గవర్నర్ ఆధీనంలోఉండే నిధి ఏది? ( పాలిటీ )
భారత రాజ్యాంగంలోని 153వ ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. 1956లో చేసిన ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా రెం లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌ను నియమించే ఏర్పాటు చేశారు. ప్రకరణ 155 ప్రకారం గవర్నర్‌ను తన అధికార ముద్రతో (by warrant under his hand and seal) రాష్ట్రపతి నియమిస్తారు.
గవర్నర్ పదవి ఖాళీ అయినప్పుడు నూతన గవర్నర్ నియామకం ఆలస్యమైతే రాజ్యాంగంలోని 160 ప్రకరణ ప్రకారం ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి లేదా పక్క రాష్ట్ర గవర్నర్ తాత్కాలిక గవర్నర్‌గా నియమిస్తారు. తదుపరి నూతన గవర్నర్ నియామకం జరిగేంత వరకు వారే తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరిస్తారు.
నియామకం
# ప్రకరణ 157 ప్రకారం.. గవర్నర్‌గా నియామకం అవ్వాలంటే.. భారతీయ పౌరుడై ఉండాలి.
# 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
# లాభదాయక పదవిలో ఉండకూడదు.
# నేరారోపణ రుజువై ఉండకూడదు.
# ప్రకరణ 158 ప్రకారం.. గవర్నర్‌గా నియమితులయ్యే వ్యక్తి పార్లమెంటులో గాని, రాష్ట్ర శాసనసభలో గాని సభ్యుడై ఉండకూడదు. ఒకవేళ సభ్యుడై ఉంటే గవర్నర్‌గా నియమితులైన వెంటనే తన సభ్యత్వం రద్దవుతుం ది. ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో ఎటువంటి లాభదాయక పదవులు చేపట్టకూడదు.
పదవీకాలం..
# ప్రకరణ 156(1) ప్రకారం, గవర్నర్‌ను ఐదు సంవత్సరాల కాలానికి నియమిస్తారు. పదవి చేపట్టిన రోజు నుంచి ఐదు సంవత్సరాల వరకు పదవీకాలాన్ని పరిగణిస్తారు. అయితే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే పదవిలో ఉంటారు. గవర్నర్ పదవికి పదవీకాల భద్రత లేదు. పునర్ నియామకానికి అర్హుడే.
తొలగింపు
# ప్రకరణ 156 (1) ప్రకారం.. గవర్నర్‌ను రాష్ట్రపతి తొలగిస్తారు. గవర్నర్‌ను తొలగించడానికి ప్రత్యేక కారణాలు రాజ్యాంగంలో ప్రస్థావించలేదు. అయితే గవర్నర్ పదవీకాలం అధీష్ట సూత్రం (Doctrine of Pleasure) పై ఆధారపడి ఉంటుంది. సరైన కారణాలు లేకుండా గవర్నర్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని 2010లో బీపీ సింఘాల్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పదవీ ప్రమాణ స్వీకారం
# ప్రకరణ 159 ప్రకారం.. గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి ద్వారా గాని, లేకపోతే హైకోర్డు న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణస్వీకారం చేస్తారు.
రాజీనామా
# గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. ప్రకరణ 158 ప్రకారం గవర్నర్ జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. 2018లో గవర్నర్ జీతభత్యాలు రూ.3,50,000 లకు పెంచారు. గవర్నర్ పదవిలో ఉండగా జీతభత్యాలు తగ్గించకూడదు. ఎవరైనా ఒక గవర్నర్ రెం రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్నప్పు రాష్ట్రపతి నిర్ణయించే నిష్పత్తిలో సంబంధిత రాష్ట్రాలు గవర్నర్ జీతభత్యాలు భరిస్తాయి.
గవర్నర్ – అధికార విధులు
# ప్రకరణ 153 ప్రకారం రాష్ట్రంలో పరిపాలన, కార్యనిర్వాహక, ఇతర అన్ని అంశాలు గవర్నర్ పేరుతో కొనసాగుతాయి. గవర్నర్ అధికార విధులను కింది విధంగా వర్గీకరించవచ్చు.
1. కార్యనిర్వాహక అధికారాలు
2. శాసన నిర్మాణ అధికారాలు
3. ఆర్థికాధికారాలు
4. న్యాయాధికారాలు
5. విచక్షణాధికారాలు
కార్యనిర్వాహక అధికారాలు
# ప్రకరణ 154 ప్రకారం, రాష్ట్ర కార్యనిర్వాహణా ధికారాలు గవర్నర్ పేరుతో నిర్వహిస్తారు. అత ఈ అధికారాలను స్వయంగా కానీ, తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తారు. ముఖ్యంగా, రాష్ట్రంలో అన్ని నియామకాలు గవర్నర్ పేరు మీదుగానే జరుగుతాయి. అందులో
# ముఖ్యమంత్రి, మంత్రి మండలి నియామకం (ప్రకరణ 164(1))
# రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నియామకం (ప్రకరణ 165) ‘ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం (ప్రకరణ 316)
# రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకం (ప్రకరణ 243-K)
# రాష్ట్ర ఆర్థిక సంఘ నియామకం (ప్రకరణ 243-1) ‘ రాష్ట్ర అధికార భాషా సంఘం, మైనారిటీ కమిషన్, మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ చైర్మన్లను, సభ్యులను నియమిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. ఈ హోదాలో వైస్ ఛాన్సులర్లను నియమిస్తారు.
# రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ పేరునే నియమితమవుతారు.
శాసనాధికారాలు
# ప్రకరణ 168 ప్రకారం, రాష్ట్ర గవర్నర్ శాసనసభలో అంతర్భాగమే కాని సభ్యు కాదు. శాసన సభలో అన్ని ప్రక్రియలు గవర్నర్‌తో ముడిపడి ఉంటాయి. అవి.. రాష్ట్ర శాసనసభను సమావేశపర్చడం, దీర్ఘకాలికంగా వాయిదావేయడం (Prorogue) రద్దు చేయడం (Dissolve) (ప్రకరణ 174)
# ఉభయసభలనుద్దేశించి ప్రసంగించడం, సభలకు సమాచారాన్ని పంపడం (ప్రకరణ 175)
# శాసనసభను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయవచ్చు. (ప్రతి సంవత్సరం మొదటి సమావేశం, ప్రతి కొత్త విధానసభ మొదటి సమావేశం) ప్రకరణ (176(1))
# విధాన పరిషత్తుకు 1/6వ వంతు సభ్యులను నామినేట్ చేయడం (ప్రకరణ 171)
# శాసనసభ్యుల అనర్హతలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. (ప్రకరణ 192(1), 192(2))
# రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు తన ఆమోదాన్ని తెలపడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. (ప్రకరణ 200)
# బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపే నిమిత్తం వాటిని నిలిపి ఉంచడం. (Reserved for Consideration of President) (ప్రకరణ 201)
# రాష్ట్ర విధానసభకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం (ప్రకరణ 333)
# శాసనసభ సమావేశంలో లేనప్పు ఆర్డినెన్స్‌లను జారీ చేయడం (ప్రకరణ 213)
# రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయడం, పునఃపరిశీలనకు పంపడం లేదా తిరస్కరించడం. (ప్రకరణ 200)
# రాష్ట్ర ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికలను శాసనసభ ముందు ఉంచడం.
రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బిల్లులు- పర్యవసానాలు
# రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపినపుడు కింది ఐచ్ఛికాలు ఉంటాయి.
# రాష్ట్రపతి ఆ బిల్లును ఎ. ఆమోదించవచ్చు, బి. అట్టిపెట్టవచ్చు (Withhold), సి. రాష్ట్ర శాసనసభ పునఃపరిశీలనకు పంపమని గవర్నర్‌ను ఆదేశించవచ్చు (ద్రవ్యబిల్లు మినహా).
# రాష్ట్ర శాసనసభ రాష్ట్రపతి సూచించిన సవరణలను పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఏది ఏమైనా ఆరు నెలల్లోపు తిరిగి రాష్ట్ర శాసనసభ ఆ బిల్లును రాష్ట్రపతికి మరోసారి నివేదించాలి. ఈ సందర్భంలో కూడా రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదం తెలపవచ్చు లేదా తెలపకపోవచ్చు.
ఆర్డినెన్స్ జారీచేసే అధికారం- ప్రకరణ 213(1)
# రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు, ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడినప్పు, ప్రభుత్వ అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్స్‌ను జారీ చేయవచ్చు. ఆర్డినెన్స్‌ను ఉభయసభలు తిరిగి సమావేశమైన ఆరు వారాల్లో ఆమోదించాలి. అలా ఆమోదించకపోతే ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆర్డినెన్స్‌లో పేర్కొ న్న అంశాలపై శాసనసభ ఆమోదాన్ని పొందవచ్చు. ఈ ఆర్డినెన్స్‌కు చట్టానికున్న హోదా, అధికారం ఉంటుంది. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
# శాసనసభకు ఉన్న పరిమితులే గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేసే అధికారాలపై కూడా ఉంటాయి. కొన్ని అంశాల్లో రాష్ట్రపతి వూర్వ అనుమతితోనే ఆర్డినెన్స్ జారీ చేయాలి.
గమనిక: ఆర్డినెన్స్ జారీ చేయడం గవర్నర్ విచక్షణాధికారం కాదు. మంత్రి మండలి సలహా మేరకే జారీ చేస్తారు.
ఆర్థికాధికారాలు
# ప్రతి ఆర్థిక సంవత్సరం, వార్షిక బడ్జెట్‌ను సభలో సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. (ప్రకరణ 202)
# ద్రవ్య బిల్లులను గవర్నర్ అనుమతితోనే విధానసభలో ప్రవేశపెట్టాలి (ప్రకరణ 207).
# గవర్నర్ అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించకూడదు, తగ్గించకూడదు, మార్పు చేయకూడదు.
# రాష్ట్ర అగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తారు (ప్రకరణ 267)
# రాష్ట్ర పబ్లిక్ నిధిని కూడా నిర్వహిస్తారు (ప్రకరణ 266).
న్యాయాధికారాలు
# ప్రకరణ 161 ప్రకారం, గవర్నర్‌కు కొన్ని న్యాయాధికారాలు ఉన్నాయి. న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు, మార్పు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. శిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు క్షమాభిక్ష కూడా పెట్టవచ్చు. ఉరిశిక్షను రద్దు చేసే అధికారం లేదు. కానీ సస్పెండ్ చేయవచ్చు (తాత్కాలిక వాయిదా). న్యాయాధికారాలు సంబంధిత రాష్ట్ర భూభాగానికి మాత్రమే పరిమితం అవుతాయి. సైనిక కోర్టులు ఇచ్చిన తీర్పులు, శిక్షల్లో గవర్నర్ జోక్యం చేసుకునే అధికారం లేదు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి గవర్నర్‌ను సంప్రదిస్తారు.
గవర్నర్ పదవి – ప్రత్యేక రక్షణలు (ప్రకరణ 361)
# 361(1) ప్రకారం.. భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ అధికార విధుల నిర్వహణలో వ్యవహరించిన తీరును ఏ న్యాయస్థానంలోను ప్రశ్నించకూడదు.
# 361(2) ప్రకారం.. రాష్ట్రపతి లేదా గవర్నర్ తమ పదవిలో ఉన్నంతకాలం ఏ కోర్టులోనూ వారికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ కేసులను, ప్రొసీడింగ్‌లను ప్రారంభించకూడదు. కొనసాగించకూడదు.
# గవర్నర్ పదవి, రాజ్యాంగంలో ఉన్న ప్రకరణల గురించి చదివితే ప్రిలిమినరీ పరీక్షకు సరిపోతుంది. అయితే మెయిన్స్ వరకు వచ్చే సరికి రాజ్యాంగంలోని ప్రకరణలతో పాటు ప్రస్తుతం పరిస్థితుల్లో గవర్నర్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై అవగాహన ఉండాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య నెలకొన్న పరిస్థితులుపై స్పష్టమైన వైఖరి ఉండాలి.
విచక్షణాధికారాలు
(Discretionary Powers)
# రాజ్యాంగంలో గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలు కల్పించారు. మంత్రి మండలి సలహా లేకుండానే కొన్ని అధికారాలను, విధులను నిర్వహిస్తారు. కింద పేర్కొన్న విధులను ముఖ్యమంత్రిని సంప్రదించినప్పటికీ గవర్నర్ తన విచక్షణ మేరకు వ్యవహరిస్తారు.
# అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ
# అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల గవర్నర్లకు ఆ రాష్ట్రాల గిరిజన ప్రాంతాల పరిపాలనపై విచక్షణాధికారాలున్నాయి.
# నాగాలాండ్‌లోని నాగాహిల్స్ తుస్నాంగ్ కొండ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక అధికారాలున్నాయి.
# సిక్కిం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం.
# కర్ణాటకలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం.
# మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతాలైన విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసే అధికారం మహారాష్ట్ర గవర్నర్‌కు ఉంది.
# గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.
# రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం.
# రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పు లేదా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పాలన కొనసాగించలేనప్పు రాష్ట్రపతి పాలన విధించమని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం (ప్రకరణ 356) రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లులను తన ఆమోదానికి వచ్చినప్పు, ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు (ప్రకరణ 2017).
ఎన్బీ చారి
ఎంఏ (పీహెచ్డీ)
పోటీ పరీక్షల నిపుణులు
9063131999
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు