క్రీడలు 11 మే 2011
వరల్డ్ స్నూకర్
వరల్డ్ స్నూకర్-2022 టోర్నీ ఫైనల్ ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్‌లోని క్రిసెబుల్ థియేటర్లో మే 2న నిర్వహించారు. ఈ పోటీలో ఇంగ్లండ్ ఆటగాడు రోని ఓ సలివాన్ టోర్నీని గెలిచాడు. రన్నరప్‌గా జడ్ ట్రంప్ (ఇంగ్లండ్) నిలిచాడు. ఈ విజయంతో రోని స్టీఫెన్ హెండ్రీ (స్కాట్లాండ్) గెలిచిన ఏడు ప్రపంచ టైటిళ్ల రికార్డును సమం చేశాడు.
సంతోష్ ట్రోఫీ
ఫుట్‌బాల్ 75వ సంతోష్ ట్రోఫీ మే 2న కేరళలోని మలప్పురంలో ఉన్న మంజేరి పయ్యనాడ్ స్టేడియంలో ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో కేరళ వెస్ట్ బెంగాల్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఈ ట్రోఫీని కేరళ గెలుచుకోవడం ఇది 7వ సారి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ జిజో జోసఫ్ (కేరళ)కు దక్కింది. అత్యధిక గోల్ స్కోరర్‌గా జెసిన్ టీకే (9 గోల్స్, కేరళ)) నిలిచాడు. బెస్ట్ గోల్ కీపర్ అవార్డును ప్రయాంత్ సింగ్ (పశ్చిమబెంగాల్) అందుకున్నాడు.
ఖేలో ఇండియా
ఖేలో ఇండియా 2వ యూనివర్సిటీ గేమ్స్ బెంగళూరులోని జైన విశ్వ విద్యాలయంలో ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు నిర్వహించారు. 210 యూనివర్సిటీల నుంచి 3900 మంది క్రీడాకారులు 20 క్రీడా అంశాల్లో పాల్గొన్నారు. యోగాసన, మల్లఖంబ అనే క్రీడలను ప్రవేశపెట్టారు. జైన్ యూనివర్సిటీ 20 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్య పతకాలతో మొదటి స్థానంలో ఉంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 2, పంజాబ్ యూనివర్సిటీ 3వ స్థానాల్లో నిలిచాయి.
కెవిన్ అండర్సన్
దక్షిణాఫ్రికా టెన్నిస్ క్రీడాకారుడు కెవిన్ అండర్సన్ మే 3న టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో ఏడు సింగిల్స్ ఏటీపీ టైటిళ్లు అందుకున్నాడు. 2018లో ఉత్తమంగా 5వ ర్యాంక్
సాధించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?