Current Affairs -04-05-2022
తెలంగాణ
గూగుల్ క్యాంపస్
హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న గూగుల్ క్యాంపస్‌కు ఐటీ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 28న శంకుస్థాపన చేశారు. 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ క్యాంపస్ గూగుల్‌కు ప్రపంచంలో రెండో అతిపెద్దది.
ఆలేరు పోలీస్ స్టేషన్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్.. 2021కు గాను ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికయ్యింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 28న ఉత్తర్వులు జారీచేసింది. నేషనల్ కైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఏటా దేశవ్యాప్తంగా 75 పోలీస్ స్టేషన్లను ప్రాథమికంగా ఎంపిక చేసి వాటి పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. ఇలా జాతీయ స్థాయిలో ప్రకటించిన మొదటి పది ర్యాంకుల్లో ఆలేరు పోలీస్ స్టేషన్‌కు కూడా స్థానం దక్కింది.
వార్తల్లో వ్యక్తులు
ఇమాన్యుయేల్ మాక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుయేల్ మాక్రాన్ ఏప్రిల్ 24న ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం వరుసగా ఇది రెండోసారి. 1789, జూలై 14న ఫ్రాన్స్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది.
సుమన్ బేరి
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సుమన్ బేరి మే 1న బాధ్యతలు స్వీకరించారు. సుమన్ బేరి వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐలో ద్రవ్య విధానం సభ్యుడిగా, పీఎం ఆర్థిక సలహా మండలి స్టాటిస్టికల్ కమిషన్‌లో పనిచేశారు.
రాబర్ట్ గోలోబ్
స్లొవేనియా దేశ ప్రధానిగా రాబర్ట్ గోలోబ్ ఏప్రిల్ 26న ఎన్నికయ్యారు. ఫ్రీడం మూవ్మెంట్ పార్టీకి చెందిన ఈయనకు 34 శాతం ఓట్లు లభించాయి. ఈయన ప్రధానిగా ఎన్నిక కావడం ఇది మూడోసారి.
డేవిడ్ అటెన్‌బరో
యూఎన్ఈపీ (యునైటెడ్ నేషన్స్ ఎన్వీరాన్మెంట్ ప్రో గ్రామ్) చాంపి యన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు-2021 డేవిడ్ అటెన్ బరోకు ఏప్రిల్ 26న లభించింది. ఈయన బ్రిటన్‌కు చెందిన ప్రకృతి శాస్త్రవేత్త, ఇంగ్లిష్ నేచురల్ హిస్టరీ బ్రాడ్‌కాస్టర్. ఈయనకు ఇదివరకు నైట్‌డ్, ఎమ్మా, బ్రిటన్ టెలివిజన్ అవార్డులు లభించాయి.
కృష్ణన్ రామానుజం
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)కు చైర్‌పర్సన్‌గా కృష్ణన్ రామానుజం ఏప్రిల్ 26న నియమితులయ్యారు. ఆయన 2022-23 సంవత్సరానికి ఈ పదవిలో ఉంటారు. నాస్కామ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్.
ఆంగ్‌సాన్ సూకీ
మయన్మార్ మాజీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీకి ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఏప్రిల్ 27న తీర్పు ఇచ్చింది. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఈమెకు అవినీతి అక్రమ కేసులో ఈ శిక్ష విధించారు. 114.12 కేజీల బంగారం, 6 లక్షల డాలర్ల నగదు తీసుకొని అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. ఈమెకు 1992లో నోబెల్ శాంతి బమతి లభించింది.
జాతీయం
సౌర విద్యుత్ ప్లాంట్
జాతీయ గ్రామపంచాయతీ డే సందర్భంగా ఏప్రిల్ 24న జమ్ము కశ్మీర్ సాంబా జిల్లాలోని పల్లి గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ గ్రామాన్ని దేశంలోనే తొలి కర్బన రహిత గ్రామంగా గుర్తించారు. ఇక్కడ రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
మొదటి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రధాని మోదీ ఏప్రిల్ 24న ముంబైలోని షన్ముఖానంద హాలో అందుకున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 80వ వర్ధంతి నిర్వహించారు.
వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్
21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ (డబ్ల్యూసీఓఏ) సమావేశం నవంబర్ 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ సదస్సును ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో ‘బిల్డింగ్ ట్రస్ట్ ఎనేబుల్ సస్టెయినబిలిటీ’ థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ దేబాశిష్ మిత్ర ఏప్రిల్ 26న వెల్లడించారు. ఈ సదస్సును 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.
డీఐఆర్-వీ
డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ-వీ (డీఐఆర్-వీ) ప్రోగ్రామ్‌ను కేంద్ర ఎలక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఏప్రిల్ 27న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. మొబిలిటీ, కంప్యూటింగ్, డిజిటైజేషన్‌కు అవసరమైన మైక్రోప్రాసెసర్ల ఆవిష్కరణకు ఊతమివ్వడానికి డీఐఆర్-వీ ప్రోగ్రామ్ దోహదపడుతుంది.
చైనీస్ పుస్తకం
‘చైనీస్ స్పైస్: ఫ్రం చైర్మన్ టు జీ జిన్‌పింగ్’ పుస్తకాన్ని ప్రచురించినట్లు హార్పర్ కొలిన్స్ ఇండియా ఏప్రిల్ 27న ప్రకటించింది. ఈ పుస్తకాన్ని ఫ్రెంచ్ జర్నలిస్ట్ రోజర్ ఫాలిగాట్ రచించారు. దీనిని నటాషా లెహ్రెర్ అను వదించారు. ఈ పుస్తకానికి రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ అధికారి విక్రం సూద్ ముందుమాట రాశారు.
క్రీడలు
వెర్స్టాపెన్
ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్‌ను సాధించాడు. ఏప్రిల్ 24న ఇటలీలోని ఇమోలాలో ఈ గ్రాండ్ ప్రిని నిర్వహించారు. వెర్‌స్టాపెన్‌కు సౌదీ అరేబియా టైటిల్ తరువాత ఇది రెండోది. కెరీర్లో 22వది.
లారెస్ అవార్డులు
లారెస్ స్పోర్ట్ అవార్డులను ఏప్రిల్ 26న ప్రకటించారు. లారెస్ స్పోర్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫార్ములా వన్ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు లభించింది. లారెస్ స్పోర్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు జమైకాకు చెందిన ఒలింపిక్స్ విజేత ఎలైన్ థాంప్సన్ హెరాకు దక్కింది. ఇటలీ ఫుట్‌బాల్ పురుషుల జట్టుకు లారెస్ స్పోర్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
– బ్రేకింగ్త్రో ఆఫ్ ది ఇయర్ ప్రైజ్ ఎమ్మా రడుకాను, లారెస్ స్పోర్టింగ్ ఐకాన్ అవార్డు వాల్టెంటినో రోసీ, లారెస్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టామ్ బ్రాడీ, ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ అవార్డు రాబర్ట్ లెవాండోస్కి, వరల్డ్ కమ్‌బ్యాక్ అవార్డు స్కై బ్రౌన్ (స్కేట్‌బోర్డ్), స్పోర్ట్పర్సన్ ఆఫ్ ది ఇయర్ విత్ ఏ డిజేబిలిటీ అవార్డు మార్సెల్ హగ్, లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్ సొసైటీ అవార్డు రియల్ మాడ్రిడ్, యాక్షన్ స్పోర్ట్పర్సన్ ఆఫ్ ది ఇయర్ బెథాని ష్రీవర్అందుకున్నారు.
ఆసియా రెజ్లింగ్
మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో నిర్వహించిన 35వ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఏప్రిల్ 27న ముగిశాయి. 30 మంది బృందంతో భారత్ పాల్గొంది. ఈ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, 5 రజతాలు, 11 కాంస్యాలు మొత్తం 17 పతకాలు సాధించింది. 57 కేజీల విభాగంలో రవికుమార్ దహియా స్వర్ణం గెలిచాడు. ఈ టోర్నీలో పతకాల పట్టికలో జపాన్ (21 పతకాలు) మొదటి స్థానంలో నిలువగా భారత్ 5వ స్థానంలో ఉంది.
ఎల్వేరో బ్రిట్టో
భారత మహిళల హాకీ జట్టు వెటరన్ క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ ఎల్వేరా బ్రిట్టో ఏప్రిల్ 27న మరణించింది. ఈమె 1960 నుంచి 67 వరకు భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 1965లో అర్జున అవార్డు అందుకుంది.
అంతర్జాతీయం
మలేరియా డే
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25న నిర్వహించారు. ఈ ఏడాది థీమ్ ‘హార్నెస్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ది మలేరియా డిసీజ్ బర్డెన్ అండ్ సేవ్ లైవ్స్ (మలేరియా వ్యాధిని తగ్గించడానికి, జీవితాలను రక్షించుకోవడానికి ఆవిష్కరణలను ఉపయోగించుకోండి)’. ఫ్రాన్స్ మిలిటరీ డాక్టర్ అల్ఫోన్స్ లావెరన్ 1880లో మలేరియాను కనుగొన్నాడు.
పుస్తక రాజధాని
2022కు గాను ప్రపంచ పుస్తక రాజధానిగా మెక్సికోలోని గ్వాడలజారాను యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలా ఏప్రిల్ 25న ఎంపిక చేశారు. వరల్డ్ బుక్ క్యాపిటల్ అడ్వైజరీ కమిటీ ఈ పట్టణాన్ని ఎన్నుకుంది. యునెస్కోను 1945, నవంబర్ 16న ప్రారంభించారు. 193 సభ్యదేశాలు ఉన్న యునెస్కో ప్రధాన కార్యాలయం పారిస్ (ఫ్రాన్స్)లో ఉంది.
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) డే (ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం)ని ఏప్రిల్ 26న నిర్వహించారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం దీని థీమ్ ‘ఐపీ అండ్ యూత్ ఇన్నోవేటింగ్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ (మెరుగైన భవిష్యత్తు కోసం ఐపీ, యువత ఆవిష్కరణలు)’. 2022 ప్రపంచ మేధో సంపత్తి జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారతదేశం 43వ స్థానంలో ఉంది.
జాన్ ఎఫ్ కెన్నెడీ అవార్డు
జాన్ ఎఫ్ కెన్నెడీ ప్రొఫైల్ ఇన్ కరేజ్ అవార్డులను ప్రారంభిస్తున్నట్లు జాన్ ఎఫ్ కెన్నెడీ లైబ్రరీ ఫౌండేషన్ ఏప్రిల్ 25న వెల్లడించింది. వోలోదిమిర్ జెలెన్స్కీ (ఉక్రెయిన్ ప్రెసిడెంట్), లిజ్ చెనీ (యూఎస్ రిప్రజెంటేటివ్), జోసెలిన్ బెన్సన్ (మిచిగాన్ రాష్ట్ర కార్యదర్శి), రసెల్ రస్టీ బోవర్స్ (అరిజోనా ప్రతినిధి), వాండ్రియా షేకే మోస్ (జార్జియా ఎన్నికల కార్యదర్శి)లకు ఈ అవార్డు లభించింది. వీరికి ఈ అవార్డును మే 22న బోస్టన్ (యూఎస్ఏ)లోని జాన్ ఎఫ్ కెన్నెడీ లైబ్రరీలో కరోలిన్ కెన్నెడీ, ఆమె కుమారుడు జాక్ ష్లోస్‌బర్గ్ అందజేయనున్నారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?