మానవ సంవర్థ కేంద్రం అని దేన్ని అంటారు?
1. కింది వారిలో ప్రాథమిక బంధువు కానివారు?
1) తల్లి 2) తండ్రి 3) మామ 4) తమ్ముడు/అన్న
2. ఎక్కడైతే తల్లి కంటే ఆడ తోబుట్టువుకు ఎక్కువ గౌరవం ఇస్తారో అలాంటి సంబంధాన్ని ఏమంటారు?
1) కుహనా ప్రసూతి 2) పితృశ్వాధికారం
3) మేనమామ సంబంధం 4) బంధుత్వ సాంకేతికత
3. భాష అనేది దేని ఉత్పాదకత?
1) సంస్కృతి 2) జైవిక వారసత్వం
3) ప్రతిభ సామర్థ్యం 4) నాగరికత
4. కింది వాటిలో ఏది సాంఘీకరణ సాధనం కాదు?
1) కుటుంబం 2) సమ సమూహం
3) పాఠశాల 4) న్యాయవ్యవస్థ
5. కింది వాటిలో సంస్థ ఏది?
1) కుటుంబం 2) రాజ్యం 3) మతం 4) పైవన్నీ
6. కింది వాటిలో ఏది ఆధునిక కుటుంబం లక్షణం కాదు?
1) ఆర్థిక స్వాతంత్య్రం
2) మతపరమైన నియంత్రణ క్షీణత
3) స్త్రీలకు అధిక స్వేచ్ఛ
4) పెరిగిన ధార్మికపరమైన, మతపరమైన భావన
7. కింది వాటిలో ఏది సమష్టి కుటుంబ లక్షణం కాదు?
1) ఉమ్మడి ఆస్తి 2) ఒకే మతం
3) ఒకే రకమైన వృత్తి
4) పరిమాణంలో భిన్నంగా ఉండటం
8. కుటుంబ వర్గీకరణకు మూలాధారం కానిదేది?
1) వారసత్వం 2) నిర్మితి 3) నివాసం 4) మతం
9. ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది అక్కాచెల్లెళ్లను వివాహమాడితే దాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) దేవర న్యాయం 2) అనులోమ వివాహం
3) భార్య భగినీ న్యాయ బహు భార్యత్వం
4) ఏదీ కాదు
10. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే క్రమాన్ని ఉపయోగించి సామాజిక స్తరీకరణాన్ని వర్గీకరించడాన్ని ఏమంటారు?
1) కులవ్యవస్థ 2) సరవర్గ వ్యవస్థ
3) వర్ణ వ్యవస్థ 4) మత వ్యవస్థ
11. ప్రాబల్య కులం అనే పదాన్ని దేని గురించి వివరించడానికి ఉపయోగించారు?
1) గ్రామీణ భారతదేశంలో సామాజిక స్తరీకరణ
2) దేశంలో నగర సమస్యలు
3) గిరిజన జీవనాధారం
4) గ్రామీణ, నగర జీవనాధారం
12. బహుభర్తృత్వం అనేది ఏ రకమైన వివాహం?
1) ఒక స్త్రీ ఒకే సమయంలో చాలామంది భర్తలను కలిగి ఉండటం
2) ఒక స్త్రీ ఒక వ్యక్తినే భర్తగా కలిగి ఉండటం
3) ఒక స్త్రీ ఒక వ్యక్తిని, అతని సోదురున్ని వివాహమాడటం
4) ఒక స్త్రీ ఒక పురుషునితో తాత్కాలికంగా జీవనాన్ని గడపటం
13. ప్రతిలోమ వివాహం అంటే ఎవరి మధ్య జరిగే వివాహం?
1) ఉన్నత కులానికి చెందిన పురుషుడు నిమ్న కులానికి చెందిన స్త్రీతో వివాహం
2) ఉన్నత కులానికి చెందిన పురుషుడు, స్త్రీల వివాహం
3) ఉన్నత కులానికి చెందిన స్త్రీ, నిమ్న కులానికి చెందిన పురుషుడితో వివాహం
4) విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు
14. గోత్రం అంటే?
1) ఏక వంశానుక్రమ బంధు సమూహం
2) ద్విపార్శ వంశానుక్రమ బంధు సమూహం
3) బహు పార్శ వంశానుక్రమ బంధు సమూహం 4) ఏదీ కాదు
15. వేద కాలంలో భారత స్త్రీ అంతస్తు ఏ విధంగా ఉండేది?
1) చాలా తక్కువ స్థాయి
2) కొంతవరకు ఉన్నత స్థాయి
3) పురుషుల కంటే ఉన్నతస్థాయి
4) సరిపోల్చలేని స్థాయి
16. వయోవృద్ధులను, వారి సమస్యలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు?
1) ఫిజియాలజీ 2) జెరంటాలజీ
3) సోషియో బయాలజీ 4) సోషియో జెనెటిక్స్
17. రాజకీయ ఉద్యమాల్లో కుల విధేయతల పట్ల తన మద్దతును సమీకరించిన ఉద్యమం? (1)
1) ఆత్మగౌరవ ఉద్యమం 2) నక్సలైట్ ఉద్యమం
3) కిసాన్ ఉద్యమం 4) బోడో ఉద్యమం
18. కింది వాటిలో జార్ఖండ్ ఉద్యమానికి సంబంధించి సరైనవాటిని గుర్తించండి?
ఎ) భూమి అటవీ అన్యాక్రాంతం
బి) అసమానమైన అభివృద్ధి
సి) నిరక్షరాస్యత డి) పృథక్కరణ
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
19. ఏ ప్రసిద్ధమైన హింసాయుత రైతు ఉద్యమం తరువాత భూదాన ఉద్యమం వచ్చింది?
1) నక్సల్బరి ఉద్యమం 2) తేభాగ ఉద్యమం
3) తెలంగాణ రైతాంగ ఉద్యమం
4) బిజోలియన్ ఉద్యమం
20. శ్రీనారాయణ ధర్మపరిపాలన ఉద్యమాన్ని మొదట ప్రారంభించినవారు?
1) నాడార్లు 2) బ్రాహ్మణులు
3) ఎజ్వాలు 4) నాయర్లు
21. వినోబా భావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడానికి కారణమైన సంఘటన?
1) నల్లగొండ సంఘటన 2) శ్రీకాకుళం సంఘటన 3) నక్సల్బరి సంఘటన 4) మధుబని సంఘటన
22. కింది ఏ అధికరణలు దేశంలోని అల్ప సంఖ్యాకుల ప్రయోజనాల పరిరక్షణకు స్పష్టమైన హామీ ఇస్తున్నాయి?
1) 27, 38 2) 29, 30 3) 31, 32 4) 33, 34
23. అధికరణ 332 ఏ అంశాన్ని స్పష్టం చేస్తుంది?
1) లోక్సభలో ఎస్సీ, ఎస్టీల కోసం సీట్ల రిజర్వేషన్
2) రాష్ర్టాల శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వేషన్
3) సీట్ల రిజర్వేషన్ 30 ఏండ్ల తరువాత రద్దుచేసే ప్రత్యేక ప్రాతినిథ్యం
4) లోక్సభలో ఆంగ్లో-ఇండియన్ సముదాయానికి ప్రాతినిథ్యం
24. కింది వాటిలో దేని ఆధారంగా షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్ కల్పించారు?
1) పేదరికం 2) ఆర్థికావసరాలు
3) జనాభా 4) నిమ్నస్థాయిలు
25. షెడ్యూల్డ్ కులం అనే పదానికి సంబంధించి సరైనది?
1) రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో స్పష్టంగా నిర్వచించారు
2) రాజ్యాంగంలోని ఒక అధికరణలో స్పష్టంగా నిర్వచించారు
3) రాజ్యాంగ ప్రవేశికలో స్పష్టంగా నిర్వచించారు
4) రాజ్యాంగంలో నిర్వచించలేదు
26. విద్యాసంస్థలో సీట్లను రిజర్వ్ చేయడం, విద్యార్థికి ఉపకారవేతనాలు ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ తెగలవారికి విద్యాపరమైన పురోగమనం కల్పించిన అధికరణ?
1) 15 (4) 2) 15 3) 330, 332 4) 18
27. దేశంలోని అల్ప సంఖ్యాకుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) ప్రధానమంత్రి 2) పార్లమెంట్
3) రాష్ట్రపతి 4) కేంద్రమంత్రి మండలి
28. వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేయడానికి సంబంధించింది?
1) భారత రాజ్యాంగ నిబంధన 340
2) సైమన్ కమిషన్ నివేదిక
3) భారత ప్రభుత్వ చట్టం- 1935
4) ఆదేశ సూత్రాలు
29. దేశంలో బీసీ కమిషన్ మొదటి అధ్యక్షుడు?
1) బీపీ మండల్ 2) బీఆర్ అంబేద్కర్
3) కాకా కాలేల్కర్ 4) ఎంకే గాంధీ
30. ఒక కులాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్గా ప్రకటించే అధికారం ఉన్నవారు?
1) రాష్ట్రపతి 2) గవర్నర్
3) షెడ్యూల్డ్ కులాల కమిషన్
4) సామాజిక న్యాయం, సాధికారిత కేంద్రమంత్రి
31. రాజ్యాంగంలోని ఏ అధికరణ షెడ్యూల్డ్ తెగల జనాభా అనుపాతానికి అనుగుణంగా లోక్సభ, విధాన సభల్లో వారి ప్రాతినిథ్యానికి రక్షణ కల్పిస్తాయి?
1) 330, 332 2) 275
3) 365 4) 340, 342
32. వెనుకబడిన తరగతి/వర్గం అనే పదాన్ని రాజ్యాంగంలోని ఏ అధికరణలో పేర్కొన్నారు?
1) 15 (4) 2) 16 (4) 3) 17 (4) 4) 23 (4)
33. గిరిజన సముద్దరణ కోసం 5 ప్రాథమిక సూత్రాల (పంచశీల)ను మొదటిసారిగా ప్రతిపాదించిందెవరు?
1) వెరియర్ ఎల్విన్ 2) ఎన్కే బోస్
3) జవహర్లాల్ నెహ్రూ 4) జైపాల్ సింగ్
34. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం సహాయ గ్రాంట్లను అందించడానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన?
1) 275 2) 334 3) 244 4) 264 (1)
35. ఏ సంస్థలో జన్మించిన పిల్లలకే చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది?
1) పాఠశాల 2) గ్రామం 3) కుటుంబం 4) దేశం
36. స్థితిలో మార్పును సూచించేది?
1) పాశ్చాత్యీకరణ 2) ఆధునీకరణ
3) సంస్కృతీకరణ 4) పారిశ్రామీకరణ
37. గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది?
1) బంధుత్వం 2) వర్గం 3) స్నేహం 4) జాజ్మానీ
38. కుటుంబాలను ఏ ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక, పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు?
1) వంశం 2) అధికారం 3) పరిమాణం 4) కూర్పు
39. కొత్తగా వివాహమైన దంపతులు వివాహానంతరం భార్య కుటుంబంతో నివసించాలనే పద్ధతిని ఏమని పిలుస్తారు?
1) నూతన స్థానిక నివాస పద్ధతి
2) మాతృ స్థానిక నివాస పద్ధతి
3) పితృ స్థానిక పద్ధతి
4) మాతుల స్థానిక నివాస పద్ధతి
40. తృతీయ బంధువు?
1) తండ్రి 2) సోదరుని కుమారుడు
3) అంకుల్ 4) బావమరిది భార్య
41. గౌణ బంధువు ప్రాథమిక బంధువును లేదా ప్రాథమిక బంధువు గౌణ బంధువును ఏ పేరుతో పిలుస్తారు?
1) గౌణ బంధువు 2) తృతీయ బంధువు
3) బంధువులు 4) ప్రాథమిక బంధువు
42. సంస్కృతీకరణ దేనికి సంబంధించింది?
1) సామాజిక పరివర్తన 2) సామాజిక ప్రగతి
3) సామాజిక చలనం 4) సామాజిక అభివృద్ధి
43. కింది వాటిలో ఏది ఉమ్మడి కుటుంబ లక్షణం కాదు?
1) కుటుంబ సభ్యులందరూ ఒకే ఇంటిలో నివసించడం
2) సభ్యులు ఒకరికొకరు బంధువులు కానవసరం లేదు
3) ఆస్తి మొత్తం కుటుంబానికి చెందుట
4) కుటుంబం ఆదాయం ఒకటిగా చేర్చడం
44. కింది వాటిలో దేన్ని మానవ సంవర్థ కేంద్రం అని అంటారు?
1) వివాహం 2) కుటుంబం 3) మతం 4) ప్రభుత్వం
45. పురుషుని దేవర న్యాయ వివాహం?
1) అతని గతించిన భార్య సోదరితో వివాహం
2) పిల్లలు పుట్టని, అతని చనిపోయిన సోదరుని భార్యతో వివాహం
3) ఉన్నత కుల స్త్రీతో వివాహం
46. తన మేనత్త కూతురితో ఒక అబ్బాయి వివాహం?
1) అనులోమ వివాహం 2) అంతర వివాహం
3) పితృక మేనరిక వివాహం 4) ప్రతిలోమ వివాహం
47. ఒకే తల్లిదండ్రుల సంతతి (పిల్లల్ని)ని ఎలా పిలుస్తారు?
1) సంతానం 2) జ్ఞాతులు
3) సోదరులు 4) తోబుట్టువులు (సిబ్లింగ్స్)
48. గిరిజన ఆర్థిక సంబంధాలు దేనిపై ఆధారపడతాయి?
1) ఉత్పత్తి 2) జాజ్మానీ వ్యవస్థ
3) వస్తుమార్పిడి 4) ఉత్పత్తి అమ్మకం
49. మానవ సమాజానికి భాష ప్రధానమైంది ఎందుకంటే?
1) ఆది మానవుడు కనుగొన్న నవ కల్పన
2) ఇది సాంఘిక సంబంధాలను సులువు చేస్తుంది 3) ఆది మానవుడి అభివ్యక్తి అవసరాన్ని సులువుగా నెరవేస్తుంది
4) ఇది ఆటవిక మానవున్ని ఒక మహోన్నత ప్రాణిగా రూపొందించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు