మూర్తిమత్వ వికాసం (TS TET)
1. ‘పర్సనాలిటీ’ అనే పదం ‘పర్సోనా’ అనే ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు?
1) ఫ్రెంచి 2) లాటిన్
3) గ్రీకు 4) జర్మన్
2. ‘మూర్తిమత్వమంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా’ అని నిర్వచించింది ఎవరు?
1) జె.ఎఫ్. బ్రౌన్ 2) ఐసెంట్
3) వాట్సన్ 4) ఇ. ఫారిస్
3. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో ఉన్న విద్యార్థులను వారి శరీర నిర్మాణాన్ని బట్టి పీసరకాయులు, ప్రాంశుకాయులు, క్రీడాకాయులుగా వర్గీకరించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు కింది ఏ వర్గీకరణను పరిగణనలోకి తీసుకున్నాడు?
1) హిప్పోక్రెటిస్ వర్గీకరణ
2) షెల్డన్ వర్గీకరణ
3) ఎర్న్స్ట్ క్రెష్మర్ వర్గీకరణ
4) యూంగ్ వర్గీకరణ
4. శరీరాకృతిని బట్టి వ్యక్తులను స్థూలకాయులు, మధ్యమకాయులు, లంబాకృతకాయులు అని వర్గీకరించింది ఎవరు?
1) స్పేంజర్ 2) కాటిల్
3) షెల్డన్ 4) హిప్పోక్రెటిస్
5. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి బహిర్వర్తనులు, అంతర్వర్తనులు, ఉభయవర్తనులు అని వర్గీకరించినది ఎవరు?
1) యూంగ్ 2) స్పేంజర్
3) షెల్డన్ 4) కాటిల్
6. రాజు అనే విద్యార్థి సన్నగా, బలహీనంగా, సిగ్గుపడుతూ, అంతర్వర్తనులుగా, నిరాశావాదిగా ఉన్నాడు. అయితే ఎర్న్స్ట్ క్రెష్మర్ వర్గీకరణ ప్రకారం ఆ విద్యార్థి ఏ రకానికి చెందినవాడు?
1) పీసరకాయులు
2) క్రీడాకాయులు
3) ప్రాంశుకాయులు
4) లంబకృతకాయులు
7. మనోవిశ్లేషణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) ఆల్పోర్ట్ 2) ఎరిక్సన్
3) కాటిల్ 4) సిగ్మండ్ ఫ్రాయిడ్
8. మనసుకు తృప్తిని, ఆరోగ్యాన్ని కలిగించే పరిస్థితుల్లో వాటిని పొందగలిగే మానసిక స్థితి, వ్యక్తిగత, సామాజిక సంబంధాలను పెంపొందించుకోగలిగే సామర్థ్యాన్ని ఏమంటారు?
1) మానసిక ఆరోగ్యం
2) సర్దుబాటు
3) విషమయోజనం
4) సంఘర్షణ
9. టెట్ కోచింగ్కు వెళ్లి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫీజు కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ?
1) ఉపగమ-ఉపగమ సంఘర్షణ
2) పరిహార-పరిహార సంఘర్షణ
3) ఉపగమ-పరిహార సంఘర్షణ
4) ద్విఉపగమ-పరిహార సంఘర్షణ
10. రవికి ఇంటిపని చేయాలని లేదు. అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ రవికి కలిగిన సంఘర్షణ?
1) ఉపగమ-ఉపగమ సంఘర్షణ
2) పరిహార-పరిహార సంఘర్షణ
3) ద్విఉపగమ-పరిహార సంఘర్షణ
4) ఉపగమ-పరిహార సంఘర్షణ
11. మానసకు స్నేహితులతో సినిమాకి వెళ్లాలని ఉంది. కానీ, ఇంట్లో తిడతారేమోననే భయం-ఇక్కడ మానసకు ఎదురయ్యే సంఘర్షణ
1) ఉపగమ-ఉపగమ సంఘర్షణ
2) పరిహార-పరిహార సంఘర్షణ
3) ఉపగమ-పరిహార సంఘర్షణ
4) ద్విఉపగమ-పరిహార సంఘర్షణ
12. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ ఉన్న ఒక అబ్బాయిని నీకు అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అని అడిగి, ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అబ్బాయి ఎదుర్కొనే సంఘర్షణ
1) ద్విఉపగమ-పరిహార సంఘర్షణ
2) ఉపగమ-పరిహార సంఘర్షణ
3) పరిహార-పరిహార సంఘర్షణ
4) ఉపగమ-ఉపగమ సంఘర్షణ
13. విద్యార్థి చదువుతున్న కోర్సులో హిందీ, తెలుగులో ఏదో ఒక భాషను తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఆ విద్యార్థికి రెండు భాషలు ఇష్టం లేదు. ఇక్కడ ఆ విద్యార్థి సంఘర్షణ స్థితి?
