భారత్-చైనా సరిహద్దు వివాదాలు
తూర్పు సెక్టార్
- భారత్ (అరుణాచల్‌ప్రదేశ్), చైనా (తవాంగ్) మధ్య ప్రాంతం వివాదాస్పదం.
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని 90,000 km2 వైశాల్యం గల ప్రాంతాన్ని చైనా తమకు చెందినదిగా పేర్కొంటుంది.
- ఇక్కడ భారత్-చైనా సరిహద్దురేఖను ‘మెక్‌మోహన్‌రేఖ’ గా పిలుస్తారు.
- 1993, 1996లో రెండు దేశాలు విశ్వాస నిర్మాణ చర్యల్లో భాగంగా జమ్ముకశ్మీర్ (లద్దాఖ్), ఆక్సాయ్‌చిన్ ప్రాంతం మధ్య LOAC( Line of Actual Control) తాత్కాలిక సరిహద్దుగా గుర్తించారు.
- సిక్కింలో చైనా-భారత్ వాణిజ్యం జరిపే కనుమలు ‘నాథులా’, ‘జెలెప్లా’.
- డోక్లా వివాదం (Doklam Issue): సిక్కిం రాష్ర్ర్టానికి తూర్పున టిబెట్ (చైనా)లోని చుంబలోయకు దక్షిణాన, భూటాన్‌లోని హలోయ మధ్యలో గల త్రికూడలి డోక్లాం.
- ఈ డోక్లాం పీఠభూమి విస్తీర్ణం 89 km2 కలదు.
- దీన్ని డోగ్లంగ్ పీఠభూమి అని, జోగ్లామ్ పీఠభూమి అని కూడా పిలుస్తారు.
- భూటాన్, చైనా ఈ భూభాగాన్ని తమ దేశంలో ప్రాంతంగా పేర్కొంటున్నాయి.
- భూటాన్ ఆధీనంలోని ఈ పీఠభూమి గుండా చైనా రహదారి నిర్మించడానికి ప్రయత్నించడంతో 2017 జూన్‌లో వివాదం ప్రారంభమయింది.
- ఈ మార్గం పూర్తయితే నాథులా కనుమ సమీపానికి చైనా సులభంగా చేరుకోవచ్చు. తద్వారా
- పశ్చిమబెంగాల్లోని చికెన్‌నెక్ ప్రాంతాన్ని చేరడం సులభం అవుతుంది.
- 1949, 2007లో భూటాన్ దేశం భారత్‌తో చేసుకున్న స్నేహపూరిత ఒప్పందం వల్ల భారత్ ఈ విషయంలో సైనిక జోక్యం చేసుకుంది.
పశ్చిమ సెక్టార్
- ఈ విభాగం లద్దాఖ్, సికియాంగ్(చైనా) మధ్య విస్తరించి ఉంది.
- హాట్‌స్ప్రింగ్, ప్యాంగాంగ్ సరస్సుల తూర్పుభాగాలు ఇందులో ఉన్నాయి.
- 1962 లో చైనా-భారత్ యుద్ధంలో చైనా 38,000 km2 గల ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది.
- చైనా పశ్చిమ ప్రాంతంలోని జిన్జియాంగ్ నుంచి టిబెట్‌కు రోడ్డు మార్గాన్ని (G-219) ఆక్సాయ్‌చిన్ గుండా నిర్మించింది.
మధ్య సెక్టార్
- భారత్ (హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్), టిబెట్ మధ్య ఈ విభాగం వివాదాస్పదంగా ఉంది.
- ఇక్కడి 2000km2 గడ్డిభూములు వివాదాస్పదంగా ఉన్నాయి.
గల్వాన్ సంఘటన
- చైనాతో గల వాస్తవాధీన (LOAC) రేఖలో ఉన్న ప్రాంతమే గల్వాన్.
- ష్యోక్ నది ఉపనది అయిన గల్వాన్ నది గల్వాన్ లోయగుండా ప్రవహిస్తుంది.
- 2020 జూన్ 15న చైనా బలగాలు గల్వాన్ ప్రాంతంలో భారత సైనికులపై దశ్చర్యకు దిగడంతో సంఘటన జరిగింది.
- గల్వాన్, డెస్సాంగ్, చుమారు, సుమ్డోరాంగ్, డోక్లాం, షిప్కిలా, తవాంగ్ ఇలా అనేక ప్రాంతాలు భారత్, చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి.
CPEC కారిడార్ (చైనా, పాక్ ఎకానమిక్ కారిడార్)
- చైనా పశ్చిమ భాగం నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (గిల్గిట్, బాల్టిస్థాన్) మీదుగా బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ‘గాద్వార్ ఓడరేవు’ వరకు చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు.
- పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని ‘కుంజెరబ్’ కనుమ గుండా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తుంది.
Previous article
ఇండియన్ హిస్టరీ | గ్రూప్స్ ప్రత్యేకం –
Next article
శిశు వికాసం – పెడగాజీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు