సమ్మిళిత విద్య- దాని ప్రాముఖ్యం (TS TET)
మన దేశంలో సమ్మిళిత అనే భావనను 1986 జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాలల్లో సమ్మిళిత విద్యను అందించాలని నిర్ణయించారు. CSIE ప్రకారం సమ్మిళిత విద్య అంటే ‘ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు. పిల్లలు వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం, వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేది’.
సహిత విద్య ప్రయోజనాలు
విద్యార్థులకు బహు ప్రకారాలయిన (diverse) మానవ కుటుంబానికి చెందిన వాళ్లమేననే భావనను కలిగిస్తుంది.
బహు ప్రకారాలయిన పరిసరాన్ని అందిస్తుంది.
బహు ప్రకారాలయిన సముదాయానికి చెందిన వాళ్లమేననే భావనను కలిగిస్తుంది.
స్నేహాలు అభివృద్ధి కావడానికి తోడ్పడుతుంది.
పొరుగు స్నేహితులను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది.
స్వీయ గౌరవాన్ని పెంపొందిస్తుంది.
వ్యక్తిత్వాన్ని గట్టిగా చాటి చెప్పడానికి Peer models అందిస్తుంది.
సమ వయస్కులతో పాటు విద్య పొందడానికి అవకాశాలు అందిస్తుంది.
ఉపాధ్యాయులకు మానవ కుటుంబ వైవిధ్యతను మెచ్చుకునేలా ఉపాధ్యాయులకు తోడ్పడుతుంది.
విద్యార్థులందరికి శక్తియుక్తులు ఉన్నాయనే విషయాన్ని గుర్తించడానికి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది.
ప్రత్యక్ష వైయక్తిక బోధన (direct individu alized instruction) ప్రాధాన్యతను ఉపాధ్యాయులు తెలుసుకుని వ్యవహరించడానికి దోహదపడుతుంది.
విద్యా సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కొనే మార్గాలను పెంచుతుంది.
జట్టు నైపుణ్యాలను పెంపొందించుతుంది.
ఒకే రీతిగా ఉండే విధానాలను ఎదిరించడానికి తోడ్పడుతుంది.
సమాజానికి వ్యక్తులందరి పౌర హక్కులను పెంపొందిస్తుంది.
సమానత్వ సామాజిక విలువలను బలపరుస్తుంది.
సాంఘికీకరణను, ఇతరులతో కలిసి పనిచేసే నైపుణ్యాలను (Collaborative Skills) బోధిస్తుంది.
సహకారాన్ని (Supportiveness) నిర్మిస్తుంది.
సామాజిక శాంతిని గరిష్ట స్థాయిలో సాధించడానికి తోడ్పడుతుంది.
పిల్లలకు ప్రజాస్వామ్య ప్రక్రియ తాలూకు చిన్నపాటి నమూనాను అందిస్తుంది.
సమ్మిళిత విద్యా లక్ష్యాలు
సమ్మిళిత విద్య ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే సమాజానికి చెందినవారుగా భావిస్తారు.
ఎవరిపట్ల వివక్ష చూపరు, ఎవరిని విద్యా పరిధి నుంచి వదిలి పెట్టరు. పిల్లలందరూ నేర్చుకోవడానికి అనువుగా పాఠశాల సముదాయం పనిచేస్తుంది.
పాఠ్యప్రణాళిక రూపకల్పనలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది.
ఇది ఒక శిశు కేంద్రీకృత విద్య, పిల్లలు తమ అవసరాలను బట్టి పాఠ్యప్రణాళిను ఎన్నుకోవచ్చు.
సమ్మిళిత విద్య కేవలం విద్యను అందించడమే కాకుండా, భవిష్యత్తులో తమ కాళ్లమీద స్వతంత్రంగా జీవించే సామర్థ్యాలను అందిస్తుంది.
ప్రాముఖ్యం
ప్రతి విద్యార్థికి చదివే హక్కు ఉంది. చదవాల్సిన అవసరం ఉంది. సాధారణ పిల్లలతో పాటు వైవిధ్య సామర్థ్యాలున్న వారిని ఒకే రకమైన పాఠశాలలకు ఆహ్వానించి రేపటి సమాజానికి ప్రతీకలుగా తయారుచేయాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేకంగా విద్యను అందించినప్పుడు వారి అవసరాలకు తగినట్లుగా బోధనాభ్యసన ప్రక్రియలు చేపట్టినప్పటికీ, భవిష్యత్తు సమాజంలో మిగతా వారితో కలిసి జీవించడంలో సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ సమ్మిళిత విద్య కార్యక్రమాల్లో అందరూ కలిసి ఉండటం వల్ల అది భవిష్యత్తుతో మంచి సర్దుబాటుకు దోహదం చేస్తుంది.
సమ్మిళిత పాఠశాలల్లో కేవలం సాధారణ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలే కాకుండా… సాంఘికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు భాషా సమస్యలు గల పిల్లలు, లింగ వివక్షతకు గరవుతున్న పిల్లలు, అల్ప సంఖ్యాక వర్గాలు, అణచివేత, వివక్షతకు గురవుతున్న పిల్లలు వీరందరికి ఒకే విధమైన వనరుల ద్వారా విద్యను అందిస్తే, వారు వారి అవసరాలు, స్థాయిలు తృప్తిచెందక పాఠశాలలో కొనసాగలేక నిలుపుదల (Drop out) కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
ప్రతి అభ్యాసకుడు విలక్షణమైన (Unique) వాడని గుర్తించి, అతనిలోని వైవిధ్య అవసరాలు కలిగించే ఒత్తిడి నుంచి స్వేచ్ఛ పొంది, ఎలాంటి అడ్డంకులు లేని అభ్యసనాన్ని కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత సమ్మిళిత పాఠశాలల పైన ఉంది. కాబట్టి స్నేహపూర్వక, విలీన అభ్యసన వాతావరణాన్ని ఏర్పరచడంలో బహుళ వనరులను కల్పించాలి. ఇవి పిల్లల వైవిధ్య అవసరాలను తీర్చేందుకు దోహదం చేస్తాయి.
నమూనా
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భారత్లో కింది నమూనా ద్వారా విద్యను అందిస్తున్నారు.
రిసోర్స్ నమూనా
సాధారణ పాఠశాలల్లోని 8-10 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక పిల్లల విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని నియమించి విద్యను అందించడం. (ఈ నమూనాలో సాధారణ ఉపాధ్యాయునితో పాటు రిసోర్స్ ఉంటాడు)
ద్వంద్వ బోధన (డ్యూయల్ టీచింగ్ నమూనా)
సాధారణ పాఠశాలల్లో పనిచేసే సాధారణ ఉపాధ్యాయుడి నిర్ణీత కాలం ప్రత్యేక అవసరాల విద్య మీద శిక్షణ ఇచ్చి అతని చేతనే సాధారణ విద్యతోపాటు ప్రత్యేక అవసరాల విద్యను కూడా అందించడం. (సాధారణ టీచర్= సాధారణ+ ప్రత్యేక బోధన)
హోం బేసిక్ ఎడ్యుకేషన్
తీవ్ర వైకల్యంతో బాధపడుతూ పాఠశాలకు వచ్చే పరిస్థితిలో పిల్లవాడు లేకపోతే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్లి విద్యను అందించడం.
సంచార ఉపాధ్యాయుడు (ఇటినరింట్ బోధన)
8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని నియమించి అతని ద్వారానే ఆ పాఠశాలలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యని అందించడం.
ప్రత్యేక పాఠశాలలు
ఒకే రకమైన వైకల్యం గల పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి విద్యను అందించడం.
ఉదాహరణ: బధిరుల పాఠశాల, అంధుల పాఠశాల.
ప్రత్యామ్నాయ పాఠశాలలు (Alternative schools)
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం.
దూరవిద్య నమూనా
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం దూరవిద్యా కార్యక్రమాలను రూపొందించి విద్యను అందించడం. మన దేశంలో IGNOU (Indira Gandhi National open university ) మధ్యప్రదేశ్లోని భోజ్ విశ్వ విద్యాలయం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళికను రూపొందించి దూరవిద్య ద్వారా విద్యను అందిస్తున్నాయి.
బోధన విధానాలు
కార్యవిశ్లేషణ ఉపాధ్యాయుడు బోధించాల్సిన అంశాలను చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి, వాటిని ఒక వరుసక్రమంలో ఏర్పాటు చేసి బోధించే పద్ధతిని కార్యవిశ్లేషణ అని అంటారు. దీన్ని మెకర్ధి శాస్త్రవేత్త సూచించాడు.
ఉదాహరణ: సొంతంగా దంతాలు శుభ్రం చేసుకోవాలి అనే అంశం నేర్పేటప్పుడు పండ్లపొడి డబ్బా మూతతీయడం దగ్గర నుంచి చేతులు తుడుచుకోవడం, ముఖం తుడుచుకోవడం, టవల్ను తిరిగి యధాస్థానంలో ఉంచడం వరకు చిన్నచిన్న భాగాలుగా చేసి చెప్పాలి.
చిన్న సముదాయ బోధన
సమ్మిళిత విద్యను సమర్థవంతంగా చేయడానికి ఒక బోధనా పద్ధతి చిన్న సముదాయ బోధన.
బోధనాభ్యసన ప్రక్రియ సక్రమంగా జరగడానికి ఉపాధ్యాయులు, తరగతిలోని విద్యార్థులను చిన్నచిన్న సముహాలుగా చేసి వారు సమూహంలో ఏ విధంగా చేయాలో బోధించాలి.
సూచనలు
ముందుగా తెలివైన విద్యార్థులను ఎన్నుకోవాలి.
ఒక తెలివైన విద్యార్థిని ఒక మానసిక వైకల్యం ఉన్న విద్యార్థితో జతపర్చాలి.
ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన కార్యం ఇవ్వాలి.
విద్యార్థులు బాగా చేసిన పనిని మెచ్చుకుని ప్రోత్సహించాలి.
సహ విద్యార్థి శిక్షణ
విద్యార్థులు ఒకరికొకరు బోధించుకోవడానికి శిక్షణ ఇవ్వడం సహ విద్యార్థి శిక్షణ లక్షణం.
ఇద్దరు, ముగ్గురు మరికొన్ని సార్లు నలుగురు లేదా అయిదుగురు కలిసి ఒకే కార్యం మీద పనిచేయడం పరస్పర బోధన.
ఇది సమ్మిళిత విద్యలో అనుకూలమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది.
పునర్బలనాలు
కృత్యాన్ని నిర్వహించడానికి శిక్షణ పొందిన వ్యక్తి ఇచ్చే ప్రోత్సాహకాలను పునర్భలనాలు అంటారు. ఇవి 3 రకాలు.
ప్రాథమిక పునర్బలనాలు- జీవితానికి అవసరమైనవి, శక్తిమంతమైనవి.
ఉదా: ఆహారం, పానీయం, నిద్ర
గొప్ప పునర్బలనాలు- ప్రాథమిక పునర్బలనాలతో జత చేయడం వల్ల ఏర్పడేవి.
ఉదా: బహుమతులు, డబ్బు
సాంఘిక పునర్బలనాలు- ఇవి ఉద్వేగ స్థాయిని పెంచేవి.
ఉదా: పొగడ్త, చిరునవ్వు, అభినందన,కౌగిలింత
అత్యల్ప నిర్బంధ వాతావరణం
మానసిక వైకల్యం ఉన్నవారిని నిర్బందించకుండా వారిని కూడా మామూలు పిల్లలతో కలిసి చదువుకోవడానికి, ఆడుకోవడానికి, ఇతర పనులు చేయడానికి అవకాశం కల్పించడం వల్ల వారు సమాజంలో కలిసి నూతన వ్యక్తులుగా జీవించడానికి వీలవుతుంది.
ఆటంకాలు లేని వాతావరణం
మానసిక వైకల్యం ఉన్న విద్యార్థులు సాధారణ పాఠశాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనభ్యసించడానికి తగిన వాతావరణాన్ని కల్పించాలి.
ఉదా: పాఠశాల లోపల, బయటకు వెళ్లే మార్గం వారికి అనుకూలంగా ఏర్పాటు.
నడిచేటప్పుడు పట్టుకుని నడవడానికి ఆధారాల ఏర్పాటు.
నేల జారుడుగా లేకుండా ఏర్పాటు.
అత్యవసర సమయాల్లో నేర్పుతో తప్పించుకోవడానికి ఏర్పాటు మొదలైనవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?