1) ద్విఉపగమ-పరిహార సంఘర్షణ
2) ఉపగమ-పరిహార సంఘర్షణ
3) పరిహార-పరిహార సంఘర్షణ
4) ఉపగమ-ఉపగమ సంఘర్షణ
14. కింది వాటిలో సరైన అంశం ఏది?
1) వ్యాకులత వల్ల సంఘర్షణ, సంఘర్షణ వల్ల కుంఠనం ఏర్పడుతుంది
2) సంఘర్షణ వల్ల కుంఠనం, కుంఠనం వల్ల వ్యాకులత ఏర్పడుతుంది
3) వ్యాకులత వల్ల కుంఠనం, కుంఠనం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది
4) కుంఠనం వల్ల సంఘర్షణ, సంఘర్షణ వల్ల వ్యాకులత ఏర్పడుతుంది
15. సంఘర్షణ అనేది
1) మానసిక రుగ్మత
2) మానసిక ఉద్వేగం
3) ఒక అలవాటు
4) ఒక సర్దుబాటు
16. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు?
1) క్లిఫర్డ్ బీర్స్ 2) సిగ్మండ్ ఫ్రాయిడ్
3) అట్కిన్సన్ 4) బెర్నార్డ్
17. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు?
1) ఉడ్వర్త్ 2) సిగ్మండ్ ఫ్రాయిడ్
3) ఆట్కిన్సన్ 4) ఆల్పోర్ట్
18. వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేకపోయినప్పుడు అదే కోరిక ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకోవడాన్ని ఏమంటారు?
1) పరిహారం 2) హేతుకీకరణం
3) ప్రతిగమనం 4) ప్రక్షేపణం
19. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయినా పెద్ద ప్రయోజనం లేదని తనను తాను సమర్థించుకోవడాన్ని ఏమంటారు?
1) విస్తాపనం 2) ప్రక్షేపణం
3) హేతుకీకరణం 4) పరిహారం
20. ‘చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తన మాట వినకపోవటంతో ఒక తండ్రి చిన్నపిల్లవాడిలా ఏడవటం’ దేనికి ఉదాహరణ?
1) ప్రక్షేపణం 2) ప్రతిగమనం
3) తాదాత్మీకరణం 4) దమనం
21. ‘అందని ద్రాక్షపండు పుల్లన’ అనే సామెత ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ?
1) ఉపసంహరణ 2) తాదాత్మీకరణం
3) విస్తాపనం 4) హేతుకీకరణం
22. పరీక్షల్లో అనుత్తీర్ణుడైన విద్యార్థి, తాను మొదటి తరగతిలో పాసైనట్లు, ప్రతిభా అవార్డు పొందినట్లు, అందరూ మెచ్చుకున్నట్లు పగటి కలలు కంటూ సర్దుబాటు చేసుకోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం?
1) స్వైర కల్పన 2) దమనం
3) విస్తాపనం 4) ప్రతిగమనం
23. కౌమార దశలో బాలబాలికలు ఎక్కువగా ఉపయోగించుకొనే రక్షకతంత్రం?
1) స్వైర కల్పన 2) ప్రక్షేపణం
3) ఉపసంహరణ 4) విస్తాపనం
24. రాజు అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుక్కపిల్ల చనిపోయిన విషయం కావాలని మరిచిపోయి ఆనందంగా ఉండటంతో రాజు ఉపయోగించుకున్న రక్షక తంత్రం?
1) దమనం 2) ప్రతిగమనం
3) విస్తాపనం 4) ప్రక్షేపణం
జవాబులు
1) 2 2) 1 3) 3 4) 3 5) 1 6) 3 7) 4 8) 1 9) 3 10) 2 11) 3 12) 4 13) 3 14) 2 15) 2 16) 1 17) 2 18) 1 19) 3 20) 2 21) 4 22) 1 23) 1 24) 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు