రెండు అచ్చమైన తెలుగు పదాలతో ఏర్పడే సమాసం ఏమిటి?
రెండు వేర్వేరు అర్థాలు ఉన్న పదాలు ఒకే పదంగా మారడమే కాకుండా ఒకే అర్థాన్ని ఇవ్వడాన్ని ‘సమాసం’ అంటారు. ఇందులో రెండు పదాలు ఉంటాయి. అవి పూర్వపదం, ఉత్తరపదం
ఉదా. ఉమాపతి – పార్వతి భర్త = శివుడు
(ఉమా=పూర్వ, పతి=ఉత్తర)
‘సమర్ధః పదనిధిః సమాసః’- పాణినిఅష్ఠాధ్యాయి.
సూరి – బాలవ్యాకరణం – సమర్థవంత మైన పదాలు ఏక పదమవడాన్ని సమాసం అంటారు.
సమ్ అనే ఉపసర్గపూర్వక, అస్ అనే ధాతువుకు ఘయ్(doubt) అనే ప్రత్యయం చేరడం వల్ల సమాసం అనే పదం ఏర్పడింది. సమ్ (ఉపసర్గ) – అస్ (ధాతువు)+ ఘయ్ (ప్రత్యయం)
బాల వ్యాకరణంలో సమాస పరిచ్ఛేదం ఆరోది.
ఇందులో మొత్తం సూత్రాల సంఖ్య 26.
విగ్రహవాక్యం :
సమాసం అర్థాన్ని తెలిపే పదసమూహం విభక్తితో కూడి ఉండటాన్ని విగ్రహవాక్యం అంటారు.
1. విభక్తిని అనుసరించి సమాసం
ఎ) లుక్ బి) అలుక్ సి) వైరి సమాసాలు
లుక్ సమాసం :
లుక్ అంటే లోపం
సమాస పదంలో విభక్తి లోపిస్తే దాన్ని లుక్ సమాసం అంటారు.
ఉదా. రామబాణం
లుక్ సమాస పదాలనే సమస్త పదాలు అని కూడా అంటారు.
అలుక్ సమాసం
రెండు పదాలు కలిపే సమయంలో పొల్లు అక్షరాలు లోపించడాన్ని అలుక్ సమాసం అంటారు.
ఉదా : నీచెన్ ప్రాపు = నీచెప్రాపు
2. శబ్దాన్ని అనుసరించి సమాసాలు
ఎ) సాంస్కృతిక సమాసం
బి) ఆచ్చిక సమాసం
సి) మిశ్రమ సమాసం
సాంస్కృతిక సమాసం
ఈ సమాసం రెండు రకాలు – ఎ) సిద్ధ సమాసం, బి) సాధ్య సమాసం
సిద్ధ సమాసం – రెండు సంస్కృత పదాలతో ఏర్పడేది సిద్ధ సమాసం. ఉదా: రాజాజ్ఞ
సాద్య సమాసం – సంస్కృత పదాలతో కాకుండా, సంస్కృత పదాలకు సమానమైన పదాలతో ఏర్పడేది సాధ్యసమాసం.
ఉదా. రాజునాజ్ఞ
ఆచ్చిక సమాసం
రెండు అచ్చమైన తెలుగు పదాలతో ఏర్పడేది ఆచ్చిక సమాసం.
ఉదా. లచ్చిమొగుడు
మిశ్రమ సమాసం
ఒక తెలుగు పదం, ఒక సంస్కృత పదంతో ఏర్పడేది మిశ్రమ సమాసం.
ఉదా. సిరివల్లభుడు
3. అర్థాన్ని అనుసరించి సమాసాలు
ఎ) పూర్వపద ప్రాధాన్యత
బి) ఉత్తరపద ప్రాధాన్యత
సి) ఉభయ పద ప్రాధాన్యత
డి) అన్యపద ప్రాధాన్యత
1) పూర్వపద ప్రాధాన్యత కలిగిన సమాసం
అవ్యయీభావ సమాసం
లింగ వచన విభక్తులు కానివి అవ్యయాలు
పూర్వపద ప్రాధాన్యత కలిగినది అవ్యయీభావ సమాసం
పూర్వపదంగా ‘అవ్యయం’ తరువాత పదంలో ‘నామవాచకం’ ఉంటుంది.
ఉదా. యథాశక్తి = శక్తిని అనుసరించి
ఉపవనం = వనానికి సమీపాన
సకుటుంబం = కుటుంబంతో సహా
ప్రతిదినం = దినదినం
కోడ్ – పూర్వపదంగా (యథా, ఉప, స, ప్రతి, అను) వస్తాయి.
2) ఉత్తర పద ప్రాధాన్యత కలిగిన సమాసం
తత్పురుష సమాసం
ఉత్తర పద ప్రాధాన్యత (సమాస పదం అర్థం 2వ పదంలో ఉంటుంది)
దీనికి మరోపేరు ‘వ్యధీకరణ సమాసం’
వివిధ రకాల విభక్తులతో ఏర్పడుతుంది.
వ్యధీకరణము = వి + అధికరణము
(ఇ)+(అ) = (య) యణాదేశ సంధి
ప్రథమ తత్పురుష సమాసం
ప్రథమ తత్పురుష సమాసం కర్తృకారకం
ఉదా: పోతన భాగవతాన్ని రచించారు.
విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు
డు, ము, వు అనేవి ఏకవచన ప్రత్యయాలు.
లు అనే ప్రత్యయం బహువచన ప్రత్యయం
ఉదా: ప్రత్యయాలు-రాముడు, వృక్షము, ధేనువు
బహువచన ప్రత్యయాలు – పర్వతాలు, నదులు
ప్రాచీన శాసన భాషలో కల్, గుల్ అనే పదాలు బహువచనంగా వాడేవారు.
ఉదా. ఎలుకళ్, ఏనుగుళ్
తరువాతి కాలంలో కళ్, గళ్ అనే పదాలకు బదులుగా ‘లు’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం.
ఉదా: పర్వతాలు, ఎలుకలు, నదులు, ఏనుగులు
ఉదా : మధ్యాహ్నము = అహ్నము యొక్క మధ్యభాగం
పావుగంట = గంటలో పావు భాగం
అర్ధరాత్రి = రాత్రిలో అర్ధభాగం
మధ్యయుగం = యుగం యొక్క మధ్య భాగం
గమనిక : ప్రథమ, షష్ఠి తత్పురుష సమాస పదాలను విగ్రహ వాక్యాలుగా మార్చినప్పుడు షష్ఠీ తత్పురుష సమాస విభక్తి ప్రత్యయాలు వస్తాయి.
విగ్రహ వాక్యాంతంలో ‘భాగము’ అనే పదం ఉంటే అది ‘ప్రథమ’ అని, లేదు అంటే అది ‘షష్ఠీ’ అని అంటారు.
కోడ్ – డు, ము, వు, లు – ప్రథమ విభక్తులు
షష్ఠీ తత్పురుష సమాస ప్రత్యయం వచ్చినప్పుడు భాగము(పదం) ఉండాలి.
ద్వితీయ తత్పురుష సమాసం
ఇది కర్మకారకం
ఉదా: భాగవతం పోతనచే రచింపబడినది.
విభక్తి ప్రత్యయాలు నిన్, నున్, లన్, కూర్చి, గురించి
ఉదా: న్యాయవాది – న్యాయమును వాదించువారు
పాత్రధారి – పాత్రను పోషించువారు
శాస్త్రవేత్త – శాస్త్రమును తెలిసిన వారు
బ్రహ్మవిత్తములు – బ్రహ్మను తెలిసిన వారు
నిన్, నున్, లన్ లు ని, ను, ల లాగా కూడా ఉపయోగపడుతాయి.
తృతీయ తత్పురుష సమాసం
ఇది కరణకారకం
కరణం అంటే ఫలసాధనలో ఎక్కువగా ఉపయోగపడేది.
ఉదా: విష్ణుమూర్తి సుదర్శన చక్రం మొసలి తలను ఖండించెను
విభక్తి ప్రత్యయాలు – చేతన్, చేన్, తోడన్, తోన్
ఉదా: ఖడ్గయుద్ధం – ఖడ్గముతో యుద్ధం, ఖడ్గం చేత యుద్ధం
కనకాభిషేకం – కనకముచే అభిషేకం, కనకముతో అభిషేకం
పాలాభిషేకం – పాలతో అభిషేకం
చతుర్థి తత్పురుష సమాసం
ఇది సంప్రధాన కారకం
త్యాగోద్దేశ్యంబు సంప్రధానంబు అన్నది సూరి.
త్యాగం = దానం
సంప్రధానము అనేది దానం పొందిన వారిని సూచిస్తుంది.
ఉదా: రాముడి(సంప్రధానం) కోసం జనకుడు కన్యనిచ్చెను
విభక్తి ప్రత్యయం – కొరకున్, కై
ఉదా: స్వాతంత్య్ర కాంక్ష – స్వాతంత్య్రం కోసం కాంక్ష
సంక్షేమ పథకాలు – సంక్షేమం కోసం పథకాలు
గురు దక్షిణ – గురువు కై/కొరకు దక్షిణ
కళ్యాణగంటలు – కళ్యాణం కొరకు గంటలు
పంచమీ తత్పురుష సమాసం
ఇది ఆపాధానకారకం
భయం(అపాదాన), పరాభవం = ఆపాధాన కారకం
ఉదా: నాకు దొంగ వలన భయం వేసింది
(ఆపాధానం) (విభక్తి)
విభక్తి ప్రత్యయాలు – వలెనన్, కంటెన్, పట్టి
ఉదా. ప్రాణధికుడు = ప్రాణాల కంటే అధికుడు
షష్ఠీ తత్పురుష సమాసం
కారకం లేదు.
విభక్తి ప్రత్యయాలు – కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
ఉదా. బావినీరు = బావిలో నీరు
రాజ పుత్రుడు = రాజు యొక్క పుత్రుడు
వినతాసుతుడు = వినత యొక్క సుతుడు
పురుషోత్తయుడు = పురుషులలో ఉత్తముడు
నోట్: షష్ఠీ తత్పురుష సమాసం ప్రత్యయంలో ‘భాగము’ అనే పదం చివరలో రానిది షష్ఠీ తత్పురుష సమాసం.
సప్తమీ తత్పురుష సమాసం
ఇది అధికరణ కారకం
ఉదా: నాకు తెలుగు యందు ప్రావీణ్యం కలదు
విభక్తి ప్రత్యయాలు అందున్, నన్
ఉదా. బావినీరు – బావి యందు నీరు
వ్యాకరణపండితుడు – వ్యాకరణం యందు పండితుడు
శివ భక్తి = శివునియందు భక్తి
నోట్ : కొన్ని పదాలను/పదాలకు ‘లో’ కూడా వాడొచ్చు
ఉదా. బావి నీరు – బావిలో నీరు. ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది.
సంబోధన ప్రధమ తత్పురుష సమాసం
సంబోధన = పిలుపు(అరాగాగమం)
సంబోధనలు ఓ, ఓయి, ఓరి, ఓసి
ఉదా: ఓ అమ్మాయి
ఓయి పుణ్యాత్ముడా
ఓరి పాపాత్ముడా
ఓసి పాసిష్టురాలా
న + తత్పురుష సమాసం
తత్పురుష సమాసంలో ముఖ్యమైనది
వ్యతిరేక అర్థం తెలిపే పదం పూర్వపదంలో ఉంటే దానిని న + తత్పురుష సమాసం అంటారు.
ఉదా: అధర్మము = ధర్మం కానిది
అక్రమం = క్రమం కానిది
అనుచితం = ఉచితం కానిది
అపరిచితుడు = పరిచితుడు కానివాడు
అశ్రద్ధ = శ్రద్ధ లేనిది
ఉదాహరణ ప్రశ్నలు
1. పూర్వకాలం – కాలంలో పూర్వభాగం (పథమ)
2. పూజాగృహము – పూజ కొరకు గృహం (చతుర్థి)
3. రైతుల కృషి – రైతుల యొక్క కృషి (షష్ఠి)
4. మాటనేర్పరి – మాటలలో నేర్పరి (షష్ఠి)
5. అనూహ్యము – ఊహ్యము కానిది (న తత్పురుష)
6. కోపావేశము – కోపం వలన ఆవేశము (పంచమి)
కర్మధారయ సమాసం
నామవాచక విశేషణలతో ఏర్పడిన సమాసం
సమానాధికరణ సమాసం అని కూడా అంటారు.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సమాస పదము యందు విశేషణమును తెలిపే
పదము పూర్వపదం యందు ఉన్నైట్లెతే అది విశే
షణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉదా: నల్లకలువ – నల్లనైన కలువ
కఠిన వాక్యలు – కఠినమైన వాక్యాలు
అద్భుత శక్తి – అద్భుతమైన శక్తి
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
విశేషణాన్ని తెలిపే పదం ఉత్తర పదంలో ఉంటే
దానిని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
అంటారు.
ఉదా: రాజోత్తముడు – ఉత్తముడైన రాజు
గమనిక : రాజోత్తముడు = రాజులలో ఉత్తముడు (షష్ఠి)
రాజులయందు ఉత్తముడు (సప్తమి)
కపోతకృద్దము = వృద్ధమైన కపోతం
కార్మిక వృద్ధులు = వృద్ధులైన కార్మికులు
నాగశ్రేష్ఠుడు = శ్రేష్ఠుడైన నాగుడు
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
విశేషణాన్ని తెలిపే పదం ఉభయ పదాల్లో ఉంటే
అది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
ఉదా: శీతోష్ణస్థితి = శీతలం అయిన, ఉష్ణమైన
ఎత్తుపళ్ళములు = ఎత్తయినవి, పళ్ళమయినవి
మృదుమధురం = మృదువైనది, మధురమైనది
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
ఉపమానం అంటే పోల్చడానికి తీసుకునే వస్తువు
ఉపమానం పూర్వపదం యందు ఉన్నైట్లెతే అది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
ఉదా: తేనె పలుకులు = తేనె వంటి పలుకులు
కలువకన్నులు = కలువల వంటి కన్నులు
చంద్రముఖి = చంద్రుడు(చంద్రబింబం) వంటి ముఖం
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
ఉపమానాన్ని తెలిపే పదం ఉత్తర పదంలో ఉంటే అది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
ఉదా: కవికోకిల = కోకిల వంటి కవి
పాదపద్మములు = పద్మముల వంటి పాదములు
కనుతామరలు = తామర వంటి కనులు
ద్విగు సమాసం
‘ద్విగు’ అంటే రెండు గోవులు అని అర్ధం
సంఖ్య వాచకాన్ని తెలిపే పదం పూర్వపదంలో ఉంటే అది ద్విగు సమాసం.
ఉదా: మూడుముళ్ళు = మూడు అనే సంఖ్యగల ముళ్ళు
ఏడడుగులు – ఐదు అనే సంఖ్యగల అడుగులు
నాలుగు దిక్కులు – నాలుగు అను సంఖ్యగల దిక్కులు
వంద సంవత్సరాలు – వంద అను సంఖ్యగల సంవత్సరాలు
అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం
అవధారణ అంటే నిర్థారించబడింది అని అర్థం
నిర్థారించబడిన పదం పూర్వపదంలో ఉండి తరువాత నామవాచకం ఉంటుంది.
వీటిని విగ్రహ వాక్యాలుగా మార్చినప్పుడు ‘అనెడి’ అనే పదాలు వస్తాయి.
ఉదా. కీర్తికన్యక – కీర్తి అనెడి కన్యక
విద్యాధనం – విద్య అనెడి ధనం
జ్ఞానజ్యోతి – జ్ఞాపమనెడి జ్యోతి
గానామృతం – గానమనెడి అమృతం
కోపాగ్ని – కోపమనెడి అగ్ని
మోక్షలక్ష్మీ – మోక్షమనెడి లక్ష్మీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు