వార్తల్లో వ్యక్తులు 11 మే 2011
నంద్ మూల్‌చందానీ
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా భారత సంతతి వ్యక్తి నంద్ మూల్‌చందానీ మే 1న నియమితులయ్యారు. ఈయన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సెంటర్‌కు యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని 1947, జూలై 26న స్థాపించారు.
వినయ్ మోహన్
విదేశీ వ్యవహారాల నూతన కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వినయ్ మోహన్ క్వాత్రా మే 1న బాధ్యతలు స్వీకరించారు. 1998 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన వినయ్ ఇప్పటి వరకు నేపాల్‌లో భారత రాయబారిగా పనిచేశారు.
అర్వింద్ కృష్ణ
ఐబీఎం చైర్మన్ అండ్ సీఈవో అర్వింద్ కృష్ణ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ డైరెక్టర్ల బోర్డుకు మే 2న ఎన్నికయ్యారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌ను 1913లో స్థాపించారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో జాన్ సీ విలియమ్స్.
సంగీత సింగ్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్‌గా సంగీత సింగ్ మే 3న నియమితులయ్యారు. దీనిలో మొత్తం సభ్యులు నలుగురు. ఈమె 1986 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారిణి.
తరుణ్ కపూర్
ప్రధానికి ప్రత్యేక కార్యదర్శిగా తరుణ్ కపూర్ మే 2న నియమితులయ్యారు. ఇతడు పెట్రోలియం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ఈయన 2021లో పదవీ విరమణ పొందారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?