తెలంగాణ రాష్ట్ర సమాచారం
తెలంగాణ ఆవిర్భావ సమయానికి రాష్ట్ర భౌగోళిక వైశాల్యం 1,14,840 చ.కి.మీ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 యాక్ట్ నెం.6ను అనుసరించి, 2014 జూలై 17న యాక్ట్ నెం.6ను అనుసరించి, 2014 జులై 17న యాక్ట్ నెం.19 సెక్షన్ 3ని అనుసరించి పోలవరం ముంపు గ్రామాలను దృష్టిలో ఉంచుకుని సవరణ చేశారు. దీనిలో భాగంగా 7 మండలాలు, 327 గ్రామాలను (2,763 చ.కి.మీ. వైశాల్యం) ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయవలసివచ్చింది.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది – 2014 జూన్ 2
- ముఖ్యమంత్రి – కల్వకుంట్ల చంద్రశఖర్ రావు
- గవర్నర్ – తమిళి సై సౌందర రాజన్
- స్పీకర్ – పోచారం శ్రీనివాస రెడ్డి
- శాసనమండలి చైర్మన్ – గుత్తా సుఖేందర్ రెడ్డి
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – సతీష్ చంద్ర శర్మ
సరిహద్దులు
- పడమర- కర్ణాటక
- ఉత్తర వాయవ్యం- మహారాష్ట్ర
- ఈశాన్యం- ఛత్తీస్గఢ్
- తూర్పు ఆగ్నేయం- ఆంధ్రప్రదేశ్
- తూర్పు, దక్షిణం- ఆంధ్రప్రదేశ్
వివిధ రాష్ట్రాలతో సరిహద్దులు గల జిల్లాలు
- ఆంధ్రద్రేశ్- జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం
- కర్ణాటక- కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల
- మహారాష్ట్ర- కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్భూపాలపల్లి
- ఛత్తీస్గఢ్- జయశంకర్భూపాలపల్లి, కొత్తగూడెం
- గోదావరి నదీ పరీవాహక ప్రాంతం- నిర్మల్- నిజామాబాద్, నిర్మల్-జగిత్యాల, మంచిర్యాల-జగిత్యాల, మంచిర్యాల-పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, భద్రాచలం
- కృష్ణా నది- మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట.
- దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ 11 వ పెద్ద రాష్ట్రం
- దేశ జనాభాలో తెలంగాణ 12వ పెద్ద రాష్ట్రం
- దేశ జనాభాలో తెలంగాణ శాతం- 13.58
- ఖమ్మం జిల్లాకు చెందిన 5 మండలాలను పూర్తిగా, రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రద్రేశ్లో కలిపారు.
- పూర్తిగా కోల్పోయిన మండలాలు: 5 (వేలేరుపాడు, కుకునూరు, వీఆర్పురం, చింతూరు, కూనవరం)
పాక్షికంగా కోల్పోయిన మండలాలు- 1. భద్రాచలం, 2. బూర్గంపాడు - భద్రాచలం నుంచి 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలు, బూర్గంపాడు నుంచి 6 రెవెన్యూ గ్రామాలు, 4 గ్రామపంచాయతీలు కోల్పోయాం. ఫలితంగా తెలంగాణ 327 గ్రామాలు, 87 గ్రామ పంచాయతీలను కోల్పోయింది.
- ప్రస్తుత తెలంగాణ వైశాల్యం 1,12,077 చ.కి.మీ. ఇది దేశ విస్తీర్ణంలో 3.41 శాతంతో 11వ స్థానంలో ఉన్నది.
మొత్తం జిల్లాలు- 33
పెద్దజిల్లా- 1. నల్లగొండ (7.222.98 చ.కి.మీ),
2. భద్రాద్రి కొత్తగూడెం (7.015.69 చ.కి.మీ),
3. నాగర్కర్నూల్ (6,395.95 చ.కి.మీ)
చిన్న జిల్లా- 1. హైదరాబాద్ (217.13 చ.కి.మీ)
2. మేడ్చల్మల్కాజిగిరి (1,059.86చ.కి.మీ)
3. హనుమకొండ (1,653.58 చ.కి.మీ)
జిల్లా పరిషత్లు- 32
అసెంబ్లీ నియోజకవర్గాలు – 119
ఎస్సీకి కేటాయించినవి – 19
ఎస్టీకి కేటాయించినవి – 11
శాసనమండలి స్థానాలు – 40
పార్లమెంట్ నియోజకవర్గాలు – 17
ఎంపీ ఎస్టీ నియోజకవర్గాలు – 2 (ఆదిలాబాద్, మహబూబాబాద్)
ఎంపీ ఎస్సీ నియోజకవర్గాలు – 3 (వరంగల్, నాగర్కర్నూల్, పెద్దపల్లి)
రాజ్యసభ స్థానాలు – 7
రెవెన్యూ డివిజన్లు – 74
అత్యధిక రెవెన్యూ డివిజన్లు- రంగారెడ్డి (5)
మొత్తం మండలాలు – 594
అత్యధిక మండలాలు – నల్లగొండ (31)
అత్యల్ప మండలాలు – ములుగు (9)
రెవెన్యూ గ్రామాలు – 10,909
అత్యధిక రెవెన్యూ గ్రామాలు గల జిల్లా – సంగారెడ్డి (600)
అత్యల్ప రెవెన్యూ గ్రామాలు గల జిల్లా – హైదరాబాద్ (66)
మున్సిపల్ కార్పొరేషన్లు – 13
మున్సిపాలిటీలు – 129
కంటోన్మెంట్ – 1
గ్రామపంచాయతీలు – 12,769
అత్యధిక గ్రామపంచాయతీలు – నల్లగొండ (844)
గ్రామ పంచాయతీలు లేనిది – హైదరాబాద్
తెలంగాణ జనాభా -> 3,50,03,674 (దేశ జనాభాలో 2.89%)
అత్యధిక జనాభా గల జిల్లాలు
హైదరాబాద్ (39,43,323)
మేడ్చల్ మల్కాజిగిరి (24,60,096)
రంగారెడ్డి (24,26,243)
అత్యల్ప జనాభా గల జిల్లాలు
ములుగు (2,94,671)
జయశంకర్భూపాలపల్లి (4,16,763)
కుమ్రంభీం ఆసిఫాబాద్ (5,15,812)
కుటుంబాలు – 83,03,612
పురుషులు – 1,76,11,633 (50.31%)
మహిళలు – 1,73,92,041 (49.69%)
ట్రాన్స్జెండర్లు – 58,264 (0.16%)
రాష్ట్ర జనసాంద్రత – 312
అత్యధిక జనసాంద్రత
హైదరాబాద్ (18,161),
మేడ్చల్ మల్కాజిగిరి (2,321),
హనుమకొండ (642)
అత్యల్ప జనసాంద్రత
ములుగు జిల్లా (71)
కుమ్రంభీం ఆసిఫాబాద్ (115)
నాగర్కర్నూల్ (135)
గ్రామీణ జనాభా -> 2,13,95,009 (61.1%)
అత్యధిక గ్రామీణ జనాభా – నల్లగొండ (12,50,113%)
నిజామాబాద్ (11,06,272)
ఖమ్మం (10,84,811)
అత్యధిక శాతం గ్రామీణ జనాభా
– ములుగు (96.1%)
– నారాయణపేట(92.6)
అత్యల్ప గ్రామీణ జనాభా
మేడ్చల్ మల్కాజిగిరి (2,09,828)
ములుగు (2,83,178)
జయశంకర్ భూపాలపల్లి (3,74,376)
పట్టణ జనాభా -> 1,36,08,665 (38.9%)
అత్యధిక పట్టణ జనాభా
1. హైదరాబాద్ (39,43,323),
2. మేడ్చల్ మల్కాజిగిరి (22,50,267),
3. రంగారెడ్డి (14,00,130)
అత్యల్ప పట్టణ జనాభా
1. ములుగు (11,493)
2. నారాయణపేట (41,752)
3. జయశంకర్ (42,387)
బాలల జనాభా (0-6) -> 38,99,166 (11.14%)
బాలురు – 20,17,935
బాలికలు – 18,81,231
అత్యధిక బాలల జనాభా
హైదరాబాద్ (4,69,126)
రంగారెడ్డి (2,97,841)
మేడ్చల్మల్కాజిగిరి (2,87,714)
అత్యల్ప బాలల జనాభా
ములుగు (29,144),
రాజన్న సిరిసిల్ల (48,751)
బాలల అక్ష్యరాస్యత – 66.5%
బాలుర అక్ష్యరాస్యత – 75.04%
బాలికల అక్షరాస్యత – 57.99%
బాల, బాలికల నిష్పత్తి – 932:1000
ఎస్సీ బాలబాలికల నిష్పత్తి – 1,008
ఎస్టీ బాలబాలికల నిష్పత్తి – 977
అత్యధిక బాల, బాలికల నిష్పత్తి
ములుగు (971),
భద్రాద్రి కొత్తగూడెం (964),
సంగారెడ్డి (955)
అత్యల్ప బాల, బాలికల నిష్పత్తి
వనపర్తి (903),
మహబూబాబాద్ (903),
నాగర్కర్నూల్ (909)
దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు (2001-11) – 13.58 శాతం
స్త్రీ, పురుష నిష్పత్తి – 988:1000
అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి
నిర్మల్ (1046),
నిజామాబాద్ (1044),
జగిత్యాల (1036)
అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి
రంగారెడ్డి (950),
హైదరాబాద్ (954),
మేడ్చల్ మల్కాజిగిరి (957)
షెడ్యూల్డ్ కులాల జనాభా
54,08, 800 (15.5%)
ఎస్సీ పురుష జనాభా – 26,93,127
ఎస్సీ మహిళల జనాభా – 27,15,673
అత్యధిక ఎస్సీ జనాభా
రంగారెడ్డి (3,34,337),
నల్లగొండ (2,92,951),
ఖమ్మం (2,79,319)
అత్యల్ప ఎస్సీ జనాభా
ములుగు (46,473),
కుమ్రం భీం (81,596),
నారాయణపేట (91,735)
ఎస్సీ స్త్రీ, పురుష నిష్పత్తి – 1008:1000
అత్యధిక ఎస్సీ స్త్రీ, పురుష నిష్పత్తి – నిర్మల్ (1092)
నిజామాబాద్ (1081)
మెదక్ (1075)
అత్యల్ప ఎస్సీ స్త్రీ, పురుష నిష్పత్తి
జోగులాంబ గద్వాల (956),
రంగారెడ్డి (968),
యాదాద్రి భువనగిరి (974)
అక్షరాస్యులు- 28.53 లక్షలు (58.90%)
పురుషులు – 16.35 లక్షలు (68.04%)
మహిళలు- 12.18 లక్షలు (49.90%)
షెడ్యూల్డ్ తెగల జనాభా – > 31,77,940 (9.1%)
ఎస్టీ పురుషుల జనాభా – 16,07,656
ఎస్టీ మహిళల జనాభా – 15,70,284
అత్యధికంగా ఎస్టీ జనాభా
భద్రాద్రి కొత్తగూడెం (3,92,034),
మహబూబాబాద్ (2,92,778),
ఆదిలాబాద్ (2,24,622)
అత్యల్ప ఎస్టీ జనాభా
జోగులాంబ గద్వాల (9,736),
కరీంనగర్ (12,779),
పెద్దపల్లి (14,945)
అక్షరాస్యత శాతం ->14.33 లక్షలు (49.51%)
పురుషుల అక్షరాస్యత శాతం – 8.52 లక్షలు (59.49%)
మహిళల అక్షరాస్యత శాతం- 5.61 లక్షలు (39.44%)
ఎస్టీ స్త్రీ, పురుష నిష్పత్తి – 977:1000
అత్యధికంగా – ములుగు (1049),
నిజామాబాద్ (1030),
కుమ్రంభీం (1029)
అత్యల్పంగా – రంగారెడ్డి (912),
హైదరాబాద్ (915),
నల్లగొండ (915)
అక్షరాస్యత శాతం – 49.51 %
పురుషుల అక్షరాస్యత శాతం – 59.49 %
మహిళల అక్షరాస్యత శాతం – 39.44 %
అక్ష్యరాస్యత- 66.54 %
పురుషుల అక్షరాస్యత – 75.04 %
మహిళల అక్షరాస్యత – 58 %
పట్టణాల్లో అక్షరాస్యత – 91.09%
గ్రామీణ అక్ష్యరాస్యత – 57.30%
అత్యధిక అక్ష్యరాస్యత
హైదరాబాద్ (83.25%),
మేడ్చల్ మల్కాజిగిరి (82.5%),
హనుమకొండ (74.1%)
అత్యల్ప అక్ష్యరాస్యత
జోగులాంబ గద్వాల (49.9%),
నారాయణపేట (49.9%),
నాగర్ కర్నూల్ (54.4%)
రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్ర పక్షి- పాలపిట్ట (కొరాసియస్ బెంగాలెన్సిస్)
రాష్ట్ర జంతువు- మచ్చల జింక (ఏక్సిస్ ఏక్సిస్)
రాష్ట్ర వృక్షం- జమ్మిచెట్టు (ప్రోసోపిస్ సినరేరియా)
రాష్ట్ర పుష్పం- తంగేడు పువ్వు (కేసియా అరిక్యులేటా)
రాష్ట్ర ఫలం- సీతాఫలం (అనోనా స్కామోజా)
రాష్ట్ర చేప- కొర్రమీను లేదా కొర్రమట్ట (ఛన్నాస్ట్రియాట)
రాష్ట్ర చిహ్నం- కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం, సత్యమేవ జయతే అని రాసి ఉంటాయి.
రాష్ట్ర చిహ్నం రూపకర్త – ఏలే లక్ష్మణ్
రాష్ట్ర అధికార మాస ప్రతిక – తెలంగాణ
రాష్ట్ర దూరదర్శన్ ఛానల్- యాదగిరి
రాష్ట్ర అధికార పండుగులు – బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతర
రాష్ట్ర క్రీడ – కబడ్డీ
రాష్ట్ర అధికార భాషలు – తెలుగు, ఉర్దూ
తెలంగాణ భాషాదినోత్సవం – ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9 )
తెలంగాణ వైశాల్యం- 1,12,077 చ.కి.మీ.
దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం – 3.41
సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, ఆగస్ట్ 19న ప్రతిష్ఠాత్మకంగా 17 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి పటిష్ఠమైన ఒకేఒక గణాంక సమాచార నిధిని సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. దీని ప్రకారం తెలంగాణలో మొత్తం కుటుంబాలు 1,01,93,027. ఈ కుటుంబ సర్వేలో కుటుంబ వివరాలు, వైకల్యాలు, దీర్ఘకాలిక వ్యాధులు, భూ వసతి, పశుసంపద మొదలైన వివరాలను సేకరించడానికి 3,85,892 మంది గణికులను ప్రభుత్వం వినియోగించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు