ఇండియన్ హిస్టరీ | గ్రూప్స్ ప్రత్యేకం –
కులవ్యవస్థ
సుల్తానుల పాలనలో సమ్మిళిత సమాజం
-సమాజంలో కులవ్యవస్థ ముఖ్యంగా 11, 12 శతాబ్దాల్లో చాతుర్వర్ణ వ్యవస్థలో అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి.
– అందులో శాఖలు, ఉపశాఖలు, నిబంధనలు, నిషేధాలు అధికమయ్యాయి.
– వర్ణాంతర వివాహాలు, సామూహిక భోజనాలు ఉండేవి కావు. ప్రాంతీయ ఆచారాలు, కులమత భేదాలు ఎక్కువగా ఉండేవి.
బ్రాహ్మణులు
– వీరికి సమాజంలో ఎక్కువగా ఆదరణ ఉండేది.
– రాజుల వద్ద కవులుగా, జ్యోతిష్యులుగా, పండితులుగా, వేదాంతులుగా ఉండేవారు అని ‘అబూజైద్’ రాశాడు.
– కనోజ్ పాలకులైన గద్వాల రాజులు వేయించిన 21 తామ్ర శాసనాల్లో 10 శాసనాలు వారి పురోహితులైన ‘జగుశర్మ’కు చేసిన దాన శాసనాలే.
– కానీ 13వ శతాబ్దంలో బ్రాహ్మణాధిక్యత తగ్గింది.
-తెలంగాణలోని ఒకానొక బ్రాహ్మణుడు మతం మార్చుకొని ‘మాలిక్ మక్బూల్’ అనే పేరుతో ఢిల్లీని రక్షించేవాడుగా ఉండేవాడు.
క్షత్రియులు
బాహ్మణ పోషణ క్షత్రియ ధర్మంగా మధ్యయుగ ఆరంభంలో ఉండేది. బ్రాహ్మణులు చేసిన వైదిక కర్మకాండలో 1/6వ వంతు ఫలితం క్షత్రియులకు చెందుతుందనే భావం ఉండేది.
ఇతర కులాలు
– బ్రాహ్మణులు సైతం ఈ యుగారంభంలో ఇతర కులాల వృత్తులను అవలంబించారు. ఉదాహరణకు గుజరాత్ రాజైన కుమారపాలుని వద్ద ‘కాక’ అనే సేనాపతి, మొదటి భోజుని కాలంలో ‘అల్ల’ అనే కోట రక్షణాధికారి బ్రాహ్మణులు.
బాహ్మణులు వ్యాపారం చేసినట్లుగా తెలుస్తుంది. ఆధారం భోజుని ‘శృంగార మంజరి’ గ్రంథంలోని మాధవుడు అనే బ్రాహ్మణుడు సింహళం వెళ్లి వ్యాపారం చేసినట్లు కథ ఉంది.
విదేశీ ముస్లింలు
– వీరికాలంలో భారతీయ ముస్లింలు, విదేశీ ముస్లింలు అని రెండు రకాలవారు ఉన్నారు.
– భారతదేశానికి ఇస్లాంను పరిచయం చేసినవారు అరబ్బులు. వీరికి జాత్యాధిక్యతలో నమ్మకం ఉంది.
– టర్కీల ఆధిపత్యం ఖిల్జీల కాలంనాటికి (13వ శతాబ్దం) తగ్గింది. అందుకు అనుమంది విదేశీ ముస్లింలు ఇండియాకు వచ్చి స్థిరపడటం కారణం.
-భారతీయులతో కులాంతర వివాహాలవల్ల మిశ్రమజాతి ఏర్పడింది. ఉదాహరణకు మంగోలుల నాయకుడు ‘హులగ్ (1292)’ నాయకత్వంలో దాడిచేసి ఓడిపోయి ఇస్లాంను స్వీకరించి ఇక్కడే ఉండిపోయాడు.
భారతీయ ముస్లింలు
– 1) యుద్ధ విజయ ఫలితంగా ఇస్లాంలోకి మారిన శత్రువులు 2) అధికారులు పాలకుల అభిమానం పొందటం కోసం మతం మార్చుకున్నవారు 3) అధిక పన్నులను తప్పించుకొనే నిమిత్తం ఇస్లాంలో చేరినవారు 4) సామాజికంగా ఉన్నతస్థాయిని కోరిన హిందూమతంలోని అట్టడుగు వర్గాలవారు.
-13వ శతాబ్దంలో నసీరుద్దీన్ మహ్మద్ కాలంలో విదేశీ ముస్లింలకు నాయకుడు బాల్బన్. స్వదేశీ ముస్లింలకు ఇమాదుద్దీన్ రెహన్, అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలంలో మాలిక్ కపూర్, ఫిరోజ్ షా తుగ్లక్ మంత్రి అయిన మాలిక్-ఇ-మక్బూల్ భారతీయ ముస్లింలే.
ముస్లింలలోని వర్గాలు
1) ఉమారా: వీరు సుల్తాన్ ఆంతరంగిక వర్గం. అమీర్, మాలిక్, ఖాన్, వజీర్ హోదాలు వీరివి.
2) ఉలేమాలు: వీరు ముస్లిం సమాజంలో అమితమైన అధికారవర్గం. మతాధికారులు, న్యాయాధికారులు, ఉపాధ్యాయులు, వివాదాస్పద విషయాల్లో ‘ఫత్వాలు’ జారీచేసేవారు. ఇండియాలో మదర్సాలను ప్రారంభించింది వీరే. వీరిని ‘ఇమామ్’లని, బిటీత లని, మూటనిట్ లని, ముఫీలని, కాజీలని అంటారు.
3) సూఫీలు: మత ప్రచారకర్తలు. స్వచ్ఛందంగా పేదరికాన్ని స్వీకరించి నగరజీవనానికి దూరంగా ఉండేవారు. వీరిలో చిష్తీ, సుహ్రా, వర్గీ, క్వాదీ, నక్షబందీ శాఖలు ఉన్నాయి.
4) బానిసలు: అతినిరుపేదలు. అవకాశాలను బట్టి ఉన్నత పదవులను అధిరోహించారు. టర్కీలతోపాటు అబిసీనియా బానిసలు ఎక్కువ సంఖ్యలో ఇండియాలో స్థిరపడ్డారు. వీరు 1) యజమానికి తండ్రి ద్వారా వారసత్వంగా 2) బానిసకు యజమాని గృహంలో జన్మించుటవల్ల 3) యజమాని వీరిని బహుమతిగా పొందటం వల్ల 4) తనను తాను విక్రయింపబడటం వల్ల 5) యుద్ధ ఖైదీలుగా పట్టుబడటం వల్ల బానిసలు అయ్యారు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో 1,80,000 బానిసలు ఉండేవారు.
హిందూ ముస్లింల సాన్నిహిత్యం
– హిందువులపై జిజియా పన్నులు వేసినా, హిందువులని కాఫిర్లు, జిమ్మీలని పిలిచినా, ముస్లింలను హిందువులు మ్లేచ్చులని పిలిచినా ఉభయుల మధ్య సాన్నిహిత్యం ఉండేది.
1) వివాహాలు: హిందూముస్లింల మధ్య 1) దేవలదేవి-చిజిర్ఖాన్ల వివాహం. ఆధారం ‘ఆషికా’ కావ్యం. 2) ఫిరోజ్ షా తుగ్లక్, సికిందర్లోడీ రాజపుత్ర స్త్రీలకు జన్మించినవారే.
2) భక్తి ఉద్యమం: ఈ ఉద్యమ ఫలితంగా హిందూముస్లిం లు సమానత్వాన్ని చాటారు. సామాన్య ప్రజలకుగల సామరస్య భావనే భక్తి ఉద్యమకారుల కీర్తికి కారణమైంది.
3) ఉభయుల ఆదరణ: హిందువుల్లో పర్షియన్ భాష నేర్చుకున్నవారికి ఉద్యోగాలిచ్చి ఆదరించారు ముస్లిం లు. సుల్తానులు, పాదుషాలు భారతీయ హిందువుల సహాయసహకారాలతోనే సామ్రాజ్యాలు స్థాపించిన సందర్భాలు ఉన్నాయి. ముస్లింలు హిందూపండితు లను, కవులను, కళాకారులను ఆదరించి గౌరవించారు.
4) మతం మార్పిడి: కొత్తగా ఇస్లాం మతంలోకి మారిన హిందువులు ముస్లింలకు దగ్గరయ్యారు.
5) పండుగలు: హిందూ ముస్లింలు హోలీ, దీపావళి, షబ్-ఎ-బారాత్, శివరాత్రి, మొహర్రం, తజియా, జగన్నాథ రథయాత్రల్లో అందరూ సామరస్యంగా పాల్గొనేవారు. గ్వాలియర్ రాజు రాజా మాన్సింగ్ విశాల దృక్పథం గలవాడని, హిందువులు తనని హిందువుగా, ముస్లిం లు తనని ముస్లింగా పిలిచేవారని ‘నియమతుల్లా’ అనే అతను తన గ్రంథంలో రాశాడు.
ముస్లింలలోని శాఖలు
1) సయ్యద్‌లు: వీరు మహ్మద్ ప్రవక్త కుమార్తె అయిన ఫాతిమా సంతతివారు.
2) షేక్‌లు: వీరు అరేబియా నుంచి వచ్చారు. భారతీయ ముస్లింలు ఈ జాతికి చెందినవారమని భావించేవారు.
3) మంగోలులు: వీరు రెండు రకాలు. పర్షియన్లు, చాగ్త్లు. ఢిల్లీ సుల్తానుల చివరి కాలంలో వచ్చారు.
4) పఠానులు: పర్షియా నుంచి వచ్చిన షియాలు వీరు. ఇండియాలో ముల్తాన్, సింధు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో ఎక్కువ మంది కవులు, పండితులు, వైద్యులు, న్యాయవాదులు ఉన్నారు.
ఆహార పానీయాలు: అల్బెరూనీ ప్రకారం శుచిగా వంట చేయడానికి ముందు స్నానం చేసేవారని, భోజన సమయాన్ని మౌనంగాను, ఏకాంతంగాను ముగించే వారని రాశాడు. హిందువులు అన్నంతోపాటు కిచిడి, చపాతి ఎక్కువగా వాడగా, ముస్లింలు కబాబ్, రొట్టె, పలావు, మాంసం ఇష్టపడేవారు.
– మధ్యయుగంలో పాలకవర్గమైన హిందూ ముస్లింలు తేడాలేకుండా మత్తును తీసుకొనేవారు. అల్లాఉద్దీన్ ఖిల్జీ మత్తును నిషేధించగా ఢిల్లీలోకి మత్తు పానీయాలు అధికారులకు తెలియకుండా వచ్చేవని తెలుస్తుంది. ఆనాటి మద్యంలో సుర మూడు విధాలుగా తయారయ్యేది. 1) బియ్యపు పిండితో తయారయ్యే వైష్టి 2) బెల్లం నుంచి తయారయ్యే గౌడి 3) తేనెతో, మధూక పుష్పాల నుంచి తయారయ్యే మాద్వా అనేవి ఉండేవి.
దుస్తులు: ముస్లిం పాలన ప్రారంభంలోనే హిందువులు ధోవతులపై అంగీలు ధరించేవారు. ముస్లింల మాదిరిగానే వీరు బిగుతుగా, వదులుగా ఉండే ప్యాంట్ ధరించేవారు. బరౌని, ఇబన్ బటూటా హిందువులు తెల్లని వస్త్రాలను ఇష్టపడేవారని రాశారు. ముస్లిం సర్దారులు కుల్లాయిలను, టోపీలను, సల్వారులను వాడేవారు. సమాజంలో ధనవంతులు పట్టు, వెల్వెట్, బ్రోకెడ్ దుస్తులను ‘దగ్లా’ అనే కోటును, క్వాజా అనే గౌను వాడేవారు. ఉలేమాలు అమామ్ అనే తలపాగను ధరించేవారు. స్త్రీలు చీరవంటి పొడవు ‘చదర్’ను, వాటి చేతుల ‘చోళీ’లను లెహంగ అనే పొడవాటి వదులు పావడాను, చోళీలుగా ధరించేవారు. తలకు పొడవైన తలగుడ్డను (స్కార్ప్) ధరించేవారు.
సభ్యతలు: మధ్యయుగ ప్రారంభంలో వ్యక్తులు కలిసినప్పుడు ఒకరికొకరు కౌగిలించుకునేవారు. కొత్త పరిచయాలప్పుడు తండ్రి పేరు ముందుగా చెప్పేవారు భారతీయులు. మా ట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి చేతులు పట్టుకొని మాట్లాడే వారని, ఒకరింట్లోకి అనుమతితోనే వెళ్లేవారని, బయటకు వెళ్లేటప్పుడు అనుమతి తీసుకునేవారని అల్బెరూనీ రాశాడు.
నమస్కారాలు: సుల్తానులకు ప్రజలు మూడు రకాల నమస్కారాలు చేసేవారు.
1) కొర్నిష్: కుడిచేయి అరచేతిని నుదుటిపై ఉంచుకొని, తలను కొంచెం కిందికి వంచి చేసే సలాం. దీన్ని ‘కొర్నిష్’ అంటారు.
2) తస్లిం: కూర్చొని ఉండి కుడిచేతిని వెనుకగా నేలపై ఉంచి లేచి ఆ చేతిని తలపై చేర్చుకొనటాన్ని తస్లిం అంటారు.
3) జమీన్బాస్: మూడుసార్లు కొంచెం వ్యవధిలో నేలపై వంగి నుదురును తాలించటం.
4) పాయ్బాస్: సుల్తాను పాదాలనుగాని, సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకో వటం మొదలైనవి.
మతపండుగలు: రంజాన్, బక్రీద్, ఈద్ ప్రార్థనలు, మిలాద్-ఉన్-నబీ, షబ్-ఎ-బరాత్, నౌరోజ్ ముస్లింల పండుగలు. బక్రీద్ నాడు చక్రవర్తులు కూడా ఈద్గాకు వెళ్లి స్వయంగా జంతుబలిని చూసేవారు, ఇచ్చేవారుకూడా. ప్రవక్త స్వర్గానికి చేరిన దినాన్ని షబ్-ఎ-బరాత్‌గా జరుపుకుంటారు.
ఆటలు: కుస్తీ, పోలో, పచ్చీస్, నార్ద్ (బేక్గమ్న్), పేకాట, గుర్రపు పందేలు, కత్తిసాము, ఈతపోటీ, వేట, ఆయు ధాల ప్రదర్శన, నృత్య, సంగీతాలు. ‘బెందుచ్యూతక్’ మాటలను మార్పుచేస్తూ ఆడే ఆట. ప్రహేలిక్ (గూడార్థంతో ప్రశ్నించే సాహిత్య సంభాషణ).
విశ్వాసాలు: సమాజంలో శకునాలు, దిష్టి, కలలపట్ల నమ్మకం, జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువని అబూజైద్, అల్బెరూనీలు రాశారు. హిందువులు యాత్రాస్థలాల్లో మరణించటాన్ని పవిత్రంగా భావించి వారణాసి, ప్రయాగ, మధుర, ఉజ్జయిని వంటి ప్రదేశాల్లో ఆత్మహ త్యలు జరిగేవి. కాలచూరి రాజు గంగయదేవుడు తన వందమంది భార్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
స్త్రీల స్థాయి: ఈ కాలంలో ఉన్నతవర్గ స్త్రీల్లో కొందరు సాహితీవేత్తలు ఉన్నారు. అవంతి సుందరి, కావ్యమం జరి రాసిన రాజశేఖరుని భార్య విద్యావంతురాలు. 12వ శతాబ్దం నాటి భాస్కరాచార్యుడు తన కుమార్తె లీలావతికి గణితశాస్త్రాన్ని బోధించిన గ్రంథమే ‘లీలావతి గణితం’. గంగాదేవి, రుద్రమ్మ, తిరుమల దేవి, రామబద్రాంబ, చాళుక్య సోమేశ్వరుని భార్య మైలదేవి, 11వ శాతాబ్దపు బనవాసి రాష్ట్ర పాలకురాలు ‘సమరభైరవి’ గుణదబెడంగ బిరుదుగల ‘అక్కాదేవి’, కొంకణ పాలకురాలు మొదలైనవారు విద్యావంతులు.
పరదాపద్ధతి: సమాజంలో హిందూ, ముస్లింలు ఇద్దరూ పర్దా పద్ధతిని పాటించేవారు. ఇది ముస్లింల పాలనతోనే ప్రారంభమైంది. దీన్ని ఘోషా పద్ధతి అని కూడా అంటారు. ‘కథాసరిత్సాగరం’లో దీని గురించి ప్రస్తావన కలదు.
ఇతర మూఢాచారాలు
1. సతీసహగమనం: చౌహాన్ వంశరాజు చండమహాసే నుని తల్లి సతీసహగమనం చేసినట్లు ధోల్పూర్ శాసనం చెబుతుంది. రాజస్థాన్‌లో రాణి కే లచ్చాదేవిని సతీ దురాచారం నుంచి ఆమె కుమారుడు ఆపినట్లు తెలుస్తుంది. ముస్లింలు కూడా తమ భర్తతోపాటు శరీరాన్ని దగ్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. బార్బోసా.. సతికి ముందు పండుగ సాంప్రదాయాలుండేవని రాశాడు. వీరశైవంవారిలో భర్త సమాధి పక్కనే గొయ్యి తీసి మెడవరకు పూడ్చి పెద్దరాయిని శిరస్సుపై పెట్టే ఆచారం ఉండేదని బార్బోసా రాశాడు.
2. జౌహరు: శత్రువుల చేతికి చిక్కకుండా గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికి రాజపుత్ర స్త్రీలు ఆచరించేవారు.
3. భోగస్త్రీలు: వేశ్యలు, దేవదాసీలు, బానిసలు.
4. వేశ్యలు: చతుర సంభాషణా నిపుణులు.
5. దేవదాసీలు: గుజరాత్‌లోని 4 వేల దేవాలయాల్లో 20 వేల దేవదాసీలు ఉండేవారు. దేవుని ఎదుట సంగీత నృత్య సాధన చేసేవారు. సోమనాథాలయంలో 500 మంది నృత్య, సంగీత దేవదాసీలున్నట్లు అల్బెరూనీ రాశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు