పునికి కర్ర ఏ అడవుల్లో దొరుకుతుంది?
హస్తకళలు
- నిర్మల్ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి.
- నిర్మల్ జిల్లా కేంద్రంలో కళాత్మక బొమ్మలు, చిత్రాలు, వస్తువులు తయారవుతాయి. వీటిని నకాష్లు అని పిలుస్తారు.
- ఈ కళాత్మక వస్తువులు మూడు ప్రధాన రూపాల్లో ఉంటాయి. అవి..
1. నిర్మల్ బొమ్మలు, చేతి వస్తువులు
2. నిర్మల్ ఇంటి సామగ్రి
3. నిర్మల్ పెయింటింగ్స్ - వీటన్నింటిని కలిపి నిర్మల్ ఆర్ట్వేర్ అంటారు.
- నిర్మల్‌ను పాలించిన పద్మనాయక వంశానికి చెందిన నిమ్మనాయుడు టేకు, పునికి, చెల్లు కలప నుంచి కొయ్య బొమ్మలు తయారుచేసే కళను ప్రోత్సహించాడు.
- నిమ్మనాయుడు పేరు మీదుగానే నిర్మల్ పట్టణానికి ఆ పేరు వచ్చింది.
- నిర్మల్ బొమ్మల తయారీకి ఉపయోగించే పునికి కర్ర ఖానాపురం నుంచి మంచిర్యాల మధ్య ఉన్న అడవిలో, బెల్లంపల్లి, జిన్నారం, మంచిర్యాల తదితర అటవీ ప్రాంతాల్లో దొరుకుతుంది.
- నిర్మల్ బొమ్మల్లో రాధాకృష్ణులు, గిరిజన మహిళ, బుద్ధుడు, గణేశుడు.. చేతి వస్తువుల్లో గాజులపెట్టె, ఆభరణాల పెట్టె, పెన్సిల్ డబ్బా మొదలైనవి ఉంటాయి.
- హైదరాబాద్‌లోని గోల్కొండ ఎంపోరియం ద్వారా నిర్మల్ బొమ్మలను ఎగుమతి చేస్తున్నారు.
- నిర్మల్ బొమ్మల పెయింటింగ్ కోసం డ్యూకో పెయింట్స్ వాడుతారు.
- నిర్మల్ చిత్రకళలో ఇక్కడి కళాకారులు బ్రహ్మరౌతు పద్మారావు శైలిని కొనసాగిస్తున్నారు.
- నిర్మల్ కళాకారులు గనిజ్ ఫా అనే ప్లేయింగ్ కార్డ్స్ తయారు చేస్తారు. వీటిపై 2010లో పేటెంట్ పొందారు.
- నిర్మల్ బొమ్మలు, చేతి వస్తువులు, నిర్మల్ ఇంటి సామగ్రి, నిర్మల్ పెంయిటింగ్స్కు భౌగోళిక గుర్తింపు లభించిన సంవత్సరం 2008-09.
- నిర్మల్ కళాకారుల నైపుణ్యంలో ఇండియన్ అండ్ మొఘల్స్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ శైలి కనిపిస్తుంది.
పెంబర్తి హస్తకళలు
- కఠినమైన ఇత్తడి లోహపు పలకపై అద్భుతకళాఖండాలు చెక్కే కళ జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో పుట్టింది.
- ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందాయి.
- ఈ హస్తకళా నైపుణ్యంలో ఎక్కువగా ఉండే లోహం ఇత్తడి (బ్రాస్).
- పెంబర్తి గ్రామంలోని కంచర కులానికి చెందిన వ్యక్తులు ఇత్తడి కళాఖండాల తయారీలో నిపుణులు.
పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం హిందూ-ముస్లిం ప్రభావానికి లోనై ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. - పెంబర్తి కళను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన కళాకారుడు అయిలాచారి.
అయిలాచారి నేతృత్వంలో 1956లో విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండస్ట్రియల్ సొసైటీ ఏర్పాటయ్యింది. - తెలుగు సినిమారంగం అందించే అత్యున్నత పురస్కారం అయిన నంది అవార్డుకు ప్రాణం పోసింది అయిలాచారే.
- కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ నిధుల పథకం కింద పెంబర్తి ఇత్తడి కళాకారుల క్లస్టర్‌ను ఏర్పాటు చేసింది. పెంబర్తి లోహకళకు 2010-11లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
సిల్వర్ ఫిలిగ్రీ
- లోహాలను తీగలుగా మార్చి వాటికి అద్భుతమైన రూపమివ్వడమే ఫిలిగ్రీ.
- వెండి తీగలతో రకరకాల బొమ్మలు, జాలీల నగలు తయారుచేసే కళ సిల్వర్ ఫిలిగ్రీ.
- ఫిలిగ్రీ అనే పదం ఫిలిగ్రీన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఫిలమ్ అంటే త్రెడ్, సన్నటి తీగపోగు అని అర్థం. గ్రానమ్ అంటే ధాన్యపు గింజ తరహాలో చిన్నపూస అని అర్థం.
- 200 ఏండ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఎలగందుల ప్రాంతంలో ఈ కళ ఆవిర్భవించింది.
- ఈ కళను ప్రవేశపెట్టినవారు కడార్ల రామయ్య. ఇది పురాతన కాలం నుంచి విశ్వబ్రాహ్మణులు కొనసాగిస్తున్న హస్తకళ.
- సిల్వర్ ఫిలిగ్రీకి దేశంలోనే రెండో పట్టణంగా కరీంనగర్ కొనసాగుతున్నది.
- సిల్వర్ ఫిలిగ్రీ కళ ఇండోనేషియా నుంచి భారత్‌లోకి (ఒడిశాలోకి) ప్రవేశించింది.
- ఈ సిల్వర్ ఫిలిగ్రీ కళకు దేశంలోనే ప్రసిద్ధి చెందిన తొలి నగరం కటక్ (ఒడిశా).
- ఈ కళకు 2007-08 ఏడాదిలో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్
- రమ్యమైన జానపద శైలిలో వస్త్రంపై చిత్రీకరించి, పౌరాణిక గాథను కళ్లకు కట్టినట్లు విశదీకరించే
- చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్‌కు తెలంగాణ ప్రసిద్ధి.
- చేర్యాల స్క్రోల్ పెంయింటింగ్ కళాకారులను నకాషీలు అంటారు.
- దీన్ని థీమ్ పెయింటింగ్ అని కూడా వ్యవహరిస్తారు.
- ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్క్రోల్ పెయింటింగ్స్‌కు సిద్దిపేట జిల్లాలోని చేర్యాల గ్రామం & మండలం ప్రసిద్ధి చెందినది.
- ఈ పెయింటింగ్స్‌లో పురాణాలు, ఇతిహాసాలను డిజైన్లుగా తీసుకుని, మట్టి రంగులతో గోడలకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు.
- ఈ స్క్రోల్ పెయింటింగ్స్‌కు 2010-11లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
బిద్రి వస్తువులు
- హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బీదర్ (ప్రస్తుత కర్ణాటక)లో ఈ కళ అభివృద్ధి చెందడంవల్ల ఈ కళకు బిద్రి అనే పేరు వచ్చింది.
- ఈ కళ ఇరాన్ నుంచి హైదరాబాద్ రాష్ర్టానికి వచ్చింది.
- సుల్తాన్ అహ్మద్ షా ఈ కళను పర్షియా (ఇరాన్) నుంచి భారత్‌కు తెచ్చాడు.
- కాపర్, జింక్ మిశ్రమ లోహం (గన్ మెటల్)తో చేసిన వస్తువులపై మొదట నల్లని రంగువేసి, దానిపై సిల్వర్ లేదా బంగారు రంగులతో డిజైన్ వేస్తారు.
- అలంకరణ వస్తువులు, ఫ్లవర్‌వాజ్‌లు, నగల డబ్బాలు వంటి ఎన్నో వస్తువులు తయారుచేస్తారు.
- హైదరాబాద్ బిద్రి వస్తువులు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.
ఆసియా (తేలియా) రుమాల్
- యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి వీటి తయారీకి ప్రసిద్ధి.
- ఇక్కత్ అనే నేతను దీనిలో ఉపయోగిస్తారు.
- దారాన్ని ఒక రకమైన తైలంలో ముంచి ఆరవేస్తారు.
- వీటిని గొర్రెపేడతో నింపిన నీటిలో ముంచి ఒక రాత్రి ఉంచి, మరునాడు ఆరబెడుతారు.
- ఇలా నాలుగు రోజులపాటు చేస్తారు. తర్వాత టై-డై ప్రక్రియలో రంగులు అద్ది చిత్రాలు గీస్తారు.
- ఈ రుమాల్‌పై చిన్నచిన్న బ్లాకులు,
- నక్షత్రాలు, గీతలు, డైమండ్ ఆకారాలు చిత్రిస్తారు.
- సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించుకునేందుకు తలపాగాలా దీన్ని వాడుతారు.
- యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని పుట్టపాక ఈ తేలియా రుమాల్ నేయడంలో ప్రసిద్ధి చెందింది.
- పుట్టపాక తేలియా రుమాల్‌కు 2019-20 ఏడాదిలో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
- పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య ఈ తేలియా రుమాల్, టై అండ్ డై రంగుల అద్దకపు పనిలో ప్రసిద్ధుడు.
- ఇతను పుట్టపాక గ్రామానికి చెందినవాడు. 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.
డోక్రా మెటల్ క్రాఫ్ట్స్
- డోక్రా అంటే బెల్ మెటల్ కళ.
- డోక్రా అనేది ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం, ఉసేగావ్ గ్రామానికి చెందిన పురాతనమైన గిరిజన లోహపు హస్తకళ.
- మైనపు పద్ధతిని ఉపయోగించి ఇత్తడితో డోక్రా కళాఖండాలు తయారుచేస్తారు.
- ఈ పూర్తయిన కళాఖండాలకు ఎలాంటి అనుమతులు ఉండవు.
- ఈ కళలో బొమ్మల తయారీకి ఎర్రమట్టి, మైనం, ఇత్తడి పదార్థాలు ఉపయోగిస్తారు.
- ఈ హస్తకళ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కెరమెరి మండలం జమగావ్ గ్రామంలో, జైనూర్ మండలంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తుంది.
- డోక్రా మెటల్ కళకు సంబంధించి బాగా ప్రఖ్యాతిగాంచినది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజాదారో.
- పశ్చిమ బెంగాల్‌లోని సంప్రదాయ లోహ తయారీదారులైన డోక్రా దమర్ అనే తెగ పేరున ఈ కళకు డోక్రా అనే పేరు వచ్చింది.
పోచంపల్లి చీరలు
- యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో నేసే చీరలు చాలా ప్రసిద్ధి.
- పోచంపల్లి చీరల్లో ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉపయోగిస్తారు.
- 2005లో రాష్ట్రంలో తొలిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన తొలి వస్తువుగా పోచంపల్లి చీరలను గుర్తించారు.
- పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటారు.
- పోచంపల్లి చేనేత కేంద్రంగా, గ్రామీణ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందినది.
మాదిరి ప్రశ్నలు
1. కింద పేర్కొన్న హస్తకళలు, ఆ కళలకు ప్రసిద్ధి చెందిన జిల్లాలను జతపర్చండి.
హస్తకళ ప్రసిద్ధి చెందిన జిల్లా
ఎ. సిల్వర్ ఫిలిగ్రీ 1. కరీంనగర్
బి. స్క్రోల్ పెయింటింగ్స్ 2. సిద్దిపేట
సి. పోచంపల్లి చీర 3. యాదాద్రి భువనగిరి
డి. పెంబర్తి లోహకళ 4. జనగామ
5. నల్లగొండ
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-3, సి-4, డి-5
3) ఎ-3, బి-4, సి-5, డి-1 4) ఎ-5, బి-4, సి-3, డి-2
2. కింద పేర్కొన్న వస్తువులను వాటికి భౌగోళిక గుర్తింపు లభించిన సంవత్సరాలతో జతపర్చండి.
ఎ. వరంగల్ డర్రీస్ 1. 2012-13
బి. సిద్దిపేట గొల్లభామ చీర 2. 2010-11
సి. హైదరాబాద్ హలీం 3. 2011-12
డి. నారాయణపేట చేనేత వస్ర్తాలు 4. 2017-18
5. 2015-16
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-5, బి-4, సి-3, డి-2 4) ఎ-2, బి-3, సి-4, డి-5
3. కింద పేర్కొన్న వస్తువులు, వాటికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను జతపర్చండి.
ఎ. ముత్యాలు 1. చందంపేట (మెదక్)
బి. తివాచీలు 2. వరంగల్
సి. కొయ్య చెక్కడాలు 3. భువనగిరి
డి. రూసాగడ్డి 4. నిజామాబాద్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4) ఎ-2, బి-3, సి-4, డి-1
4. కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి.
ఎ. పెంబర్తి హస్తకళకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి – కడార్ల రామయ్య
బి. సిల్వర్ ఫిలిగ్రీ కళను ప్రవేశపెట్టింది – అయిలాచారి
1) ఎ సరైనది 2) బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి సరికావు
5. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన తెలంగాణ నేత కార్మికుడు ఎవరు?
1) పరంధాములు
2) గజం అంజయ్య
3) గజం గోవర్దన్
4) ఎవరూకాదు
6. ప్రకృతి రంగులతో 16 ఆకారాలు ఒకే వస్త్రంపై వేసి, తన కళా నైపుణ్యానికి పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు?
1) గజం యాదగిరి
2) గజం అంజయ్య
3) గజం నాగరాజు
4) ఎవరూకాదు
7. కింది ఏ హస్తకళ ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందినది?
1) డోక్రా మెటల్ క్రాఫ్ట్
2) పెంబర్తి హస్తకళ
3) బంజారా నీడిల్ క్రాఫ్ట్
4) ఏదీకాదు
8. గద్వాల-కొత్తకోట చీరలకు కింది ఏ సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు లభించింది?
1) 2010-11
2) 2011-12
3) 2012-13
4) 2013-14
9. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి తన రచనల్లో పేర్కొన్న హస్తకళను గుర్తించండి.
1) బిద్రి వస్తువులు
2) గద్వాల్ చీరలు
3) డోక్రా మెటల్క్రాఫ్ట్
4) వరంగల్ డర్రీస్ (తివాచీలు)
10. లేసు అల్లికల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) దుమ్ముగూడెం 2) కోరుట్ల
3) చందంపేట 4) ఏదీకాదు
జవాబులు
1-1, 2-2, 3-1, 4-4, 5-1, 6-2, 7-2, 8-1, 9-4, 10-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు