ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు లాభపడేవారు?
1. కింది వాటిలో మానవాభివృద్ధికి సంబంధంలేని అంశం?
ఎ. శిశు మరణాల రేటు బి. ఆయుర్ధాయం
సి. అక్షరాస్యత డి. జీవనప్రమాణం
1) ఎ, బి 2) ఎ 3) డి 4) సి, డి
2. పేదరిక అంచనాల్లో గిని గుణకానికి సంబంధించిన అంశాలు ఏవి?
ఎ. దీనిద్వారా సాపేక్ష పేదరికం లెక్కిస్తారు
బి. దీని స్కేలు విలువ 0 నుంచి 1
సి. దీన్ని లారెంజ్ అభివృద్ధి పర్చారు
డి. దీనిద్వారా ఆదాయ అసమానతలు తెలుసుకోవచ్చు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి
3. హెచ్డీఐ నివేదిక ప్రకారం 2015 నాటికి నార్వే ఎన్నిసార్లు మొదటి స్థానాన్ని పొందింది?
1) 10 సార్లు 2) 11 సార్లు
3) 12 సార్లు 4) 14 సార్లు
4. హెచ్డీఐ నివేదిక 2014 ప్రకారం భారత్కి సంబంధించిన అంశాలను గుర్తించండి.
ఎ. 2014 ప్రకారం భారత్ 135వ స్థానంలో ఉంది
బి. బ్రిక్స్ దేశాల్లో తక్కువ భారత్ హెచ్డీఐ కలిగి ఉంది
సి. 2014 ప్రకారం భారత్కు 0.586 పాయింట్లు ఉన్నాయి
డి. ఆయుర్ధాయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉంది
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) సి, డి 4) బి, సి, డి
5. గనులు, తవ్వకాలు ఎప్పటి నుంచి ద్వితీయ రంగంలో భాగంగా చూపుతున్నారు?
1) 1955-56 2) 1960-61
3) 1964-65 4) 1970-71
6. జాతీయాదాయ అంచనాల్లో పరిగణించని అంశాలేవి?
ఎ. బదిలీ చెల్లింపులు
బి. చట్టవ్యతిరేక కార్యక్రమాలు
సి. అంతిమ వస్తువులు డి. గ్రాంట్లు, విరాళాలు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) బి, డి
7. 50:50 కేంద్ర, రాష్ట్ర వాటా ఉన్న సంక్షేమ పథకాలేవి?
ఎ. TRYSEM బి. DWACRA
సి. IRDP డి. JRY
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి 3) సి, డి 4) బి, సి
8. కింది పథకాల్లో నిరుద్యోగ నిర్మూలన పథకం కానిది?
1) TRYSEM 2) IRDP
3) IAY 4) JRY
9. భారత్లో రెండుసార్లు ప్రకటించిన పంచవర్ష ప్రణాళిక ఏది?
1) 5వ 2) 6వ 3) 7వ 4) 12వ
10. బ్యాంకుల జాతీయీకరణకు సంబంధించిన అంశాలు ఏవి?
ఎ. 1969లో 14 బ్యాంకులు జాతీయం చేశారు
బి. 1980లో 6 బ్యాంకులు జాతీయం చేశారు
సి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 19 బ్యాంకులు ఉన్నాయి
డి. బ్యాంకుల జాతీయీకరణపై సరయు కమిటీని నియమించారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
11. కింది వాటిలో సరైన అంశాలు గుర్తించండి.
ఎ. భారత్లో లోటు ద్రవ్యం అధికంగా 2వ ప్రణాళిక వాడింది
బి. దేశంలో దేశీయ వనరులు అధికంగా 8వ ప్రణాళిక వాడింది
సి. దేశంలో విదేశీ వనరులు అధికంగా 3వ ప్రణాళిక వాడింది
డి. దేశంలో 9వ ప్రణాళిక నుంచి లోటు ద్రవ్య విధానాన్ని రద్దు చేశారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) సి, డి 4) పైవన్నీ
12. దేశంలో ఏ ప్రణాళిక నుంచి ప్రైవేట్ పెట్టుబడులు పెరిగాయి?
1) ఏడో ప్రణాళిక 2) ఎనిమిదో ప్రణాళిక
3) తొమ్మిదో ప్రణాళిక 4) ఆరో ప్రణాళిక
13. భారత్ కొనసాగించగలిగే అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఏ ప్రణాళికలో ఇచ్చారు?
1) 10వ 2) 11వ 3) 12వ 4) 9వ
14. దేశంలో ద్వంద్వ వడ్డీ విధానం ఎప్పటినుంచి అమలు చేశారు?
1) 1962 2) 1972 3) 1982 4) 1999
15. దేశంలో ఏ కమిటీ సూచన మేరకు పెట్టుబడులను పెంచమని ప్రభుత్వానికి తెలిపారు?
1) దత్ కమిటీ 2) రాఘవన్ కమిటీ
3) సచార్ కమిటీ 4) రాడి కమిటీ
16. 3వ పారిశ్రామిక తీర్మానానికి సంబంధించిన అంశాలు?
ఎ. పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు
బి. పారిశ్రామిక వాడల ఏర్పాటు
సి. జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు
డి. చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) సి, డి
17. ద్రవ్యల్బోణం అంటే ఏమిటి? సరైన అంశాలు ఏవి?
ఎ. ధరలు నిరంతరంగా పెరగడం
బి. ద్రవ్యం విలువ పడిపోవడం
సి. రూపాయి మారక విలువ తగ్గడం
డి. ధరలు పెరుగుతూ తగ్గడం
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) సి, డి 4) ఎ, బి, సి
18. వ్యాపార చక్రాల దశల్లో ఏ దిశలో ధరలు బాగా తగ్గుతాయి?
1) పురోగమన దశ 2) తిరోగమన దశ
3) ఆర్థిక మాంద్య దశ 4) ఆర్థిక సౌభాగ్య దశ
19. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు లాభపడేవారిని గుర్తించండి.
ఎ. రైతులు బి. రుణదాతలు
సి. మధ్యవర్తులు డి. పింఛన్దారులు
1) ఎ, సి 2) బి, సి 3) సి, డి 4) ఎ, బి, సి
20. దేశంలో వివిధ పరిశ్రమల్లో కార్మికుల వేతనాలు పెరగడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం?
1) మిశ్రమ ద్రవ్యోల్బణం 2) ధర ద్రవ్యోల్బణం
3) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
4) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
21. వాణిజ్య బ్యాంకులు తమ సొంత ఆస్తులు ఆర్బీఐ వద్ద తాకట్టుగా పెట్టి తీసుకొనే రుణాలపై చెల్లించే వడ్డిరేటును ఏమంటారు?
1) రీడిస్కాంట్ రేటు 2) రెపో రేటు
3) డిస్కాంట్ రేటు 4) బ్యాంకు రివర్స్ రెపో
22. వాణిజ్య బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని ఎంత నుంచి ఎంతకు పెంచవచ్చు?
1) 1 నుంచి 15 శాతం 2) 3 నుంచి 15 శాతం
3) 10 నుంచి 15 శాతం 4) 8 నుంచి 15 శాతం
23. కింది అంశాల్లో సరిగా లేనిది ఏది?
1) ఎన్హెచ్ఏఐ-1988 2) బీఐఎఫ్ఆర్-1987 3) ఐఆర్డీపీ-1999 4) ఎస్ఎస్ఏ-2004
24. ఉత్పత్తి పద్ధతుల ఎంపిక సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు ఏవి?
ఎ. దీన్ని అమర్త్యసేన్ రూపొందించాడు
బి. మూలధన సాంద్రత పద్ధతివల్ల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పాడు
సి. వెనుకబడిన దేశాలు శ్రమ సాంద్రత పద్ధతులు వాడుతున్నాయని చెప్పాడు
డి. ఈ సిద్ధాంతాన్ని వెనుకబడిన దేశాలకు, వాటి అభివృద్ధికి తెల్పాడు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) సి, డి 4) బి, సి, డి
25. ద్రవ్యోల్బణ విరామం గురించి తెలిపిన ఆర్థికవేత్త?
1) కురిహర 2) హర్ష్మన్
3) రగ్నార్ నర్క్స్ 4) జేఎం కీన్స్
26. జవహర్ రోజ్గార్ యోజన పథకంలో కేంద్ర-రాష్ట్ర అమలుకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
ఎ. ఇది నిరుద్యోగ నిర్మూలన పథకం
బి. ఇది 100 రోజుల పని పథకం
సి. ఈ పథకం ప్రారంభంలో ప్రభుత్వాలు 80:20 నిష్పత్తిలో నిధులు భరించాయి
డి. ఈ పథకంలో మహిళల రిజర్వేషన్ 50 శాతంగా ఉంది
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) సి, డి
27. లోటు ద్రవ్య విధానంపై నియమించిన కమిటీ ఏది?
1) సుఖ్మయ్ చక్రవర్తి కమిటీ
2) రాజా చెల్లయ్య కమిటీ
3) అబిద్ హుస్సేన్ కమిటీ
4) మీరానాథ్ కమిటీ
28. కింది అంశాలు ఏ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి?
ఎ. ద్వంద్వ ధరల విధానం
బి. విదేశీ మారక నియంత్రణ చట్టం
సి. జాతీయ డెయిరీ అభివృద్ధి సంస్థ
డి. ఈశాన్య రాష్ర్టాల మండలి
1) 3వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక
3) 5వ ప్రణాళిక 4) 6వ ప్రణాళిక
29. మాల్థస్ జనాభా సిద్ధాంతం ప్రకారం కింది అంశాల్లో సరైనది?
ఎ. ఈ సిద్ధాంతం జనాభా-ఆహార సరఫరాను తెలియజేస్తుంది
బి. ఆహార సరఫరా అంకగణిత శ్రేణిలో పెరుగుతుంది
సి. జనాభా బీజగణిత శ్రేణిలో పెరుగుతుంది
డి. 25 ఏండ్లకు జనాభా రెట్టింపు అవుతుందని తెలిపాడు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
30. అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త?
1) మాల్థస్ 2) ఎడ్విన్ కానన్
3) అలెగ్జాండ్రోటోస్ 4) ఫ్రాంక్ నాటిస్టెయిన్
31. భారత పారిశ్రామిక అభివృద్ధి అంశాలను గుర్తించండి.
ఎ.1964 IDBI స్థాపన బి. 1964 UTI స్థాపన
సి. 1956 LIC స్థాపన డి. 1973 GIC స్థాపన
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
32. దేశ వ్యవసాయాభివృద్ధికి సంబంధించి సరైన అంశాలేవి?
ఎ. 1963 – ARDC
బి. 1982లో – NABARD
సి. 1972 – DIR
డి. 1998 – KCC
1) ఎ, బి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
33. ప్రదర్శన ప్రభావం గురించి తెలిపిన ఆర్థికవేత్త?
1) రగ్నార్ నర్క్స్ 2) మైఖేల్ పి తొడారో
3) డ్సుసెన్ బరి 4) మేయర్ బాల్దెన్
34. పేదరిక విషవలయాలు వెనుకబడిన దేశాలలో ఆటంకంగా ఉన్నాయని పేర్కొన్నది?
1) రగ్నార్ నర్క్స్ 2) హర్ష్మన్
3) గౌతమ్ మాథుర్ 4) జోన్ రాబిన్సన్
35. వెనుకబడిన దేశాల అభివృద్ధికి ఆర్థికవేత్తలు కింది ఏ సిద్ధాంతాలను రూపొందించారు?
ఎ. శ్రమ విభజన సిద్ధాంతం – ఆడం స్మిత్
బి. పునఃపెట్టుబడి సిద్ధాంతం – గ్సాలెన్సన్ లైబిన్స్టీన్
సి. బిగ్పుష్ – రోజస్టీన్ రోడాన్
డి. నవకల్పనలు – షుంపీటర్
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) బి, సి, డి 4) సి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు