ఎండబెట్టిన సొరచేప చర్మాన్ని ఏమంటారు?
కార్డేటా
- పృష్టవంశం (Notochord), పృష్టనాళికాయుత నాళికాదండం (Dorsal hallow nervecord), గ్రసనీ మొప్ప చీలికలు/రంధ్రాలు (Pharyngeal gill slits/Clefts), పాయు పరపుచ్ఛం (Post and tail) లాంటి లక్షణాలను కలిగివున్న జంతువులను కార్డేటా అంటారు.
- ఇవి ఈ ముఖ్య లక్షణాలతోపాటు ద్విపార్శ సౌష్ఠవం, త్రిస్తరిత, ఎంటిరోసీలిక్ శరీరకుహర, అవయవస్థాయి వ్యవస్థీకరణ మొదలైన లక్షణాలను కలిగివుంటాయి.
- కార్డేటా వర్గాన్ని మూడు ఉపవర్గాలుగా విభజించవచ్చు. అవి.. యూరోకార్డేటా (ట్యూనికేటా), సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా (సకశేరుకాలు).
యూరోకార్డేటా/ట్యూనికేటా (Urochordata/tunicata)
- పృష్టవంశం లార్వా తోకలో మాత్రమే ఉండే జీవులను యూరోకార్డేటా అంటారు.
ఉదా: ఎసీడియా, సాల్పా, డొలియోలం.
సెఫలోకార్డేటా (Cephalo Chordata)
- పృష్టవంశం తల నుంచి తోక వరకు జీవితకాలం ఉండే జీవులను సెఫలోకార్డేటా అంటారు.
ఉదా: బ్రాంకియోస్టోమా (ఆంఫియాక్సస్/లాన్స్నెట్)
వర్టిబ్రేటా (సకశేరుకాలు/క్రేనియేటా)
- పిండదశలో పృష్టవంశం ఉండి, ప్రౌఢ దశలో పృష్టవంశం స్థానంలో మృదులాస్థి/అస్థినిర్మిత వెన్నెముక/కశేరుదండం ఏర్పడే జీవులను వర్టిబ్రేటా/సకశేరుకాలు/క్రేనియేటా అంటారు.
- పృష్టవంశం గల జీవులను కార్డేటా అని, పృష్టవంశం స్థానంలో వెన్నెముక/కశేరుదండంగల జీవులను సకశేరుకాలు (వర్టిబ్రేట్స్) అంటారు.
- దవడ ఉండటం, లేకపోవడాన్ని ఆధారంగా చేసుకుని వర్టిబ్రేటా ఉపవర్గాన్ని రెండు విభాగాలుగా విభజించవచ్చు. అవి.. ఏనేత (Agn atha/అహను కశేరుకాలు), నేతోస్టొమేటా (Gnathostomata/హనుకశేరుకాలు).
ఏనేత/అహనుకశేరుకాలు
- దవడలేని చేపల లాంటి జీవులు.
- ఆస్ట్రకోడర్మ్లు, సైక్లోస్టొమేట్లు అని రెండు రకాలు.
- ఆస్ట్రకోడర్మ్లు విలుప్తం/అంతరించి ఉన్నాయి.
- ప్రస్తుతం జీవించి ఉన్న అహనుకశేరుకాలు.
- సైక్లోస్టొమేట: ఇవి గుండ్రని నోరుగల దవడలు లేని జంతువులు.
ఉదా: పెట్రోమైజాన్ (లాంప్రే) మిక్సిన్ (హాగ్ చేప/ స్లైమ్ ఈల్)
నేతోస్టొమేటా/హనుకశేరుకాలు
- ఇవి దవడలుగల సకశేరుకాలు.
- వీటిలో వాజాలుగల చేపలు, అంగాలుగల చతుష్పాదులు (Tetropodes) కలవు.
- వీటిని స్థూలంగా ఇలా చెప్పవచ్చు. అవి.. చేపలు (Pisces), ఉభయచరాలు (Amphibians), సరీసృపాలు (Reptiles), పక్షులు (Aves), క్షీరదాలు (Mammales).
ఉభయచరాలు
- ఉభయచరాల అధ్యయనాన్ని ఆంఫీబియాలజీ అంటారు.
- నీటిలోనూ, భూమి మీద ఇలా రెండు రకాల ఆవాసాలలో నివసించే వాటిని ఉభయచరాలు అంటారు.
- ఇవి నీటి నుంచి వెలుపలికి వచ్చి నేలపై నడిచిన మొట్టమొదటి సకశేరుకాలు.
- వీటి హృదయంలో మూడు గదులు ఉంటాయి. రెండు కర్ణికలు, ఒక జఠరిక.
- ఇవి శీతలరక్త జంతువులు.
- జీవించి ఉన్న ఉభయచరాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఎన్యురా/సేలియెన్షియన్స్, యురోడిలా/కాడేటాలు, ఎపోడా/సిసీలియన్స్.
ఎన్యురా/సేలియెన్షియన్స్ - ఎన్యురాలో కప్పలు, గోదురు కప్పలను చేర్చారు. వీటి అధ్యయనాన్ని బాట్రకాలజీ అంటారు.
- కప్పల అండాల సమూహాన్ని స్పాన్ అని, శుక్రకణాల సమూహాన్ని మిల్ట్ అంటారు.
- కప్పలు శీతాకాలంలో నిద్రించడాన్ని శీతాకాల సుప్తావస్థ అని, వేసవికాలంలో నిద్రించడాన్ని గ్రీష్మాకాల సుప్తావస్థ అని అంటారు.
- కప్ప లార్వా/డింబకం – టాడ్‌పోల్.
యురోడిలా/కాడేటా
- వీటిలో సాలమాండర్లను చేర్చారు.
- వీటి లార్వా/డింబకం – ఆక్సోలోటల్.
- ఇవి నియోటనీ/పీడోజెనెసిస్ను ప్రదర్శిస్తాయి.
- ఉత్తర అమెరికాను సాలమాండర్ల రాజధాని అంటారు.
ఉదా: ఆంఫీయూమా – అతిపెద్ద ఆర్బీసీ కలిగిన జంతువు.
ట్రైలటో ట్రైటాన్ – ఇది ఇండియన్ సాలమాండర్.
ఎపొడా/సిసీలియన్స్
- వీటిని గుడ్డి పాములు అంటారు. ఇవి బొరియలలో నివసిస్తాయి. వీటికి చలనాంగాలు ఉండవు.
ఉదా: ఇక్తియోఫిస్, గెగనోఫిస్. ఇక్తియోఫిస్ సంతాన పాలనను చూపుతుంది.
జీవి – సాధారణ నామం
రానా – కప్ప
బ్యుఫో – గోదురు కప్ప
హైలా – చెట్ల కప్ప
రాకోఫోరస్ – ఎగిరేకప్ప
ఫిల్లోబేట్స్ – విషపూరిత కప్ప
అలైటిస్ – మంత్రసాని కప్ప
రానా గోలియత్ అతిపెద్ద కప్ప
మైక్రో హైలా – అతిచిన్న కప్ప
చేపలు (Pisces)
- వీటి అధ్యయనాన్ని ఇక్తియాలజీ (Ichthyology) అని, పెంపకాన్ని పిసీకల్చర్ (Pisciculture) అని అంటారు.
- చేపలు, రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు మొదలైన జలచర జీవుల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు.
- చేపల ఉత్పత్తిని బ్లూ రెవల్యూషన్ అంటారు.
- వీటి హృదయంలో 2 గదులు ఉంటాయి.
- వీటిలో పార్శరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ (Lateral line Sensory System) ఉండి, నీటి కదలికలు, కంపనాలను గుర్తించడానికి తోడ్పడుతుంది.
- ఇవి శీతలరక్త జంతువులు.
- చేపలను రెండు విభాగాలుగా విభజించవచ్చు. అవి.. కాండ్రిక్తిస్/మృదులాస్థి చేపలు, ఆస్టిక్తిస్/అస్థి చేపలు.
కాండ్రిక్తిస్/మృదులాస్థి చేపలు
- వీటి అంతరాస్థిపంజరం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది.
- రింకోడాన్/రైనోడాన్ అనేది అతిపెద్ద చేప, రెండో అతిపెద్ద జంతువు.
ఆస్టిక్తిస్/అస్థి చేపలు
- వీటి ఎముకలు/అస్థిపంజరం అస్థితో నిర్మితమై గట్టిగా ఉంటాయి.
ఉదా: సముద్ర చేపలు - ఎక్సోసీటస్ (ఎగిరేచేప), హిప్పోకాంపస్ (సముద్ర గుర్రం).
మంచినీటి చేపలు - లేబియో (రోహు), కట్ల కట్ల (కట్ల), క్లేరియస్ (మగర్)
అక్వేరియం చేపలు - బెట్టా (పోరాడే చేప), టీరోఫిల్లం (Angel fish)
ముఖ్యమైన అంశాలు
- స్క్రాప్ చేపల నుంచి తయారు చేసిన ఎరువును ఫిష్ గ్వానో అంటారు. దీన్ని కోళ్ల దాణాగా, అరటి, రబ్బరు తోటలకు ఎరువుగా వాడుతారు.
- సొరచేప ఎండబెట్టిన చర్మాన్ని షాగ్రీన్ అంటారు. దీన్ని తివాచీలు, గృహోపకరణ వస్తువులను నునుపు చేయడానికి వాడుతారు.
- పిల్లిచేపల ఎండిన గాలితిత్తుల నుంచి తీసిన పదార్థంతో చేసినదాన్ని ఐసిన్గ్లాస్ అంటారు. దీన్ని వైన్‌ను శుద్ధి చేయడానికి వాడుతారు.
- ఎసిటిక్ ఆమ్లంతో చేపల చర్మాన్ని కరిగించి తయారుచేసిన పదర్థాన్ని ఫిష్ గ్లూ అంటారు. దీన్ని పుస్తకాల బైండింగ్‌లో వాడుతారు.
- పొటాప్టెరస్, నియోసెరటోడస్, లెపిడోసైరన్లను డిప్నాయ్ చేపలు/ఊపిరితిత్తి చేపలు/లంగ్ ఫిష్ అంటారు. ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. వీటి శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది.
- సీలకాంత్ చేప (లాటిమేరియా)ను సజీవ శిలాజ చేప అంటారు. ఇది దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది.
- చేపలు సముద్రనీటి నుంచి మంచినీటికి వలస రావడాన్ని ఎనడ్రోమస్ వలస అంటారు.
ఉదా: హిల్సా (ఇండియన్ షేడ్), సాల్మన్ చేప, పెట్రోమైజాన్. - చేపలు మంచినీటి నుంచి సముద్రపు నీటిలోకి వలసరావడాన్ని కెటడ్రోమస్ వలస అంటారు.
ఉదా: ఆంగ్విల్లా (ఈల్ చేప) - చేపలు ఆహారం కోసం, ప్రత్యుత్పత్తి కోసం వలస చూపుతాయి.
- చేపలను పట్టడానికి వాడే పడవలను ఫిషింగ్ క్రాఫ్ట్‌లు అంటారు.
- చేపలను పట్టడానికి వాడే వలలను ఫిషింగ్ గేర్లు అంటారు.
- గుడ్లు పెట్టే పెద్ద చేపలను బ్రీడర్స్ అంటారు.
- నాలుగు కాళ్లు కలిగిన చేప (ఏంజిలాప్స్).
జీవి – సాధారణ నామం
స్కోలియోడాన్ – సొరచేప
ప్రిస్టిస్ – రంపపు చేప
కార్కరోడాన్ – పెద్ద తెలుపు షార్క్
ట్రైగాన్, డాసియాటిస్ – విషపూరిత చేపలు
టార్పిడో – విద్యుత్ చేప
స్పిర్నా – సుత్తితల చేప
రింకోడాన్/రైనోడాన్ వేల్ – షార్క్ / తిమింగలపు సొర
మాదిరి ప్రశ్నలు
1. పూర్వంగాలు చిన్నగా, చరమాంగాలు పెద్దగా ఉండే ఉభయచరాలు ఏవి? (1)
1) ఎన్యురా/సేలియెన్షియస్
2) యురోడిలా/కాడేటాలు
3) ఎపొడా/ససీలియన్లు
4) 1, 3
2. మంత్రసాని కప్ప అని దేనిని అంటారు? (3)
1) మైక్రో హైలా
2) రానా గోలియాత్
3) అలైటిస్ 4) ఫిల్లో బేటస్
3. కప్పల్లోని అండాల సమూహాన్ని ఎలా పిలుస్తారు? (2)
1) మిల్ట్, 2) స్పాన్
3) 1, 2 4) ఏదీకాదు
4. ఉభయచరాల హృదయంలోని గదుల సంఖ్య? (2)
1) రెండు 2) మూడు
3) నాలుగు 4) ఐదు
5. నీటి నుంచి బయటకు వచ్చి నేలపై నడిచిన మొదటి జంతువులు ఏవి? (1)
1) ఉభయచరాలు 2) సరీసృపాలు
3) పక్షులు 4) క్షీరదాలు
6. డిప్నాయ్ చేపలలో శ్వాస అవయవాలు ఏవి? (4)
1) చర్మం 2) ఆస్యకుహరం
3) మొప్పలు 4) ఊపిరితిత్తులు
7. ఏ చేపకు నాలుగు కాళ్లు ఉంటాయి? (4)
1) పెట్రోమైజాన్ 2) మిక్సిన్
3) సిల్వర్ పాంఫ్రెట్
4) ఏంజిలాప్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు