దేశంలో అందుబాటులోకి వచ్చిన మొదటి నానోడ్రగ్?
1. నానోటెక్నాలజీ అనే పదాన్ని రిచర్డ్ ఫెన్‌మన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇతనికి 1959లో భౌతికశాస్త్రంలో నోబెల్ వచ్చింది. ఈయన దేర్ ఈజ్ ఏ ప్లెంటీ ఆఫ్ ఎట్ ది బాటమ్ అనే శాస్త్రీయ పత్రికను ప్రచురించారు. నానోటెక్నాలజీ అంటే 100 నానోమీటర్ల పరిమాణంగల అతిసూక్ష్మ రేణువుల అధ్యయనం. 1 నానోమీటర్ = మిల్లీమీటర్లో 10 లక్షల వంతు (10-9 మీ.). ఇంతకూ ఈ నానో అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి?
1) మరుగుజ్జు 2) చిన్న 3) తేలికైన 4) ఏదీకాదు
2. ఇంజిన్స్ ఆఫ్ క్రియేషన్: ది కమింగ్ ఎరా ఆఫ్ నానోటెక్నాలజీ అనే గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త?
1) నోరియో టానిగుచి 2) రిచర్డ్ ఫెన్‌మన్
3) ఎరిక్ డ్రెక్స్లర్ 4) రిచర్డ్ స్మాలీ
3. నానో పదార్థాల లక్షణాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ. సూక్ష్మ పరిమాణం కలిగి, అతి తేలికగా ఉంటాయి
బి. అతి సమర్థవంతంగా పనిచేస్తాయి
సి. స్థితిస్థాపక శక్తి, అధిక నిల్వ సామర్థ్యం ఉంటాయి
డి. విద్యుత్ వాహకత, రంగును కలిగి ఉంటాయి
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ, సి 4) ఏదీకాదు
4. ఇటీవల హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నల్లగొండలో నీటి నుంచి ఫ్లోరైడ్‌ను వడపోతకు గురిచేయడం కోసం కమ్యూనిటీ బేస్డ్ మెంబ్రేన్ సిస్టం (సమూహ ఆధార స్తరిత వ్యవస్థ)ను తయారుచేశారు. ఇందుకు ఉపయోగపడిన నానో పదార్థం?
1) టైటానియం డై ఆక్సైడ్ 2) సిల్వర్ రేణవులు
3) అల్యూమినియం సిలికేట్ 4) పైవన్నీ
5. నానోటెక్నాలజీ వైద్యరంగంలో కీలకంగా మారింది. నానో పదార్థాలు MRI, అల్ట్రాసోనోగ్రఫీ వంటి ప్రక్రియలకు ఉపయోగపడి వ్యాధి నిర్ధారణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడే నానో పదార్థం?
1) అల్యూమినియం సిలికేట్ 2) బంగారు నానో రేణువులు
3) సిల్వర్ నానో రేణువులు 4) టైటానియం డై ఆక్సైడ్
6. నానో టెక్నాలజీకి సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యం?
ఎ. అసాధారణ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి నానో రోబోట్స్ వాడుతున్నారు
బి. రక్షణ రంగంలో బుల్లెట్ ప్రూఫ్ పరికరాల తయారీకి, సైనికులు మోసే బరువును తగ్గించడంలో ఉపయోగిస్తున్నారు
సి. తేలికైన, అతి సమర్థవంతమైన, అధిక మెమరీని నిల్వచేసే ఉపగ్రహాల తయారీలో వాడుతున్నారు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఏదీకాదు
7. కింది వాటిలో నానోటెక్నాలజీ మిషన్-2007కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ. భారత్‌ను నానోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దడం ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం
బి. దీని కాలపరిమితి ఐదేండ్లు కాగా, 12వ ప్రణాళికా కాలంలో (2012-17) కూడా కొనసాగిస్తున్నారు
సి. ఈ మిషన్‌ను శాస్త్రసాంకేతిక విభాగం అమలుపరుస్తున్నది
డి. దీనికి సుమారుగా రూ. 1000 కోట్లు కేటాయించారు
1) ఎ, బి 2) బి,సి 3) ఎ, సి 4) పైవన్నీ
8. స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ (STM)కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. ఎలక్ట్రాన్ల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
బి. న్యూట్రాన్ల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
సి. అణువుల ఉపరితలాన్ని చిత్రిస్తుంది
డి. పరమాణు ద్రవ్యరాశిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
1) ఎ, బి 2) బి, సి 3) సి 4) డి
9. కార్బన్ నానో ట్యూబ్స్ అనేవి?
1) సహజ నానోపదార్థాలు
2) శైవలాల ద్వారా ఉత్పత్తి చేయబడుతాయి
3) కర్బన పరమాణువులతో నానో పరిమాణంలో ఏర్పడిన స్థూపాకారపు నిర్మాణాలు
4) 1000 నానో మీటర్ల పరిమాణం కలిగి ఉంటాయి.
10. నానోటెక్నాలజీలో ఉపయోగించే పదార్థాలు?
1) సిలికా, అల్యూమినియం ఆక్సైడ్
2) టైటానియం ఆక్సైడ్, అల్యూమినియం సిలికేట్
3) NO2, థోరియం 4) పైవన్నీ
11. సిల్వర్ నానో రేణువులను ఉపయోగించి బ్యాక్టీరియాను చంపే బ్యాండేజ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?
1) రాబర్ట్ బరెల్ 2) హ్యారీ క్రోటో
3) ఎరిక్ డ్రెక్స్లర్ 4) రిచర్డ్ స్మాలీ
12. దేశంలో మొదట అందుబాటులోకి వచ్చిన నానోడ్రగ్?
1) పాల్సిటాక్సెల్ 2) ఇన్సులిన్ (2nm)
3) నానోక్సెల్ 4) హిమోగ్లోబిన్ (4nm)
13. దేశంలో నానో టెక్నాలజీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నానో ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ 2) డెహ్రాడూన్
3) బెంగళూరు 4) ముంబై
14. కింది వాటిలో డయోడ్లుగా పనిచేసే నానో పదార్థాలు?
1) కార్బన్ నానోట్యూబ్స్
2) నానో మెటీరియల్స్
3) Y- జంక్షన్ నానోట్యూబ్స్ 4) పైవన్నీ
15. దేశంలో సహజంగా పనిచేసే నానో నిర్మాణాలు?
1) ఇన్సులిన్ (6nm), హిమోగ్లోబిన్ (8nm)
2) ఇన్సులిన్ (2nm), హిమోగ్లోబిన్ (4nm)
3) ఇన్సులిన్ (8nm), హిమోగ్లోబిన్ (10nm)
4) ఇన్సులిన్ (10nm), హిమోగ్లోబిన్ (12nm)
జవాబులు
1-1, 2-3, 3-4, 4-1, 5-2, 6-4, 7-4, 8-3, 9-3, 10-2, 11-1,12-3, 13-1, 14-3, 15-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు