ఇవి వాణిజ్య మొక్కలు
రెసిన్
-ఇది ఆల్కహాల్లో కరిగే, అతుక్కునే పదార్థం.
-దీన్ని వార్నిష్‌ల తయారీలో, పేపర్ సీలింగ్‌లో వాడుతారు.
-పైనస్ మొక్క నుంచి టర్పెంటిన్, రోసిన్ అనే రెసిన్లు తయారవుతాయి.
-సాల్ (సోరియా రోబస్టా) మొక్క నుంచి డమర్ అనే రెసిన్ తయారవుతుంది.
జిగుర్లు
-మొక్కకు గాయమైనప్పుడు ఉత్పత్తి అయ్యి గాయాన్ని మాన్పుతుంది.
-బైండింగ్ కోసం ఉపయోగిస్తారు.
-తుమ్మ (అకేషియా), వేప (అజడరిక్టా) జాతుల కాండాల నుంచి జిగుర్లు లభిస్తాయి.
టానిన్స్
-ఇవి వగరుగా ఉండి తోళ్లశుద్ధిలో తోడ్పడుతాయి.
-వీటిని ఎక్కువగా అద్దకాలు, ఇంకులలో వాడుతారు.
-తమలపాకు (పైపర్ బీటిల్), తంగేడు (కేసియా), వాల్నట్ బెరడు, అకేషియా నీలోటికా బెరడు నుంచి లభిస్తాయి.
లేటెక్స్
-ఇది పాలలా తెల్లగా ఉండే, రబ్బరు అణువులు తేలియాడుతూ ఉండే ఒక ఎమల్షన్.
-ఇది మొక్కల్లో లాటిఫెరస్ కణజాల రూపంలో ఉంటుంది.
-రబ్బరు రేణువులకు సల్ఫర్ అనే ఉత్ప్రేరకాన్ని కలిపి వల్కనైజేషన్ ప్రక్రియ ద్వారా సంపూర్ణ రబ్బర్‌ను తయారుచేస్తారు. మనదేశంలో రబ్బరు ఉత్పత్తిలో కేరళ (90 శాతం) మొదటి స్థానంలో ఉంది.
-హీవియా బ్రెజిలెన్సిస్, ఆక్రస్ సపోటా, పైకస్ ఇలాస్టికా (ఇండియన్ రబ్బర్) మొక్కల నుంచి లేటెక్స్ లభిస్తుంది.
ఆల్కలాయిడ్స్
-ఆల్కలాయిడ్స్ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. ఇవి మొక్కలకు ఉపయోగపడవు. కానీ మానవాళికి వివిధ ఔషధాల తయారీలో పనికొస్తాయి.
మత్తు పదార్థాలు
1. నమిలేవి: వక్క, తమలపాకు మొదలైనవి.
2. పొగపీల్చేవి: పొగాకు, గంజాయి
-గంజాయి కెన్నాబిస్ సటైవస్ మొక్క పత్రాలు, కీలాగ్రం నుంచి లభిస్తుంది.
మత్తు పానీయాలు
1. నాన్ ఆల్కహాలిక్ పానీయాలు: కాఫీ, టీ.
2. ఆల్కహాలిక్ పానీయాలు
ఎ. కిణ్వన పానీయాలు
-ఆక్సిజన్ రహిత పరిస్థితుల్లో సూక్ష్మజీవుల (ఈస్ట్, బ్యాక్టీరియా) కిణ్వన చర్యవల్ల బార్లీ, గోధుమ, మొలాసిస్ (చెరుకు రసం), ద్రాక్షరసం వంటి పదార్థాలు ఆల్కహాల్‌ను ఏర్పరుస్తాయి.
ఉదా: 1. బీరు: దీనిలో 3-6 శాతం ఆల్కహాల్ ఉంటుంది.
2. వైన్: దీనిలో ఆల్కహాల్ శాతం 10-20.
బి. స్వేదన పానీయాలు
-స్వేదన ప్రక్రియ ద్వారా తయారయ్యేవి స్వేదన పానీయాలు.
ఉదా: 1. విస్కీ: బార్లీ, గోధుమ, ఓట్, బంగాళదుంప నుంచి తయారీ.
2. బ్రాందీ: దీనిలో 60-70 శాతం ఆల్కహాల్ ఉంటుంది.
3. ఓడ్కా: బంగాళదుంప గుజ్జు నుంచి తయారు చేస్తారు. దీనిలో 40-60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది ఎక్కువగా రష్యాలో తయారవుతుంది.
4. రమ్ (RUM): ఇది చెరుకు రసం నుంచి తయారవుతుంది. దీనిలో 40 శాతం ఆల్కహాల్ ఉంటుంది.
మత్తు పానీయాలవల్ల కలిగే దుష్ప్రభావాలు
1. జీర్ణాశయం అల్సర్లు, మ్యూకస్ పొర వాపు
2. మానసిక ఒత్తిడి (డిప్రెషన్)
3. రక్తనాళాలు (దమనులు) గట్టిపడటం
4. గుండెపోటు, హైబీపీ మొదలైన వాటికి దారితీయడం
VII. నారలనిచ్చే మొక్కలు
-రెండు వైపుల కొనలు మొనదేలి మధ్యలో ఇరుకైన అవకాశికను కలిగిన పొడవైన దృఢ కణాన్ని నార అంటారు. ఇవి లిగ్నిన్‌తో నిర్మితమైన నిర్జీవ కణాలు. నారలను విడదీసే పరిశ్రమలను ఫైబర్ రెట్టింగ్ పరిశ్రమలు అంటారు.
1. పత్తినారలు (గాసీపియం)
-ఇవి విత్తన కవచం నుంచి ఏర్పడిన ఏక కణయుత కేశాలు.
-పొడవు నారలను లింట్ అని, పొట్టి నారలను ఫజ్ అని అంటారు.
-పత్తి నారకు నత్రికామ్లం కలిపి పేలుడు వస్తువుల తయారీలో వాడే గన్ కాటన్ తయారు చేస్తారు.
2. జనపనార/జూట్
-కార్కోరస్ క్యాప్సులారిస్ మొక్క కాండం నుంచి లభిస్తుంది. (పశ్చిమ బెంగాల్)
-దీన్ని రవాణాకు ఉపయోగించే సంచుల తయారీలోనూ.. తెరచాపలు, జూట్ వస్ర్తాల తయారీలోనూ ఉపయోగిస్తారు.
3. కొబ్బరి నార (కోకస్ న్యూసిఫెరా)
-మధ్య ఫలకవచం నుంచి నార లభిస్తుంది.
-దీన్ని డోర్ మ్యాట్లు, బస్సు సీట్ల తయారీలో ఉపయోగిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు