భారతదేశ చరిత్ర….సాంస్కృతిక అంశాలకే ప్రాధాన్యం -2
# దక్షిణదేశ రాజ్యాలు: బాదామి/వాతాపి/పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు, పల్లవులు, చోళులు, కళ్యాణి, తూర్పు చాళుక్యుల కాలంలో వచ్చిన దక్షిణ భారత సంస్కృతి, ఆలయ నిర్మాణాలు, వేసర, ద్రావిడ శైలిలో నిర్మించిన నిర్మాణాలు ముఖ్యమైనవి. దంతిదుర్గుడు నిర్మించిన దశావతార గుహాలయం, మొదటి కృష్ణుడు- ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం, రెండో నర్సింహవర్మ- కంచిలోని కైలాసనాథదేవాలయం, తంజావూరులో మొదటి రాజరాజు నిర్మించిన బృహదీశ్వరాలయం వంటి ఆలయాలు కాకుండా పశ్చిమ చాళుక్యులు వేసరశైలిలో నిర్మించిన ఆలంపూర్, ఐహోలు, పట్టడిగల్, బాదామి దేవాలయాలు, పల్లవుల కాలంలో పంచపాండవ రథాలు వంటి నిర్మాణాలు, సాహిత్యం, మొదటిమహేంద్రవర్మ గుహనిర్మాణాలు చదవాలి.
#మధ్యయుగంలో ముస్లిం సంస్కృతి: ప్రాచీన కాలంలో హైందవ సంస్కృతి, మధ్యయుగంలో ముస్లిం సంస్కృతి, ఆధునిక యుగంలో కైస్తవ సంస్కృతి భారతదేశంలో కన్పిస్తుంది. అరబ్బుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన ముస్లిం సంస్కృతి, గజనీ, ఘోరీ దండయాత్రల ద్వారా రాజ్యస్థాపనకు కారణమైంది. ఢిల్లీ సుల్తానుల ద్వారా రాజ్యస్థాపన జరిగి మొఘలాయిల ద్వారా అభివృద్ధి చెందింది.
# ఢిల్లీ సుల్తానుల రాజకీయ వ్యవస్థ- బానిస ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల వివరాలు, ముఖ్యమైన చక్రవర్తులైన కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహ్మద్‌బిన్ తుగ్లక్, ఫిరోజ్‌షా తుగ్లక్, సికిందర్ లోడీ, ఇబ్రహీం లోడీ కాలంలో రాజకీయ పరిస్థితులు, వారి కాలంలోని నిర్మాణాలు- కుతుబ్ మినార్, అర్హదిన్ ఖాజోప్డా, కువాతుల్ ఇస్లాం, అలై దర్వాజ వంటి నిర్మాణాలు, వారి నిర్మాణాల శైలి ఇండో-ఇస్లామిక్ శైలి, ఆర్చి, డోమ్, డబుల్ డోమ్ సిస్టం వంటి అంశాలు చదవాలి. అమీర్ ఖుస్రూ, ఇబన్‌బటూట, జియావుద్దీన్ బరౌని, హసన్నిజామి, ఆల్బెరూని, ఉద్బి, ఫిరదౌసి రచనలు చదవాలి.
# మధ్యయుగంలో భక్తి ఉద్యమం: హిందూ, ముస్లిం మిశ్రమ సంస్కృతితో ఏర్పడిన విభేదాలను తగ్గించి ఎవరి మతాన్ని వారు కాపాడుకోవడానికి వచ్చినవే భక్తి, సూఫీ ఉద్యమాలు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, రామానందుడు, కబీర్, మీరాబాయి, మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులు, చైతన్యుడు వారి బోధనలు, సాహిత్యం, భక్తిమత ఉద్యమాల ద్వారా సమాజంలో వచ్చిన మార్పులను పరిశీలించాలి. అలాగే మధ్యయుగంలో శివాజీ ప్రభావం, పరిపాలనా విధానం, పీష్వాల కాలంలో జరిగిన సాంస్కృతిక వైభవం అధ్యయనం చేయాలి.
ఆధునిక యుగం:
ఐరోపావారి రాకతో భారతదేశంలో ఆధునికయుగం ప్రారంభమవుతుంది. పోర్చుగీసువారు, డేనిస్, డచ్చి, బ్రిటీష్, ఫ్రెంచివారు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు. సముద్రమార్గం కనుగొని సముద్రం మీద ఆధిపత్యం కొనసాగించి, వ్యాపారంలో లాభాలు కాస్తా సామ్రాజ్యవిధానానికి దారితీసి తర్వాత కాలంలో భారతదేశాన్నే ఆక్రమించి నాలుగు శతాబ్దాలపాటు ప్రభావితం చేసినవారు ఐరోపావారు. వ్యాపార సంఘర్షణలో భాగంగా ఆంగ్లో-ఫ్రెంచి యుద్ధాలకు దారితీసి చివరగా ఆధిపత్యం చెలాయించిన వారు ఆంగ్లేయులు. భారతీయులతో పలు యుద్ధాలు నిర్వహించిన బ్రిటీష్‌వారు చివరగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలన వ్యవస్థను రూపొందించారు. ఆంగ్లో-కర్నాటక, మైసూరు, మహారాష్ట్ర, సిక్కు, ప్లాసీ, బక్సార్ యుద్ధాల ద్వారా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించారు. కారన్‌వాలీస్ శాశ్వత భూమిశిస్తు పద్ధతి, వెల్లస్లీ-సైన్యసహకార పద్ధతి, విలియం బెంటింగ్ ఆధునిక విద్య, డల్హౌసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం సామ్రాజ్యవిస్తరణకు దోహదం చేశాయి. వారి సామ్రాజ్యవాదం కారణంగా చివరగా సిపాయిల తిరుగుబాటుకు కారణమైంది.
# బ్రిటీష్‌వారి ఆంగ్ల విద్యావిధాన ప్రభావం, భారతదేశంలో ఉన్న మూఢవిశ్వాసాలు, సాంఘిక దురాచారాలు, చివరగా సంఘసంస్కరణ ఉద్యమాలకు దారితీశాయి. సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు పితామడు రాజా రామ్మోహన్రాయ్. బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, ప్రార్థనా సమాజం, దివ్యజ్ఞాన సమాజం సంఘసంస్కరణకు కృషి చేశాయి. దయానంద సరస్వతి హైందవ సంస్కృతి పునరుద్ధణకు కృషిచేశాడు. గో బ్యాక్ టు వేదాస్- వేదాల్లోనే అన్ని అంశాలు దాగి ఉన్నాయని వేదాల ఉన్నతిని తెలిపాడు. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. సత్యార్థప్రకాశిక అనే గ్రంథాన్ని రాశాడు. స్వామి వివేకానంద యువతను మేల్కొల్పడానికి ప్రయత్నం చేశాడు. విదేశీ మహిళ అయినప్పటికీ భారతదేశ ఉన్నతికి ప్రయత్నం చేసి సంఘసంస్కరణకు కృషిచేసింది అనిబీసెంట్. వెనుకబడిన వర్గాల ఉన్నతికి ప్రయత్నం చేసిన వారిలో సంఘసంస్కరణకు కృషి చేసింది జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి, నారాయణగురు, పెరియార్ రామస్వామి, అంబేద్కర్, మహాత్మాగాంధీ. వెనుకబడిన మహర్కులంలో పుట్టినప్పటికీ చదువే ఆయుధంగా మార్చుకొని ఎదిగిన వ్యక్తి అంబేద్కర్. బహిష్కృత భారత్, ముఖ్నాయక్ వంటి పత్రికలు స్థాపించాడు. ఇండిపెండెంట్ లేబర్‌పార్టీ, ఆల్ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ వంటి పార్టీలు స్థాపించి వెనుకబడిన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి. సత్యశోధక్ సమాజం అనే సంస్థను స్థాపించింది మహాత్మాజ్యోతిబాఫూలే. గులాంగిరి, సార్వజనిక్ సత్యధర్మార్థ అనే గ్రంథాలు రాశాడు. అలాగే దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా సంఘసంస్కరణకు కృషి చేసినది పెరియార్ రామస్వామి.
మొఘలాయిల కాలంలో సంస్కృతి:
మొఘలాయిల కాలంలో రాజకీయ పరిస్థితి- బాబర్, మాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు పాలనావిధానాలు, వారు నిర్మించిన నిర్మాణాలు, భాషా సాహిత్యాలు ముఖ్యమైనవి. దాదాపు 330 ఏండ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించిన మొఘలాయిలు భారతదేశ సంస్కృతిని ఎంతో ప్రభావితం చేశారు. ఎన్నో నిర్మాణాలు నిర్మించారు. ముఖ్యంగా అక్బర్, షాజహాన్ నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. బులంద్ దర్వాజ, ఫతేపూర్ సిక్రి, ఆగ్రా, లాహోర్, అలహాబాద్ కోటలు, షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్, ఎరకోట, జుమామసీద్, నెమలి సింహాసనం, అలాగే వీరికాలంలో వచ్చిన సాహిత్యం- తుజుక్-ఇ-బాబరీ, మాయూన్నామా, తుజుక్-ఇ-జహంగీరీ, ఐనీఅక్బరీ, అక్బర్నామా, షాజహాన్నామా, పాదుషానామా, ఆలంగీర్నామా, ముంతకాబ్లబాబ్ వంటి అంశాలు చూడాలి. అలాగే జహంగీర్, అక్బర్కాలంలో వచ్చిన చిత్రలేఖనం, వాస్తుకళ, పరిపాలనలో అక్బర్ మున్సబ్దారా విధానం, బందోబస్తు విధానం, ఔరంగజేబు మత విధానం ప్రధాన అంశాలను స్టడీ చేయాలి.
(నోట్: గ్రూప్-1, గ్రూప్-2లో జాతీయోద్యమాన్ని సిలబస్‌లో పేర్కోలేదన్న అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. గ్రూప్-1లో సమాజంలో వచ్చిన మార్పులు, గిరిజన, కుల ఉద్యమాలు, కమ్యూనికేషన్ రంగం, మహిళ పరిస్థితి వంటి సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన అంశాన్ని గమనించాలి).
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు