అభివృద్ధికి జీవనాడి – రవాణా
రైల్వే గణాంకాలు
– మొత్తం రైల్వే మండలాలు – 17
– బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ల పొడవు – 1,05,000 కి.మీ.
– మీటర్‌గేజ్ రైల్వే లైన్ల పొడవు – 8,000 కి.మీ.
– న్యారోగేజ్ రైల్వే లైన్ల పొడవు – 2,000 కి.మీ.
– మొత్తం రైల్వే స్టేషన్లు – 7,172
కొంకణ్ రైల్వే వ్యవస్థ
– ఇది చాలా ప్రత్యేకమైనది. దీని నిర్మాణం కోసం ఒక కార్పొరేషన్ (కొంకణ్) ఏర్పరిచారు.
– మహారాష్ట్రలోని రోహ నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు నిర్మించారు.
– ఈ రైలు మార్గం 146 నదులు, 2,000 బ్రిడ్జిలు, సుమారు 73 సొరంగ మార్గాలగుండా మంగళూరుకు చేరుతుంది.
– అయితే ఎక్కువ రైల్వే సాంద్రత కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
దక్షిణ మధ్య రైల్వే మండలం
– తెలంగాణలో ఏకైక రైల్వే మండలం దక్షిణమధ్య రైల్వే.
– అయితే తెలంగాణలో రైల్వే వ్యవస్థ చాలా వెనుకబడి ఉంది.
– కొత్త, గతంలో ప్రతిపాదించిన రైల్వేలైన్లకు కొంత మొత్తాన్ని కేటాయించి పనులు ప్రారంభించారు. అందులో ప్రధానమైనది మనోహరాబాద్ -కొత్తపల్లి రైల్వే లైన్.
– ఈ రైల్వే మండల ముఖ్యకేంద్రం సికింద్రాబాద్‌లో ఉంది. దీన్ని 1966లో ఏర్పర్చారు.
– దీనిలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉన్నాయి.
– ఈ రైల్వే మండలం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు సేవలు పొందుతున్నాయి.
– తెలంగాణలో 229 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఆదిలాబాద్, బాసర, భద్రాచలం, హైదరాబాద్ దక్కన్, సికింద్రాబాద్ జంక్షన్, ఖాజీపేట జంక్షన్, వరంగల్, పెద్దపల్లి, నల్లగొండ, మహబూబ్‌నగర్.
– రాష్ట్రంలో రైల్వే లైన్ కేవలం 1676 కి.మీ. ఉంది.
– అన్ని జిల్లాల్లోకెల్లా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రైల్వే వ్యవస్థ ఎక్కువగా విస్తరించింది. కరీంనగర్ జిల్లాలో అతి తక్కువ రైల్వేలైన్ వ్యవస్థ ఉంది.
వాయు రవాణా
– వాయు మార్గాల ద్వారా దేశానికి-దేశానికి, ప్రాంతానికి-ప్రాంతానికి మధ్య ప్రయాణకాలం తగ్గిపోయి ప్రపంచ పర్యాటకం చాలా సులభంగా తయారైంది.
– దేశంలో వాయురవాణా సామాన్యుడికి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవస్థ కేవలం రాష్ర్టాల రాజధానులు, పెద్ద పట్టణాల్లోనే ఉంది.
– దేశంలో వాయుమార్గాలను 1953లో జాతీయం చేశారు.
– వాయు రవాణా భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కొన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో నిర్వహించబడుతుంది.
– దేశంలో వాయు రవాణా వ్యవస్థను రెండుగా విభజించవచ్చు.
అవి: 1. ఎయిర్ ఇండియా – అంతర్జాతీయ సర్వీసులు
2. ఇండియన్ ఎయిర్‌లైన్స్ – దేశీయ సర్వీసులు
– చిన్నచిన్న పట్టణాల కోసం దేశంలో 1981లో వాయుదూత్ సర్వీసులను ప్రవేశపెట్టారు.
– దేశంలో 12 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి…
1. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – న్యూఢిల్లీ – పాలం విమానాశ్రయం
2. చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం – ముంబై – శాంతాక్రజ్ విమానాశ్రయం
3. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం – కోల్‌కతా – డండం విమానాశ్రయం
4. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం – చెన్నై – మీనంబాకం విమానాశ్రయం
5. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – హైదరాబాద్
6. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం – బెంగళూరు
– రాష్ట్రంలో విమానాశ్రయాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట (పాతది) విమానాశ్రయం హైదరాబాద్‌లో ఉన్నాయి. వరంగల్‌లో కూడా వాయుదూత్ సౌకర్యాల కోసం విమానాశ్రయం నిర్మించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నగరాల్లో విమానాశ్రయాలు నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నది. ఆ నగరాలు.. 1. ఆదిలాబాద్, 2. వరంగల్(మామునూరు) 3. ఖమ్మం (కొత్తగూడెం), 4. నిజామాబాద్.
జలరవాణా
– పూర్వకాలంలో జలరవాణాకు అత్యంత ప్రాముఖ్యం ఉండేది. రోడ్డు, రైలు, వాయురవాణా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో దీని ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది.
– దేశంలో ఇప్పటికీ కొన్ని నదులు, కాలువల్లో జలరవాణా కనబడుతుంది. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర, హుగ్లీ నదులు, వాటి ఉపనదులు.. గోదావరి, కృష్ణా నదుల కాలువలు, బకింగ్‌హాం కాలువలు, మహానది కాలువల్లో జల రవాణా కనబడుతుంది.
– దేశం మొత్తంలో 14,500 కి.మీ. మేర నౌకాయానం చేయవచ్చు.
– గంగానది మార్గంలో ముడి ఇనుము, బొగ్గు, మాంగనీస్, ఆహారధాన్యాలు, జనుము, తేయాకు.. బ్రహ్మపుత్రా నది మార్గంలో జనుము, తేయాకు, కలప, ఆహారధాన్యాలు, వంటనూనెలు రవాణా అవుతున్నాయి.
– 1986లో వాటర్ వే అథారిటీ ఏర్పాటైంది.
– బకింగ్‌హాం కాలువ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది.
– తెలంగాణలో ఎటువంటి జలరవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. కారణం ఇది భూ పరివేష్ఠిత రాష్ట్రం. అంటే రాష్ట్రం చుట్టూ అన్నివైపుల భూభాగం సరిహద్దుగా ఉంది.
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతానికి బంగాళాఖాతం తూర్పు సరిహద్దుగా ఉండేది.
– సరుకు రవాణా వ్యవస్థలో ఓడరేవులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఓడరేవులు 2 రకాలు.
అవి :1. సహజ సిద్ధంగా ఏర్పడినవి
2. కృత్రిమ ఓడరేవులు
– సహజసిద్ధంగా ఏర్పడిన ఓడరేవులు నది ముఖద్వారాల వద్ద అగాథాల్లో ఏర్పడుతాయి.
– కృత్రిమ ఓడరేవుల్లో నౌకలు వచ్చి ఆగడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తారు.
– దేశానికి మొత్తం 7,517 కి.మీ. తీరప్రాంతం ఉండగా, అందులో 6,100 కి.మీ. తీరప్రాంతం రాష్ర్టాల సరిహద్దులతో (ప్రధాన భూభాగానికి) ఉంది.
– ఓడరేవులు 2 రకాలు. అవి: 1. తూర్పుతీర ఓడరేవులు
2. పశ్చిమతీర ఓడరేవులు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు