వాయువుల్లో వ్యాపనరేటు అధికంగా ఉండటానికి కారణం? (TS TET and TSLPRB)
ఉష్ణం
- పదార్థంలోని కణాలు
- 1) రేఖీయ గతిశక్తి 2) భ్రమణ గతిశక్తి
3) కంపన శక్తి 4) స్థితిజ శక్తి కలిగి ఉంటాయి. - వీటన్నింటి మొత్తాన్ని అంతర్గత శక్తి అంటారు.
- ఫ్రిజ్ నుంచి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పొల్చినట్లయితే పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లదనం నిలిపి ఉంచుతుంది.
- పుచ్చకాయలో అధికంగా నీరు ఉంటుంది. నీటి విశిష్టోష్ణం విలువ ఎక్కువ.
- సమోసా చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించకపోయినా దాన్ని తింటే లోపలి పదార్థాలు వేడిగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ.
- మిశ్రమాల పద్ధతి సూత్రం
వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం
T= M1T1+M2T2
—————-
M1+M2
20 డిగ్రీల C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని, 40 డిగ్రీల C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది.
T= M1T1+M2T2 = 50×20+50×40
—————- —————–
M1+M2 50+50
= 1000+2000 = 3000
————– ——–
100 100
T= 30o C
బాష్పీభవనం
- ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవపదార్థం, వాయు పదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను భాష్పీభవన ఉష్ణోగ్రత అంటారు.
- నీరు మరిగే స్థానం 100oC
- ఇది శీతలీకరణ ప్రక్రియ
- చెమట పట్టినప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే చల్లగా అనిపిస్తుంది. కారణం బాష్పీభవనం.
- ఫ్యాన్ గాలికి ఉంచినపుడు స్పిరిట్ తొందరగా ఆవిరి అవడం.
సాంద్రీకరణం
- వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడాన్ని సాంద్రీకరణం అంటారు.
- ఇది ఒక ఉష్ణీకరణ ప్రక్రియ
- వేసవి రోజుల్లో షవర్ కింద స్నానం చేసిన తర్వాత శరీరం వెచ్చగా అనిపిస్తుంది. కారణం సాంద్రీకరణం.
- చల్లని నీటితో నింపిన గాజుగ్లాసు గోడలపై నీటి అణువులు ఏర్పడతాయి కారణం సాంద్రీకరణం.
- ఉత్పతనం: ఘన పదార్థం నేరుగా వాయుస్థితిలోకి మారడం.
- ఉదా: కర్పూరం కరగడం, NH4Cl స్పటికాలు ఆవిరి అవడం, నాఫ్తలిన్ గుళికలు మొదలైనవి.
ఆర్థ్రత
- గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్థ్రత అంటారు.
- వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు.
- పొగవలె గాలిలో తేలియాడే నీటి బిందువు లను పొగమంచు అంటారు.
- మరగడం: ఏదైనా పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని మరగడం అంటారు. ఆ ఉష్ణోగ్రతను ద్రవం మరుగే స్థానం (Boiling Point) అంటారు.
- బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్ద నైనా జరుగుతుంది. కానీ మరగడం అనేది ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది.
- నీరు ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మార డానికి ఉపయోగించే ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు.
- L =Q/m
గుప్తోష్ణం
- C.G.S ప్రమాణం-Cal /Grm
- SI ప్రమాణం – Joul /Kg
- సాధారణ పీడనం వద్ద నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 Cal/Grm
ద్రవీభవనం
- స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం, ద్రవంగా మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు. దీన్నే విలీనం అంటారు.
- ఏ ఉష్ణోగ్రత వద్ద ఘన స్థితిలోని పదార్థం, ద్రవస్థితిలోకి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు. కణాల మధ్య ఆకర్షణ బలంపై ఆధారపడుతుంది.
- స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రాము ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ‘ద్రవీభవన గుప్తోష్ణం’ అంటారు.
- L=Q/m
- మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 Cal/gm
ఘనీభవనం
- ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘన స్థితిలోకి మారే ప్రక్రియను ఘనీభవనం అంటారు.
- సాధారణ వాతావరణ పీడనం(1atm, 0oC వద్ద నీరు ఘనీభవనం చెందుతుంది.
- నీరు ఘనీభవించినపుడు వ్యాకోచిస్తుంది. (ఘనపరిమాణం పెరుగుతుంది)
- నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ కాబట్టి నీటిపై మంచు తేలుతుంది.
ఇగురుట
- వేడి చేయకుండానే ఒక ద్రవపదార్థం ఆవిరై పరిసర ప్రాంతపు ఉష్ణోగ్రతను తగ్గించే ప్రక్రియను ఇగురుట అంటారు.
- ఉదా: అరచేతిలో పెట్రోలు, ఈథర్ను ఉంచి నపుడు చేయి చల్లగా కావడం
- మరిగే స్థానం కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాష్పంగా మారే దృగ్విషయం.
- పీడనం పెంచినట్లయితే నీటి మరిగే స్థానం పెరుగుతుంది అనే సూత్రంపై ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది.
- పీడనం పెంచితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది. ఈ సూత్రంపై స్కేటింగ్ చేస్తారు.పదార్థాలు- వ్యాకోచం
- ఘన పదార్థాల వ్యాకోచం
- ప్రతి ఘన పదార్థంలోని ద్రవ్యరాశి అనేది పొడవు వెడల్పు ఎత్తులతో విభజించి ఉంటుంది.
- పొడవు వెంబడి వ్యాకోచిస్తే దైర్ఘ్య వ్యాకోచం అని, పొడవు, వెడల్పు రెండింటి వెంబడి వ్యాకోచిస్తే వైశాల్య వ్యాకోచం అని మూడు అంశాలతో వ్యాకోచం జరిగితే ఘన పరిమాణ వ్యాకోచం అని పిలుస్తారు.
అనువర్తనాలు
- రైలు పట్టాల మధ్య తగినంత ఖాళీ వదిలి వేయడం
- విద్యుత్ టెలిఫోన్ స్తంభాల మధ్య గల తీగలను కొంచెం వదులుగా చేయడం
- విద్యుత్ బల్బును సీల్ చేయడానికి ప్లాటినం ఉపయోగిస్తారు.
- గాజు ఫలకపై వేడి నీటిని లేదా ద్రవాన్ని చల్లినపుడు గాజు పొరల మధ్య అసమాన వ్యాకోచం వల్ల పగిలిపోతుంది.
- ఇన్వార్స్ స్టీలు సంకోచ వ్యాకోచాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని శృతిదండం, మీటరు స్కేలు, నియంత్రిక యంత్రం అంటారు. దీన్ని ఆటోమెటిక్ ఇస్త్రీపెట్టే, ఓవెన్లో ఉష్ణోగ్రత క్రమబద్దీక రణకు ఉపయోగిస్తారు.
ద్రవపదార్థాల వ్యాకోచం
- ద్రవాలను వేడి చేసినపుడు వాటి ఘనపరిమాణంలో వ్యాకోచిస్తాయి.
- నిజవ్యాకోచం = పాత్ర వ్యాకోచం + దృశ్యవ్యాకోచం
- 4 డిగ్రీల C వద్ద నీటిని వేడిచేసినా, చల్లబరిచినా అది వ్యాకోచిస్తుంది. దీన్ని ‘నీటి అసంగత వ్యాకోచం’ అంటారు.
- 4 డిగ్రీల C వద్ద నీటికి అధిక సాంద్రత ఉంటుంది
- నీటి అసంగత వ్యాకోచాన్ని డయా మీటర్ అనే పరికరంతో కొలుస్తారు.
అనువర్తనాలు
- అతిశీతల ప్రాంతంలో జలచరాలు బతకడానికి గల కారణం
- చలికాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోవడానికి
- చలికాలంలో నల్లరేగడి నేలలు బీటలు వారడానికి
- ప్రకృతిలో శిలా శైథిల్యం జరగడానికి నీటి అసంగత వ్యాకోచం కారణం
వాయువుల వ్యాకోచం
- వాయువుల్లో అణువుల మధ్య దూరం అధికంగా ఉండటం వల్ల వ్యాకోచం అధికంగా ఉంటుంది. (ఘన, ద్రవ, పదార్థాలతో పోల్చితే)
- ఉదా: వేసవికాలంలో వాహనాల టైర్లలో గాలి వ్యాకోచించడం వల్ల అవి పగిలిపోతాయి.
- రెండు అరచేతులను రుద్దినపుడు వేడెక్కడం, సుత్తితో పదేపదే కొట్టడం వల్ల ఇనుము వేడెక్కడం,
- కుంకుడు గింజను తీసుకొని రాతిమీద అరగదీసినపుడు వేడెక్కుతుంది.
- పై సందర్భాల్లో యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది.
- నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ హీటర్ను ఉపయోగిస్తే విద్యుత్శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది.
- గ్యాస్స్టౌవ్ వాడినట్లయితే రసాయనశక్తి ఉష్ణశక్తిగానూ, సోలార్ హీటర్ వినియోగిస్తే సౌరశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది.
- స్టీం ఇంజిన్లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఇది ఆవిరి యంత్రం కదల డానికి ఉపయోగపడుతుంది.
- థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచం జరిపే ద్రవపదార్థాలుగా పాదరసం, ఆల్కహాల్ను ఉపయోగిస్తారు.
- క్రీ.శ. 1593లో మొదటి థర్మామీటరును గెలీలియో కనుగొన్నాడు. దీనిలో పదార్థంగా గాలిని ఉపయోగించాడు.
- పసిపిల్లలు, చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి థర్మిస్టర్/థర్మామీటరును ఉపయోగిస్తారు.
- డిజిటల్ థర్మామీటర్ ఒక ఎలక్ట్రాన్ సాధనం
- కొంత ద్రవ్యరాశి కలిగిఉండి స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా పదార్థం అని చెప్పవచ్చు.
- పదార్ధం మూడు స్థితుల్లో లభిస్తుంది.
- 1) ఘన స్థితి 2) ద్రవస్థితి 3) వాయుస్థితి
- ఘన పదార్థాలు నిర్దిష్టమైన ఆకారాన్ని, ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయి.
- ద్రవపదార్థాల ఆకారాలు వాటిని కలిగి ఉన్న పాత్రల ఆకారాలపై ఆధారపడి ఉంటాయి.
- ద్రవాలను ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి సులభంగా మార్చవచ్చు. కనుక వీటిని ప్రవాహాలు అని అంటారు.
- ద్రవాలు నిర్దిష్ట ఆకారం లేనప్పటికీ నిర్దిష్ట ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయి.
- పదార్థంలోని కణాల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది.
- ద్రవ, వాయు పదార్థాల్లోని కణాలు నిరంతరం చలనంలో ఉంటాయి.
- వాయుపదార్థాలు, నిర్దిష్ట ఆకారాన్ని, ఘన పరిమాణాన్ని కలిగి ఉండవు.
- ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయి.
- ఇళ్ళలో వంట అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్), మోటారు వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీ (కంప్రెస్స్డ్ నేచురల్ గ్యాస్)లను అధిక పరిమాణంలో ఉన్న వాయువును సంపీడ్యం చెందించి తక్కువ పరిమాణం గల సిలిండర్లలో నింపుతారు.
వ్యాపనం
- అగరబత్తిని వెలిగించగానే దానిలోని సుగంధ ద్రవ్యం ఆవిరిగా మారి అగరబత్తి పొగతో పాటు గాలిలో కలిసి గది అన్ని వైపులా వ్యాపిస్తుంది. దీనినే వ్యాపనం అంటారు.
- వాయువుల వ్యాపన రేటు, ద్రవాలు, ఘన పదార్థాల కంటే అధికంగా ఉంటుంది. భూమిపై ప్రాణులు, మొక్కలు, జంతువుల మనుగడకు కారణం ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు నీటిలో వ్యాపనం చెందడం.
- శ్వాసక్రియలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి వ్యాపనం చెందుతుంది.
- అలాగే CO2 రక్తం నుంచి ఊపిరితిత్తులకు వ్యాపనం చెందుతుంది.
- పదార్థపు కణాలు నిరంతరం కదులుతు న్నప్పుడు మాత్రమే వ్యాపనం సాధ్యమవు తుంది.
- వాయువుల్లో వ్యాపనరేటు అధికంగా ఉండటానికి కారణం:
- వాయువుల్లో కణాల చలనవేగం అధికంగా ఉండటం.
- కణాల మధ్య ఖాళీ స్థలం అధికంగా ఉండటం
వ్యాపనరేటు
- వాయువులు > ద్రవపదార్థాలు > ఘన పదార్థాలుగా ఉంటుంది.
- ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వ్యాపనరేటు పెరుగుతుంది.
- ఘనస్థితిలోని CO2ను పొడిమంచు అని అంటారు.
Previous article
ప్రిలిమ్స్ యాక్షన్ ప్లాన్ @ 25 రోజులు
Next article
భారత ఆర్థిక వ్యవస్థ – ప్రణాళికలు – నీతి ఆయోగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు