దేశంలో మొదటిసారిగా సిద్ధసైన్యాన్ని ఏర్పర్చిన రాజు?
1. షోడశ మహాజనపదాలు మొత్తం 16. వాటిలో 14 మహా జనపదాల్లో రాజరికం, రెండు జనపదాల్లో గణతంత్ర పాలన కొనసాగింది. రాజరిక రాజ్యాలు గంగా, యమున మైదాన ప్రాంతాల్లో కేంద్రీకరింపబడి ఉన్నాయి. అయితే గణతంత్ర రాజ్యాలు ఎక్కడ ఏర్పటయ్యాయి?
1) అటవీ ప్రాంతాల వద్ద 2) నదీలోయ ప్రాంతాల వద్ద 3) ఎడారి ప్రాంతాల వద్ద 4)పర్వతపాదాల వద్ద
2. అంగ రాజ్యం నేటి బీహార్లోని భగల్పూర్, మాంఘీర్ జిల్లాలకు చెందిన ప్రాంతం. చంపానగరం రాజధానిగా గల ఈ రాజ్యం గంగానది తీరంలో ఉంది. అంగ, మగధ రాజ్యాల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగాయి. అయితే క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఈ రాజ్యాన్ని మగధలో కలిపిన రాజు ఎవరు?
1) అశోకుడు 2) అజాతశత్రువు
3) బింబిసారుడు 4) అంగదుడు
3. కాశి రాజధాని వారణాసి. ఇది యూపీలోని వరుణ-అసి నదుల మధ్య ప్రాంతం. ఈ రెండు నదుల పేరుపైనే వారణాసిఅనే పేరు వచ్చింది. ఇది ఒక విద్యాకేంద్రం. కోసల, కాశిల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగాయి. బింబిసారుడు కోసల రాజు ప్రసేనజిత్తు సోదరిని వివాహమాడి కట్నం కింద కాశి రాజ్యాన్ని పొందాడు. అయితే ఆమె పేరేమిటి?
1) కోసలదేవి 2) కుశలదేవి
3) కుందనదేవి 4) రమాదేవి
4. కోసల రాజధానులు శ్రావస్తి, కుశావతి (సాకేత). ఇది అయోధ్య ప్రాంతంలో వెలసింది. ఈ రాజ్యాన్ని సరయూ నది రెండు భాగాలుగా విభజిస్తుంది. ఉత్తర కోసల రాజధాని శ్రావస్తి, దక్షిణ కోసల రాజధాని కుశావతి. దీని రాజు ప్రసేనజిత్తు. ఇతని భార్య మల్లిక. బౌద్ధమతాన్ని స్వీకరించిన మొదటి దంపతులు వీరు. అయితే ప్రసేనజిత్తు నిరంతరం ఎవరితో యుద్ధం చేసేవాడు?
1) అశోకుడు 2) అజాతశత్రువు
3) అంగదుడు 4) బింబిసారుడు
5. మగధ రాజధానులు మొదట గిరివ్రజం, తదుపరి రాజగృహం, చివరగా పాటలీపుత్రం. ఇది షోడశ మహాజనపదాల్లో అంత్యంత శక్తిమంతమైన జనపదం. ఇది నేటి పాట్నా, గయ, షహబాద్ జిల్లాలో కొంత ప్రాంతం విస్తరించింది. అయితే పాటలీపుత్రం ఏ నదుల మధ్య ఉండేది?
1) వరుణ, అసి 2) రావి, బియాస్
3) గంగా, శోణ్ 4) గంగా, రావి
6. ఛేది రాజధాని శుక్తమతి. వత్స రాజధాని కౌశంబి. యమునానదికి దక్షిణాన ఉన్న ప్రాంతం. కురు రాజధానులు హస్తినాపురం, ఇంద్రప్రస్తం. ఇది నేటి ఢిల్లీ, మీరట్ జిల్లాల ప్రాంతం. పాంచాల రాజధానులు అహిచ్ఛత్రం, కాంపిల్య. మత్స్య రాజధాని విరాటనగరం. నేటి రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతం. శూరసేన రాజధాని మధుర. ఇది ఢిల్లీ ఆగ్రాల మధ్య యమునానది ఒడ్డున కలదు. అస్మక దక్షిణ భారతదేశంలో ఏకైక జనపదం. దీని రాజధాని ఏది?
1) ఇందూరు 2) ఎదులాబాద్
3) నీలగిరి 4) పోతన్ (బోధన్)
7. అవంతి జనపద రాజధానులు ఉజ్జయిని, మహిశ్మతి. ఇది నేటి మధ్యప్రదేశ్లోని మాళ్వాప్రాంతం. గాంధార రాజధాని తక్షశిల. కాంభోజ రాజధాని రాజపురం. ఇది నేడు ఏ దేశంలో ఉంది?
1) పాకిస్థాన్ 2) ఆఫ్ఘనిస్థాన్
3) ఉజ్బెకిస్థాన్ 4) కిర్కిజిస్థాన్
8. వజ్జి, మల్ల గణతంత్ర రాజ్యాలు. వజ్జి ఎనిమిది తెగ రాజ్యాల గణ సమాఖ్య. వీటిలో విదేహ, జ్ఞాత్రిక, లిచ్ఛవి, వజ్జి ముఖ్యమైన సమాఖ్యలు. వీరిలో లిచ్ఛవులు బలవంతులు. వీరి రాజధాని వైశాలి. వైశాలి రాజైన చేతక తన కుమార్తె చెల్లనను బింబిసారుడికి ఇచ్చి వివాహం చేయడంతో దీని ప్రాబల్యం అడుగంటింది. మల్ల రాజధానులు కుశినార, పావ. ఇది ఎన్ని తెగల సమాఖ్య? (1)
1) 9 2) 7 3) 5 4) 3
9. ఈ షోడశ మహాజనపదాల్లో గౌతమ బుద్ధుని కాలంనాటికి వత్స, అవంతి, కోసల, మగధ రాజ్యాలున్నాయి. బుద్ధుడు శాక్యవంశీయుడు కావడంతో ప్రాముఖ్యంలోకి వచ్చిన రాజ్యం శాక్యరాజ్యం. దీని రాజధాని కపిలవస్తు. అయితే భారతదేశ చరిత్రలో ప్రథమ సామ్రాజ్యంగా నిలిచి గెలిచిన రాజ్యం ఏది?
1) అవంతి 2) కోసల 3) మగధ 4) వత్స
10. మగధ విస్తరణకు, గొప్ప రాజ్యంగా వెలుగొందడానికి దోహదపడిన రాజవంశాలేవి?
ఎ. హర్యాంక వంశం బి. శిశునాగ వంశం
సి. నంద వంశం డి. మౌర్య వంశం
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) పైవన్నీ
11. వంశాలు, వాటి స్థాపకులను జతపర్చండి.
1. హర్యాంక వంశం ఎ) బింబిసారుడు
2. శిశునాగ వంశం బి) మహాపద్మనందుడు
3. నంద వంశం సి) చంద్రగుప్తుడు
4. మౌర్య వంశం డి) శిశునాగుడు
1) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
12. దేశ చరిత్రలో మొదటిసారిగా సిద్ధసైన్యాన్ని ఏర్పర్చిన రాజు?
1) మహాపద్మనందుడు 2) మౌర్య చంద్రగుప్తుడు
3) బింబిసారుడు 4) శిశునాగుడు
13. రాజ్యాలు, రాజధానులను జతపర్చండి.
1. కురు ఎ. ఉజ్జయిని
2. వత్స బి. మధుర
3. శూరసేన సి. కౌశాంబి
4. అవంతి డి. హస్తినాపురం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
14. మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం?
1) నంద వంశం 2) హర్యాంక వంశం
3) మౌర్య వంశం 4) శిశునాగ వంశం
15. పాటలీపుత్ర నగర నిర్మాత?
1) బింబిసారుడు బి) అజాతశత్రువు
సి) ఉదయనుడు డి) మహాపద్మనందుడు
16. బింబిసారుని ఆస్థాన వైద్యుడు?
1) చరకుడు 2) జీవకుడు
3) శుశ్రుతుడు 4) ధన్వంతరి
17. అజాత శత్రువు తండ్రి బింబిసారుడిని చంపి రాజయ్యాడు. దీంతో హర్యాంక వంశానికి పితృహంతకుల వంశమని పేరువచ్చింది. అజాతశత్రువు ఉపయోగించిన యుద్ధ పరికరాలు మహాశిల కంటక (శత్రువులపై బరువైన రాళ్లు విసిరే యంత్రం), రథ ముసలం (రథ చక్రాలను కట్టిన ఇనుపదూలం). అయితే ఇతని కాలంలో రాజగృహంలో జరిగిన బౌద్ధ సంగీతి ఎన్నోది?
1) నాలుగోది 2) మూడోది
3) రెండోది 4) మొదటిది
18. షోడశ మహాజనపదాల్లోని వజ్జి, మల్ల గణతంత్ర రాజ్యాలని పేర్కొన్న గ్రంథం?
1) బృహత్కథ 2) రుగ్వేదం
3) అష్టాధ్యాయి 4) స్వప్నవాసవదత్త
జవాబులు
1-4, 2-3, 3-1, 4-2, 5-3, 6-4, 7-2, 8-1, 9-3, 10-4, 11-1,12-3, 13-1, 14-2, 15-3, 16-2, 17-4, 18-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు