లక్షదీవులు గురించి కొన్ని సంగతులు..
లక్షద్వీప్ అనే సంస్కృత పదానికి ఇంగ్లిష్‌లో a hundred thousand islands అని అర్థం. ప్రవాళ కేరళ తీరంలో గల లక్షద్వీపాలు సముద్రంలో గల నిర్మిత దీవులే. భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. మొత్తం 36 ద్వీపాలు 32.62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే 11 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఉనికి పరంగా లక్షదీవులు 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 12 డిగ్రీల-20 డిగ్రీల మినట్స్ ఉత్తర అక్షాంశ వరకు, అదేవిధంగా 71 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 74 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉన్నాయి.
- లక్ష దీవుల రాజధాని కవరట్టి. ఇది కన్ననూర్ దీవుల్లో ఉన్నది.
- లక్ష దీవుల్లో అతిపెద్ద దీవి మినికాయ్ దీవి (4.5 చదరపు కిలోమీటర్లు). అతిచిన్న దీవి బిత్రా (Bitra)
- లక్ష దీవుల్లో అత్యంత ఉత్తరాన ఉన్న దీవి చట్లట్. అత్యంత దక్షిణాన ఉన్న దీవి ‘మినికాయ్’.
- ఇవి పగడపు దీవులు (Coral Islands). ఇవి 132 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉన్నాయి.
- ఈ దీవులు 1 నవంబర్ 1973లో లక్క దీవులు, మినికాయ్, అమిని దీవుల కలయిక వల్ల ఏర్పడ్డాయి.
- కేరళ తీరం (మలబార్ తీరం) నుంచి 220 నుంచి 440 కిలోమీటర్ల దూరంలో దక్షిణ అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్నాయి.
- అగటి, బంగారం దీవులు పర్యాటక రంగానికి ప్రసిద్ధి. అగటి ద్వీపంలో విమానాశ్రయం ఉంది.
- ఇది అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. అక్షరాస్యులు అధికంగా కలిగి ఎస్సీ, ఎస్టీలు లేని ప్రాంతం.
- వీటిని 3 రకాలుగా విభజించారు.
- అమిని దీవులు- 110 ఉత్తర అక్షాంశానికి ఉత్తరంగా ఉన్నాయి.
- లక్క దీవులు – 110 ఉత్తర అక్షాంశం దగ్గర విస్తరించి ఉన్నాయి.
- కన్ననూరు దీవులు- 110 ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా ఉన్నాయి.
- భారత్‌లో ఒక్కరోజులో 116 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం అమిని దీవుల్లో నమోదైంది.
- ప్రపంచంలో ఒక్క రోజులో అత్యధికంగా ‘ఫాక్-ఫాక్ దీవుల్లో’ 182 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
- ‘పిట్టి దీవి’ జనరహిత దీవి. ఇక్కడ ‘పెలాజిక్’ పక్షుల ప్రజనన కేంద్రం (breeding station) ఉంది.
గుజరాత్
- పిరం (పిరంబెట్) దీవి – ఇది గల్ఫ్ ఆఫ్ కాంబేకు దగ్గర ఉంది.
- బైలాసా దీవి- ఇది కథియవార్ ద్వీపకల్పం దగ్గర ఉంది. ఇది ‘కాంబే సింధుశాఖ’ లో కలదు.
- వైడా, నరర, బెట్ ద్వార్కా, పిరోటాస్ దీవులు- ఇవి కచ్ సింధుశాఖకు దగ్గర తీరంలో ఉన్నాయి.
- డయ్యూ, అలియాబెట్ దీవులు- ఇవి నర్మద, తపతి నదులు కలిసే ముఖద్వారం దగ్గర ఉన్నాయి.
మహారాష్ట్ర
- బచ్చర్ దీవి (జవహార్) – ముంబై తీరానికి దగ్గర ఉంటుంది.
- ఎలిఫెంటా దీవి ( ఘరాపురి) దీనిలో యునెస్కో గుర్తించిన ఎలిఫెంటా గుహలు ఉన్నాయి.
- ముంబైని ఏడు దీవుల నగరం (City of seven Isalands) అంటారు.
- సాల్ సెట్టి ద్వీపం- ముంబై తీరానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉల్హాస్నది ప్రవహి స్తుంది.
కర్ణాటక
- శివ సముద్రం – ఇది కావేరి నది వల్ల ఏర్పడింది.
- భారత్‌లో మొదటి జలవిద్యుత్ ప్రాజెక్టు శివ సముద్రానికి దగ్గర ఉన్న శివసముద్ర జలపాతం వద్ద ఉన్నది. (ఇక్కడి నుంచి మొదట 1902లో జలవిద్యుత్ ఉత్పత్తి చేశారు).
- సెయింట్ మేరీ దీవి- ఇది ఉడిపికి దగ్గర ఉంది.
- కొబ్బరి తోటలకు ప్రసిద్ధి
- దీన్ని కోకోనట్ దీవి అంటారు.
పశ్చిమ బెంగాల్
- జంబూ దీవి- బెంగాల్ తీరంలో ఉంది.
- హెన్రీ దీవి- బెంగాల్ తీరంలో ఉంది.
- సాగర్ దీవులు- హూగ్లీ నది ముఖద్వారం దగ్గర ఉన్నాయి.
గోవా
దీవర్ దీవి- ఇది మండోవి నది వల్ల ఏర్పడింది.
కేరళ
మాన్రో దీవి- ఇది అష్టముది సరస్సులో ఉంది.
వల్లార్ పాదం, విల్లింగ్డన్, వైపిన్ దీవులు కొచ్చిన్‌కు దగ్గరలో వెంబనాడు సరస్సులో ఉన్నాయి.
తమిళనాడు
క్విబుల్ దీవి – చెన్నైకి దగ్గరలోని అడయార్ నది వల్ల ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
భవానీ ద్వీపం- ఇది విజయవాడకు దగ్గర కృష్ణానది వల్ల ఏర్పడింది.
దివిసీమ- కృష్ణా జిల్లాలో కృష్ణానది ముఖద్వారం దగ్గర ఉంది.
హోప్ నది- కాకినాడకు దగ్గరలో ఉంది. కోరింగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది.
శ్రీహరి కోట దీవి- ఇది నెల్లూరు జిల్లాలో ఉంది.
దీనిలో పులికాట్ సరస్సు ఉంది. దీనిలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉంది.
ఒడిశా
వీలర్ దీవి- దీనిలో క్షిపణి పరీక్షా కేంద్రం ఉంది.
పారికుడ్ దీవి- ఇది చిల్కా సరస్సులో ఉంది.
బాలాసోర్ దీవి- ఇక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది.
అతి ముఖ్యమైన ఛానల్స్
- సముద్రాల్లోని ఓడల్లో ప్రయాణించేందుకు అనువుగా సరైన లోతును, వెడల్పును కలిగిన సముద్ర భాగాన్ని ఛానల్ అంటారు. లక్ష దీవులకు-మాల్దీవులకు మధ్య 8 డిగ్రీల ఛానల్ ఉంది.
- లక్ష దీవుల్లో సుహేళి దీవికి-మినికాయ్ దీవికి మధ్య 9 డిగ్రీల ఛానల్ ఉంది.
- ఉత్తర అండమాన్ దీవులకు-కోకో దీవులకు (మయన్మార్) కు మధ్య ఉన్నది ‘కోకో ఛానల్’.
- మధ్య అండమాన్- ఉత్తర అండమాన్లను ‘ఆస్టేన్ జలసంధి’ విడదీస్తుంది.
- మధ్య అండమాన్, భారతాంగ్ దీవులను ‘హంప్రే జలసంధి’ విడదీస్తుంది.
- దక్షిణ అండమాన్ (రట్లాండ్) లిటిల్ అండమాన్‌ను వేరు చేసేది ‘డంకన్ ప్యాసేజ్’.
- అండమాన్& కార్ నికోబార్ దీవులు, అండమాన్ దీవులు& నికోబార్ దీవులను 10 డిగ్రీల ఛానల్ వేరుచేస్తుంది.
- కచ్చల్ దీవులకు & లిటిల్ నికోబార్ దీవిని ‘సోంబ్రెరా ఛానల్’ వేరు చేస్తుంది.
- లిటిల్ నికోబార్ & గ్రేట్ నికోబార్‌ను వేరు చేసేది ‘సెయింట్ జార్జెస్ ఛానల్’
- గ్రేట్ నికోబార్& సమత్రా దీవుల (ఇండో నేషియా) ను గ్రేట్ ఛానల్ వేరుచేస్తుంది.
- ప్రపంచంలో అత్యధిక జనాభా గల దీవి – ‘జావా ద్వీపం’ (ఇండోనేషియా).
- అత్యధిక దీవులుగల మహాసముద్రం – ‘పసిఫిక్ మహాసముద్రం’
- 2021 అక్టోబర్ 16న అండమాన్ నికోబార్ దీవుల్లోని ‘మౌంట్ హరియోట్’ శిఖరం పేరును మణిపూర్
- స్వాతంత్య్ర పోరాట యోధుల గుర్తింపుగా ‘మౌరల్ మణిపూర్’గా మార్చారు.
- లక్ష దీవుల్లో పెద్దనగరం ‘ఆండ్రాట్’
- సెల్యూలర్ (కాలాపాని) జైలు పోర్ట్బెయిల్ లో ఉంది. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1896 లో నిర్మించింది.
- స్వాతంత్య్రోద్యమ కాలంలో రాజకీయ ఖైదీలను ఇక్కడికి పంపేవారు.
- 2018 డిసెంబర్ 30న అండమాన్ నికోబార్ దీవుల్లోని మూడు దీవుల పేర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది.
- గ్రేట్ అండమానీస్ గిరిజన తెగ (ట్రైబ్) అండమాన్‌లో ప్రవహించే ‘స్ట్రేయిట్’ నది పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్నారు.
- ‘ఓంగే’ గిరిజన తెగ ‘లిటిల్ అండమాన్ దీవిలోని డ్యూగాంగ్ క్రిక్లో నివసిస్తున్నారు.
- ‘జారవా’ గిరిజన తెగ దక్షిణ&మధ్య అండమాన్‌లో నివసిస్తున్నారు.
- ‘సెంటినలీస్’ గిరిజన తెగ ఉత్తర సెంటినల్ ద్వీపంలో నివసిస్తున్నారు.
- ‘షాంపెన్స్’ గిరిజన తెగ గ్రేట్ నికోబార్ దీవిలో నివసిస్తున్నారు.
- ‘నికోబారీస్’ గిరిజన తెగ నికోబార్ దీవుల్లో నివసిస్తున్నారు.
1. భారత్-పాకిస్థాన్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. సిందూ నది జలాల్లో భారత్ వాటా 20శాతం
బి. బియాస్, రావి, సట్లెజ్ నదుల జలాల ను భారత్ వాడుకోవాలి
సి. జీలమ్, చీనాబ్, కిషన్‌గంగ నదుల జలాలను పాకిస్థాన్ వాడుకోవాలి
1) బి, సి సరైనవి 2) ఎ, సి సరైనవి
3) ఎ, బి, సి సరైనవి 4) ఏదీకాదు
2. భారతదేశ వాణిజ్య జలాల పరిధి (EEZ-Exclusive Economic Zone). దీన్ని ప్రత్యేక ఆర్థిక పరిధి అంటారు. అయితే దీని విస్తీర్ణం ఎంత?
1) 2.3 మిలియన్ చ.కి.మీ
2) 3.2 మిలియన్ చ.కి.మీ
3) 2.4 మిలియన్ చ.కి.మీ
4) 4.2 మిలియన్ చ.కి.మీ
3. కేంద్ర హోంశాఖ 2020-21 రిపోర్టు ప్రకారం దేశంలో మొత్తం దీవుల సంఖ్య ఎంత?
1) 1482 2) 1382
3) 1582 4) 1282
4. ‘జారవా’ గిరిజన తెగ ఎక్కడ నివసిస్తుంది?
1) దక్షిణ, మధ్య అండమాన్ 1
2) గ్రేట్ నికోబార్ దీవి
3) స్ట్రేయిట్ నదీ పరీవాహక ప్రాంతం
4) లిటిల్ అండమాన్ ప్రాంతం
5. ఏ దీవిని కేంద్ర ప్రభుత్వం ‘సుభాష్ చంద్రబోస్ దీవి’గా పేరు మార్చింది?
1) నీల్ దీవి 2) రాస్ దీవి
3) హేవలాక్ దీవి 4) ఏదీకాదు
జవాబులు
1-3, 2-1, 3-2, 4-1, 5-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు