస్సే-బోరాలా శాసనంలో సుదర్శన సరోవరాన్ని నిర్మించినట్లు చెప్పబడింది. దీన్ని నిర్మించిన అధికారి ?
1) స్వామిల్లదేవుడు 2) వినయదేవుడు
3) నరసింహదేవుడు 4) వరాహదేవుడు
జవాబులు
1-4, 2-2, 3-1, 4-3, 5-4, 6-4, 7-1, 8-1, 9-2,10-3, 11-4,12-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు