విప్రో ఎలైట్-2022 వివరాలు..
దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు సొంతంగా దేశవ్యాప్తంగా నిర్వహించే ఆయా పరీక్షల ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుంటున్నాయి. అలాంటి పరీక్షల్లో విప్రో నిర్వహించే ఎలైట్ ఎన్‌టీహెచ్ ప్రధానమైంది. ప్రస్తుతం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..
విప్రో ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది.
ఎవరు అర్హులు?
గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ (ఇంటిగ్రేటెడ్)
ఉత్తీర్ణులైన వారు లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అన్నింటిని ఫుల్‌టైం విధానంలో చదివి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం
మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత బిజినెస్ డిస్కషన్, ఎల్ఓఐ తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తారు.
అసెస్మెంట్ టెస్ట్
ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షను 128 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.
దీనిలో మూడు సెక్షన్లు ఉంటాయి. అవి..
ఆప్టిట్యూడ్ టెస్ట్ – దీనిలో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ (వెర్బల్) ఎబిలిటీ- దీనికి కేటాయించిన సమయం 48 నిమిషాలు.
రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్- దీనిలో ఎస్సే రైటింగ్ ఉంటుంది. దీన్ని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి.
ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్- కోడింగ్‌కు సంబంధించి రెండు ప్రోగ్రామ్స్‌ను 60 నిమిషాల్లో పూర్తిచేయాలి.
ఆన్లైన్ ప్రోగ్రామింగ్ కోసం సీ, సీ++, జావా, పైథాన్ లాంగ్వేజ్‌లను ఉపయోగించుకోవచ్చు.
ఎంపికైతే?
ఈ పరీక్షల్లో ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ఇంజినీర్ హోదాలో ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది విప్రో.
వీరికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. సంస్థలో చేరినవారు ఏడాది తప్పనిసరిగా కంపెనీలోనే పనిచేయాలి. దీనికి సంబంధించిన గ్యారెంటీ పత్రంపై అంగీకారం తెలపాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 22
అసెస్మెంట్ టెస్ట్ తేదీలు: మే 21 నుంచి జూన్ 5 మధ్య నిర్వహిస్తారు.
వెబ్సైట్: https://careers.wipro.com/elite#
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?