కిణ్వనప్రక్రియ ద్వారా పొందే జీవ ఇంధనం?

1. భారత్‌లో శక్తి ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంస్థ ఏది?
1) NHPC (నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్)
2) NTPC (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)
3) NEEPCO (నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్)
4) పైవన్నీ
2. పునరుత్పాదకంకాని లేదా తరిగిపోయే ఇంధన వనరులు అని వేటిని అంటారు?
1) సంప్రదాయ ఇంధనవనరులు
2) సంప్రదాయేతర ఇంధన వనరులు
3) పై రెండూ
4) ఏదీకాదు
3. కింది వాటిలో సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది?
1) బొగ్గు 2) బయోమాస్
3) పెట్రోల్ 4) డీజిల్
4. విద్యుత్ శక్తి గిడ్డంగి అని దేనిని అంటారు?
1) జలశక్తి 2) పవనశక్తి
3) బొగ్గు 4) సౌరశక్తి
5. సహజవాయువుకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. ఇది భూమి పొరల నుంచి లభించే వాయువు
బి. హైడ్రోకార్బన్ల సమ్మేళనం
సి. దీనిలో అధికంగా మీథేన్ ఉంటుంది
1) ఎ 2) ఎ, బి 3) బి, సి 4) పైవన్నీ
6. పవన శక్తికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం?
ఎ. దేశంలో పవన శక్తి ఉత్పత్తి 1986లో ప్రారంభమైంది
బి. ప్రపంచంలో అత్యధికంగా పవన శక్తిని ఉత్పత్తి చేస్తున్న దేశం – చైనా
సి. దేశంలో పవన శక్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం – తమిళనాడు
డి. వీచే గాలిని అనుసరించి టర్బైన్స్ తిరగడంవల్ల పవన శక్తి ఉత్పత్తి అవుతుంది
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు
7. కిణ్వనప్రక్రియ ద్వారా పొందే జీవ ఇంధనం?
1) బయో ఇథనాల్ 2) బయో డీజిల్
3) బయోమాస్ 4) బయోగ్యాస్
8. బయోడీజిల్ ఉత్పత్తి చేసే మొక్కలను, సంబంధిత దేశాలను సరిగా జతపర్చండి.
ఎ. ఫ్రాన్స్ 1. సోయాబీన్
బి. మలేషియా 2. పామాయిల్
సి. భారత్ 3. కానుగ
డి. అమెరికా 4. రేప్‌సీడ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
9. బయోగ్యాస్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. బయోగ్యాస్‌కు మరోపేరు – గోబర్‌గ్యాస్
బి. బయోగ్యాస్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది
సి. దీనిలో ప్రధాన వాయువు – మీథేన్
డి. దీన్ని పశువుల పేడ, ఆకుల నుంచి తయారు చేస్తారు
1) ఎ, బి 2) బి 3) బి, సి 4) పైవన్నీ
10. 21వ శతాబ్దపు ఇంధనంగా పిలువబడేది?
1) జలవిద్యుత్ శక్తి 2) వాయుశక్తి
3) సౌరశక్తి 4) హైడ్రోజన్ శక్తి
11. దేశంలో భూగర్భ ఉష్ణశక్తిని వెలికితీస్తున్న ప్రాంతాలు?
ఎ. మణికరన్ (హిమాచల్‌ప్రదేశ్)
బి. సూరజ్‌ఖండ్ (జమ్ముకశ్మీర్)
సి. తపోవన్ (ఉత్తరప్రదేశ్)
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
12. కింది విధానాలను, సంబంధిత విషయాలను జతపర్చండి.
ఎ. బచావత్ ల్యాంప్ యోజన 1. శక్తి వనరుల సమతుల్యత
బి. జాతీయ ఇంధన విధానం 2. జీవ ఇంధనాలను ప్రోత్సహించడం
సి. సమగ్ర ఇంధన విధానం 3. సాధారణ బల్బుల స్థానంలో LED, CFలు వాడటం
1) ఎ-3, బి-2, సి-1 2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-3, బి-1, సి-2 4) ఎ-2, బి-3, సి-1
13. 123 ఒప్పందం/హెన్రీ జే హైడ్ ఒప్పందం దేనికి సంబంధించినది?
1) బ్రిక్స్ దేశాల మధ్య శాంతి చర్చలకు సంబంధించినది
2) భారత్, అమెరికాల మధ్య పౌర అణు సరఫరాకు సంబంధించినది
3) భారత్, రష్యాల మధ్య పెట్రోల్ సరఫరాకు సంబంధించినది
4) భారత్, చైనాల మధ్య శిలాజ ఇంధన మార్పిడికి సంబంధించినది
14. పవర్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం?
1) అమెరికా 2) చైనా
3) భారత్ 4) జపాన్
15. కింది వాటిలో భారత్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఏవి?
ఎ. బ్రిటన్ బి. జపాన్ సి. రష్యా
డి. దక్షిణాఫ్రికా ఇ. కెనడా ఎఫ్. స్విట్జర్లాండ్
జి. దక్షిణ కొరియా హెచ్. కజెకిస్థాన్ ఐ. చైనా జె. ఫ్రాన్స్ కె. ఉత్తర కొరియా
1) ఎ, బి, సి, ఇ, ఐ, జె, కె
2) ఎ, సి, డి, ఇ, ఐ, జె, కె
3) బి, డి, ఇ, ఎఫ్, జి, హెచ్
4) బి, సి, ఇ, ఎఫ్, జి, హెచ్, ఐ
జవాబులు
-1-4, 2-1, 3-2, 4-3, 5-4, 6-4, 7-1, 8-3, -9-2, 10-4, 11-4,12-1, 13-2, 14-3, 15-4
RELATED ARTICLES
-
SGT Maths – DSC Special | ఒక చతురస్ర కర్ణం 18 సెం.మీ అయితే దాని భుజం (సెం.మీ.లలో) ?
-
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
-
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
-
Biology- DSC Special | పోషకాల రవాణా.. ప్రాణవాయువు ప్రసరణ
-
DSC Special | పియాజే, బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేధించిన ప్రధాన అంశం?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !