ప్రిలిమ్స్ యాక్షన్ ప్లాన్ @ 25 రోజులు
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కు ఇంకా 25 రోజులు మాత్రమే ఉంది. అంటే ఎగ్జామ్‌కు ప్రీ క్లైమాక్స్ దశలో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా చదివిన వ్యూహమే పాటించాలా? మరింత వేగం పెంచాలా? 25 రోజుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి? ఎలాంటి స్ట్రాటజీ పాటిస్తే ప్రిలిమ్స్ సాధించవచ్చు? అనేది ఇప్పుడు అభ్యర్థులందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి తోడు, సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన, ఎంత చదివినా పూర్తి స్థాయి విశ్వాసం కలగకపోవడం, ఇంకా కవర్ కాని టాపిక్స్ మిగిలిపోయినట్టుగా అనిపించడం సహజంగా సంభవించే పరిణామాలు. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నిజానికి సివిల్స్ ప్రిపరేషన్ అనేది సుదీర్ఘకాలపు సన్నద్ధత. అందుకే ఈ ప్రిపరేషన్ విషయంలో మనకు సమ్మిళిత ప్రణాళిక (Integrated plan) ఉండాలి. ప్రిలిమ్స్ కోసమే కాకుండా మెయిన్స్ తరహాలో ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ పరీక్ష ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్, ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవడమే ఇంటిగ్రేటెట్ ప్లాన్. దీన్నే త్రిముఖ వ్యూహం (Tripartite Strategy) అని కూడా చెప్పవచ్చు. ఆ వివరాలు పరిశీలిస్తే…
ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్ టైప్ ప్యాట్రన్ ఉన్నప్పటికీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్న ప్రశ్నలకు మనం సమాధానాలు ఇవ్వాలంటే, ఆ ప్రశ్నలను సరిగా సాల్వ్ చేయాలంటే కచ్చితంగా సబ్జెక్టు మీద సంపూర్ణ జ్ఞానం (Complete Knowledge) సమగ్ర అవగాహన (Comprehensive Awareness ) అవసరం. సబ్జెక్టు పట్ల 360 డిగ్రీల దృక్పథం మనకు అవసరం. ఉదాహరణకు పాలిటీకి సంబంధించి సుప్రీంకోర్ట్ అనే అంశం, చరిత్రకు సంబంధించి భారతదేశ స్వాతంత్య్ర సమరం గురించిన విషయాలన్నీ కూలంకషంగా తెలిస్తే ప్రిలిమ్స్‌లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి ఎ, డి- కరెక్ట్ లేదా సి, డి – కరెక్ట్ అనే ఒక జంట సమాధానాన్ని మనకు ఇచ్చినప్పుడు ప్రశ్న పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సరైన సమాధానం ఇవ్వడం సాధ్యం.
అందుకే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అవసరం. ఇందులో భాగంగా మెయిన్స్‌కి ఎలాగైతే డిస్క్రిప్టివ్ ైస్టెల్లో మనం ప్రిపేర్ అవుతామో అనాలిసిస్‌తో పాటు ఎలాబరేటివ్ ఇన్ఫర్మే షన్, ఆయా సబ్జెక్టుకు సంబంధిం చిన పూర్తి సమాచారాన్ని, ప్రముఖ వ్యక్తులకు (Persons, News makers) సంబంధిం చిన అంశాలను, ఆయా విషయాలతో ముడిపడి ఉండే ప్రదేశాలు, స్థలాల (Places) వివరాలను, ప్రముఖ సంఘటనలను (Events), వాటి తేదీలను (Dates), వివిధ రకాల ఒప్పందాల గురించి (Treaties, Agreements, Conventions), చట్టాల (Acts, Laws, Bills) గురించి పూర్తి అవగాహన ఉండటం అవసరం. దీని మూలంగా మెయిన్స్‌కు సమయం ఆదా అవుతుంది. మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్ విధానంలో మనం మరింత సమర్థవంతంగా రాయడానికి అవకాశం ఏర్పడుతుంది.
మనలో చాలా మంది భావించేది ఏంటంటే..
ప్రిలిమ్స్ అనగానే ఆబ్జెక్టివ్ ప్యాట్రన్ కాబట్టి ఆబ్జెక్టివ్ తరహా లోనే ప్రిపేర్ అవుదామని భావించి ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్‌ను అధ్యయనం చేస్తే సరిపోతుందనుకుంటాం. కానీ ఇది సరిపోదు. ఎందువల్ల అంటే సివిల్స్ ప్రిపరేషన్ అనేది మూడు దశల్లో విడివిడిగా జరిగే ఎగ్జామినేషన్ అయినప్పటికీ ఈ మూడు దశలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండే ప్రక్రియగా మనం భావించాలి.
మన దగ్గర కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో బాగా రాణించగలుగుతాం. సబ్జెక్టు లేదా టాపిక్కు సంబంధించిన సమగ్ర సమాచారం దగ్గర ఉండాలి. అది ఆప్షనల్స్ అయినా , కరెంట్ అఫైర్స్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఆ టాపిక్కు సంబంధించిన సమగ్రమైన అవగాహన మనకు ఉంటే మనల్ని ఇంటర్వ్యూ బోర్డు ప్రశ్నించినప్పుడు కాన్ఫిడెంట్‌గా కమ్యూనికేట్ చేయగలుగుతాం.
ప్రిలిమ్స్‌కు సంబంధించి ఇప్పుడు అనుసరించాల్సిన వ్యూహం:
PQRRRAAMSS
Practice: ఇప్పటివరకు మనం చదివింది, రాసింది, సబ్జెక్ట్ వైజ్‌గా టాపిక్ వైజ్‌గా , కేటగిరీ వైజ్‌గా మనం రాసుకున్న నోట్స్ అన్నింటితో పాటు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్స్ ప్రిలిమినరీ ఓరియంటేషన్ కోసం ప్రాక్టీస్ చేయాలి. రోజుకి కనీసం ఒక్క పేపర్ అయినా సాల్వ్ చేసి మనల్ని మనం సమీక్షించుకోవాలి.
Question Bank : మనం ఇంతకుముందు రాసుకున్న నోట్స్‌ను అనుసరించి సబ్జెక్ట్ లేదా ఒక కేటగిరీకి సంబంధించి ముఖ్య ప్రశ్నలను బుల్లెట్ పాయింట్స్‌గా రాసుకోవాలి. ఆయా సబ్జెక్టులను చదువుతున్న సమయంలో రిఫర్ చేసిన పుస్తకాల్లోని ముఖ్యాంశాలను కేటగిరీ వారీగా, టాపిక్ వారీగా రాసుకున్న బుల్లెట్ పాయింట్స్‌ను క్వశ్చన్ బ్యాంకుగా భావించాలి. ప్రశ్నను ఏ విధంగా అడిగే అవకాశం ఉంది ? మనం ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేది మనకు మనం అవగాహన చేసుకోవాలి.
Re Vision : గతంలో మనం చదివిన వాటిని తిరిగి చదవడం రివిజన్. ఇప్పటివరకు మనం చదువుకున్న వాటిని రివిజన్ చేసుకోవాలి. పుస్తకం చదివేటప్పుడు అవసరమనుకున్న పాయింట్లను హైలైట్, లైన్ చేసుకొని ఉంటాం. లేదా వేరే నోట్‌బుక్‌లో నోట్ చేసుకొని ఉంటాం. ఇలాంటి అంశాలను రివిజన్ చేసుకోవాలి.
ReVisiting : ఏ సోర్స్, పుస్తకం నుంచి మనం సమాచారం తీసుకున్నామో, ఏ పుస్తకం మీద మనం ఆధారపడ్డామో వాటిని తిరిగి చదవడం. గతంలో చదివిన సమయంలో వదిలేసిన అంశాలను, ప్రాధాన్య విషయాలను మళ్లీ రాసుకోవాలి. మొదటిసారి పుస్తకంలోని ప్రాధాన్య అంశాలనే రాసుకున్నప్పుడు వందకు పైగా పాయింట్లు వస్తే రీ విజిట్ చేసినప్పుడు 10 అంశాలు రావచ్చు. మిగతావన్నీ మనకు ఇంతకుముందు తెలిసిన అంశాలు కాబట్టి క్లారిటీ తక్కువ ఉన్న అంశాలను మరొక్కసారి పునరావలోకనం చేసుకోవాలి.
Remember : ఒక టాపిక్‌ను పదేపదే మననం చేయడం వల్ల, గుర్తుకు తెచ్చుకోవడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువకాలం గుర్తుంటుంది. ముఖ్యంగా వ్యక్తుల గురించిన విషయాలు, స్థలాల గురించి, చట్టాల గురించి, తేదీలు, సంవత్సరాలు, వేడుకలు, ఉత్పత్తులకు సంబంధించిన అంశాల డేటా, వివిధ అంశాలకు సంబంధించిన ప్రగతి రేటు లేదా నిష్పత్తుల వివరాలు, కొలమానాలకు సంబంధించిన స్టాటిస్టిక్స్ను, ఆర్థిక వివరణలు, విశ్లేషణలను గుర్తుంచుకోవాలి. సైన్స్&టెక్నాలజీకి సంబంధించి వివిధ నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, ఆవిష్కర్తల ప్రయోగాల వివరాలు అన్నింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి.
Assessment : మనల్ని మించిన జడ్జి మరెవరూ ఉండరు. We Are the best judges of ourselves. గత సంవత్సరాల కు చెందిన ప్రశ్నపత్రాలను, మోడల్ పేపర్లను మనం సాల్వ్ చేసే సమయంలో అనలైజ్ చేయాలి. మొత్తం ప్రశ్నలకుగాను సరైన సమయంలో మనం ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగాం. వాటిలో ఎన్ని కరెక్ట్ సమాధానాలు రాయగలిగామన్నది బేరీజు వేసుకోవాలి. ఏయే అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో కేటగిరీల వారీగా విభజన చేసుకోవాలి.
ఆయా కేటగిరీల వారీగా ప్రాధాన్య అంశాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు పాలిటీలో స్థానిక సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాష్ర్టాల మధ్య సంబంధాలు, గవర్నర్ ప్రాముఖ్యత, న్యాయ వ్యవస్థ లాంటి అంశాలను ప్రాధాన్య పద్ధతిలో ప్రిపేర్ అవ్వాలి. మనం వెనుకబడి ఉన్న టాపిక్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
Analysis : ఒక మోడల్ పేపర్, మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్ మీద ఆధారపడి ఎప్పుడూ మనల్ని మనం అనాలసిస్ చేసుకోకూడదు. ఒక్క పేపర్ ఎప్పుడూ మనకు ప్రామాణికం, కొలమానం కాదు. కనీసం 10 మోడల్ లేదా ప్రీవియస్ పేపర్లను తీసుకొని వాటిని సాల్వ్ చేసి, వాటి ద్వారా వచ్చిన మొత్తం ఫలితాలను యావరేజ్‌గా లెక్కపెట్టాలి. తద్వారా మనం ఎక్కడ ఏ పొజీషన్లో ఉన్నామో తెలుస్తుంది. మన ఆసక్తిని బట్టి రోజుకు కనీసం ఒకటి లేదా రెండు పేపర్లను సాల్వ్ చేసుకుంటూ మనకు మనం అనాలసిస్ చేసుకుంటే పరీక్షల మీద పూర్తి పట్టు సాధించడం పెద్ద కష్టమైన పని కాదు.
Mindset : సివిల్స్ పరీక్ష పైకి మేధో పరీక్ష లాగా కనిపిస్తుంది. కానీ దాని కన్నా ముందు అది ఒక మానసిక యుద్ధం. కేవలం రెండు గంటల్లోనే ముగిసే విచిత్ర యుద్ధం. అందుకే సాధారణ సందర్భాల్లో ఎలా ఉన్నా, ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎలా ఉన్నామనేది ముఖ్యం. దీనికోసం మానసికంగా మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడం, ఏళ్ళ తరబడి చదివి, అధ్యయనం చేసి ఆకళింపు చేసుకున్న అంశాలను ఆయుధాలుగా వాడుకుంటూ ప్రశ్నలకు సరైన సమాధానాలను పెట్టడం, అప్పటికప్పుడు సమయోచిత పరిజ్ఞానంతో మెలగడం, మల్టిపుల్ సమాధానాల్లోంచి సరైన జవాబును ఎంపిక చేసుకోవడం వంటివన్నీ చేయాలంటే ముందు మనం ప్రశాం తంగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం.
అన్నివేళలా దృఢ చిత్తంతో, ధైర్యంగా ఉండాలి. దీంతోపాటు ఓపిక కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైన అంశం. పరీక్ష రాయగలమన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ తరహా మానసిక సంతులనం, మనో నిశ్చలత, సానుకూల దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుంది.
ఇవే కాకుండా, మరికొన్ని సందేహాలు కూడా ఈ ప్రీ క్లైమాక్స్ దశలో అందరినీ ఆందోళనకు గురి చేస్తాయి. అవి…
Syllabus Coverage : మొత్తం సిలబస్‌ను కవర్ చేయలేకపోయామని బాధ వద్దు. అందరూ అన్ని సబ్జెక్టుల్లో నిపుణులు కాలేరు. అందరికీ 100% మార్కులు రావు. రాని అంశాల గురించి ఇప్పుడు ఫోకస్ చేయడం అనవసరం. ప్రతీ సబ్జెక్టులో అన్ని చాప్టర్లలో ఎక్స్పర్ట్ కాలేం. ఒకటి , రెండు చాప్టర్ల విషయంలో పర్ఫెక్ట్గా లేకపోతే వాటిని వదిలేసి బాగా ప్రిపేరయిన చాప్టర్ల నుంచి ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా కాన్ఫిడెంట్‌గా ప్రిపేర్ కావాలి. అన్ని సబ్జెక్ట్స్‌ను చదివినప్పటికీ సిలబస్‌కు మించి కూడా చదవాలి. సిలబస్ అనేది దారిదీపం మాత్రమే. ప్రశ్నలు సిలబస్ నుంచి మాత్రమే కాకుండా వేరే అంశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చదవాలి. సిలబస్‌కు అనుకూలంగా సిలబస్‌తో సంబంధం ఉండి సిలబస్ చుట్టూ అల్లుకుని ఉండే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
Say No To Confusion : ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకోసం ప్రిపరేషన్ మాక్ టెస్టుల సమయంలో పరీక్షా వాతావరణాన్ని మనకి మనమే కల్పించుకోవాలి.
పరీక్ష వ్యవధికి తగ్గట్టుగా స్టాప్ వాచ్ అలారం లాంటివి పెట్టుకొని మోడల్ టెస్ట్‌లు రాయాలి. పరీక్షలు ఉన్నట్టుగానే భావించి సరైన సమాధానాలను సరైన సమయంలో రాసే ప్రయత్నం చేయాలి. టైం మేనేజ్మెంట్ కచ్చితంగా పాటించాలి. ఇలా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే పరీక్ష రోజు సరిగ్గా రాయగలుగుతాం. మన ఆత్మ విశ్వాసమే మనల్ని విజేతలుగా మారుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?